breaking news
heritage
-
35 ఉద్యోగాల పేరుతో హెరిటేజ్ భారీ దోపిడీ.. బయటపెట్టిన వెంకటరెడ్డి
-
కుటుంబానికి బాబు కానుక!
సాక్షి, అమరావతి: సంపద సృష్టించకుండా.. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా.. సహజ వనరులను పచ్చ ముఠాలకు అప్పగించి ఇసుక, సిలికా, గ్రానైట్, క్వార్ట్జ్ దోపిడీకి తెర తీసిన చంద్రబాబు సర్కారు మరింత బరి తెగించింది! బినామీలకు 99 పైసలకే భూములను పందేరం చేస్తూ, నిర్మాణ వ్యయం కింద చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఖజానా నుంచి దోచిపెట్టి ఎదురు చెల్లిస్తూ, బంధు గణానికి విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని రాసిచ్చిన ప్రభుత్వ పెద్దలు తాజాగా అన్ని విలువలకు తిలోదకాలిచ్చేశారు! దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయని రీతిలో నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనాలు కలి్పస్తూ తాజాగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తండ్రి, కుమారుడి సాక్షిగా హెరిటేజ్‌కు చేకూర్చిన లబ్ధి ఇలా ఉంది..! ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందంటూ.. తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాదికి ముందు తన కుటుంబానికి సీఎం చంద్రబాబు తీపి కబురు వినిపించారు! ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్ధ హెరిటేజ్‌కు ప్రభుత్వం నుంచి భారీ రాయితీలు, సబ్సిడీలను కల్పిస్తూ శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని కేబినెట్ నిర్ణయాలు వెల్లడించే మీడియా సమావేశంలో మంత్రి పార్ధసారధి దాటవేయగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తెలియచేసింది.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట గ్రామంలోని హెరిటేజ్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్ గ్రెడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద మెగా ప్రాజెక్టు హోదా పొందిన ఈ హెరిటేజ్ డెయిరీ అప్ గ్రెడేషన్ వల్ల ఉత్పత్తుల తయారీ భారీగా పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫ్లేవర్డ్ పాలు 131 శాతం, పనీర్ 400 శాతం, నెయ్యి ఉత్పత్తి ఏకంగా 566 శాతం పెరగనుంది. సభ సాక్షిగా అబద్ధాలు...!‘‘హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్థి చేకూరలేదు. ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఈ సంస్థ పెట్టినప్పుడే మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించకూడదన్నదే మా విధానం. దానికి కట్టుబడే ఇప్పటి వరకు నడుచుకున్నాం..!’’ తాజా బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గంభీర ఉపన్యాసం ఇదీ! ఒకపక్క ప్రభుత్వం నుంచి ఆయాచిత ప్రయోజనాలు పొందుతూ అసెంబ్లీలో మాత్రం హెరిటేజ్‌కు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదంటూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.సుమారు రూ.100 కోట్ల రాయితీచంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌ను రూ.209.68 కోట్లతో అప్‌గ్రెడేషన్ చేసే ప్రతిపాదనను మెగా ప్రాజెక్టుగా ఆమోదిస్తూ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద చంద్రబాబు సర్కారు భారీ రాయితీలను కల్పించింది. ప్రత్యక్షంగా 35 మందికి మాత్రమే ఉపాధి కల్పించనున్నారు. ఐదేళ్లపాటు 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, యూనిట్‌కు రూపాయి చొప్పున విద్యుత్తు రాయితీ, అప్‌గ్రెడేషన్ టెక్నాలజీపై సబ్సిడీ పేరుతో పెట్టుబడిపై 50 శాతం వరకు అంటే సుమారు రూ.100 కోట్ల వరకు రాయితీల రూపంలో వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వడ్డించేవాడు మనవాడు అయితే బంతిలో చివర కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లుగా సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్ స్వయంగా పాల్గొన్న కేబినెట్ అజెండాలో చివరి అంశంగా హెరిటేజ్‌ను చేర్చి భారీ ప్రయోజనాలకు ఆమోద ముద్ర వేయించుకోవడం గమనార్హం. -
బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు
-
తప్పు తాను చేసి.. నిందలు , స్కామ్‌లు!
సాక్షి, అమరావతి: ‘ఒకవైపు చంద్రబాబే తప్పు చేసి.. వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండోవైపున ఆ దుమారంలోనే స్కామ్‌లు చేస్తారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరను కిలోకి రూ.351 నుంచి రూ.716కు పెంచేసి.. హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపుర్ డెయిరీ నుంచి సరఫరా చేశారు. రూ.200 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇలాంటి వాళ్లను ఏమనాలి? రెండున్నర గంటల సినిమాలో విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్‌లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే..!’ అంటూ చంద్రబాబును తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో మా పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం కూడా చెప్పలేదు. ఇందాపూర్ డెయిరీ, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్‌కు మధ్య బంధంపై నోరు ఎత్తలేదు. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తే నోరు మెదపరు. ఇక్కడ నెయ్యిపై ఒకవైపున దుమారం రేపుతూనే మరోవైపు నెయ్యిలో స్కామ్‌లకు పాల్పడుతున్నారు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. 2024 ఆగస్టులో కిలో నెయ్యి రూ.351కి టీటీడీకి సరఫరా జరిగితే అక్టోబర్ 2025 నాటికి.. కేవలం ఏడాదిలోనే రూ.716కు పెంచేశారు. ఏడాదిలో కేజీ నెయ్యి ధరను రూ.365 చొప్పున పెంచేసి దోపిడీకి పథకం వేశారు. నెయ్యి స్కామ్ కోసం చంద్రబాబు అండ్ కో దోపిడీ మందలా (కాటెల్) ఏర్పడి దేవుడి సొమ్మును కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు రూ.351కే కిలో నెయ్యి టీటీడీకి సరఫరా అయితే.. ఆ తర్వాత 2025 జనవరి 31 నాటికి అమాంతం రూ.513కి ఎగబాకింది. 2025 అక్టోబర్ నాటికి రూ.599 దూసుకెళ్లి.. అదే నెలలో రూ.716కి చేరుకుంది. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్‌లు చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు కుట్ర..! తిరుమల హుండీలో డబ్బులు లెక్కించే పరకామణి నుంచి 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం దొంగతనంపై కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో ఇంతటి ఘోరమైన తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించారు. పైగా మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మా హయాంలో రూ.75 వేల విలువైన డాలర్ నోట్లు దొంగతనం జరిగితే.. ఏకంగా రూ.15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ దేవాలయానికి రాయించారు. దేవుడి సొమ్ముతో ఎవరైనా చెలగాటం ఆడితే అది తప్పని, క్రమశిక్షణ ఉండాలంటూ అప్పటి టీటీడీ బోర్డు ఆ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీటీడీ పరకామణి లెక్కింపుల సమయంలో 2025 జనవరిలో రూ.కోటి విలువైన బంగారం చోరీ జరిగింది. ఈ ఘటనను బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. మరోవైపున 2025 సెపె్టంబర్లో చంద్రబాబు కుట్ర పూరితంగా.. ఎప్పుడో 2023లో పరకామణిలో రూ.75వేలు విలువైన డాలర్లను దొంగతనం చేసి.. పశ్చాత్తాపంతో రూ.15 కోట్లు దేవుడికి రాసిచ్చిన ఘటనను తప్పుపడుతూ దు్రష్పచారం చేశారు. కానీ, చంద్రబాబు ఆరోపణ కంటే ముందు, ఆయన హయాంలో నమోదైన చోరీని మాత్రం కావాలనే బయటకు రాకుండా కప్పెట్టేశారు. నెయ్యి రేట్లు అమాంతం పెంచేసి.. చంద్రబాబు నెయ్యి వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా ఆరోపణలు చేశారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మే 15న నెయ్యి టెండర్లు ఖరారయ్యాయి. జూన్ 4న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. జూన్ 12న నెయ్యి సరఫరా ప్రారంభమైంది. వాటిల్లో జూన్–జూలైలో 4 నెయ్యి ట్యాంకులు టీటీడీ టెస్టులు పాసయ్యాయి. అదే జూలై 6, 8వ తేదీల్లో వ చ్చిన మరో 4 ట్యాంకుల టెస్టులు టీటీడీ ల్యాబ్‌లో నెగిటివ్ వ చ్చింది. మళ్లీ చంద్రబాబు హయాంలోనే ఆ నాలుగు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు ఆగస్టు, సెపె్టంబర్లో వేరే కంపెనీ పేరుతో మళ్లీ టీటీడీలోకి వచ్చాయి. వాటిని టీటీడీ అనుమతించింది. వాటిని లడ్డూల తయారీలో ఉపయోగించారు. ఇదంతా దాచిపెట్టిన చంద్రబాబు.. కుట్ర పూరితంగా సెపె్టంబర్ 18న తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఎదురు ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో తప్పు జరిగితే మాపై నెట్టేశారు. అసలు తిరస్కరించిన నెయ్యి ట్యాంకులు వెనక్కి రాకూడదు. అలాంటి వాటిని వెనక్కి రప్పించి వినియోగించారు. ఇక్కడ వైష్ణవి డెయిరీ, సంగం డెయిరీ సంబంధాలు అందరికీ తెలుస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు తప్పు చేసి వేలెత్తి ఎదుటివారిపై నింద వేసేస్తారు. రెండో వైపున దుమారంలోనే స్కామ్‌లు చేస్తారు. హెరిటేజ్ వెబ్సైట్లో తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని రాసుకున్నారు. అదే క్రమంలో హెరిటేజ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్‌ను వాళ్లే ఫైర్ చేస్తారు. ఏడాదిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కి పెంచేసి స్కాములు చేసుకుంటారు. ఇలాంటి వాళ్లను ఏమనాలి? సినిమాలో రెండున్నర గంటల విలన్ కూడా ఇంత ఆలోచన చేయడేమో! ఇది లైవ్‌లో కనిపిస్తున్న రియాల్టీ షో. ఇక్కడ స్కీములు ఉండవు.. అన్నీ స్కాములే!శ్రీవారి సొమ్ము.. అయినవారికి దోచిపెట్టేందుకు..బాబును సీఎంగానే భరించలేకపోతున్నారుఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?.. వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలుసాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియా ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలపై మీడియా ప్రతినిధులు బుధవారం అడిగిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు..?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1,100 మందిలా మాట్లాడుతున్నారంటూ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలు అంత నిబద్ధతతో ఉన్నారు. బలంగా పని చేస్తున్నారు. అది మంచి విషయమే’ అని పేర్కొన్నారు. -
వెంకన్న ఆలయానికి భూములడిగితే కోట్లు వసూలు చేస్తారు
-
అనగనగా ఒక హెరిటేజ్... లబ్ది కోసం కల్తీ పేరుతో కుట్రలకు తెరలేపుతారు
-
హెరిటేజ్ కోసం కొన్న కెమికల్స్.. వివరాలను బయటపెట్టే దమ్ముందా..?
-
మండలిలో పర్వత రెడ్డి స్పీచ్ కు కూటమి నేతల ఉక్కిరిబిక్కిరి
-
Watch Live: లడ్డూపై మండలిలో చర్చ ప్రారంభం
-
దేవునికే టోపీ.. ఆన్ లైన్ లో కిలో నెయ్యి రూ.529.. టీటీడీకి మాత్రం రూ.638..
-
ఎలా ముంచావో అందరికి తెలుసు.. హేరిటేజ్ బాగోతాన్ని బయటపెట్టిన లక్ష్మి పార్వతి
-
హెరిటేజ్ పాలు, నెయ్యి కల్తీ.. కల్తీ.. YSRCP ఎమ్మెల్సీ లు నిరసన
-
అందరి బాబాల వెనుక ఉన్న ఏకైక బాబా మన చంద్ర "బాబా"
-
హెరిటేజ్ గుట్టురట్టు.. అసెంబ్లీలో తప్పించుకున్న చంద్రబాబు..
-
మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం
సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్‌పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్‌కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా? ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ? ⇒ 2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం? ⇒ కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్‌కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? ⇒ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా ఇచ్చారు? ⇒ చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్ ప్రభుత్వం పునర్ నిరి్మంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి పాపం మీదే ⇒ మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా? ⇒ 2024 జూన్‌లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది. ⇒ ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్ జగన్‌కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే. వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్‌లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. బయటపడ్డ హెరిటేజ్–ఇందాపూర్ బంధం ⇒ తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ పిటిషన్ వేసింది. బోలేబాబా ఆర్గానిక్కూ, సీబీఐ చార్జిషీట్లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్కూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది. ⇒ దీన్నిబట్టి భారత్‌లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్ ఎవరు? బాబూ ఇదేనా మీ భక్తి? ⇒ మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? ⇒ చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా? అవి జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్‌కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది? మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ⇒ బోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్నర్. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్‌లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్‌కు దగ్గరా? ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్‌లో హెరిటేజ్ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? ⇒ నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్‌లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. -
అవును.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ‘కో మాన్యుఫాక్చరర్’
సాక్షి, అమరావతి: టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డెయిరీ తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు కో–మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని శాసన సభ సాక్షిగా సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇందాపూర్ డెయిరీలో హెరిటేజ్ ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించారు. తమకు కో–మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్‌పై ఆరోపణలు చేస్తున్నారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో హెరిటేజ్‌కు ముడిపెడుతున్నారని, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన సభలో మంగళవారం నిర్వహించిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ తన ఉత్పత్తులను ప్రభుత్వానికి ఎన్నడూ సరఫరా చేయలేదని తెలిపారు. తిరుమల క్షేత్రం ఏడు కొండలపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 746, 747 జీవోలను తానెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారని ఎన్డీడీబీ అనుమానిత నివేదిక ఆధారంగానే ప్రకటన చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన 20.01 కోట్ల లడ్డు ప్రసాదాలను విక్రయించారని ఆరోపించారు. సీబీఐ సిట్ సిఫార్సులు అమలు చేయడం కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామన్నారు.గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకున్నారని, కరుణాకర్‌రెడ్డి కుమార్తె వివాహం క్రైస్తవ సంప్రదాయంలో చేశారని విమర్శించారు. కాగా 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 746, 747 జీవోలను రద్దు చేస్తామని గుంటూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఆ విషయాన్ని కప్పి పుచ్చి, ఆ జీవోలను తాను వ్యతిరేకించలేదని అసెంబ్లీ వేదికగా తనకు అలవాటైన రీతిలో కళ్లార్పకుండా అబద్ధాలను వల్లె వేశారు. పెరుమాళ్లకే ఎరుక: పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తానెక్కడా అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రసాయనాలు కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని తేలిందన్నారు. ఇందులో లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని, అయితే ఇది రికార్డుల్లో నిరూపితం కావడం లేదన్నారు. రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకే ఎరుక అని వ్యాఖ్యానించారు. నిబంధనలు సవరించి, నచ్చిన సంస్థలకు గత ప్రభుత్వంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్‌లు ఇచ్చారని విమర్శించారు. -
హెరిటేజ్ నెయ్యి కల్తీనా? నిజం ఒప్పుకున్న లోకేష్
-
వీఎస్ఆర్ విమానాలకు.. నారా వారి హెరిటేజ్ హింగ్లాజ్ కి లింకేంటి ?
-
విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్ లీజ్ ! అజిత్ పవార్ మృతిపై రామ్మోహన నాయుడు కామెంట్స్
-
వీఎస్ఆర్ వెనుక హెరిటేజ్!
సాక్షి, అమరావతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తెలుగుదేశం పారీ్టపై అనేక అనుమానాలను లేవనెత్తి 36 గంటలు దాటినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు. వీఎస్ఆర్ విమానయాన సంస్థ విమానాల కొనుగోళ్లకు హెరిటేజ్ సంస్థ వందల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చిందంటూ సాక్ష్యాధారాలతో చూపించినా.. స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీ అయ్యి ఉండి కూడా ఇంత వరకు స్పందనే లేదు. అజిత్ పవార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ రోహిత్ పవార్ చేసిన ఆరోపణలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కానీ, హెరిటేజ్ సంస్థ కానీ స్పందించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు నామినేట్ చేసిన కె.రామ్మోహన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేస్తేనే విచారణ పారదర్శకంగా జరుగుతుందంటూ రోహిత్ పవార్ చేసిన డిమాండ్ సహేతుకమైనదేనని స్పష్టం చేస్తున్నారు. నైతికతకు కట్టుబడి రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయక పోవడాన్ని తప్పు పడుతున్నారు. నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మిణల ఫోటోలను ప్రదర్శిస్తూ రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేసినా, పార్టీ స్పందించక పోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వీఎస్ఆర్ వెంచర్స్‌తో హెరిటేజ్ ఫిన్‌లీజ్ 2023లో కుదుర్చుకున్న ఒప్పందం గురించి రోహిత్ మీడియాకు పూసగుచ్చినట్లు వివరించిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్నలకు బదులేదీ? – రూ.35 కోట్ల విలువయ్యే విమానానికి రూ.265 కోట్ల ఇన్సూయరెన్స్ ఎందుకు చేశారు? వాస్తవానికి ప్రమాదానికి గురైన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పాతది కావడంతో మార్కెట్లో రూ.15–20 కోట్లు కూడా చేయదని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఉద్దేశంతో అన్ని రెట్లు ఎక్కువ విలువతో ఇన్సూయరెన్స్ చేశారు? – విమానంలో టాయ్‌లెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎందుకు పెట్టారు? ఒక వీవీఐపీ ప్రయాణిస్తున్న విమానంలో పెట్రోల్ క్యాన్లు ఎలా వచ్చాయి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణించే ఆ విమానం బయలుదేరే ముందు ఆ విమాన సిబ్బంది ఎవరూ వాటిని గమనించలేదా? అసలవి అక్కడికి ఎలా వచ్చాయి? విమానంలో పెట్రోల్ క్యాన్లను ఉంచడమనేది విస్తుగొలుపుతోంది. – ట్యాంకులో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్ నింపారు? ఏ విమానానికి ఎంత మేర ఇంధనం నింపాలనేది డీజీసీఏ నిబంధనల్లో కీలకం. వాటిని పాటించకుండా ఆ విమానంలో సామర్థ్యానికి మించి ఇంధనం నింపడంలో ఉద్దేశం ఏమిటి? సామర్థ్యానికి మించి విమానాల్లో ఇంధనం నింపితే ఎంతటి ప్రమాదమో వారికి తెలియదా? – ఎంత వేడినైనా తట్టుకునే బ్లాక్ బాక్స్ ప్రమాదంలో కాలిపోవడమేంటి? ఏదైనా విమాన ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు.. ఆ ప్రమాదం తాలూకు గుట్టు విప్పేదే బ్లాక్ బాక్స్. ప్రమాదానికి ముందు విమాన పైలట్ల మాటలన్నీ ఇందులో రికార్డు అయి ఉంటాయి. వాటి ద్వారా ప్రమాదానికి గల కారణాలపై ఒక అంచనాకు రావచ్చు. అందుకే ఇంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను అత్యున్నత ప్రమాణాలతో తయారు చేస్తారు. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగినా ఈ బ్లాక్ బాక్స్ దెబ్బ తినకుండా ఉండటమే దీని ప్రత్యేకత. ఎంత వేడినైనా, మంచునైనా తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంటుంది. అలాంటి బ్లాక్ బాక్స్ ఈ ప్రమాదంలో కాలిపోయిందని చెప్పడం ఎంత వరకు నిజం? తద్వారా ఏదో దాస్తున్నారని, నిజాన్ని సమాధి చేస్తున్నారని ఇట్టే తెలియడం లేదా? – ఏ విచారణ జరక్క ముందే వీఎస్ఆర్ వెంచర్స్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎలా క్లీన్ చిట్ ఇచ్చారు? ఒక విమాన ప్రమాదం జరిగిన తర్వాత వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది. వివిధ శాఖలు దర్యాప్తులో భాగమవుతాయి. అందునా ఆ విమాన ప్రమాదంలో మృతి చెందింది మామూలు వ్యక్తి కాదు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో ఒక కేంద్ర మంత్రిగా అత్యంత బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు.. ఆ విమానయాన కంపెనీ వీఎస్ఆర్ తప్పు లేదని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? ఏ ఆధారంతో ఆయన ఈ ప్రకటన చేశారు? అంటే దర్యాప్తు సంస్థ ఆయన ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని చెప్పడం కాదా? ఎందుకోసం ఇలా తొందరపాటుతో ప్రకటన చేశారు? ఎవరి కోసం చేశారు? వీఎస్ఆర్ను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రోహిత్ డిమాండ్లన్నీ సహేతుకమే అంటున్న విశ్లేషకులు – విమాన ప్రమాదంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి చనిపోతే ఇంత వరకు వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్‌ను అరెస్ట్ చేయలేదని, డైరెక్టర్లు విదేశాలకు పారిపోవడానికి సహకరించారని, దీని వెనుక రామ్మోహన్ నాయుడు ఉన్నారంటూ రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలే చేశారు. రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.265 కోట్ల బీమా చేయించడం, టాయిలెట్ వెనుక లగేజ్ పెట్టే ప్రాంతంలో పెట్రోల్ క్యాన్లను ఉంచడం, విమానంలో సామర్థ్యానికి మించి ఫ్యూయల్ నింపడం, ప్రమాదం తర్వాత తీవ్ర పేళ్లుళ్లు జరగడం, 1,100 డిగ్రీల వేడిలో ఉన్నా కాలిపోవడానికి అవకాశం లేని బ్లాక్ బాక్స్ కాలిపోయిందని చెప్పడం.. ఇవన్నీ చూస్తుంటే ఇందులో కుట్ర ఉన్నదని రోహిత్ పవార్ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని విమానయాన రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. – సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫిన్‌లీజ్ వీఎస్ఆర్ సంస్థకు రూ.వందల కోట్లలో ఫండింగ్ చేయడం, కంపెనీ వెనుక టీడీపీ కీలక నేతలు ఉండటం వల్లే 2016లో కేవలం రూ.10 కోట్ల టర్నోవర్‌తో ఉన్న వీఎస్ఆర్ కంపెనీ ఇప్పుడు రూ.500 కోట్లకు చేరుకుందని రోహిత్ ఆధారాలతో చెబుతుంటే టీడీపీ నేతలు, హెరిటేజ్ సంబంధికులు ఎందుకు బదులివ్వడం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. – వీఆర్ఎస్ను వెనకేసుకు రావడానికి టీడీపీ ముఖ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమని, అందువల్లే తక్షణం ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి, ఈ ప్రమాదంపై కుట్ర కోణంలో దర్యాప్తు జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేయడం సహేతుకమేనని.. ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. విమానాల కొనుగోళ్లకు టీడీపీ నిధులు వీఎస్ఆర్ వెంచర్స్ విమానాల కోనుగోళ్లకు హెరిటేజ్ సంస్థతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కూడా నేరుగా నిధులు సమకూర్చినట్లు రోహిత్ పవార్ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ హెరిటేజ్ ఫిన్‌లీజ్ ద్వారా వీఆర్ఎస్కు రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు ఫండింగ్ జరిగినట్లు తమకు సమాచారం ఉందంటూ రోహిత్ ఆరోపించారు. టీడీపీకి చెందిన కీలక వ్యక్తి రూ.650 కోట్లతో దుబాయ్‌లో వీఆర్ఎస్ ద్వారా లెగసీ విమానం కొనుగోలు చేశారని.. దాన్ని దుబాయ్‌లో పార్క్ చేశారని, ఏడాది క్రితం రాజస్తాన్‌లో జరిగిన వీఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ రోహిత్ సింగ్ ఫంక్షన్‌కు టీడీపీలోని ప్రముఖ నేతలు హాజరయ్యారని, ఇలా ఒకటి, రెండు కాదు..అనేక ఆర్థిక పరమైన వ్యవహారాలు వీఎస్ఆర్–టీడీపీ నేతల మధ్య ఉన్న విషయాన్ని రోహిత్ పవార్ బహిరంగ పరిచారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో విమానాలు కొనుగోలు చేసిందెవరని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు కూడా వీఎస్ఆర్ కంపెనీతో సన్నిహిత సంబంధాలున్నాయని, అందువల్లే దర్యాప్తు పూర్తి కాకుండానే ఆ కంపెనీకి క్లీన్ చిట్ ఇస్తూ మాట్లాడటమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని రోహిత్ ఎత్తి చూపారు. తక్షణమే రామ్మోహన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ విమానాల్లోనే తిరుగుతున్న బాబు కుటుంబం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నారా కుటుంబమంతా ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతుండటం తెలిసిందే. ఈ విమానాలన్నీ వీఎస్ఆర్ ఏవియేషన్ సమకూరుస్తున్నవే. ఇదే విషయాన్ని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన కుటుంబంహైదరాబాద్, ఢిల్లీ, పూణే, బెంగళూరు ఇలా ఎక్కడకు వెళ్లాలన్నా వీఎస్ఆర్ విమాన సర్వీసులనే వినియోగిస్తున్నారు. వీఎస్ఆర్ వెంచర్స్.. వీఎస్సార్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చార్టర్ ఫ్లైట్ కంపెనీ. 2011లో ఢిల్లీ కేంద్రంగా ఈ సంస్థను విజయ్ కుమార్ సింగ్ (వీకే సింగ్) స్థాపించారు. ఆయన కుమారుడు రోహిత్ సింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. 2014లో నాన్ షెడ్యూల్డ్ విమాన సర్వీసులను నడపడానికి అనుమతి లభించింది. ఈ లైసెన్స్‌ను 2028 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఈ సంస్థ లీయర్ జెట్ 45/45 ఎక్స్ ఆర్ వంటి విమానాలతో పాటు ఎయిర్ అంబులెన్స్, ఏవియేషన్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలో వీఎస్సార్ లియర్ జెట్ కూలిపోవడం వల్లే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. హెరిటేజ్ ఫిన్‌లీజ్.. హెరిటేజ్ అనుబంధ సంస్థగా పాడి రైతులకు రుణాలను ఇచ్చే లక్ష్యంతో 1996 డిసెంబర్ 23న హైదరాబాద్ కేంద్రంగా హెరిటేజ్ ఫిన్ లీజ్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, అక్కిరాజు చంద్రమౌళి, ఎం.సాంబశివరావు, కొల్లి దుర్గాప్రసాదరావు, భూదర్ కుమార్ కరుటూరి, కొంపెల్ల వెంకటేశ్వర్లు, నర్రావుల నాగేశ్వరరావులు డైరెక్టర్లుగా ఉన్నారు. రైతుల కోసం ఉద్దేశించిన ఈ సంస్థ వందల కోట్ల రూపాయలు విమానయాన సంస్థకు దారి మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. -
చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ ఫిన్ లీస్ నుంచి VSRకు ఫండింగ్
-
ఆ నెయ్యిపై చర్చకు ససేమిరా
సాక్షి, అమరావతి: శాసన మండలి సమావేశాలు శుక్రవారం కేవలం ఆరు నిమిషాల్లోనే ముగిసినా, హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ బంధంపై దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం వెనకాడుతోంది. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ దుష్ప్రచారం చేసి, ఆనక దొరికిపోయిన చంద్రబాబు ఆ అంశం సభలో చర్చకు రాకుండా విఫలయత్నం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన నాలుగున్నర నిమిషాలకే తొలుత వాయిదా పడింది. మధ్యాహ్నం 1.07 గంటలకు తిరిగి ప్రారంభమైన ఒకటిన్నర నిమిషం వ్యవధిలోనే మళ్లీ వాయిదా పడింది. టీటీడీకి నెయ్యి సరఫరా విషయమై హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీ మధ్య ఉన్న సంబంధంపై సభలో చర్చ జరగాలని వైఎస్సార్సీపీ నాలుగు రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఆ పార్టీ సభ్యులు ప్ల కార్డులు పదర్శిస్తూ, నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, ఎస్ మంగమ్మలు.. వాయిదా తీర్మానం ఇవ్వగా, ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ మోషేన్‌రాజు ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. మరో సభ్యుడు బలి కళ్యాణ చక్రవరి ‘ఎన్డీడీబీఎస్ సీఏఎల్ఎఫ్ ఛార్జిషీటు రిపోర్టులోని పేజీ నెంబరు 35లో పేర్కొన్న విధంగా తిరుమల లడ్డూను తయారు చేయడానికి వినియోగించిన నెయ్యి గురించి చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని కూడా తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు చైర్మన్ ప్రకటించారు. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం అంశం, హెరిటేజ్‌కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్ల కార్డులు, శ్రీవారి ఫొటోలు పట్టుకుని చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు కొనసాగించారు.మంత్రి కేశవ్ అసహనంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దేవుడి ఫొటోలను ప్రదర్శించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ సభ్యులు పోడియం ముందుకు దూసుకు రావడంతో చైర్మన్ మోషేన్‌రాజు సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మంత్రి కేశవ్ తన చేతిలో ఉన్న మైకును విసురుగా టేబుల్‌పై కొట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.07 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తూ వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్లు వేసుకొని వేంకటేశ్వరస్వామి ఫొటో పట్టుకొని నడుస్తున్న చిత్రాన్ని ప్రదర్శిస్తూ పోడియం వద్దకు వచ్చారు. అదే సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ‘హెరిటేజ్–ఇందాపూర్’పై చర్చించాల్సిందేఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ బంధంపై శాసనమండలిలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ సభ్యులు శుక్రవారం మండలి ప్రారంభ సమయంలో నిరసనకు దిగారు. ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సాధికారిత సంస్థ భవన్ వద్దకు చేరుకున్న సభ్యులు.. అక్కడి నుంచి బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీగా శాసనమండలికి వెళ్లారు.‘టీటీడీలో హెరిటేజ్ పాత్రపై విచారణ జరపాలి.. హెరిటేజ్ కోసం దైవంపై నిందలా.. సిగ్గు సిగ్గు.. భోలే బాబా వెనుక ఉన్న ఆలీ బాబా చంద్రబాబే.. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ దోపిడీ నశించాలి.. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని అపవిత్రం చేస్తూ అవమానించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి.. భోలే బాబాను తెచ్చింది హెరిటేజ్ బాబే.. రక్షించు గోవిందా.. గోవింద’ అంటూ నినాదాలు చేస్తూ శాసన మండలిలోకి ప్రవేశించారు. -
పనిచేయని ‘కల్తీ’ కుతంత్రం! సొంత కమిటీ షురూ!
సాక్షి, అమరావతి: శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా.. ‘కల్తీ నెయ్యి’ వివాదంలో చిక్కుకున్న చంద్రబాబు పెనుగులాడుతున్నారు. హెరిటేజ్ – ఇందాపూర్ బంధం బయటపడడం, నెయ్యి కాంట్రాక్టు కోసమే పవిత్రమైన తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి ‘కల్తీ’ మరక అంటించినట్లు బట్టబయలు కావడంతో బాబు అండ్‌కో కు కళ్లు బైర్లు కమ్మాయి. తమ కుట్ర బయటపడిపోవడం, మండలిలో ప్రతిపక్షం రోజూ చర్చకోసం పట్టుబడుతుండడం అధికార పక్షానికి మింగుడుపడడం లేదు. దాంతో ముందే వేసుకున్న పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకాన్ని ఆపాదిస్తూ తాము చేసిన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు సొంతంగా ఏకసభ్య కమిటీ ఏర్పాటుచేసే కుట్రను చంద్రబాబు పట్టాలెక్కించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, చంద్రబాబుకు ఎంతో అనుకూలమైన అధికారిగా పేరుతెచ్చుకున్న దినేశ్కుమార్ని ఈ కార్యానికి ఎంచుకోవడం గమనార్హం. టీటీడీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగుతున్నా... కూటమి ప్రభుత్వం తమ సొంత కమిటీని ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది. అంతేకాదు ఆ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ అసలు పన్నాగాన్ని బయటపెట్టాయి.సిట్ లేఖ ముసుగు... రాజకీయ కక్ష సాధింపే లొసుగుఅప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి(ఎఫ్‌ఏసీవో) బాలాజీలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సీబీఐ నేతృత్వంలోని సిట్ కొద్ది కాలం క్రితం రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. టెండర్ల ప్రక్రియను అమలు చేయడంలో వైఫల్యాలపై వారి నుంచి వివరణ తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ లేఖను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. తమ రాజకీయ కక్ష సాధింపునకు సిట్ లేఖను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏకసభ్య కమిటీ పరిధిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. టెండర్ల ప్రక్రియ వ్యవహారాలపై దినేశ్ కుమార్ కమిటీ టీడీడీ అధికారులతోపాటు కమిటీ సభ్యులను కూడా పిలిచి విచారించ వచ్చని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. దీనిని చూస్తే కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్ర అర్ధం కావడం లేదూ? జంతు కొవ్వు కలవలేదన్న క్లీన్ చిట్ తట్టుకోలేక కూటమి కొత్త కుతంత్రంలడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ముఠా దుష్ప్రచారం బెడిసికొట్టడంతో కూటమి ప్రభుత్వం ఈ కొత్త కుతాంత్రానికి తెరతీసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ స్వతంత్ర సిట్ తమ చార్్జషీట్ను నెల్లూరు న్యాయస్థానానికి ఇటీవల సమర్పించింది. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని అందులో స్పష్టం చేసింది. నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్‌ను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ల్యాబరేటరీలలో సీబీఐ పరీక్షించింది. హర్యానాలోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ), గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ల్యాబ్‌లు ఆ శాంపిల్స్‌ను నిశితంగా పరీక్షించి వాటిలో జంతు కొవ్వు లేనే లేదని తేల్చిచెప్పాయి. ఆ రెండు ల్యాబ్‌ల నివేదికలను పొందుపరుస్తూ మరీ సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో చార్‌్జషీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సాధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కూడా సీబీఐ చార్‌్జషీట్ పరోక్షంగా స్పష్టం చేసింది. వైవీ సుబ్బారెడ్డిగానీ ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఎవర్నీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చకపోవడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో లడ్డూ ప్రసాదం ముసుగులో చంద్రబాబు చేసిందంతా రాజకీయ దుష్ప్రచారమేన్నది నిర్ధారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల ప్రసాదానికి కళంకం ఆపాదించేందుకు తెగబడతారా అని జాతీయస్థాయి మీడియా, విశ్లేషకులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు తమ కుట్రను కొనసాగించేందుకే ఏక సభ్య కమిటీని తెరపైకి తెచ్చారు. అందుకే నెయ్యి టెండర్ల ప్రక్రియకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులను కూడా విచారించే అధికారం ఈ కమిటీకి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ సమగ్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన చార్్జషీట్కు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే సుప్రీం కోర్టునే ధిక్కరిస్తోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇక 45 రోజుల హై డ్రామా..లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచార రాద్ధాంతం మరో 45 రోజులపాటు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. టీటీడీ నెయ్యి టెండర్ల ప్రక్రియపై టీటీడీ కమిటీ సభ్యులు, ఇతర అధికారులను విచారించేందుకు ఏకసభ్య కమిటీకి 45 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే నెయ్యి నాణ్యత అంశంతోపాటు టెండర్ల ప్రక్రియపై సీబీఐ సిట్ దర్యాప్తు చేసే నివేదిక సమర్పించింది. కాగా మళ్లీ ఏకసభ్య కమిటీ టెండర్ల ప్రక్రియపై విచారణకు ప్రభుత్వం అనుమతించడం విడ్డూరంగా ఉంది. తద్వారా పలువురు అధికారులు, నెయ్యి సరఫరా డెయిరీ ప్రతినిధులు, ఇతరులను విచారణ పేరుతో వేధించడమే ప్రభుత్వ లక్ష్యం. తాము కోరినట్టు వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. మద్యం విధానంపై అక్రమ కేసులో ఇదే రీతిలో బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసి అక్రమ కేసులతో వేధిస్తున్న విషయం తెలిసిందే. అదే రీతిలో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబ్దద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని అధికారులు, డెయిరీ ప్రతినిధులను బెదిరించేందుకు ఏక సభ్య కమిటీ రూపంలో అవకాశం కల్పించింది. అనుకున్నట్టు నివేదిక ఇప్పించుకోవాలన్నదే ప్రభుత్వ మొదటి లక్ష్యం. అనంతరం ఆ నివేదిక ఆధారంగా పోలీసులతో అక్రమ కేసు నమోదు చేయించి వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్నది అసలు లోగుట్టు. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారాన్ని సాగదీస్తూ ఉండాలన్నది చంద్రబాబు ఉద్దేశం. తమ రాజకీయ కుట్రల కోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం, సంప్రదాయాలపై విష ప్రచారం చేసేందుకు చంద్రబాబు పక్కా పన్నాగంతోనే తెగబడుతున్నారన్నది సుస్పష్టం. -
హెరిటేజ్ ప్రైవేట్ సంస్థ అయినప్పుడు.. మంత్రులెందుకు చించుకుంటున్నారు లాజికతో కొట్టిన బొత్స
-
సాక్షి పై హెరిటేజ్ పరువు నష్టం దావా..! సంచలన నిజాలు బయటపెట్టిన లాయర్
-
TTD డిస్ క్వాలిఫై చేసిన ఇందాపూర్ కి.. 3 నెలల్లోనే అర్హత కల్పించిన చంద్రబాబు
-
ఇందాపూర్ వెనుక హెరిటేజ్.. మండలిలో దడదడలాడించిన బోత్సా
-
దేవుడి దెబ్బ అదుర్స్.. హెరిటేజ్ షేర్లు ఢమాల్..
-
ఇందాపూర్, హెరిటేజ్ ఒక్కటే పాలు, పెరుగే కాదు పాలన కూడా కల్తీ
-
Botsa : దమ్ముంటే చర్చకు రా..
-
లడ్డూ కల్తీ, ఇందాపూర్ డైరీపై చర్చకు YSRCP డిమాండ్
-
ఇందాపూర్ బాబు సొంత డైరీ.. అసలు హెరిటేజ్ తో అచ్చన్నకు ఏంటి సంబంధం..?
-
చంద్రబాబు హెరిటేజ్ దే ఇందాపూర్ డైరీ
-
హెరిటేజ్‌తో ఇందాపూర్ డెయిరీ బంధంపై అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
-
కూటమికి టైం దగ్గరపడింది.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
ఇందా డెయిరీ కల్తీ నెయ్యి బాగోతం.. ఆధారాలతో బయటపెట్టిన కేఎస్ ప్రసాద్
-
హెరిటేజ్ కోసమే కుట్ర! టీటీడీ నెయ్యి పై తీగ లాగితే..!
-
సూది కోసం సోదికెళ్తే.. పాత కథలన్నీ బయట పడుతున్నాయ్..
-
వేంకటేశ్వర.. నువ్వు ఉన్నావయ్యా.. చంద్రబాబు నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడు..!
-
సోషల్ మీడియా జమానా.. బాబు బుక్ అయినట్టేనా?
చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని అంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను సోషల్ మీడియా వెలికితీస్తున్న వైనమిప్పుడు ఒక రకంగా సంచలనం సృష్టిస్తోంది. హిందూ మతోద్ధారకుడిగా తరచూ ప్రచారం చేసుకుంటున్న ఆయన అసలు రూపాన్ని బయటపెట్టాయి ఈ పోస్టులు.తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ దిక్కుమాలిన వివాదాన్ని సృష్టించి వైఎస్సార్సీపీపై రుద్దేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. పైగా.. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు తొమ్మిది మంది నేతలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది బాబుగారికి. అక్కడ కూడా మరోసారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు కల్తీ అంటూ ఏదో మాట్లాడబోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని డబ్బుకోసం ఈ కల్తీ జరిగిందని తనకు తోచిన సలహాను చంద్రబాబు చెవిలో చెప్పేయత్నం చేశారు. దానిని అంగీకరించని చంద్రబాబు అవినీతి కాదు.. హిందూమతంపై దాడి చేయడానికి జరిగిన కుట్ర అని ప్రకటించారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల ఏడు కొండలను రెండు కొండలుగా చెప్పారని, అప్పుడు తాను దానికి వ్యతిరేకంగా మెట్ల ద్వారా తిరుమల వెళ్లి దానిపై వారి పక్షాన క్షమాపణ కోరానని అన్నారు. నిజంగా ఆయన అలా చేశారా? అన్నది గుర్తు లేదు కాని కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు చూపిన ఆధారాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మొదలు టీడీపీ మీడియా, ఇతరత్రా వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు ఆరంభించాయి. హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని ప్లాన్ చేశారు. పంచాయితీ ఎన్నికలు సందర్భంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవిత్రమైన తిరుమల ప్రాంతంలో ఎన్నికలు జరపడం సరికాదన్న భావనతో వందేళ్లుగా తిరుమల కొండలుగా భావిస్తున్న ప్రాంతంలో ఎన్నికలు జరపవద్దని ఒక జీవో ఇచ్చారు. పచ్చ తమ్ముళ్లు దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సహచర ఎల్లో మీడియా సాయంతో వివాదాన్ని సృష్టించారు. ఆ జీవోను వైఎస్‌కు అంటకట్టి అందులోని వివరాల ప్రకారం రెండు కొండలే పరిధిలోకి వస్తాయని, ఏడు కొండలు రావని అంటూ గొడవ మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న రాజశేఖరరెడ్డి తిరుమల విస్తీర్ణంపై ఉన్న అస్పష్టతను వెంటనే తొలగిస్తూ మొత్తం ఏడు కొండలూ వచ్చేలా కచ్చితమైన జీవో ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో 18 ప్రముఖ హిందూ దేవాలయాలున్న ప్రాంతాలను టెంపుల్ సిటీలుగా ప్రకటించి ఆయాచోట్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అన్యమత ప్రచారంపై నిషేధం విధిస్తూ మరో జీవో జారీ చేశారు.అంతేకాదు... వైఎస్ తన హయాంలో తిరుమల విశిష్టతను కాపాడేలా, హిందు మత విశ్వాసాలను పరిరక్షించేలా అనేక చర్యల తీసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలో ఎస్వీబీసీ ఛానెల్ పెట్టి స్వామివారి ప్రచారం చేయాలని సంకల్పిస్తే చంద్రబాబు దాన్ని అసెంబ్లీలోనే వ్యతిరేకించారు. ఆ ఛానెల్‌కు రూ.40 కోట్లు వృథా అని అని వాదించారు. 2009 ఎన్నికలకు ముందు గుంటూరు వద్ద జరిగిన బైబిల్ మిషన్ ఉత్సవాల్లో చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు కొండలూ తిరుమలేశుడివే అని, అన్యమత ప్రచారం నిషేధిస్తూ వైఎస్ ఇచ్చిన జీవోలను రద్దు చేస్తామని ఆ సభలో ప్రకటించారు. ఈ జీవోల వల్ల క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని కూడా చంద్రబాబు అన్నారట. ఇప్పుడేమో తాను రెండు కొండలు, ఏడు కొండలు పోరాటం చేశానని చెబుతున్నారు. అప్పుడేమో హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాన్ని నిషేధించే జీవోను రద్దు చేస్తామన్నారు. 2019-24 మధ్యలో అన్యమత ప్రచారం జరిగిపోతుందన్నట్లు వదంతులు సృష్టించి టీడీపీ మీడియా ప్రచారం చేసేది. ఎంత ఆత్మవంచన.2009లో ప్రముఖ హిందూవాది టి.హనుమాన్ చౌదరి ఒక లేఖ రాస్తూ చంద్రబాబు తీరును తప్పు పట్టారు. అన్యమత ప్రచారానికి అవకాశం ఇచ్చే విధంగా జీవో ఇస్తానని చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీ, ఎస్టీ హిందువులకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తామని చంద్రబాబు ఇచ్చిన మరో హామీని కూడా ఆయన విమర్శించారు. క్రిస్టియన్ ఓట్ల కోసం, మత మార్పిడులను ప్రోత్సహించేలా చంద్రబాబు ఇలాంటి హామీలు ఇచ్చారని విమర్శిస్తూ 2009 ఫిబ్రవరి మూడున రాసిన లేఖ సోషల్ మీడియా యాక్టివిస్టులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది రాకపోతే చంద్రబాబు చెప్పే మాటలు నిజమేనేమో, ఈయన హిందుత్వ కోసం కట్టుబడి ఉండే వ్యక్తేమో అన్న భావన ఉండేది కదా!.1996 ఎన్నికల సమయంలో చంద్రబాబు కమ్యూనిస్టులతో పొత్తులో ఉండేవారు. ప్రచార సభలో బీజేపీని మతతత్వ పార్టీగా, మసీదులు కూల్చే పార్టీగా ధ్వజమెత్తేవారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బీజేపీతో పొత్తు పెట్టుకోనని మహానాడులో ప్రకటించారు. కానీ, ఆ తర్వాత జరిగిన సంగతులు తెలిసినవే. గుజరాత్లో జరిగిన మత కలహాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి మోదీని పదవి నుంచి దించాలని డిమాండ్ చేసి, తదుపరి లోక్‌సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఓటింగ్ వరకు ఉండకుండా జారుకున్నారు. 2019లో ప్రధాని మోదీపై వ్యక్తిగత పరుష వ్యాఖ్యలు చేసింది ఇటీవలి చరిత్రే. 2024 వచ్చేసరికి మోదీ ప్రపంచానికి మార్గదర్శి అని, దేశానికి ఆయన గొప్ప సేవలు చేస్తున్నారని ప్రకటించారు. ఇప్పటికీ కూడా ప్రధానిని అదే తరహాలో పొగుడుతున్నారు.ఇక లడ్డూ వివాదంలో తను చేసిన ఆరోపణ నిజమని జనాన్ని నమ్మించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఈయన మాటలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లేదు. అందువల్లే ఢిల్లీ టూర్లో మీడియా లడ్డూ గురించి అడిగినా స్పందించలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో హెరిటేజ్ పెరుగు నాణ్యతపై వచ్చిన ఆరోపణలు, ఫుడ్ సేఫ్టీ సంస్థ రూ.లక్ష జరిమానా విధించిన సమాచారం రాగానే చంద్రబాబుకు చెందిన ఆ కంపెనీ స్పందించిన తీరు చర్చనీయాంశంగా ఉంది. ల్యాబ్ పరీక్షల తీరుపై హెరిటేజ్ సంస్థ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది. సీల్డ్ ప్యాకెట్ల నుంచి పెరుగు సాంపుల్ తీశారా? లేక లుజ్గా తీసుకున్నారా? అన్న సందేహం వ్యక్తం చేసింది.డెయిరీ ఉత్సత్తులలో వివిధ కారణాల వల్ల స్వల్పంగా విశ్లేషణలలో తేడా రావచ్చని, ఇందులో ప్రమాదకరమైనవి కాని, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవి ఏవీ లేవని పేర్కొంది. ఒక ప్రైవేటు సంస్థ అయిన హెరిటేజ్ ఇంత కంగారుపడి ఈ ప్రకటన చేసిందే. మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తదితరులు పదే పదే జంతు కొవ్వు, పంది మాంసం వంటివి లడ్డూలో కలిశాయని చెబుతున్నారే. అధి ధర్మమేనా ? అంటే తన సంస్థ కైతే ఒక రూల్స్.. అదే ప్రజలందరూ కొలిచే దైవం విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తారా? తన దాకా వస్తేకాని తత్వం బోధపడదని అంటారు! ఇదే అన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇందాపూర్ పేరుతో టీటీడీకి హెరిటేజ్ కంపెనీ నెయ్యి సరఫరా...
-
చుక్క పాలు లేకుండా పెరుగు.. ఎంత దారుణం..!
-
హెరిటేజ్ పెరుగులో పెరుగు లేదట..!
ప్రపంచంలో తానే అత్యంత నీతిమంతుడినని.. తాను పుట్టిన తర్వాతే లోకంలో పద్ధతి నీతి నిజాయితీ ధర్మం అని ఉద్భవించాయని చెప్పే చంద్రబాబు తాను నిర్వహించే హెరిటేజ్ పెరుగులో పెరుగు లేకుండానే కేవలం కల్తి ఉత్పత్తులను మార్కెట్లోకి పంపించి కోట్లు కొల్లగొడుతున్నారు. శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడినట్లు ప్రపంచంలో అందరికీ నీతులు చెప్పే చంద్రబాబు ఆయన సారధ్యంలోని హెరిటేజ్ కల్తీ ఉత్పత్తులని అమ్ముతూ దొరికిపోయింది. పెరుగు అంటూ విక్రయిస్తున్న ఆ ప్యాకెట్లలో అసలు పెరిగే లేదని గురుగాంలో ఏకంగా కేసు నమోదయింది. వివిధ స్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో అది మొత్తం కల్తీ అని తేలడంతో ఏకంగా లక్ష రూపాయలు పెనాల్టీ సైతం విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీంతో దెబ్బకు దెయ్యం జడుస్తుంది అన్నట్లుగా హెరిటేజ్ సంస్థ దారికి వచ్చింది. ఈ క్రమంలో సంస్థ ఒక ప్రకటన చేసింది. హెరిటేజ్ సంస్థపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. . తమ ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తామన్నారు. తమకు వెన్న శాతం తగ్గించే ఉద్దేశమే లేదన్నారు. ఇదే తరుణంలో అసలు హెరిటేజ్ పెరుగుకు సంబంధించి శాంపిల్స్ సేకరించే ప్రక్రియ సరిగా లేదంటూ ఎదురుదాడి చేసింది.అయితే హెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను సేకరింంచే సమయంలో సరైన పద్ధతి పాటించలేదన్నారు.. ఆ మొత్తం ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. 'నిర్దేశిత ప్రమాణాల కంటే ఎస్ఎన్ఎఫ్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్ నివేదికలో తేలింది. దీంతో అసలు ఆ నమూనాల సేకరణ ప్రక్రియ సరిగా లేదని బుకాయిస్తోంది.మరి తిరుపతి లడ్డూకు ఈ నిబంధనలు వర్తించవాహెరిటేజ్ ఉత్పత్తులకు సంబంధించి నమూనాలు సేకరించే క్రమంలో నిబంధనలు పాటించలేదని, థర్డ్ పార్టీ సమక్షంలో నమూనాలు తీయలేదని అంటూ ప్రభుత్వ సంస్థలను వాటి పనితీరును తప్పుపట్టిన హెరిటేజ్ దాని యజమాని చంద్రబాబు తిరుపతి లడ్డు విషయంలో మాత్రం తమకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తిరుపతి లడ్డు కోసం వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ అవాస్తవాలు ప్రచారం చేసిన చంద్రబాబు నా నమూనాలు సేకరించే విషయంలో ప్రమాణాలు పాటించారా లేదా చెప్పడం లేదు. బోలె బాబా డైరీ నుంచి వచ్చే నెయ్యి నమూనాలను థర్డ్ పార్టీ సమక్షంలో సేకరించారా లేదా. .. నెయ్యి నమూనాలను ని ట్యాంకర్ల నుంచి నేరుగా సేకరించారా ? లూజ్ నెయ్యిని వేరే పాత్రలోకి తీసుకుని దాన్ని ల్యాబ్ పరీక్షలకు పంపారా అనేది కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. తాము బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తమకు ఇబ్బంది వచ్చినపుడు నీతులు చెప్పడం పద్ధతి కాదని ప్రజలు అంటున్నారు. ఎదుటివారిపై అభాండాలు వేసేటపుడు వెనకా ముందూ చూడని చంద్రబాబు తనవరకు వచ్చేసరికి అందరూ నిబంధనలు పాటించాలని రోదిస్తున్నారు.తిరుమల లడ్డుకోసం వాడే నేతి కి సంబంధించి నామూనాలు థర్డ్ పార్టీ సమక్షంలో తీసారా లేదా.. నేతి నాణ్యతను నిర్ధారించే పరీక్షలు సరిగానే చేశారా లేదా అనేది తేల్చకుండానే బురద చెల్లుతున్న చంద్రబాబు తన హెరిటేజ్ పెరుగు విషయానికి వచ్చేసరికి రూల్స్..నిబంధనలు అంటూ ఆక్రందనలు చేస్తున్నారు. నీవరకు వచ్చేసరికి ఒక రూల్.. మిగతావారికి ఇంకో రూల్ ఎలా బాబూ -
హెరిటేజ్ పెరుగు నాసిరకం.. నెయ్యిపై నారా ఆరోపణలు?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారని అన్నారు. బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వచ్చింది చంద్రబాబు పాలనలోనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మేము అబద్ధాల కోరు చంద్రబాబుతో కొట్లాడుతున్నాం. ప్రతిరోజూ ఆయనతో కొట్లాడకపోతే ఆయన చెప్పే అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది. అందుకే మేము తిరుమల పవిత్రతపై రోజూ మాట్లాడాల్సి వస్తోంది. కేవలం హిందువుల్లో జగన్ పట్ల వ్యతిరేకత రావాలనే చంద్రబాబు దుష్ప్రచారానికి దిగాడు. దేవుడిని కూడా అడ్డు పెట్టుకుని కుట్రలకు తెర లేపారు. జంతువుల కొవ్వు కలిసింది అని మొట్టమొదటి అబద్దం చెప్పాడు. స్వామి వారి పవిత్రతకు భంగం కలగకుండా ఉండాలి అనుకుంటే ఈ విషయం మాట్లాడరు.గోప్యంగా విచారణ చేసి నిజాలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు ప్రకటన చేయాలి. సుప్రీంకోర్టులో సిదార్థ్ లూథ్రా వాదిస్తుంటే జడ్జీలు మాట్లాడిన మాటలు వింటే అన్నీ తెలుస్తాయి. ఆనాడు సుప్రీంకోర్టు మందలించినా మీకు బుద్ధి రాలేదు. సీబీఐ విచారణ వేసినా దర్యాప్తు చేసింది మీ అధికారులే కదా. వారిచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పారు. అప్పుడన్నా నన్ను క్షమించి స్వామీ అని దేవదేవుడిని కోరాల్సింది. అప్పుడు జంతు కొవ్వు అన్నావు.. ఇప్పుడు బాత్రూం కడిగేవి వాడారు అంటున్నావు. భోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా?.82వేల కేజీల నెయ్యి కొనుగోలుకు ఒకే రోజు అనుమతించారు. సీబీఐ రిపోర్టు కాదని ఏకసభ్య కమిషన్ ఎలా వేస్తారు?. సీబీఐ దర్యాప్తు తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడమేంటి?. భోలే బాబా ఫ్రాడ్ అయినప్పుడు 82వేల కేజీల నెయ్యి ఎలా ఆర్ఢర్ ఇచ్చారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులే సరికాదని ఎలా చేప్తావు చంద్రబాబు?. బాబూ నీకు ఆత్మే లేనప్పుడు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం ఏంటి?. వైఎస్ జగన్ హయాంలో నెయ్యి నాణ్యతలో ఎక్కడా పొరపాటు చేయలేదు. బరితెగించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నావు.ఇది కూడా చదవండి: చంద్రబాబు హెరిటేజ్ గురించి తెలుసా.. నాసిరకం పెరుగు.. సీబీఐ సిట్ చెప్పినా, ల్యాబ్స్ చెప్పినా నారా వారి మాటే కరెక్ట్ అనాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంటున్నారు.. సీబీఐ విచారణ చేసినా వీళ్లు ఒప్పుకోవడం లేదు. పాలే లేకుండా పెరుగు తయారు చేసినందుకు నీ హెరిటేజ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా కట్టావు. దీనికి పుల్ స్టాప్ పడాలంటే ఒక్కటే మార్గం.. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఇక నిరూపించుకోవాలి. దీనికి మేము జంతు కొవ్వు కలిపితే మా చేతులు పడిపోవాలి. జంతు కొవ్వు కలవకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నోరు పడిపోవాలి. మీ ముగ్గురికి ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష తప్పకుండా విధిస్తాడు. స్వామి వారికి నువ్వు చేసిన అపచారానికి కచ్చితంగా శిక్ష పడుతుంది. నీ జీవితంలో 2029 తర్వాత నువ్వు, నీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఆ తర్వాత నీ జీవితంలో మంచి రోజులే ఉండవు. నీకు స్వామి వారి పట్ల భక్తి లేదు.. ప్రజల మనోభావాలపై గౌరవం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
హెరిటేజ్ పెరుగులో ఏంకలుపుతున్నారు..? బాబు, లోకేష్‌ను నిలదీసిన కారుమూరి
-
అంతా కల్తీ.. హెరిటేజ్ గుట్టురట్టు
-
చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్’ బండారం బట్టబయలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ బండారం బట్టబయలైంది. హెరిటేజ్ ‘టోటల్ కర్డ్’ అత్యంత నాణ్యతలేనిదిగా నిర్థారణ అయ్యింది. సబ్-స్టాండర్డ్ ఉత్పతి అని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ధారించింది. నిబంధనలు ఉల్లంఘించి నాణ్యత లేని పెరుగు విక్రయిస్తోంది. నాణ్యత లేని పెరుగు విక్రయిస్తున్న హెరిటేజ్‌కు జరిమానా విధించిన అధికారులు.. పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ యాక్ట్ కింద రూ.లక్ష పెనాల్టీ వేశారు. తప్పు ఒప్పుకున్న హెరిటేజ్ యాజమాన్యం.. పెనాల్టీ కడతామంటూ సెబీకి నివేదిక ఇచ్చింది. ప్రజల ఆరోగ్యంతో బాబు సంస్థ చెలగాటమాడుతోంది. నాణ్యతలేని పెరుగును మార్కెట్లోకి వదిలిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్ పేరుతో హెరిటేజ్ మోసానికి పాల్పడుతోంది. హెరిటేజ్ ఉత్పత్తుల్లో నాణ్యత లోపంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
సుసంపన్న సహకారా వారసత్వ సంపద..!
వారసత్వ సంపద అపురూపమైనది. విలువను గుర్తెరిగి పరిరక్షించుకోదగినది. కొత్త తరానికి ఆ స్ఫూర్తిని అందించదగినది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో పురాతన నాగరికతలకు ప్రతిరూపాలుగా వారసత్వ కట్టడాలు, స్థలాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తించి పరిరక్షించటం ఆధునికుల బాధ్యత. సాంస్కృతిక, ఆథ్యాత్మిక, చారిత్రక, వ్యవసాయక హెరిటేజ్ సైట్స్ గురించి మాత్రమే ఇప్పటికి తెలుసు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సహకార సంస్థలు కూడా చేరాయి. ఇది అంతర్జాతీయ సహకార సంవత్సరం. ఈ సందర్భంగా సుప్రసిద్ధ సహకార సాంస్కృతిక వారసత్వ సంస్థలను గుర్తించే బృహత్ కృషికి అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్– ఐసీఏ) శ్రీకారం చుట్టింది. 25 దేశాలకు చెందిన అంతర్జాతీయంగా పేరొందిన 31 పురాతన సహకార సంస్థలకు ‘కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్’గా తొలివిడతలో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రత్యేక వెబ్సైట్లో ఈ సైట్స్ విశిష్టతలను తాజాగా అందుబాటులోకి తెచ్చారు. సహకార సాంస్కృతిక వారసత్వంలో భారత్‌కు విశేష భాగస్వామ్యం ఉంది. ‘కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్’గా గుర్తింపు పొందిన సంస్థల్లో గుజరాత్ కేంద్రంగా విస్తరించిన పాడి రైతుల సహకార మకుటం ‘అమూల్’తోపాటు కేరళకు చెందిన ‘ఉరులుంగల్ వర్క్‌ర్స్ సొసైటీ’ చోటు దక్కించుకున్నాయి. అసలు సహకార ఉద్యమం అంటే ఏమిటి? ఈ ఉద్యమ చరిత్ర ఏమిటి? సుసంపన్న వారసత్వం ఏమిటి?... వివరంగా తెలుసుకుందాం!దిగ్గజ సహకార సంస్థలకు ‘సహకార సాంస్కృతిక వారసత్వ’ సంస్థలుగా గుర్తించటంతో పాటు వీటన్నిటినీ ఆన్లైన్లో ఒక్కచోట చూపించే ప్రపంచ పటం ఇప్పటి వరకు లేదు. ఈ కొరత తీర్చుతూ ఈ నెల 12న అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) అధికారికంగా ప్రకటన చేసింది. సహకార సాంస్కృతిక వారసత్వ వేదికను, సహకారం తరతరాలుగా సంస్కృతి, విద్య, జీవనోపాధిని ఎలా రూపొందించిందో వివరించే స్థలాల మొట్ట మొదటి ప్రపంచ పటాన్ని ప్రారంభించింది. బ్రెసిలియాలోని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక వేడుకలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సహకార ఉద్యమ సజీవ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, దాని ప్రాముఖ్యతను ఎత్తిచూపటానికి ఈ ఆవిష్కరణ ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి 31 సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను మొట్టమొదట ఈ పటంలో ఐసీఏ చోటు కల్పించింది. ఆధునిక సహకారానికి జన్మస్థలం రోచ్డేల్ (యునైటెడ్ కింగ్డం) మొదలుకొని.. నోవా పెట్రోపోలిస్ (బ్రెజిల్) లోని మాన్యుమెంటో ఆవో కోఆపరేటివ్ నుంచి అముల్ డెయిరీ కోఆపరేటివ్ – వర్గీస్ కురియన్ మ్యూజియం (భారతదేశం), ఉరులుంగల్ వర్కర్స్ కోఆపరేటివ్ (భారతదేశం), ఫెడరేషన్ ఆఫ్ సదరన్ కోఆపరేటివ్స్ (అమెరికా), మోషి కో–ఆపరేటివ్ యూనివర్సిటీ (టాంజానియా) నుంచి అంతర్జాతీయ కార్మిక సంస్థ కోఆపరేటివ్, సోషల్ అండ్ సాలిడారిటీ ఎకానమీ యూనిట్ (స్విట్జర్లాండ్) వరకు ఇందులో ఉన్నాయి. ఐసీఏ గ్లోబల్ ఆఫీస్ సహకారంతో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రెజిలియన్ కోఆపరేటివ్స్ (ఓసీబీ), భారత్‌కు చెందిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఈ మ్యాప్‌ను రూపొందించాయి.‘ఈ వారసత్వ స్థలాలు సహకారం, సంఘీభావాన్ని బోధించే సజీవ తరగతి గదులు. సహకారం సుసంపన్న చరిత్ర అని, న్యాయమైన సమాజాలను నిర్మిస్తున్న సాంస్కృతిక శక్తి అని ఇవి నిరూపిస్తున్నాయి’ అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రెజిలియన్ కోఆపరేటివ్స్ (ఓసీబీ) అధ్యక్షుడు మార్సియో లోప్స్ డి ఫ్రీటాస్ అన్నారు. ‘ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడంలో ఎన్సీడీసీ సాంకేతిక పరమైన భాగస్వామి కావటం సంతోషకరం. సహకారానికి సంబంధించిన కాలాతీత వారసత్వాన్ని ప్రపంచ ప్రజలు చూడటం కోసం నమోదు చేయటానికి ఈ కృషి దోహదపడింది’ అని ఎన్సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ బన్సాల్ (ఐఏఎస్) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట విడతలో 31 ప్రసిద్ధ సంస్థలను సహకార సాంస్కృతిక వారసత్వ సంస్థలుగా ఈ పటంలో చేర్చారు. ఇకముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పంచవ్యాప్తంగా సహకార సంస్థలు, సమాఖ్యలు, సంఘాలు తమకు తెలిసిన సహకార వారసత్వ హోదా ఇవ్వదగిన సైట్లు, సంస్థలు, జీవన సంప్రదాయాలను ప్రతిపాదించవచ్చు. సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల గుర్తింపుపై కొత్త మార్గదర్శకాలలో నిర్వచించిన స్పష్టమైన అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఐసీఏలో సభ్యులైన సహకార సంస్థలు, వ్యక్తులు ఈ పటంలో చేర్పింపునకు ఈ కింది వెబ్సైట్ ద్వారా నామినేట్ చెయ్యవచ్చు. www.culturalheritage.coop/ nominationsఐసీఏ రెక్టర్ జనరల్ జెరోయిన్ డగ్లస్ అధ్యక్షతన గల వర్కింగ్ గ్రూప్ నిర్ణయం తీసుకొని, అర్హతగల సంస్థలకు హెరిటేజ్ గుర్తింపునిచ్చి ఈ పటంలో పొందుపరుస్తారు. ఈ బృందంలో మొరాకో, జర్మనీ, నైజీరియా, భారతదేశం, జపాన్, యూకే, బ్రెజిల్, అమెరికాలకు చెందిన సీనియర్ సహకారవేత్తలు ఉన్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది కంటికి కనిపించే సుప్రసిద్ధ సహకార సంస్థలకు సంబంధించిన ప్రపంచ సహకార సాంస్కృతిక వారసత్వ పటం గురించి. దీన్ని ‘గోచర సహకార వారసత్వ జాబితా’ అనొచ్చు. వచ్చే ఏడాదిలో ‘అవ్యక్త సహకార వారసత్వ జాబితా’ను కూడా ఐసీఏ ప్రకటించనుంది. సహకార సంస్కృతిని ప్రతిబింబించే మౌఖిక సంప్రదాయాలు, అభ్యాసాలు, ఆచారాలకు ఇందులో చోటుకల్పిస్తారు. సహకార ఉద్యమం అంటే..? ఉమ్మడి యాజమాన్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నియంత్రించబడే సంస్థ ద్వారా తమ సాధారణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలను తీర్చుకోవడానికి స్వచ్ఛందంగా ఐక్యమయ్యే వ్యక్తులతో కూడిన స్వయంప్రతిపత్తి గల సంఘం. స్వయం సహాయం, పరస్పర సహాయం సూత్రాలపై సభ్యుల అవసరాలు తీర్చటం కోసం పనిచేసే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్థిక, సామాజిక ఉద్యమం. బాహ్య వాటాదారులకు లాభాలను పెంచడం కంటే సభ్యులకు సేవ చేసే లక్ష్యంతోనే ఏర్పాటైనవి సహకార సంఘాలు.అంతర్జాతీయంగా విస్తరించిన సహకార ఉద్యమానికి చోదక శక్తి అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్– ఐసీఏ). ఇది 130 ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి కథా ఒక స్వరంతో ప్రారంభమవుతుంది. వ్యక్తులు బృందంగా ఏర్పడి కలలను పండించుకున్నప్పుడు.. కోఆపరేటివ్ ఉద్యమంలో ఈ స్వరం ప్రతిధ్వనిస్తుంది. ఇది సమాజాలను మర్చేస్తుంది. తరతరాల పాటు ఆ మార్పు కొనసాగుతూ ఉంటుంది. కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ ఒక ప్రపంచ ఉద్యమం. సహకారం నుంచి పుట్టిన కథల్లో, సంప్రదాయాల్లో, కల్పనల్లోని ఈ సహకార ఉద్యమ స్వరాలన్నిటినీ ఈ ఉద్యమం భద్రంగా కాపాడుతూ ఉంటుంది అని ఐసీఏ తెలిపింది. అమూల్: శ్వేత విప్లవ స్ఫూర్తి‘ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ (అమూల్)’ పాల ఉత్పత్తుల దిగ్గజ సహకార సంఘం, ఆనంద్ మ్యూజియం భారతీయ చిన్న, సన్నకారు పాడి రైతుల శ్వేత విప్లవ స్ఫూర్తికి సంబంధించిన అవిచ్ఛిన్న సహకార సంస్కృతి వారసత్వ స్ఫూర్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి. 1946లో త్రిభువన్దాస్ పటేల్, తర్వాత డాక్టర్ వర్గీస్ కురియన్ చూపిన బాటలో అమూల్ దిగ్గజ సంస్థగా అవతరించింది. ఇవ్వాళ 78 ప్రాసెసింగ్ ప్లాంట్లలో రోజుకు 28 కోట్ల లీటర్ల పాలను శుద్ధి చేసి ఉత్పత్తులను తయారు చేస్తారు. గుజరాత్‌లోని 37 లక్షల పాడి రైతుల శ్రమ అమూల్ గుండెచప్పుడై వెల్లివిరుస్తోంది. ఆనంద్ నగరంలోని అమూల్ మ్యూజియం భవనం భారతదేశంలోని అత్యంత అసాధారణ సహకార విజయ గాథలలో ఒకదాన్ని చెప్పే భవనం ఉంది. అమూల్ మ్యూజియం కేవలం ప్రదర్శనల గ్యాలరీ కాదు, ఇది ఒక దేశాన్ని మార్చిన సహకార ఆదర్శాలకు సజీవ నివాళి. ఇక్కడ భారతదేశ స్వాతంత్య్ర పోరాటం, క్షీర విప్లవం పెనవేసుకున్న కథనాలు వినిపిస్తాయి. స్వావలంబన కల సహకార ఉద్యమంలో ఎలా శాశ్వత రూపాన్ని ΄పొందిందో అముల్ మ్యూజియం చూపిస్తుంది. నవంబర్ 26న కురియన్ పుట్టిన రోజును భారతదేశం జాతీయ పాల దినంగా జరుపుకుంటుంది. ఉరలుంగల్: శ్రామిక సహకార స్ఫూర్తిఉరలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ (యూఎల్సీసీఎస్).. సాధారణ కార్మికులు తమ ఉపాధి కోసం, పని భద్రత కోసం నిర్మించుకున్న అద్భుత సహకార సౌధం. కేరళ తీర్రప్రాంత పట్టణం వడకరలో ఉరలుంగల్ ప్రధాన కార్యాలయం ఉంది. శ్రామికుల చెమట చుక్కలతో ఇటుక ఇటుక పేర్చి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆశాసౌధం ఇది. ఆసియాలోని అత్యంత గొప్ప సహకార సంస్థలలో ఒకది. 1925లో కొద్ది మంది దార్శనిక కార్మికుల సమూహం స్థాపించారు. సంపద లేదా ప్రత్యేక హక్కు నుంచి పుట్టలేదు. అవసరం, ఐక్యత, ధైర్యం నుంచి పుట్టింది. న్యాయమైన వేతనాలు, గౌరవానికి నోచుకోని 14 మంది ఉరలుంగల్ గ్రామ కార్మికులు న్యాయం కోసం వేచి ఉండటానికి బదులుగా, దాన్ని తామే నిర్మించుకోవాలని నిర్ణయించుకొని సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక సమానత్వం, సహకార చర్యను సమర్థించిన స్థానిక తత్వవేత్త వాగ్భటానంద సంస్కరణవాద ఆదర్శాలే వారికి మార్గనిర్దేశం చేశాయి. ‘గౌరవంగా పని చేయండి, సమిష్టిగా పంచుకోండి, సమాజానికి సేవ చేయండి’ ఇదీ వారి నినాదం. రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు నిర్మించే ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థగా ఈ సొసైటీ ఎదిగింది. సేంద్రియ వ్యవసాయం, కళలు, సాఫ్ట్వేర్, డిజిటల్ రంగాల్లోకి కూడా ప్రవేశించటం విశేషం. ప్రజలు నిజాయితీ, క్రమశిక్షణ, ఒకరిపై ఒకరు విశ్వాసంతో కలిసి పనిచేసినప్పుడు, వారు సృష్టించగల సంపదకు పరిమితి లేదని ప్రపంచానికి గుర్తు చేస్తూనే ఉంటుంది ఉరులుంగల్.ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదు!సహకార సంస్థలు కేవలం సంస్థలు మాత్రమే కాదు. అవి సంస్కృతి, చరిత్ర, గుర్తింపును కలిగి ఉంటాయి. ఈ సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల ప్రపంచ పటాన్ని ఆవిష్కరించటం ద్వారా సహకారాన్ని యావత్ మానవాళి భాగస్వామ్య వారసత్వ విజయంగా జరుపుకుంటున్నాం. సంఘీభావం, స్వయం సహాయం ద్వారా ప్రజలను, సమాజాలను అనుసంధానిస్తాం.– ఏరియల్ గ్వార్కో, అధ్యక్షుడు, అంతర్జాతీయ సహకార కూటమి(ఐసీఏ)పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్) -
వారసత్వ వెలుగులు
కాలంతో పాటు ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్‌ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్‌తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! -
గొంగడి గురించి తెలుసా? ఇంతకుముందెప్పుడూ వినని విశేషాలు!
పిల్లలూ! ‘గొంగడి’ గురించి మీకు తెలుసా? మీ ఇంట్లో గొంగడి ఉందా? ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గొంగడి ఉండేది. వ్యవసాయ, పాడి ఆధారిత కుటుంబాల్లో తప్పకుండా కనిపించే వస్తువు ఇది. ప్రస్తుతం పట్టణాల్లో దీని వాడకం తగ్గినా పల్లెల్లో ఇంకా వాడుతున్నారు.ముఖ్యంగా పశువుల కాపర్లు జీవాలను మేతకు తీసుకువెళ్లే సమయంలో గొంగడిని తమ వెంట తీసుకువెళ్తుంటారు. భారతదేశానికి వస్త్ర పరిశ్రమ రంగంలో గొంగడికి కీలకమైన స్థానం ఉంది. గొంగడి అనేది ఉన్నితో తయారు చేసిన దుప్పటి. మరాఠీలో దీన్ని ‘ఘొంగడి’ అంటారు. దీన్ని చేత్తో తయారు చేస్తారు. దీనికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక విలువలు ఉన్నాయి. గతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో వివాహ ప్రతిపాదనలు ఏర్పాటు చేసేటప్పుడు గొంగడిని వినియోగించేవారు.ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూర్చోడానికి, విశ్రమించడానికి దీన్ని వాడేవారు. ఎండ, వాన, చలి నుంచి రక్షణగా నిలిచేందుకు ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షంలో ఈ గొంగడి కప్పుకుంటే గొంగడి తడిసిపోయినా లోపలున్నవారికి ఆ తడి తగలదు. అది గొంగడి విశిష్టత.చదవండి: కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనెమహారాష్ట్రలోని పలు గ్రామాల్లో అతిథులను స్వాగతించడానికి నేటికీ ఈ గొంగడిని ఉపయోగిస్తారు. అతిథుల్ని గొంగడిపై కూర్చోబెట్టడం గౌరవప్రదంగా భావిస్తారు. జూన్–ఆగస్టు నెలల మధ్య గొంగడి తయారీ ప్రారంభమవుతుంది. ఈ నెలల్లో గొర్రెల నుండి ఉన్నిని తీస్తారు. దాన్ని రంగుల ఆధారంగా వేరు చేస్తారు. సాధారణంగా ఉన్ని నలుపు, తెలుపు, గోధుమ రంగులలో ఉంటుంది. ఇందులో తెల్ల రంగు గొంగడి చాలా అరుదుగా కనిపిస్తుంది. 8 అడుగుల గొంగడిని తయారు చేయడానికి 350 గజాల ఉన్ని అవసరం. 10, 12 అడుగుల గొంగడికి 400, 450 గజాల ఉన్ని అవసరం అవుతుంది. చేతి మగ్గంపై ఒక గొంగడిని నేయడానికి ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. నేయడం పూర్తయ్యాక దుప్పటికి చింతపండు గింజల రసం పూసి, రెండు నుండి మూడు రోజులు ఎండలో ఉంచుతారు. ఆ తర్వాత గొంగడి వినియోగానికి సిద్ధమైనట్లే.చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! -
వారసత్వ ప్రదేశాలకు యువతరం ఓటు
యువతరం (18–24 ఏళ్లు) చారిత్రక ప్రాశస్త్యం, గొప్ప వారసత్వం కలిగిన ప్రదేశాలను చూసి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియం వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతిథ్య సేవల సంస్థ నూర్మహల్ ప్యాలెస్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. సంప్రదాయ పర్యాటక ప్రదేశాల కంటే గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రదేశాలను చూడడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, జైపూర్, కర్నాల్, కోల్‌కతాలో 2,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను నూర్మహల్ ప్యాలెస్ విడుదల చేసింది. గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాపర్టీల్లో బస చేయాలని అనుకుంటున్నట్టు సర్వేలో 53 శాతం మంది చెప్పారు. వినూత్నమైన చరిత్ర, నిర్మాణ నైపుణ్యం (ఆర్కిటెక్చర్), వ్యక్తిగత సేవలకు ప్రాధాన్యం దృష్ట్యా తాము ఖరీదైన వారసత్వ ప్రాపర్టీలను ఎంపిక చేసుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘యువత కేవలం లగ్జరీనే కోరుకోవడం లేదు. చారిత్రక వైభవంతో అనుసంధానాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తూనే.. చరిత్ర, సంస్కృతితో అనుసంధానమయ్యే అనుభవాన్ని అందించడం పట్ల గర్విస్తున్నాం’’అని నూర్మహల్ ప్యాలస్ ఈడీ రూప్ ప్రతాప్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్‌రూమ్‌కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్‌తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్‌గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
ఉత్తర భారత్ హెరిటేజ్ టూర్..!
భారతదేశం గర్వించే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్... దేశం కోసం ప్రాణాలర్పించిన జలియన్‌వాలా బాగ్.సైనిక వందనంతో గౌరవించే వాఘా– అట్టారి సరిహద్దు... పంజాబ్ ప్రాణత్యాగాల నిలయం జంగ్ ఈ ఆజాదీ.వ్యర్థాలను అర్థవంతం చేసిన చండీగఢ్ రాక్ గార్డెన్... భగవద్గీత బోధనక్షేత్రం హరియాణా కురుక్షేత్రం.బహాయీ ధ్యానమందిరం ఢిల్లీ లోటస్ టెంపుల్... భారతీయ లోహ ప్రావీణ్యత చిహ్నం ఐరన్ పిల్లర్.కృష్ణుడు పుట్టిన మధుర... ఆడిపాడిన బృందావనం... భారతీయుల ప్రేమ పొందిన ప్రపంచవింత తాజ్‌మహల్. ఉత్తర భారత వారసత్వాన్ని వారంలో ఒడిసి పట్టుకోవచ్చు.1వ రోజు :హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం తర్వాత 3.50 గంటలకు 6ఈ 167 విమానం బయలుదేరి సాయంత్రం ఆరున్నరకు అమృత్‌సర్‌కు చేరుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహకులు పికప్ చేసుకుంటారు. హోటల్లో చెక్ ఇన్ అవడం, విశ్రాంతి, రాత్రి బస.2వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, జలియన్‌వాలా బాగ్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత వాఘా బోర్డర్ విజిట్, రాత్రి బస అమృత్‌సర్‌లోనే.బంగారు మందిరంగోల్డెన్ టెంపుల్ అనగానే గుర్తొచ్చే ప్రదేశం అమృత్ సర్. ఇటీవల తమిళనాడులో మరో గోల్డెన్ టెంపుల్ నిర్మాణం జరిగింది. కానీ ఇది 443 ఏళ్ల నాటి నిర్మాణం. దేశమెరిగిన బంగారపు మందిరం. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఆలయం కూడా. సిక్కుల ప్రార్థనామందిరం రాజకీయ సంక్లిష్టతలకు నెలవైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని ఇందిరాగాంధీ 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆమె హత్యకు దారి తీశాయి. ఈ గురుద్వారాని రోజుకు లక్షా యాభై వేల మంది సందర్శిస్తారని అంచనా. గురుద్వారా కమిటీ నిర్వహించే లంగార్ (భోజనశాల)లో భోజనం చేయాలి. ఇక్కడో విషయం లంగార్లో అందరూ సమానమే. సహపంక్తి భోజనం చేయాలి. ఎంతమంచి వచ్చినా, కాదనకుండా వడ్డిస్తారు. ఎంత తిన్నా పెడతారు కానీ వడ్డించుకున్న పదార్థాన్ని వృథా చేస్తే ఒప్పుకోరు. పూర్తిగా తినేవరకు ఒకరు వచ్చి ఎదురుగా నిలుచుంటారు. భోజనాన్ని గౌరవించాలనేది వారి నియమం. భోజనంతోపాటు వారి నియమాన్ని కూడా గౌరవించడం పర్యాటకుల ధర్మం. బంగారు గోపురం ఉన్న ప్రధాన ఆలయం సరోవరం మధ్యలో ఉంటుంది. ఆలయం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వంతెన మీద రావాలి. ఈ గురుద్వారా పేరు హర్మందిర్ సాహిబ్. ఈ మందిర నిర్మాణాల సమూహం వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కోసం యునెస్కో పరిశీలనలో ఉంది. ఈ మందిరంలో జాతిరత్నాలు పొదిగిన పై కప్పును కూడా పరిశీలనగా చూడాలి.బుల్లెట్ గాయాల గోడబ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కాల్పులు జరిపినప్పుడు బుల్లెట్లు తగిలి చిల్లులు పడిన గోడ ఉంటుంది. ఆ గోడకు 36 బుల్లెట్ గాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 1919, ఏప్రిల్ నెల 13వ తేదీ, బైశాఖీ పండుగరోజు జరిగిందా దుర్ఘటన. డయ్యర్ భారతీయుల మీద కాల్పులు జరపడానికి ముందు బయటకు వెళ్లడానికి అనుమతించిన చిన్న ద్వారాన్ని కూడా చూడవచ్చు. ఆ కాల్పుల్లో మరణించిన వారి స్మారక నిర్మాణం, అమర జ్యోతి చుట్టూ దేశం కోసం ప్రాణాలొడ్డిన వారి ముఖాల అమరిక అద్భుతంగా ఉంటుంది. వారిని చూస్తుంటే గుండె బరువెక్కుతుంది. ఆ ఘటనలో మరణించిన వారిలో 120 మంది మృత దేహాలు ఒక బావిలో లభించాయి. ఏడు ఎకరాల ప్రదేశంలో అడుగడుగునా స్వాతంత్య్ర పోరాటంలో చోటు చేసుకున్న మౌనరోదనకు ఆనవాలుగా కనిపిస్తుంది.వాఘా– అట్టారి సరిహద్దు ద్వారంభారత్– పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఇది. అమృత్ సర్నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉంది. వాఘా బోర్డర్ అని వాడుకలో అంటుంటాం. కానీ దీని పేరు వాఘా– అట్టారి బోర్డర్. వాఘా అనే గ్రామం భారత్– పాక్ సరిహద్దు రేఖ రెడ్‌క్లిఫ్ లైన్‌కు ఆవల ఆరు వందల మీటర్ల దూరాన ఉంది. భారత సరిహద్దు గ్రామం అట్టారికి మూడు కిలోమీటర్ల దూరం. రోజూ సాయంత్రం ఇక్కడ వాఘా– అట్టారి బోర్డర్ సెరిమనీ జరుగుతుంది. 1959 నుంచి రోజూ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలల్లో సందర్శకులు వస్తారు. ఇక్కడి నుంచి అర కిలోమీటరు దూరాన వాఘా రైల్వేస్టేషన్ ఉంది. భారత్– పాక్ మధ్య నడిచే రైలును చూడాలంటే వెళ్లవచ్చు.3వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి జలంధర్‌కు ప్రయాణం. జంగ్ ఈ ఆజాదీ మెమోరియల్ సందర్శనం. మధ్యాహ్నం తర్వాత చండీగఢ్‌కు ప్రయాణం. రాక్ గార్డెన్ విజిట్ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస.సమర జ్ఞాపకంజంగ్ ఈ ఆజాదీ అనే ప్రదేశాన్ని చరిత్ర పాఠంలో చదివి మర్చిపోయి ఉంటాం. ఇది స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించిన ప్రదేశం. ఈ స్మారక భవనం పంజాబ్ రాష్ట్రం, జలంధర్ నగరానికి సమీపంలో కర్తార్‌పూర్ పట్టణంలో ఉంది. భారత స్వాతంత్య్ర సమరంలో పంజాబ్ వాసులు నిర్వహించిన పాత్ర, వారి ప్రాణత్యాగాలకు గౌరవ చిహ్నంగా పదేళ్ల కిందట నిర్మించారు. చరిత్రకారులు, పాత్రికేయులు, మేధావులు సమగ్రంగా అధ్యయనం చేసి దీనికి రూపకల్పన చేశారు.రాకింగ్ రాక్స్వేస్ట్ మేనేజ్మెంట్ అవసరాన్ని తెలియచేసే ప్రదేశం ఇది. నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ గార్డెన్లో పరిశ్రమల వ్యర్థాలు, ఇంట్లో వాడి పారేసిన వస్తువులతో ఆకర్షణీయమైన కళారూపాలను తయారు చేశారు. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కూడా మానవ నిర్మితమే. సృజనాత్మకత, ఆచరణాత్మకత ఉంటే ఏ వస్తువూ వ్యర్థం కాదు, వృథాగా పారేయడం ఉండదు. అందమైన కళాఖండం అవుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈ గార్డెన్ అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చిన తరవాత ఇంట్లో వాడకుండా అటకమీద పెట్టిన వస్తవులకు ఒక రూపమిచ్చే ఆలోచనలు మెదడులో పూస్తాయి.4వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి కురుక్షేత్రకు ప్రయాణం. శ్రీ కృష్ణ మ్యూజియం సందర్శనం. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస ఢిల్లీలో.గీత బడి కురుక్షేత్రంశ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేల ఇది. కురుక్షేత్ర అనగానే కురు– పాండవుల యుద్ధక్షేత్రంగానే గుర్తొస్తుంది. కురుక్షేత్రలో యుద్ధం జరిగిన ప్రదేశాన్ని స్థానికులు ధర్మక్షేత్రగా చెప్పుకుంటారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత బోధించిన ప్రదేశంలో ప్రస్తుతం మ్యూజియం ఉంది. కురుక్షేత్ర పట్టణం హరియాణ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పర్యాటకులు చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. బ్రహ్మ సరోవర్, జ్యోతిసర్, కురుక్షేత్ర పనోరమ అండ్ సైన్స్ సెంటర్, శ్రీకృష్ణ మ్యూజియం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, భీష్మకుండ్, కర్ణ లేక్, కల్పనా చావ్లా ప్లానిటేరియమ్, సూఫీ సన్యాసి షేక్ చిల్లీ టూంబ్ ముఖ్యమైనవి. ఇతడు మొఘల్ పాలకుడు ఔరంగజేబు సోదరుడు దారాషుకో గురువు. తన ఆధ్మాత్యిక గురువు గౌరవార్థం దారాషుకో దీనిని నిర్మించాడు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను ΄ోలిన నిర్మాణం కావడంతో దీనిని హరియాణా తాజ్‌మహల్ అంటారు. 5వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్‌మినార్ విజిట్. సాయంత్రం అక్షరధామ్ దర్శనం. రాత్రి బస ఢిల్లీలోనే.లోటస్ టెంపుల్నిశ్శబ్దంమైన ఆలయం ఇది. టెంపుల్ అంటే ఇక్కడ ఏ దేవతా విగ్రహమూ ఉండదు. ధ్యానం చేసుకోవడమే ప్రధానంగా రూపొందిన బహాయీ ప్రార్థన మందిరం. సర్వమానవ సమానత్వం, మానవత్వమే మతం అనే గొప్ప ఆధ్యాత్మిక భావనతో ఏర్పడిన మతం ఇది. బహాఉలాహ్ అనే తత్వవేత్త ఇరాన్లో 19వ శతాబ్దంలో రూపొందించిన భావజాలం ఇది. అందుకే దీనికి బహాయి మతంగా పేరు వచ్చింది. అరవిరిసిన కలువపువ్వును తలపిస్తుంది. కాబట్టి లోటస్ టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది. ఇది ఒక నిర్మాణ అద్భుతం. 2500 సీటింగ్ కె΄ాసిటీ ఉన్న విశాలమైన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ ఉండదు. మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. మతాలు, కులాలు, స్థాయీ బేధాలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లాలి. ధ్యానం చేసుకుని బయటకు రావాలి. పర్యాటకులకు ధ్యానం చేసుకోగలిగినంత సమయం ఉండదు. కాబట్టి పది నిమిషాల సేపు కళ్లు మూసుకుని ఆ ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేసి రావడమే జురుగుతుంది.ఢిల్లీ పేరిలా వచ్చింది!కుతుబ్ మినార్ను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో. ఢిల్లీ శివారులోని మెహ్రౌలీలో ఉంది. లాల్ కోట శిథిలాల మీద నిర్మించిన కట్టడం అని చెబుతారు. ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ కుతుబ్ మినార్ ఉన్న ప్రదేశంలో లాల్ కోట ఉండేదని, అది ఢిల్లిక రాజ్య రాజధాని అని చెబుతారు. అదే దిల్లీగా వాడుకలోకి వచ్చింది. బ్రిటిష్ ఉచ్చారణలో డిల్లీగా మారింది. కుతుబ్‌మినార్ ప్రాంగణం అంతా తిరిగి చూస్తే ఒక భారీ కోట ఉండేదని నమ్మక తప్పదు. భారీ ప్రాకారాలు, గోడలు, వాటి నిర్మాణశైలి ప్రాచీనతకు అద్దం పడతాయి. కుతుబ్‌మినార్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ పిల్లర్ చారిత్రక ప్రాధాన్యం కలిగినది మాత్రమే కాదు. మనదేశంలో ప్రాచీనకాలంలోనే లోహశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియచేసే ప్రత్యక్ష ఉదాహరణ. శతాబ్దాలపాటు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నప్పటికీ ఆ ఐరన్ పిల్లర్కి తుప్పు పట్టలేదు. పేరుకు ఐరన్ పిల్లరే కానీ అనేక లోహాల మిశ్రమం. ఏ లోహాన్ని ఎంత మోతాదులో మిశ్రమం చేశారనేది పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టడం లేదింకా. గుప్తుల కాలం నాటిది ఈ ఐరన్ పిల్లర్.అక్షరధామ్ఇది స్వామి నారాయణ్ ఆలయం. నిర్మాణ అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. మొత్తం తిరిగి చూడాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది. అభిషేక మండపంలో నీటి చెంబులు వరుసగా ఉంటాయి. టికెట్ తీసుకున్న వాళ్లు వరుసలో వెళ్లి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు. ఇది ఢిల్లీలో యమునా నది తీరాన ΄ాండవ నగర్లో ఉంది. శిల్పసౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇతర ధార్మిక క్రతువులేవీ ఉండవు. దర్శనం, ధ్యానం, ఉల్లాసంగా గడపడమే ప్రధానం. పిల్లలు ఊయలలూగుతూ ఆడుకోవడానికి ఆటస్థలం కూడా ఉంది. విస్తారమైన గార్డెన్‌లున్నాయి. భారత్ ఉ΄ావన్లో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలున్నాయి. అక్షరధామ్లోపలకు స్మార్ట్ఫోన్లు, కెమెరాలను అనుమతించరు. అయితే బ్యాక్‌డ్రాప్‌లో ఆలయ గోపురం కనిపించేటట్లు ఫొటో పాయింట్ ఉంది. అక్కడ కెమెరామన్ ఉంటాడు. ఈ టూర్ జ్ఞాపకంగా ఒక ఫొటో తీయించుకోవడం మరిచిపోవద్దు. 6వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్ చేసి మధురకు ప్రయాణం. శ్రీ కృష్ణ జన్మభూమి సందర్శనం తర్వాత బృందావన వీక్షణం. సాయంత్రం ఆగ్రాకు ప్రయాణం. హోటల్ గదిలో చెక్ ఇన్, రాత్రి బస ఆగ్రాలో.మధుర మసీదుమధుర ప్రయాణం ఆసక్తిగా సాగుతుంది. కానీ మధురకు చేరిన తర్వాత కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని, భక్తుల విశ్వాసాలకు తగినంత ప్రాధాన్యం పాలకులు ఇవ్వలేదనిపిస్తుంది. ఆలయం లోపల ఒక మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు ముచ్చటగా ఉంటాయి. దేవకీవసుదేవులను కంసుడు బంధించి ఉంచినట్లు చెప్పే చెరసాల కూడా ఇక్కడే ఉంది. భూగర్భంలో నిర్మించిన రాతి గోడల కట్టడంలోకి ఇరుకు మెట్లు దిగి లోపలికి వెళ్లాలి. కృష్ణుడు పుట్టిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. క్రీస్తు పూర్వం నాటి నిర్మాణాలన్నీ ధ్వంసం అవుతూ, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను నిక్షిప్తం చేసుకుంటూ పునర్నిర్మాణమవుతూ వచ్చింది. మొఘలు పాలకుడు ఔరంగజేబు శ్రీకృష్ణుడి జన్మస్థాన భవనాన్ని ఆనుకుని నిర్మించిన పెద్ద మసీదును కూడా చూడవచ్చు.యమునాతటిలో నల్లనయ్యబృందావనమది అందరిదీ! గోవిందుడు అందరివాడే... అని ఆడుకోవడానికి ఆడుకోవడానికి అందమైన ప్రదేశం బృందావనం. గోవిందుడు సంచరించిన నేల మీద పర్యటన అనే భావనలోనే ఓ గొప్ప గిలిగింత ఉంటుంది. యమునానది తీరాన విస్తరించిన ఈ నేల మీద ఐదు వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు, బలరాముడు అనే పుణ్య పురుషుల బాల్యం గడిచిందని భక్తుల విశ్వాసం. ఇస్కాన్ నిర్మించిన భారీ ఆలయాలలో పౌరాణిక కథనాల్లో చోటుచేసుకున్న నాటి జ్ఞాపకాలకు నేటి రూపాలను మనం చూడగలుగుతున్నాం. మధుర నుంచి బృందావనానికి 15 కిమీల దూరం. మరో పది కిలోమీటర్ల దూరాన గోకులం ఉంది. విశ్రాంత జీవితంలో ప్రశాంతత కోసం ఇక్కడ కొంత కాలం నివసించవచ్చు. స్థానికులు మాట్లాడేది హిందీయే అయినా ఆ డైలక్ట్ దక్షిణాది వాళ్లు పుస్తకాల్లో నేర్చుకున్న హిందీకి ఏ మాత్రం సరి΄ోలదు. మెల్లగా అలవాటు చేసుకోవాలి.7వ రోజు :బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్. తాజ్ వీక్షణం తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. 16 తేదీ సాయంత్రం 4.40 గంటలకు 6ఈ 6478 విమానం ఆగ్రాలో బయలుదేరి 6. 45 గంటలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.భారతీయుల ప్రేమకు చిహ్నంతాజ్మహల్ ను ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడవచ్చనిపించే అద్భుతం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవడానికి కొన్ని వివరాలు మిగిలే ఉంటాయి. ఓ పాతికేళ్ల కిందట... ‘తాజ్‌మహల్ గొప్ప నిర్మాణమే కానీ ఫొటోలో కనిపించినంత అందంగా డైరెక్ట్‌గా చూసినప్పుడు కనిపించదు’ అనేవారు. అది నాటి మాట. యూపీలో యమునానది తీరాన ఫ్యాక్టరీలున్నప్పుడు వాటి కాలుష్యం కారణంగా తెల్లటి పాలరాయి పసుపు రంగులోకి మారింది. ఫ్యాక్టరీలను తొలగించిన తర్వాత ప్రమాదం తగ్గినప్పటికీ దశాబ్దంపాటు తాజ్‌మహల్ పసుపు వర్ణంలోనే ఉండింది. అలాగే ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో స్థానం పొందింది కూడా. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (తొలి దఫా) మనదేశంలో పర్యటించడానికి ముందు తాజ్‌మహల్ పాలరాయికి పాలిష్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తాజ్ మహల్ తెల్లగా మెరుస్తోంది. తాజ్ మహల్ 42 ఎకరాల్లో విస్తరించి ఉంది. నాలుగు వైపులా ఉన్న తోటలను పరిశీలనగా చూస్తే చార్బాగ్ ఏర్పాటులో మొఘలులు ఎంత నిశితంగా ఉండేవారో అర్థమవుతుంది. మొక్కలు, గుబుర్ల వరుస స్కేలు పెట్టి గీచినట్లు ఉంటుంది. మనకు తాజ్‌మహల్ అంటే ఎంత ప్రేమంటే... 2007లో జరిగిన న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ పోటీలో తాజ్‌మహల్‌కు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇది షాజహాన్ ప్రేమకు మాత్రమే కాదు, ఇది భారతీయుల ప్రేమకు కూడా చిహ్నమే. ఇరవై ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణంలో ప్రతి అంగుళమూ ఓ అద్భుతం. అన్నట్లు ఫొటోలు తీసుకునేటప్పుడు తాజ్ మహల్ ముందు మాత్రమే కాదు, వెనుక వైపు యమునా నది బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోలు తీసుకోవడం మరువద్దు. తాజ్‌మహల్‌తోపాటు ఆగ్రాలో చూడాల్సిన ప్రదేశం రెడ్‌ఫోర్ట్. దీనిని ఆగ్రాఫోర్ట్ అంటారు. అక్బర్ ఎక్కువకాలం రాజ్యపాలన చేసింది ఈ ఎర్ర కోట నుంచే.హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ ఏడు రోజుల టూర్ పేరు ‘నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా’,టూర్ కోడ్ ఎస్హెచ్ఏ 52. సెప్టెంబర్ 10వ తేదీన మొదలయ్యే ఈ పర్యటనలో అమృతసర్, చండీగఢ్, ఢిల్లీ, మధుర, ఆగ్రా కవర్ అవుతాయి. ప్యాకేజ్ వివరాలకు..ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ కాంటాక్ట్ నంబరు: 91 97013 60701ప్యాకేజ్ ఇలా: సింగిల్ ఆక్యుపెన్సీలో 52,850 రూపాయలు, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 39,800 అవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో 37,300 రూపాయలు. (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
కుల్లాకర్ రైస్ : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఫలిస్తున్న కలలు
సంతాన భాగ్యానికి, ఆరోగ్య భాగ్యానికి చిరునామాగా నిలుస్తోంది అరుదైన హెరిటేజ్ రైస్ ‘కుల్లాకర్’ (Kullakar Rice). ఈ అపురూపమైన రెడ్ రైస్ పుట్టిల్లు తమిళనాడు అయినా దేశవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దేశీ వరి వంగడాల్లో పోషకాలు, విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఒకానొక అపురూప వంగడం ఇది. గర్భ ధారణలో సమస్యలను అధిగమించాలన్నా.. లేకుండా సహజ రీతిలో సుఖప్రసవం కావాలన్నా.. ప్రసవానంతరం తల్లీ బిడ్డా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా.. అన్నిటికీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కుల్లాకర్ తదితర దేశీ వరి బియ్యాన్ని ఆశ్రయించాల్సిందేనా? దేశీ ఆవు పాలు, నెయ్యిని మెనూలో జోడించాల్సిందేనా?? అంటే.. ముమ్మాటికీ అవును అంటున్నారు ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, సుభాష్ పాలేకర్ కృషి (ఎస్పికె) సాధకులు, దేశీ విత్తన పరిరక్షకులు ఎం. విజయ్‌రామ్. ఆరోగ్యవంతమైన కుటుంబ జీవనానికి కుల్లాకర్ ఆరోగ్య బాటలు వేస్తోందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ముడి కుల్లాకర్ బియ్యాన్ని అనేక గ్రామాల్లో, హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా పలువురితో తినిపించారు. వారి అనుభవాల సారాన్ని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. కేవలం కుల్లాకర్ బియ్యం తినటం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన సమృద్ధ జీవనానికి దోహదం చేసే ‘దేశీ ఆహారంతో కూడిన ఒక సమగ్ర జీవన విధానాన్ని ఆయన సూచిస్తున్నారు. ఇంతకీ దొడ్డు/ముతక రకం కుల్లాకర్ బియ్యం చుట్టూ అల్లుకున్న విశేషాలేమిటి? వాడిన/వాడుతున్న కుటుంబాల సుసంపన్న అనుభవాలేమిటి?? ఆలస్యం ఎందుకు.. చదవండి!మొదట సిజేరియన్.. రెండో కాన్పు నార్మల్!అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్లం. మొదట కాన్పులో బాబు పుట్టినప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది. హైదరాబాద్ వచ్చిన రోజే రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. సాధారణ వైట్‌రైస్ తినకుండా ఉండలేకపోయేదాన్ని. కేర్లెస్గా జంక్‌ఫుడ్ తినేదాన్ని. ప్రీడయాబెటిక్ స్టేజ్‌కి వెళ్లా. రెండో కాన్పు కూడా ఆపరేషన్ తప్పదనుకున్నాం. అయితే, గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత, విజయరామ్ గారి వీడియోలు చూసి సుఖప్రసవానికి, ఆరోగ్యానికి కుల్లాకర్ బియ్యం ఉపయోగపడతాయని తెలుసుకున్నా. అప్పటి నంచి 4–5 నెలల పాటు కులాకర్ బియ్యాన్ని మట్టిపాత్రలో వండుకొని తినటం, దేశీ ఆవు నెయ్యి, పాలు వాడటం శ్రద్ధగా చేశా. నార్మల్ డెలివరీ అయ్యింది. బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 21వ రోజే తల నిలిపాడు. స్థిమితంగా, నెమ్మదిగా ఉంటాడు. ఆకలైతేనో, నిద్ర వస్తేనో ఏడుస్తాడు. మా ఇద్దరి పిల్లలకు ఈ విషయంలో తేడా గమనించాను. డెలివరీ తర్వాత బహురూపి, నారాయణ కామిని, ఇంద్రాణి వంటి దేశీ బియ్యం తింటున్నాం. నల్లబియ్యం, ఎర్రబియ్యం దోసెలకు వాడుతున్నాం. మా ఇంట్లో రెండు వైపులా పెద్దవాళ్లకు సుగర్ ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూర్చొని చేసే ఉద్యోగం, పైగా పని వత్తిడి. అయినా, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ ఆహారం తింటున్నాం కాబట్టి ఆ భయం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం. ఆహారాన్ని ఇలా మార్చుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్, పిసిఓఎస్, పీరియడ్స్ సమస్యలు పోతాయి. మళ్లీ రావు. ఆలస్యం కాకముందే కళ్లు తెరిచి మీరేమి తింటున్నారో తెలుసుకోమని యువతకు స్వానుభవంతో ఘంటాపథంగా చెబుతున్నా. -రామవరపు సింధుకుమారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కొండాపూర్, హైదరాబాద్ 3 నెలల్లోనే ఫలించిన కల పెళ్లయిన ఐదేళ్లకు తొలి కాన్పులో బాబు అనారోగ్యంతో పుట్టి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 50 రోజులకు చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ గర్భం రాలేదు. ఆ దశలో కులాకర్ బియ్యం మధ్యాహ్నం, రాత్రి వండుకొని తినటం ప్రారంభించిన మూడు నెలల్లోనే, ఎటువంటి మందులు వాడకుండానే, నా భార్య సింధూరి గర్భం దాల్చింది. తర్వాత కూడా ఏ సమస్యలూ రాలేదు. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించింది. కులాకర్ బియ్యం గర్భం దాల్చటానికి దోహదపడుతున్నట్లు యూట్యూబ్‌లో విజయరామ్ వీడియో చూసి రెండేళ్ల క్రితం సేవ్ సంస్థ కార్యాలయానికి వెళ్లి కలిశాం. అప్పటి నుంచి కుల్లాకర్, బహురూపి, గోవింద భోగ్, నవార బియ్యం, దేశీ ఆవు నెయ్యి పాలు ఉపయోగిస్తున్నందు వల్లనే మా కల నెరవేరింది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం చేకూరిందని నూరు శాతం నమ్ముతున్నాం. ఇవన్నీ తింటుంటే ఎగతాళి చేసిన మా అక్క ఇప్పుడు రసాయనాల్లేని దేశీ బియ్యం, దేశీ ఆవు ఉత్పత్తుల ప్రభావాన్ని గుర్తించింది. మా అత్తగారి (కడప జిల్లా వేంపల్లె) ఊళ్లో 3 ఎకరాల భూమి కొన్నా. నాకు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించబోతున్నాం. – సి. క్రాంతికుమార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, హైదరాబాద్20 మంది కలలు పండాయి! వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగసముందర్ గ్రామంలో సంతానం కావాలనుకునే 30 మంది మహిళలకు 18 నెలల పాటు కుల్లాకర్ బియ్యాన్ని ఇచ్చి వాడించాం. అదే విధంగా, కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు లంక గ్రామంలో 18 నెలల పాటు 20 మందికి ఈ బియ్యాన్ని తినిపించాం. వీళ్లందరూ గర్భదాల్చారు. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టారు. పిల్లల బరువు 2.5 కేజీల నుంచి 3 కేజీల మధ్యన వుంది. పుట్టిన పిల్లలు చలాకీగా వున్నారు. వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుంది. ఒక సంవత్సరం లోపు పిల్లలు ఇతరుల దగ్గర వున్నప్పుడు చికాకుతో ఏడవట్లేదు. పాలు అవసరమైనప్పుడు మాత్రమే తల్లి కోసం ఏడుస్తున్నారు. మధ్యలో తల్లి కనిపిస్తూ వుంటే ఇతరులతో స్థిమితంగా వుండ గలుగుతున్నారు. తల్లుల ఆరోగ్యం బాగుంది. పిల్లలకు సరిపడా పాలు వున్నాయి. ఈ పద్ధతిని పాటించిన ఒక ప్రవాస భారతీయురాలు కుల్లాకర్ బియ్యాన్ని వాడి బిడ్డకు సరిపడా పాలు ఇవ్వడమే కాకుండా తల్లి పాల బ్యాంకుకు తన పాలను దానం చేయగలిగింది. చాలా మంది గర్భవతులకు సహజ సిద్ధంగా సులభ ప్రసవం జరిగింది. 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేని తల్లి ఈ బియ్యాన్ని వాడి 40 రోజుల్లోనే గర్భవతి అయ్యింది. అంతకు మునుపు అబార్షనై, పిసిఓడితో బాధపడే ఒకామె ఈ బియ్యాన్ని 6 నెలలు వాడి పండంటి బిడ్డను కన్నారు. ప్రైవసీ కోసం వారందరి పేర్లు బహిరంగంగా ఇవ్వలేకపోతున్నాం. ఆసక్తి గల ఎవరైనా హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులోని ‘సేవ్’ ఆఫీసు(సుంకర వెంకట రమణ: 63091 11427) ను సంప్రదించి, వారితో ఫోనులో మాట్లాడొచ్చు. తర్వాత నేరుగా కలవొచ్చు కూడా!– ఎం. విజయ్ రామ్, దేశీ విత్తన పరిరక్షకులు, సుభాష్ పాలేకర్ కృషి (ఎస్పికె) సేద్య విధాన సాధకులు, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు కుల్లాకర్‌లో పోషకాలేమిటి?సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే దేశీ వరి బియ్యంలో అద్భుతమైన పోషక / ఔషధ విలువలు చెక్కు చెదరలేదన్న విషయం మనకు బోధపడుతుంది. అపారమైన దేశీ వరి జీవవైవిధ్యం చాలా వరకు కాలగర్భంలో కలసిపోయింది. అయితే, కొద్ది మంది ముందుచూపున్న రైతులు ఇప్పటికీ అనేక వందల అలనాటి వరి వంగడాలను ఏటేటా సాగు చేస్తూనే ఉన్నారు. వీటిని అపురూపంగా పరిరక్షించుకుంటున్నారు. ఇంతకీ, ఏ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఏయే దేశీ వరి బియ్యం ఉపయోగపడతాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు! అందుకే ఈ ఆహారమే ‘దివ్యౌషధం’ అయ్యింది!! చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్స్ సిస్టమ్స్ (సిఐకెస్) అనే స్వచ్ఛంద సంస్థ ‘ట్రెడిషినల్ రైస్ వెరైటీస్ ఆఫ్ తమిళనాడు: ఏ సోర్స్ బుక్’ అనే సంకలనాన్ని 2019లో ప్రచురించింది. దీని ప్రకారం.. సేంద్రియంగా పండించిన కుల్లాకర్ బాయిల్డ్ (ఉప్పుడు) బియ్యంలో వివిధపోషకాలు మెండుగా ఉన్నాయి. గ్లైసెమిక్ ఇండెక్స్(జిఐ) తక్కువ. ఐరన్, కాల్షియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. -
మరో స్వదేశీ స్టోర్ వచ్చేస్తోంది : కుమార్తె, కోడళ్లతో నీతా అంబానీ ప్రత్యేక పూజ
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఫౌండర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, నీతా అంబానీ ముంబైలో మరో స్వదేశీ స్టోర్‌ను లాంచ్ చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్పూర్తితోపాటు, హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్‌ను హైదరాబాద్ ఏర్పాటు చేసిన నీతా అంబానీ తాజాగా ముంబైలోని ఈరోస్‌లో స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కుమార్తె ఇషా, కోడళ్లు శ్లోక, రాధికలతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.స్వదేశ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈవేడుక నిర్వహించారు. దేశీయ అనాది సంప్రదాయాలు, తరతరాలుగా అందివస్తున్న చేతివృత్తుల నైపుణ్యానికి శాశ్వత వారసత్వానికి నివాళిగా ఈ వేడుకను నిర్వహించారు.భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. తాజాగా మరో అద్భుతమైన చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. రాజ్శృందర్ రాజ్‌కోట్ 10 నెలలకు పైగా చేతితో నేసిన అద్భుతమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించారు. ఈ చీరకు ప్రముఖ డిజైనర్ మనీష్‌మల్హోత్రా అందమైన జాకెట్టును నీతా ఎంపిక చేసుకున్నారు. యాంటిక్ గోల్డ్ వరల్డ్ ఎంబ్రాయిడరీతో ఫిరోజీ సిల్క్ కాంచాలి బ్లౌజ్‌తో స్టైల్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) తాత ముత్తాల నాటి మహిళా కళాకారులకు నివాళిగా నీతా తనకు వారసత్వంగా వచ్చిన బంగారు బాజుబంద్ను ధరించారు. ఇది నీతా తల్లి ముత్తాత నుండి లభించిన ఆర్మ్లెట్. తన వివాహం సందర్భంగా కూడా దీన్ని ధరించడం విశేషం. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, వారసత్వం, ప్రేమ , ఒక తరం మహిళల నుండి మరొక తరం వరకు ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం . పెద్దల కరుణ, జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆర్మ్లెట్ అంబానీ నుంచి , ఆమె కుమార్తె ఇషా కుమార్తె, మనవరాలికి వారసత్వంగా లభిచనుంది.ఇక నీతా అంబానీ జ్యుయల్లరీ గురించి చెప్పాలంటే స్వదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన నెక్లెస్‌తో తన లుక్‌ను మరింత వన్నె తెచ్చారు. ప్రతి ప్యానెల్ వైట్ గోల్డ్‌తో శ్రీనాథుడి జీవితంలోని దైవిక క్షణాలను చిత్రీకరించేలా చేతితో చేసిన కళాసృష్టి ఇది. కళాత్మకతను ఆధ్యాత్మికతతో మిళితం చేస్తుంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) -
హెరిటేజ్ వాళ్లు మోసం చేశారు..
సాక్షి, అమరావతి: ఇన్నోవా కారును హెరిటేజ్ కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన హెరిటేజ్ సంస్థ ఆనక ముఖం చాటేసిందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాకు చెందిన టీడీపీ కార్యకర్త బాలునాయక్ ఆరోపించాడు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ ఏడాది ఫిబ్రవరి నెల 23న అనంతపురంలో పెళ్లి వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులతో ఇన్నోవా కారులో తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తుండగా కర్నూలు–వెల్దుర్తి మధ్య తాము ప్రయాణిస్తున్న కారుని హెరిటేజ్ కంటైనర్ ఢీ కొందని తెలిపాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన హెరిటేజ్ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తామని ఆరోజు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదని బాలునాయక్ వివరించాడు.న్యాయం చేయమని వెళితే గెంటేశారు..‘వైఎస్సార్ కడపలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను కలిశా. విషయం చెప్పాను. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా హెరిటేజ్ యాజమాన్యం న్యాయం చేయలేదు. క్యాబినెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో లోకేశ్ చాంబర్ కి వెళ్లి మరోసారి విన్నవించా. అక్కడున్న సిబ్బంది మా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకొని ఆ పార్టీలో ఉన్నాం. కానీ నమ్ముకున్న పార్టీ, హెరిటేజ్ యాజమాన్యం మా కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. ప్రమాదంలో గాయపడిన కుటుంబసభ్యుల చికిత్స కోసం ఇంటి స్థలం, ట్రాక్టర్ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’ అని బాలునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు హెరిటేజ్ యాజమాన్యం, టీడీపీ న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేశాడు. -
నా దారి నేను చూసుకుంటా..!
తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్‌లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట. – సాక్షి, స్పెషల్ డెస్క్హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. సర్వేలో 1,798 మంది..హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ఫ్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్‌లో ఆన్ లైన్ లో నిర్వహించారు. వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం. మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్‌లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్‌కాంగ్‌లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్‌వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు. -
హెరిటేజ్ ఫ్యాక్టరీతో నష్టపోతున్నాం
చంద్రగిరి: హెరిటేజ్ ఫ్యాక్టరీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని.. నీటి కాలుష్యం వల్ల పంట దిగుబడులు సరిగ్గా చేతికిరాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల సమీపంలో ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీ ముందు స్థానికులు, రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకారులు మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల ఏర్పాటు చేస్తామని, ఇంటింటికి తాగునీరు అందిస్తామని, రోడ్లు నిర్మించి ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని హామీలు ఇచ్చారని తెలిపారు. దీంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించామన్నారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా.. గాలి, నీటి కాలుష్యం వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని.. ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని.. నిరసనకారులు, అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారమయ్యేలా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామని ఫ్యాక్టరీ అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు తాత్కాలికంగా నిరసనను విరమించారు. -
World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.చారిత్రక నేపథ్యం: ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి. మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.ఆ జాబితాలో మనవి..మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోట, తాజ్‌మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే. ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.ఏవేవి ఉన్నాయంటే..ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్‌మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్‌లోని జంతర్‌మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్‌లోని రాణీకీ వావ్, చండీగఢ్‌లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్‌పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!) -
హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!
సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో సందడి నెలకొంది. విద్యార్థుల కోలాహలంతో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడింది.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి 1,628 మంది విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశంలోని మూడు రాష్ట్రపతి నిలయాల చరిత్ర, ప్రాముఖ్యతను వివరించే వీడియోను వీక్షించారు. అనంతరం విద్యార్థులు హెరిటేజ్ వాక్‌లో భాగంగా రాష్ట్రపతి నిలయంలోని పురాతన భవనాలను సందర్శించి వాటి చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వారసత్వ పరిరక్షణకు సంబంధించిన నిపుణులు విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. ఈ సెషన్లలో ఇంజినీర్ వేదకుమార్ మణికొండ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్), మధు వొటెరి (సీనియర్ ఫెలో – కేంద్ర సాంస్కతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ టూరిజం వాక్ కోఆర్డినేటర్), కల్పనా రమేష్ (కావా డిజైన్ స్టూడియో – ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు) పాల్గొన్నారు. (చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!) -
అపురూపాల మంత్రపురి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది. అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన మంత్రపురి దర్శన్‌లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.చదవండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలంనేటితరం కోసం.. భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -
ప్రముఖ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్
రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఎస్ఐఎల్ బ్రాండ్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఎస్ఐఎల్(SIL) వివిధ రకాల జామ్‌లు, ఊరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులను తయారు చేస్తోంది. రిలయన్స్ ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయడంతో ఇకపై ఎస్ఐఎల్ ఉత్పత్తులు ఆర్సీపీఎల్ ఆధ్వర్యంలో తయారు చేయనున్నారు.ఈ బ్రాండ్ కొనుగోలు కేవలం వ్యాపార లావాదేవీ మాత్రమే కాదని రిలయన్స్ తెలిపింది. ఐకానిక్ భారతీయ వారసత్వ బ్రాండ్లను పునరుద్ధరించడానికి, వాటిని విస్తరించడానికి ఆర్సీపీఎల్ వ్యూహాత్మక చర్యల్లో భాగమని పేర్కొంది. ఎస్ఐఎల్ను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఉత్పత్తులను నిలుపుకుంటూ సమకాలీన అభిరుచులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తామని ఆర్సీపీఎల్ తెలిపింది. ఎస్ఐఎల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా రిలయన్స్ నెట్వర్క్ ఉపయోగపడనుంది.విస్తరణ దిశగా మరో కంపెనీ..కంపెనీలకు డిజిటల్ పరివర్తన సేవలు అందించే క్రెడెరా భారత్‌లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశీయంగా ఆరు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 1,300 మంది సిబ్బంది ఉండగా అతి పెద్దదైన హైదరాబాద్ సెంటర్లో 1,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు క్రెడెరా ఇండియా సీఈవో గౌరవ్ మాథుర్ తెలిపారు. మరింత మంది మార్కెటింగ్, టెక్నికల్ నిపుణులను నియమించుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు పలు కళాశాలలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. క్రెడెరాకు అంతర్జాతీయంగా 3,000 మంది సిబ్బంది ఉన్నారు. -
యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే భవిష్యత్తు
భువనేశ్వర్: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భవిష్యత్తు అనేది యుద్ధంలో లేదు, బుద్ధుడిలో ఉందని ప్రపంచానికి చెప్పగల శక్తి భారత్‌కు ఉందని తెలిపారు. గురువారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, మనందరి జీవితాల్లో ప్రజాస్వామ్యం ఒక అంతర్భాగమని స్పష్టంచేశారు. ప్రపంచ స్థాయిలో మన దేశ ప్రతిష్ట ఎంతగానో పెరిగిందని అన్నారు. కేవలం మన మనోగతమే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాల అభిప్రాయాలను సైతం ప్రపంచ వేదికపై బలంగా వినిపించగలుగుతున్నామని వెల్లడించారు. ఆయుధ బలంతో సామ్రాజ్యాలు విస్తరిస్తున్న కాలంలో అశోక చక్రవర్తి శాంతి మార్గంలో నడిచారని గుర్తుచేశారు. మన వారసత్వ బలానికి ఇదొక ప్రతీక అని వెల్లడించారు. యుద్ధంలో కాకుండా బుద్ధుడి బోధనల్లోనే భవిష్యత్తు ఉందని భారత్ నమ్ముతున్నట్లు స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... మీ వల్లే తలెత్తుకొని ఉండగలుగుతున్నా.. ‘‘ప్రవాస భారతీయులను మన దేశానికి రాయబారులుగా పరిగణిస్తున్నాం. వైవిధ్యం గురించి మనకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంపై మన జీవితాలు నడుస్తున్నాయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి సమాజంతో హృదయపూర్వకంగా మమేకమవుతూ ఉంటారు. ఇతర దేశాల నియమ నిబంధనలు మనం చక్కగా గౌరవిస్తాం. మనకు ఉద్యోగం, ఉపాధి కల్పించిన దేశానికి నిజాయితీగా సేవ చేయడం, ఆ దేశ ప్రగతిలో పాలుపంచుకోవడం మనకు అలవాటు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన హృదయం భారతీయతతో నిండి ఉంటుంది. భారత్ కోసమే మన గుండె చప్పుడు వినిపిస్తుంది. ప్రవాస భారతీయులు మన దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు. వారి వల్లే విదేశాలకు వెళ్లినప్పుడు నేను తలెత్తుకొని ఉండగలుగుతున్నా. మనది యువ భారత్: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం రావడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్య సాధనకు సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నా. మనది యువ భారత్. ఇక్కడ యువ జనాభా అధికం. అంతేకాదు నైపుణ్యం కలిగిన యువత మన దగ్గర ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చగల సత్తా ఇండియాకు ఉంది. డిజిటల్ టెక్నాలజీలో మనం ముందంజలో ఉన్నాం. ఆధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలను మన దేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానాల్లో మీరంతా ప్రవాసీ భారతీయ దివస్‌కు వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. భారతదేశ ఆసలైన చరిత్రను విదేశాల్లో చాటి చెప్పండి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రపంచానికి ఆయుర్వేదం ఇచ్చిన భారత్: క్రిస్టినా క్లారా ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్ వెలకట్టలేని అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ప్రశంసించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె గురువారం మాట్లాడారు. గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. భారత్ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది. -
కులం పేరిట విషం చిమ్ముతున్నారు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత లాభం కోసం కులం పేరిట సమాజంలో విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. మన గ్రామీణ సంస్కృతి, వారసత్వం, విలువలను బలోపేతం చేసుకోవాలంటే విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. సామాజిక నిర్మాణాన్ని బలహీనపర్చాలని చూస్తున్న శక్తులకు బుద్ధి చెప్పాలని అన్నారు. శనివారం ఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవం–2025ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చుదిద్దుకోవాలన్న లక్ష్య సాధనలో గ్రామసీమల పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందని స్పష్టంచేశారు. పల్లె ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని వివరించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... గ్రోత్ సెంటర్లుగా మన గ్రామాలు ‘‘గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయాలని సంకల్పించాం. ప్రజలు సాధికారత సాధించడానికి చర్యలు చేపట్టాం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలు తగ్గుతాయి. ఆ దిశగా కృషి చేస్తున్నాం. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నాం. గ్రామాలను గ్రోత్ సెంటర్లుగా, అవకాశాల గనిగా మార్చాలన్నదే మా లక్ష్యం. నూతన శక్తితో గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెట్టాలి. మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలన్నీ అందుకోసమే. పదేళ్లుగా ఎంఎస్పీ పెంచుతున్నాం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత పదేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం. వ్యవసాయ రుణాల కింద ఇచ్చే సొమ్మును 3.5 రెట్లు పెంచాం. పదేళ్లుగా వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూనే ఉన్నాం. మన ఉద్దేశాలు పవిత్రంగా ఉంటే ఫలితాలు సైతం గొప్పగా ఉంటాయి. గత పదేళ్లపాటు చేసిన కఠోర శ్రమకు తగిన ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 2011తో పోలిస్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మూడు రెట్లు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఖర్చు వెనుకాడకుండా ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆదాయంలో 50 శాతానికిపైగా సొమ్మును కేవలం ఆహారం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అది 50 కంటే తక్కువ శాతానికి తగ్గిపోయింది’’ అని ప్రధాని మోదీ అన్నారు. గ్రామీణ పేదరికం 5 శాతమే ‘‘మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. పేదరికం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలావరకు మారిపోయింది. 2012లో గ్రామీణ పేదరికం 26 శాతం ఉండగా, 2024 నాటికి అది 5 శాతానికి పడిపోయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో తేలింది. కొన్ని పార్టీలు, వ్యక్తులు పేదరిక నిర్మూలన అంటూ దశాబ్దాలపాటు నినాదాలు చేశారు. కానీ, వారు సాధించింది ఏమీ లేదు. పేదరికం నిజంగా తగ్గిపోవడాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉన్న బండరాళ్లివి!
రాక్ సొసైటీ గుర్తింపు పొందిన ఉర్దూ విశ్వవిద్యాలయంలోని పత్తర్ కే దిల్, ఏక్తా మే తాకత్ హై పేర్లు కలిగిన రెండు బండరాళ్లకు మాత్రం 2500 మిలియన్ల ఏళ్ల చరిత్ర ఉందని, దక్కన్ పీఠభూముల్లో భాగం అని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు బండరాళ్లలో రెండు రాళ్లు పక్కపక్కనే ఉండడాన్ని గుర్తించి ఈ రాళ్లకు ‘పత్తర్కే దిల్’ అని నామకరణం చేశారు. రాళ్లన్నీ ఒకేచోట ఉండడంతో ఏక్తా మే తాకత్ హై (యునైటెడ్ వి స్టాండ్) అని నామకరణం చేశారు. అలాగే మరోచోట ఉన్న రాళ్లకు కూడా అనేక్ తా మే ఏక్తా (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అని కూడా పిలుస్తున్నారు. రాక్స్ పేరిట వీకెండ్స్ వాక్ ∙విభిన్న రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలకు చెందిన వారితో మినీ భారత్‌గా మారిన హెచ్‌సీయూలో విద్యార్థులలో ఐక్యత బలపడేలా చేసేందుకు హెచ్‌సీయూ ఎక్స్‌ప్లోరర్ పేరిట వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా వీకెండ్స్‌లో వాక్‌లను నిర్వహిస్తున్నారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మష్రూమ్ రాక్, వైట్ రాక్, టెంపుల్ రాక్, వర్జిన్ రాక్, వైట్ రాక్స్, హైరాక్స్, సాసర్ రాక్, కోన్ రాక్ కాంప్లెక్స్ ఇలా రకరకాల పేర్లతో ఈ బండరాళ్లను విద్యార్థులు పిలుస్తుంటారు. హెచ్‌సీయూ, మనూ యూనివర్సిటీల్లో హెరిటేజ్ రాక్స్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ‘ఏక్తా మే తాకత్ హై’పేరుతో పిలిచే రాళ్లు ‘పత్తర్ కే దిల్.. ఏక్ తా మే తాకత్ హై.. అనేక్ తా మే ఏక్తా.. ‘మష్రూమ్ రాక్,.. వైట్ రాక్స్.. టెంపుల్ రాక్’లు హెరిటేజ్ రాక్స్గా గుర్తింపు పొందాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన భారీ బండరాళ్లకు పెట్టిన పేర్లు ఇవి. నగరంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రాతి సంపద హెచ్‌సీయూ, మనూ ఉర్దూ యూనివర్సిటీల్లో ఉండడం విశేషం. నగరంలో గుర్తించిన హెరిటేజ్ రాళ్లలో హెచ్‌సీయూ ‘మష్రూమ్రాక్’ ఉంది. వీటికి శతాబ్దాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. వీటి గురించి భావితరాలకు తెలిసేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌సీయూలో 2,300 ఎకరాలు, ‘మనూ’లో 200 ఎకరాలు కలిపి 2,500 ఎకరాలలో విభిన్న తరహాలో ఏర్పడిన భారీ బండరాళ్ల (రాక్స్)ను రక్షిస్తూ వస్తున్నారు. – రాయదుర్గం -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్‌కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్‌లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్‌లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్‌గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్‌లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్‌లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్‌గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్‌గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్‌వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్‌పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్‌గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్‌లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్‌లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్‌లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్‌ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్‌పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్‌లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా?
మణిపూర్‌లోని ఆండ్రో గ్రామం. ఈ యేడాది ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. అంతటి ప్రత్యేకత ఆ గ్రామానికి ఏముందో తప్పక తెలుసుకోవాల్సిందే! మణిపూర్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉత్తమ పర్యాటక గ్రామాలపోటీని నిర్వహించింది. దీనిలో ఆండ్రో విలేజ్‌కు వారసత్వ విభాగంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లోని ప్లీనరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మణిపూర్ టూరిజం అధికారులు ఆండ్రో విలేజ్ ప్రతినిధులకు మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేసింది. ఆండ్రో గ్రామం ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ పద్ధతులు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడానికి ప్రధాన కారకంగా నిలిచాయి. ఎన్నో వారసత్వ ప్రత్యేకతలు : అండ్రో గ్రామంలో గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా స్థానిక జానపద కథలను కళ్లకు కట్టే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలో శతాబ్దాల నాటి నుంచి వారసత్వంగా అగ్ని ఆరాధనను కొనసాగిస్తూ వస్తున్నారు. వేల ఏళ్లుగా అఖండదీపం ఆరకుండా వెలుగుతూనే ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తోందిది. ఇక్కడ ప్రకృతి అందాలతోపాటు మటువా బహదూర్ మ్యూజియం, వివిధ గిరిజన∙తెగలకు సంబంధించిన కుటీరాలు, కుండల తయారీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటకుల ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయం, ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. ఆండ్రో గ్రామస్తులు తమ వారసత్వాన్ని కొనసాగించడంలోనూ, నిలబెట్టు కోవడంలో స్థానికులను నిమగ్నం చేయడానికి అనేక వ్యూహాలను అను సరిస్తున్నారు. అదే సమయంలో వారిని పర్యాటక కార్యకలాపాలో కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ విశేషాలతోనే ఈ గ్రామం ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా మొదటి ప్లేస్‌లో నిలిచింది. -
ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే అద్భుతాలు మనవే!
ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు గుర్తింపునిచ్చే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో అత్యధికంగా భారతీయ సందర్శనీయ స్థలాలే ఉన్నాయి. దీనికి కారణం ప్రపంచంలో అతి ఎక్కువ మంది సందర్శిస్తున్న దర్శనీయ స్థలాలలో ఈ ప్రాచీన వారసత్వ సంపద ప్రముఖంగా నిలిచాయి.ఖజరహో శిల్పాలుదేశంలోనేకాదు ప్రపంచంలోనే ఎన్ని చారిత్రక కట్టడాలు ఉన్నా ఖజరహో శిల్పకళకు మరేదీ సాటిరాదని మరోసారి రుజువైంది. మధ్య ప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలో కొలువై ఉన్న ఖజరహోను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే కళా వైభవం గల స్థలంగా పేరొందింది. శిల్ప సోయగాలతో ఆకట్టుకునే ఖజరహో గ్రూప్ ఆప్ మాన్యుమెంట్స్ గురించి కళ్లారా చూడాల్సిందే తప్ప ఒక్క మాటలో వివరించలేం. అలాంటి ఖజరహో శిల్పాలతో పాటు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, సాంచీ అండ్ రాక్స్ షెల్టర్స్ ఆఫ్ భీమ్బెట్కా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఎల్లోరా గుహలుమహారాష్ట్రాలోని ఎల్లోరా, అజంతా, ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో పాటు విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో కూడా ఈ జాబితాలో ఉన్నాయి.నేషనల్పార్క్పింక్ సిటీగా పేరొందిన జైపూర్ సిటీ, రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్, కొలడియో నేషనల్పార్క్. జంతర్ మంతర్‌ను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించిన స్థలాలుగా పేరొందాయి. వెన్నెల దీపంయునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శించిన జాబితాలో నాల్గవ స్థానంలో తాజమహల్. దీంతో పాటు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ ఉన్నాయి.రాణీకి వావ్గుజరాత్లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో రాణీ కి వావ్, ది హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ చంపనీర్–పవగడ్, ఆర్కియలాజికల్ పార్క్ లు ఉన్నాయి. -
హెరిటేజ్ లాభాల కోసమా!
సాక్షి, అమరావతి: తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీపై చెలరేగిన వివాదంపై తృణమోల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందించారు. ఇది నిజమా.. లేక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణా.. అని ‘ఎక్స్’లో అనుమానం వ్యక్తం చేశారు. ‘తిరుపతి లడ్డూల కథ వాస్తవమా లేక చంద్రబాబు హెరిటేజ్ సంస్థ లాభాలను పెంచుకోవడానికి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సహాయంతో అల్లిన కట్టుకథా? జంతువుల కొవ్వు, పంది కొవ్వుతో తిరుపతి ప్రసాద లడ్డూలు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ల్యాబ్ రిపోర్టు చూపించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ఆయన పార్టీ పేర్కొంది.ఇందులో ఆసక్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు, అతని భార్య నెయ్యి తయారు చేసే హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నడుపుతున్నారు. లోక్‌సభ ఫలితాలప్పుడు బీజేపీ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోణలున్నాయి. అదే సమయంలో చంద్రబాబుకు చెందిన కంపెనీ షేర్లు గాలివాటంగా అమాంతం పెరిగిపోయి ఆయన కుటుంబానికి రూ.1,200 కోట్లు లాభాలు తెచి్చపెట్టాయి.ఇప్పుడు తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై ఆరోపణలు రావడం.. గుజరాత్ నుంచి వచ్చిన ‘ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్’ ఆధారంగా నెయ్యి, పాల సామ్రాజ్యాన్ని నియంత్రించే ఓ కుటుంబం ఆరోపణలు చేయడం యాదృచి్చకం’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చంద్రబాబును ట్యాగ్ చేయడంతో పాటు హెరిటేజ్ సంస్థ ఉత్పత్తుల చిత్రాలను సైతం జత చేశారు. పోస్ట్ ప్రారంభంలో ‘ఇంపార్టెంట్’ అని మొదలుపెట్టారు. -
తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్ లింకులు!?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని నీచపు రాజకీయానికి.. అది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తెర తీశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు హిందూ సంఘాలు.. ఇంకోవైపు నలభై ఏళ్ల బాబు రాజకీయం గురించి తెలిసిన నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ పార్టీ టీఎంసీ సైతం చంద్రబాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఎక్స్ వేదికగా చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలకు దిగారు. అందుకు ల్యాబ్ రిపోర్టులను సాక్ష్యంగా చూపిస్తున్నారు. లడ్డూల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన పార్టీ ఆరోపిస్తోంది. అయితే..చంద్రబాబు, ఆయన సతీమణి పేరిట హెరిటేజ్ పుడ్స్ అనే డెయిరీ సామ్రాజ్యం ఉందని, అది నెయ్యి కూడా ఉత్పత్తి చేస్తోందని అన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ షేర్లు 1,200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్లాయని సాకేత్ గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ, స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐈𝐬 𝐭𝐡𝐞 𝐓𝐢𝐫𝐮𝐩𝐚𝐭𝐢 𝐥𝐚𝐝𝐝𝐨𝐨𝐬 𝐬𝐭𝐨𝐫𝐲 𝐫𝐞𝐚𝐥 𝐨𝐫 𝐢𝐬 𝐢𝐭 𝐚 𝐟𝐚𝐤𝐞 𝐜𝐨𝐧𝐭𝐫𝐨𝐯𝐞𝐫𝐬𝐲 𝐜𝐫𝐞𝐚𝐭𝐞𝐝 𝐰𝐢𝐭𝐡 𝐁𝐉𝐏’𝐬 𝐡𝐞𝐥𝐩 𝐟𝐨𝐫 𝐛𝐨𝐨𝐬𝐭𝐢𝐧𝐠 𝐩𝐫𝐨𝐟𝐢𝐭𝐬 & 𝐩𝐥𝐚𝐲𝐢𝐧𝐠 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐬? Andhra Pradesh CM @ncbn… pic.twitter.com/Em5JxD4H1s— Saket Gokhale MP (@SaketGokhale) September 21, 2024 ఎవరి కుటుంబమైతే నెయ్యి- పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తోందో.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డూల విషయంలో కూడా గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే ప్రస్తావించారు.మొత్తంగా.. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు.. తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని సాకేత్ గోఖలే ఆరోపించారు.ఇదీ చదవండి: దేవుడే ఇక చంద్రబాబుకి బుద్ధి చెప్తాడు! -
Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్.. 430 అడుగులు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు. ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు. -
వైద్య వారసత్వం పునరుద్దరణకు కృషి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, హైదరాబాద్ నిర్వహిస్తున్న మాన్యుస్క్రిప్ట్లజీపై రెండురోజుల శిక్షణ కార్యక్రమం 20 జూలై 2024న ముగిసింది. భారతదేశంలోని వివిధ స్క్రిప్ట్‌ల గురించి విజ్ఞానాన్ని అందించడం ద్వారా పండితులకు వైద్య వ్రాత ప్రతులను సులభంగా అనువదించడం దీని లక్ష్యం. మాన్యుస్క్రిప్ట్లజీ లో నిపుణులు మాన్యుస్క్రిప్టులజీ యొక్క వివిధ అంశాలను అనగా వాటిలో ఉన్న వైద్యజ్ఞానాన్ని తెలుసుకోవడం పురాతన లిపి అందులోని అర్థాన్ని తెలుకోవడం మొదలగు వాటి గురించి తెలియజేసారు.వీరిని హైదరాబాద్‌లోని ఎన్ఐఐఎంహెచ్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి పి ప్రసాద్ సత్కరించారు. దాదాపు 100 మంది మేధావులు ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమథన సెషన్లకు మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా హాజరయ్యారు. వారు గ్రంథ, వట్టెఝుత్తు, కన్నడ, నగరి మరియు తెలుగు వంటి ప్రాచీన భారతీయ లిపిల గురించి తెలుసుకున్నారు. ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ సినిరుద్ధ దాష్, మాజీ ప్రొఫెసర్ మరియు హెడ్, మద్రాస్ విశ్వవిద్యాలయం, సంస్కృత శాఖ, డాక్టర్ కీర్తికాంత్ శర్మ, మాజీ రీసెర్చ్ ఆఫీసర్, I.G.N.C.A., శ్రీ షాజీ, ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ మాజీ మాన్యుస్క్రిప్ట్ అసిస్టెంట్, ప్రొఫెసర్ M. A. అల్వార్, మహారాజా సంస్కృత కళాశాల, మైసూర్, డాక్టర్ ఉత్తమ్ సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం, త్రిపుర, డాక్టర్. V. S. కంచి అసోసియేట్ ప్రొఫెసర్, ముల్జీ జైతా కళాశాల, మహారాష్ట్ర, Mr. N.R.S. నరసింహ, సీనియర్ అసిస్టెంట్, TTD మ్యూజియం, తిరుపతి, ప్రొఫెసర్ డా. రంగనాయకులు, మాజీ డైరెక్టర్ – చరిత్రకారుడు, TTD మ్యూజియం, ఆంధ్రప్రదేశ్, మాన్యుస్క్రిప్ట్లజీపై లోతైన అవగాహన కల్పించారు. డాక్టర్ వి.కె. న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ నుండి డా.లావనియా,RO (Ayu.), డాక్టర్ రాకేష్ నారాయణన్,RO (Ayu.) మరియు డాక్టర్ ముఖేష్ చించోలికర్, RO (Ayu.) మరియు NIIMH అధికారులు డాక్టర్ V. శ్రీదేవి, RO ( ఆయు.), డాక్టర్ అష్ఫాక్ అహ్మద్, RO (యునాని), డాక్టర్ ఖీ .సాకేత్ రామ్, RO (Ayu.), ఈట సంతోష్ మానె, RO (Ayu.) ఈట. బిస్వో రంజన్ దాస్, RO (Hom.) Dr. Chris Antony, RO (Ayu.) వైద్య మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధనలు చేపట్టడం కోసం పాల్గొనే వారితో వారి అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. -
సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం
సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. – సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్‌పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక కేస్ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది. అదిగో తోక.. ఇదిగో పులి తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్ అధికారులు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్‌ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్ అవుట్ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది. ఆ ఐటీ రిటర్న్‌లు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. ‘హెరిటేజ్’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్ చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్‌కు సోమవారం ఓ లేఖ రాళారు. తాము హెరిటేజ్ ఫుడ్స్‌కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్ఆర్ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్ నోట్‌ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్ ఫుడ్స్‌కు అందించారు. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
నిజమైన ఎర్రచందనం స్మగర్లు టీడీపీ వాళ్లే
-
హెరిటేజ్ కోసం పాడి పరిశ్రమను - రైతులను నట్టేట ముంచారు
-
రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం
జైపూర్: రాజస్థాన్‌లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. రైలు ప్రత్యేకతలు.. ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. గోరమ్ ఘాట్(రాజస్థాన్ మినీ కశ్మీర్), భిల్ బేరీ వాటర్‌ఫాల్ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబిస్తుంది. రైలు వేళలు.. మార్వార్ జంక్షన్ వద్ద ఉదయం 8:30కు ప్రారంభమైన ఈ రైలు కామ్లిఘాట్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుతుంది. వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ హెరిటేజ్ రైలు.. సాయంత్రం 5:30కి మార్వార్ చేరుతుంది. హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్‌కు రూ.2000 వసూలు చేయనున్నారు. హెరిటేజ్ రైలు ప్రారంభం సందర్భంగా బీజేపీ ఎంపీ దివ్యా కుమారి తన మొదటి ప్రయాణం అద్భుతంగా ఉందని వెల్లడించారు. UNESCO భారత్‌లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (1999), నీలగిరి మౌంటైన్ రైల్వే (2005), కల్కా సిమ్లా రైల్వే (2008), ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై (2004)లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో -
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
బాబు బాటలోనే భువనేశ్వరి
సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ప్రయాణిస్తున్నారు. సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి తొలిసారిగా రాజకీయ ప్రసంగం చేస్తూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు. స్కిల్ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాంతంగా తమ హెరిటేజ్ కంపెనీ విలువను పెంచేశారు. రూ.371 కోట్ల కోసం తాము కక్కుర్తి పడ¯నక్కర్లేదని, హెరిటేజ్‌లో రెండు శాతం వాటా అమ్ముకుంటే తమకు రూ.400 కోట్లు వస్తాయంటూ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేశారు. రెండు శాతానికి రూ.400 కోట్లు అంటే హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20,000 కోట్లుగా ఉండాలి. కానీ సోమవారం స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం హెరిటేజ్ మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ మొత్తం విలువ రూ.2,171 కోట్లు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే రెండు శాతం వాటా విక్రయిస్తే భువనేశ్వరి చేతికి వచ్చేది కేవలం రూ.43.2 కోట్లు మాత్రమే. మరి రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయంటూ ఎలా చెప్పారంటూ స్టాక్ మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మా కంపెనీలో 2% వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయ్.. జగ్గంపేట/అన్నవరం: మా కంపెనీ(హెరిటేజ్)లో 2 శాతం వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని.. బినామి కంపెనీ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణల్లో నిజం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సోమవారం సందర్శించారు. శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సొమ్ము తమకు వద్దని.. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని, తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని.. అయినా జైల్లో పెట్టారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, నారా భువనేశ్వరి రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి విడుదలవ్వాలని పూజలు చేశారు. వేదపండితులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఆమె వెంట పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, వరుపుల సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులున్నారు. -
హెరిటేజ్ షేరుకు షాక్! రెండు రోజుల్లో 20 శాతం డౌన్
హైదరాబాద్: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారులకు షాక్ తగిలింది. చంద్రబాబు కుటుంబం కంపెనీ ప్రధాన ప్రమోటర్ కావడంతో షేరు కుప్పకూలింది. శనివారం చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత రెండు ట్రేడింగ్ సెషన్లలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు ధర దాదాపు 19 శాతం క్రాష్ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 12.5 శాతం (రూ.32) క్షీణించి రూ.221 వద్ద ముగిసింది. భారీ వాల్యూమ్‌తో (దాదాపు 24 లక్షల షేర్లు చేతులు మారాయి) షేరు పడిపోవడం చూస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం ఉన్నట్లు కనబడుతోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్‌కు ముందు, అంటే శుక్రవారం (సెప్టెంబర్ 8న) ట్రేడింగ్ ముగింపు నాటికి షేరు ధర దాదాపు రూ.272 వద్ద ఉంది. షేరు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా ఆవిరవుతోంది. గత రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) ఏకంగా రూ.450 కోట్ల మేర కరిగిపోయింది. మంగళవారం ట్రేడింగ్ ముగింపు నాటికి ఇది రూ.2,073 కోట్లకు దిగొచ్చింది. కాగా, హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ.287 కాగా, కనిష్ట స్థాయి రూ.135గా నమోదైంది. కంపెనీలో ప్రమోటర్లకు (చంద్రబాబు కుటుంబం) సుమారు 41.58 శాతం వాటా ఉంది. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు’ అక్రమాల్లో హెరిటేజ్.. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలపై ఏపీ సీఐడీ విచారణ జోరు పెంచడం, వీటిలో బాబు కుటుంబంతో పాటు హెరిటేజ్ కంపెనీకి కూడా ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు బయటపడటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఒకపక్క, ‘స్కిల్’ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబు అరెస్టయ్యి రిమాండ్‌లో ఉన్నారు. ఇదే తరుణంలో అమరావతి ‘ఇన్నర్ రింగ్ రోడ్డు‘ ప్రాజెక్టులో సైతం బాబు అండ్ కో అందినకాడికి దోచుకున్నారన్న పక్కా ఆధారాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులోనూ బాబును అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ స్కామ్‌లో హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వెంబడి భూములు కొనుగోలు చేసినట్లు ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో వెలికితీయడం గమనార్హం. వీటన్నింటి ప్రభావంతో రానున్న రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దీంతో షేరు మరింత కుప్పకూలే అవకాశం ఉందనేది వారి విశ్లేషణ. -
ఏపీలో కనిపించని టీడీపీ బంద్ ప్రభావం
-
మళ్లీ నేనే!
2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... దుష్ట రాజకీయాలపై యుద్ధమే వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి. మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది. ‘బంగారు పక్షి’గా భారత్ మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది. ధరల నియంత్రణకు మరిన్ని చర్యలు ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. 6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ చేరుకుంది. క్వాంటమ్ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం. 2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్‌కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మన స్టార్టప్‌లు భేష్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 98,119 స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం. నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా ప్రతి కల జనం కోసమే ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా. విశ్వకర్మ యోజన రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు. -
పచ్చని చిత్తూరు డెయిరీపై చంద్రబాబు పన్నాగం.. అసలేం జరిగిందంటే?
చిత్తూరు అర్బన్: ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద రెండో సహకార పాల డెయిరీగా పేరుగాంచిన చిత్తూరు విజయా డెయిరీ ఎందుకు మూతబడింది? ఏ ప్రభుత్వ హయాంలో విజయా డెయిరీని మూయించారు? నాటి పాలకులు చేసిన తప్పిదాలు ఏంటి? డెయిరీ మూత వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ పచ్చ మీడియాకు సమాధానాలు తెలుసు. కానీ ఎక్కడా వాటిని ప్రస్తావించదు. ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించదంటే.. కారణం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చంద్రబాబునాయుడు చేసిన కుట్ర. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి డెయిరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పునరుద్ధరిస్తుంటే ‘పచ్చ మీడియా’ ఓర్చుకోవడంలేదు. డెయిరీ ఎదుట ఉన్న వీరరాఘవులునాయుడు విగ్రహం పడేశారంటూ గోల చేస్తూ తప్పుడు కథనాలు వార్చి వడ్డిస్తోంది. డెయిరీ మూసివేత కుట్రకు నాంది చంద్రబాబు నాయుడు సహకార శాఖ మంత్రిగా పనిచేసే రోజుల్లో ఓసారి చిత్తూరు విజయా డెయిరీని సందర్శించారు. అప్పటికి రోజుకు 4 లక్షల లీటర్ల మేరకు పాల సేకరణ జరుగుతుండేది. డెయిరీలో ప్రత్యక్షంగా దాదాపు 800 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే, పరోక్షంగా 2 లక్షలకు పైగా కార్మికులు విధులు నిర్వర్తించే వారు. చిత్తూరు విజయా పాల డెయిరీ నుంచి డిల్లీ, పూణే, బాంబే తదితర మహా నగరాలకు రోజుకు 2 లక్షల లీటర్ల మేరకు పాలను తరలించడం గమనించిన బాబు మదిలో ఓ కుట్ర పురుడుపోసుకుంది. హెరిటేజ్ పుట్టిందే ఆ కుట్ర నుంచి.. అదే ఆయన మానస పుత్రిక హెరిటేజ్ పాల డెయిరీ స్థాపన. హెరిటేజ్‌ను స్థాపించాలంటే సహకార రంగంలో పాతుకుపోయిన విజయా పాల డెయిరీని మూయించాలని నిర్ణయించుకున్నారు. తనకు నమ్మిన బంటుగా ఉన్న చిత్తూరు టీడీపీ నేత దొరబాబునాయుడును విజయా పాల డెయిరీకి చైర్మన్‌గా నియమించుకున్నారు. మరో కుడిభుజం జీవరత్నం నాయుడును మేనేజర్‌గా నియమించుకుని విజయా డెయిరీకి వచ్చే పాలను తన డెయిరీకు మళ్లించుకున్నారు. జాగ్రత్తగా డెయిరీని మూత వేయించారు విజయా డెయిరీలో పాల పౌడర్, నెయ్యి లాంటి పదార్థాలు అమ్ముడుపోవడం లేదంటూ, భారీ నిల్వలను ఉంచేశారు. విజయా డెయిరీకి పాల సేకరణ ఎక్కువగా ఉందంటూ వారానికి రెండు రోజులు చొప్పున మిల్క్ హాలిడేను ప్రకటించారు. రైతులకు క్రమంగా పాల ధరలను తగ్గిస్తూ, ఇదే సమయంలో హెరిటేజ్‌లో 20 పైసలు అదనంగా ఇస్తామని ఆశ చూపించి పాలను మళ్లించుకున్నాడు. ముందు నష్టాలు.. తర్వాత లాకౌట్ ఆఖరికి డెయిరీలో భారీ నష్టాలు చూపించి 2002 ఆగస్టు 31వ తేదీన లాకౌట్ ప్రకటించి పూర్తిగా డెయిరీని మూసివేశారు. ఆ సమయంలో డెయిరీ చైర్మన్‌గా ఉన్న దొరబాబు నాయుడు పూర్తిగా చంద్రబాబు నాయుడి కుట్రలకు తోడ్పాటు అందించారు. విజయా పాల డెయిరీపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులను, డెయిరీలో పనిచేస్తున్న వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారు. విగ్రహాన్ని భద్రంగా ఉంచాం.. ప్రభుత్వం విజయ డెయిరీని పునఃప్రారంభించనున్న నేపథ్యంలో గేటు ముందు దారిలో అడ్డుగా ఉన్న వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి భద్రపరిచామని నగర కమిషనర్ అరుణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా తీసిన విగ్రహ ఫొటోలను చూపించారు. విగ్రహాన్ని ఎక్కడా పడేయలేదని స్పష్టం చేశారు. పచ్చ మీడియా దాచిన చరిత్ర 1969లో సహకార కార్పొరేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు విజయా డెయిరీని ప్రారంభించారు. అప్పట్లో రోజుకు 3 వేల లీటర్లు పాలు సేకరించేవారు. ఈ పాలను చిత్తూరు, తిరుపతి నగరాల్లో విక్రయించేవారు. 1977–78 నుంచి తిరుమల శ్రీవారికి అభిషేకానికి కూడా విజయా డెయిరీ పాలను సరఫరా చేసేవారు. తిరుమలలోని పలు హోటళ్లు, క్యాంటీన్లకు సైతం ఇక్కడి నుంచి పాలు వెళ్లేవి. ఘనచరిత్ర చిత్తూరు డెయిరీది 1980లో పాలకోవా, రోస్మిల్క్ తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ రోజుకు 50 వేల లీటర్ల పాలసేకరణ జరిగేది. కాల క్రమేణా తిరుమలకు నెలకు రూ.కోటి మేరకు నెయ్యి సరఫరా చేయడంతో పాటు, పాల కోవా, రోస్ మిల్క్ విక్రయాలను చిత్తూరు, తిరుపతి, తిరుమలలో పుంజుకున్నాయి. విజయా డెయిరీ నుంచి తయారుచేసిన పాల పౌడర్‌ను మిలిటరీ క్యాంటీన్లకు తరలించేవారు. లక్షల కుటుంబాల జీవన ధార రోజు రోజుకూ విజయా డెయిరీకి పాలసేకరణ సామర్థ్యం పెరగడంతో జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల పాడి రైతు కుటుంబా లు రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల మేరకు పాలను సరఫరా చేసేవి. గ్రామాల్లో పాడి రైతులతో కూడిన పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు దాదాపు 850 గ్రామాల్లో పాల ఉత్పత్తి దారుల సంఘం కింద పాల సేకరణ భవనాలను నిర్మించారు. ఇపుడు డెయిరీ తెరుస్తుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న విజయా డెయిరీని పునరుద్ధరించే క్రమంలో స్థలాన్ని అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి పాలను సేకరించి గిట్టుబాటు ధర కల్పించడానికి చేస్తున్న ప్రయత్నంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీర రాఘవుల విగ్రహానికి సముచిత స్థానం డెయిరీ మాస్టర్ ప్లాన్ ప్రకారం వీరరాఘవులునాయుడు విగ్రహానికి సముచిత స్థానం కల్పిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ ఇప్పటికే స్పష్టం చేశారు. విగ్రహాన్ని పడేశామని, మూలనచుట్టి ఎక్కడికో తరలించారంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు. మరోవైపు డెయిరీని మూయించిన దొరబాబు నాయుడు.. చిత్తూరు కలెక్టర్‌ను కలిసి డెయిరీ ఎదుట వీర రాఘవులు నాయుడు విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని వినతిపత్రం ఇవ్వడం ఈ ఘటనలో కొస మెరుపు. -
మన సంస్కృతితో యువత బంధం బలీయం: ప్రధాని
న్యూఢిల్లీ: మన దేశ అద్భుతమైన వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం, గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా చేపట్టిన అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. ఘనమైన మన సాంస్కృతిక వారసత్వ సంపద మనకు గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం సాగించిన ప్రయత్నాల ఫలితంగానే మన యువతకు సంస్కృతితో బంధం బలపడిందని అన్నారు. శనివారం ఆయన ట్విట్టర్లో ‘9ఇయర్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ కల్చర్’పేరుతో హాష్‌ట్యాగ్ చేశారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు ట్వీట్లు చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. -
సహకార డెయిరీ రంగాన్ని చంపేసింది చంద్రబాబే
చంద్రబాబు ప్రభుత్వం హయాం.. రాష్ట్రంలో సహకార డెయిరీలను ప్రభుత్వమే చిదిమేసింది. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ ఎదుగుదల కోసం గ్రామ గ్రామాన వేళ్లూనుకొన్న సహకార డెయిరీలను ఆయన ప్రభుత్వమే నాశనం చేసేసింది. కొన్నింటిని తనకు అనుంగులుగా ఉండే వ్యక్తులకు అప్పజెప్పింది. చివరకు రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. పాలకు కనీస ధర కూడా అందక అల్లాడిపోయారు. ‘ఈనాడు’ విషం.. విషపు రాతల ‘ఈనాడు’కు ఈ వాస్తవాలు పట్టవు. ప్రజల సంక్షేమం అసలే పట్టదు. ఎంతసేపూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యం. అందులో భాగంగానే ‘అమూల్ మాకొద్ద’ంటున్నారంటూ విషపు రాతలతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. మూతపడ్డ సహకార పాల డెయిరీలు పునరుద్ధరించి, పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ గ్రామాన మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి సహకార రంగాన్ని బలోపేతం చేసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. లీటర్‌కు రూ. 4 మేర అదనపు ప్రయోజనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా జగనన్న పాల వెల్లువ పథకం కింద లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు లబ్ధి చేకూరుస్తోంది. పాడి రైతులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన పాల సేకరణ, సరఫరాయే లక్ష్యంగా పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో గిట్టుబాటు ధర వస్తోంది. అమూల్‌కు పాలు పోసే వారే కాదు.. అమూల్ రాకతో పాల సేకరణ ధరలు పెంచడం వలన ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తున్న పాడి రైతులూ లబ్ధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీల రైతులకూ లబ్ధి అమూల్ రాకతో ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకూ లబ్ధి చేకూరింది. అమూల్ పాల సేకరణ ధర పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా విధిలేని పరిస్థితుల్లో పాల సేకరణ ధరలు పెంచాయి. అమూల్ ఇచ్చే ధరతో పోలిస్తే తక్కువే అయినా, వాటికి పాలు పోసే పాడి రైతులకు ఈ 30 నెలల్లో రూ.3,312.46 కోట్ల అదనపు ప్రయోజనం చేకూరింది. సహకార డెయిరీలకు చంద్రబాబు కాటు హెరిటేజ్ డెయిరీ కోసం రాష్ట్రంలో సహకార డెయిరీ రంగాన్ని ఓ పథకం ప్రకారం నిర్వీర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని కంపెనీలుగా ప్రకటించుకున్నారు. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా ప్రకటించుకున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు లాభాల్లో ఉన్న ప్రభుత్వ డెయిరీలన్నీ బాబు హయాంలో మూతపడ్డాయి. 2017 జనవరి 23న కడప జిల్లాలోని పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణాలోని మినీ డెయిరీ–కంకిపాడు, 2019 మార్చి 15న చిత్తూరు జిల్లాల్లోని మదనపల్లి డెయిరీ, మరో 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మిల్క్ చిల్లింగ్ సెంటర్ (ఎంసీసీ)తో పాటు 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూలు) మూతపడ్డాయి. రాష్ట్రంలోని పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. పాల సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువైన మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిల్లింగ్ సెంటర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటిపై ఈనాడు పత్రిక ఏనాడూ చిన్న వార్తా రాయలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం నుంచి పాలను సేకరించడమే నిలిపివేసింది. రూ.45 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టారు. అయినా బాబు సర్కారు నోరు మెదపలేదు. సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాడి రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాల సహకార సంఘాల పునరుద్ధరణ, పాడి రైతులకు గిట్టుబాటు ధర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. గ్రామాల్లో మహిళా డెయిరీ సహకార సంఘాలు (ఎండీఎస్) ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పాలు సేకరిస్తున్నారు. మూడు జిల్లాలతో మొదలైన పాల సేకరణ ప్రస్తుతం 17 జిల్లాలకు విస్తరించింది. 20 – 30 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న ప్రైవేటు డెయిరీలు ప్రస్తుతం రోజుకు 5 – 6 లక్షల లీటర్లు సేకరిస్తుంటే, కేవలం 30 నెలల్లోనే అమూల్ సంస్థ రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతంలో ప్రైవేటు డెయిరీలు రెండేళ్లకోసారి పాలసేకరణ ధరలు పెంచేవి. అమూల్ మూడు నెలలకోసారి పాల సేకరణ ధరలను సవరిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. ఇలా 30 నెలల్లో ఏడు రెట్లు పెంచింది. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా లీటర్‌కు రూ.88, ఆవు పాలకు రూ.43.69 చెల్లిస్తున్నారు. 30 నెలల్లో గేదె పాలపై రూ.16.53, ఆవు పాలపై రూ. 9.49 మేర ధరలు పెంచారు. ఒక్క రూపాయి తక్కువ కాకుండా 10 రోజులకోసారి నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు ఆర్బీకేల ద్వారా ఇన్పుట్స్ అందిస్తున్నారు. మధ్యవర్తులు, వాటాదారుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా ప్రోత్సాహకం, బోనస్ పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 సార్లు లీటరుకు అర్ధ రూపాయి లాయల్టీ బోనస్ కూడా వస్తోంది. పాడి రైతుల సంరక్షణ, నిర్వహణ కోసం రూ.40 వేల వరకు ఎలాంటి హామీ లేకుండా స్వల్పకాలిక రుణాలందిస్తున్నారు. అమూల్ ప్రాజెక్టులో భాగంగా 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.680 కోట్లతో 3,156 గ్రామాల్లో ఏఎంసీయూ, బీఎంసీయూలు నిర్మిస్తున్నారు. – సాక్షి, అమరావతి -
హెరిటేజ్ పై సీఐడీ ఫోకస్...!
-
ఇది మా వారసత్వం! ప్రియాంక ఉద్వేగభరిత ప్రసంగం
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై లోక్‌సభ అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం ఆ పార్టీ కార్యదర్మి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ రాజ్‌ఘాట్ వద్ద సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక ఆ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఆ ప్రసంగంలో.. "మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరించారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మా నాన్న(రాజీవ్ గాంధీ) అంతక్రియల ఊరేగింపు తీన్‌మూర్తి భవన్ నుంచి బయలుదేరుతోంది. భద్రతా బెదిరింపులు ఉన్నప్పటికీ రాజ్‌ఘాట్‌కు వరకు తన తండ్రి అంత్యక్రియల ఊరేగింపుకి వెళ్లేందుకు ఎలా పట్టుబట్టారో తెలిపింది. అప్పుడూ మా నాన్న మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టారు. అలాంటి అమరవీరుడి తండ్రిని పార్లమెంటులో అవమానించారు. ఆ అమరవీరుడి కుమారుడిని మీరు దేశ వ్యతిరేకి అంటారు. ఈ సందర్భంగా ప్రియాంక పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రస్తావిస్తూ.. ఈ కుటుంబం నెహ్రూ ఇంటి పేరు ఉపయోగించేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారో అంటూ హేళన చేశారు. మోదీ తన వ్యాఖ్యలతో మొత్తం కుటుంబాన్నే గాక కాశ్మీర్ పండిట్ల సంప్రదాయాన్నే అవమానించారు. దీనికి మీపై ఎటువంటి కేసు లేదు. అలాగే రెండేళ్ల పదవీకాలంపై వేటు పడదు, అనర్హులుగా ప్రకటించరు కూడా. ఎందుకు ఇలా అని ప్రియాంక ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక ప్రసంగించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తూ.. సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం. ఇదే మా బలం అని రాసుకొచ్చారు. కాగా, ఆమె ఆ ప్రసంగంలో.. అమరులైన ప్రధాని కుమారుడు, పైగా జాతీయ సమైక్యత కోసం వేలకిలోమీటర్లు నడిచిన మహోన్నత వ్యక్తి (రాహుల్) ఎప్పటికీ దేశాన్ని అవమానించలేడని ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు. అంతేగాదు ఈ దేశ ప్రధాని పిరికివాడని, అధికారం వెనక దాక్కున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. ఈ దేశ ప్రజలు కచ్చితంగా అలాంటి దురహంకారి రాజుకి తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) (చదవండి: తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం! పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్) -
ఉన్నత విద్యలో హెరిటేజ్, కల్చర్
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఇండియన్ హెరిటేజ్ (భారతీయ వారసత్వం), కల్చర్ (సంస్కృతి) ఆధారిత కోర్సుల అమలుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుడుతోంది. శాస్త్రీయ నృత్యం, ఆయుర్వేదం, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, మానవ విలువలు, వేద గణితం, యోగా తదితర కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. బహుళ ప్రవేశ నిష్క్రమణలతో స్వల్పకాలిక క్రెడిట్–ఆధారిత కోర్సులుగా వీటిని అమలు చేయనున్నట్లు పేర్కొంది. జాతీయ నూతన విద్యావిధానం–2020 ప్రకారం భారతీయ వారసత్వం, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి వీలుగా భారతీయ సనాతన వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియచేయడమే లక్ష్యంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. ఆయుర్వేదం, శాస్త్రీయ నృత్య రూపాలు, భారతీయ భాషలు, సంగీతం, సంస్కృతం, సార్వజనీన మానవ విలువలు, వేద గణితం, యోగా వంటి కోర్సుల కోసం కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును రూపొందించనుంది. ఈ కోర్సులతో విదేశీ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 3 విభాగాలుగా ఈ కోర్సులను యూజీసీ ప్రతిపాదించింది. పరిచయ స్థాయి, మధ్యంతర స్థాయి, అధునాతన స్థాయిగా వీటిని విభజించనుంది. కోర్సులను అందించే సంబంధిత ఉన్నత విద్యాసంస్థలు వాటికి నిర్దిష్ట అర్హత పరిస్థితులను నిర్ణయించడానికి యూజీసీ అనుమతించింది. ఆయా ప్రోగ్రాములు ఫ్లెక్సిబుల్ హైబ్రిడ్ (ఆన్లైన్–ఆఫ్‌లైన్ కాంబినేషన్) కింద అందించనున్నారు. ఆయా ఉన్నత విద్యాసంస్థలు కోర్సులకు సంబంధించి సంబంధిత ముఖ్యమైన సాహిత్యం గ్రంథాలు నేర్చుకున్న పండితుల సహకారం తీసుకుని పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఆయా ప్రోగ్రాములను రూపొందించేటపుడు బోధనా విధానాల్లోనూ ఆధునిక నాలెడ్జ్ సిస్టమ్‌తో అనుసంధానం ఉండాలని స్పష్టం చేసింది. బోధన వివిధ మాధ్యమాల్లో ఉంటుంది. ఉపన్యాసాలు, ఆడియో–వీడియో కంటెంట్, గ్రూపు చర్చలు, ఆచరణాత్మక సెషన్లు, విహారయాత్రలు కూడా బోధనలో భాగంగా ఉంటాయి. అభ్యాసకులకు క్రెడిట్లను అందించడానికి రెండు రకాల మూల్యాంకన విధానాలు పాటిస్తారు. నిరంతర, సమగ్ర అంచనా (సీసీఏ), పీరియాడికల్ మూల్యాంకనాలను అనుసరించనున్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఆయా ఉన్నత విద్యా సంస్థలే సర్టిఫికెట్లను మంజూరు చేస్తాయి. ఆ సర్టిఫికెట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. -
పట్టాలపైకి ‘పాడికుండ’.. చిత్తూరు విజయ డెయిరీకి మంచిరోజులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని పట్టాలెక్కించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. చంద్రబాబు తన పా‘పాల’ డెయిరీ హెరిటేజ్ కోసం చిత్తూరు విజయ డెయిరీని గుదిబండలా మార్చి మూయిస్తే.. దాని పూర్వవైభవం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. త్వరలో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పాడి రైతులు, కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు విజయ డెయిరీ ప్రస్థానమిలా.. చిత్తూరు కేంద్రంగా 50 మంది పాడి రైతులతో 1969లో ప్రారంభమైన విజయ డెయిరీ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. రోజుకు ఆరువేల లీటర్ల నుంచి 4 లక్షల లీటర్ల సేకరణకు దినదినాభివృద్ధి చెందింది. 68వేల మంది పాడి రైతు కుటుంబాలకు కల్పతరువుగా మారింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు చిత్తూరు పర్యటన సందర్భంగా విజయ డెయిరీని సందర్శించారు. పాడి గురించి ఆరాతీసి పాలద్వారా వచ్చే రాబడిని గ్రహించి హెరిటేజ్ కోసం అడుగులు వేశారు. చిత్తూరు డెయిరీ మూసివేసేందుకు పన్నాగం పన్నారు. టీడీపీ నేత, తన ముఖ్య అనుచరుడు దొరబాబుని డెయిరీ చైర్మన్‌గా నియమించారు. యూనియన్లు ఉన్నా ఎవ్వరూ నోరెత్తకుండా చేశారు. ఎండీ, మేనేజర్నూ తన వైపు తిప్పుకున్నారు. అనంతరం తన పథకాన్ని అమలుచేశారు. లాభాల్లో ఉన్న ఈ డెయిరీని నష్టాల బాట పట్టించారు. ఎగుమతి అయ్యే టన్నుల కొద్దీ నెయ్యి, పౌడర్‌ను రహస్యంగా నిల్వచేసేవారు. అలా ప్రతిరోజూ 35 టన్నుల నెయ్యి, మరో 32 టన్నుల పౌడర్ని నిల్వ చూపించి టెండరుదారులకు తక్కువకే అప్పగించేవారు. ఇలా రోజువారి నష్టాలు పెరిగి చివరకు డెయిరీ మూతకు చంద్రబాబు కారణమయ్యారు. రాజకీయ అవినీతి ఊబిలో.. చిత్తూరు డెయిరీలో గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు సహకార సంఘాల ఎన్నికలు ఒక పెద్ద రాజకీయ వ్యవహారంగా మార్చేశారు. దీంతో డెయిరీ అవినీతిలో కూరుకుపోయింది. ఫలితంగా రైతులకు సరఫరా చేసిన పాలకు బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయింది. పాడి రైతుల ఆందోళనలతో అతి కష్టంపై బిల్లులు చెల్లించేవారు. చివరకు రైతులకు ఈ బిల్లులు చెల్లించలేక 2002 ఆగస్టు 31న చిత్తూరు విజయ డెయిరీ మూతపడింది. అదే సమయంలో ప్రైవేటు డైరీలు పుంజుకున్నాయి. కరువు కారణంగా పంటలు దెబ్బతింటుండటంతో జీవనాధారం కోసం ఎక్కువమంది రైతులు ఆవులను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రైవేటు డెయిరీలన్నీ ఏకమయ్యాయి. పాల ఉత్పత్తిదారులను దోపిడీ చేయటం ప్రారంభించాయి. ప్రభుత్వ సహకార సంఘాల నుండి పోటీరాకుండా బాబు చక్రం తిప్పేవారనే అనేక ఆరోపణలు ఉన్నాయి. కావాలనే నష్టాలబాట అప్పట్లో డెయిరీలో అంతా నిజాయితీగా పనిచేసేవాళ్లం. అవినీతికి పాల్పడేవారే లేరు. అయినా నష్టాలు చూపించారు. ఎవరో పనికట్టుకుని కావాలనే మూతేశారు. డెయిరీ మూసేయటంవల్ల అనేకమంది రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం తెరిపిస్తానంటోంది. డెయిరీకి పూర్వవైభవం తీసుకొస్తే సంతోషిస్తాం. – రామచంద్ర, చిత్తూరు డెయిరీ కార్మికుడు హెరిటేజ్ కోసమే.. చిత్తూరు విజయ డెయిరీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండేది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పాల పదార్థాలు తయారయ్యేవి. ప్రత్యేకంగా ఇక్కడి చీజ్‌కు మంచి గిరాకీ ఉండేది. హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 140 మందిని బయటకు నెట్టేశారు. కొందరు వీఆర్ఎస్ తీసుకున్నారు. మరికొందరు అనారోగ్యంతో మరణించారు. లాభాల్లో ఉన్నప్పటికీ కావాలనే రైతులకు పేమెంట్ ఇవ్వకుండా మార్కెటింగ్‌ని దెబ్బతీశారు. – దశరథన్, టైమ్ స్కేల్ వర్కర్, విజయ డెయిరీ, చిత్తూరు -
రిలయన్స్ ఫ్రెష్‌లో హెరిటేజ్ ఎక్స్పైర్డ్ పన్నీరు.. క్యాంటిన్ అన్నంలో బొద్దింక!
సాక్షి, సిటీబ్యూరో: శాలిబండలోని రిలయన్స్ ఫ్రెష్ స్టోర్‌లో హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ కొన్నాను. తీరా చూస్తే అది ఎక్స్పైర్డ్ అని తెలిసింది. దాన్ని వాడి నేను మరణిస్తే అందుకు బాధ్యులెవరు? తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ ఓ పౌరుడు జీహెచ్ఎంసీకి సామాజిక మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సమాచారమిచ్చాం. సదరు అధికారి ఆ స్టోర్‌ను తనిఖీ చేసి.. తదుపరి చర్య కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు అంటూ జీహెచ్ఎంసీ ప్రత్యుత్తరమిచి్చంది. ‘ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ‘తెలుగు రుచులు’ క్యాంటిన్లో మీల్స్ పార్శిల్ తీసుకున్నాను. ఇంటికి వెళ్లి చూస్తే అన్నంలో బొద్దింక కనిపించింది. ఆ క్యాంటిన్లో వందలాది బొద్దింకలున్నట్లు నాకు సమాచారం అందింది’ అని మరో పౌరుడి నుంచి అందిన ఫిర్యాదుకు స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీ చేసి శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపించారు. తదుపరి చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు పరీక్ష ఫలితాల అనంతరం కోర్టులో కేసు నమోదు చేయడమో, పెనాల్టీ విధించడమో చేస్తామని పేర్కొంది. ఇలా.. పేరెన్నికగన్న సంస్థల్లోనే ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటే ఇక సాధారణ, చిన్నా చితకా హోటళ్లు, తదితర సంస్థల్లోని పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు పదిమందికి తెలుస్తాయని కాబోలు మొక్కుబడి సమాధానాలు తప్ప జీహెచ్ఎంసీ ఇంకా తగిన చర్యలు చేపట్టలేదు. ఆహార కల్తీకి సంబంధించి, కుళ్లిపోయిన ఆహారం గురించి, వంటశాలల్లో అధ్వాన్నపు పరిస్థితుల గురించి, ఇతరత్రా హానికర పరిస్థితుల గురించి జీహెచ్ఎంసీకి నిత్యం ఫిర్యాదులందుతున్నప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్‌సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాచారం ఉండటం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో తనిఖీలు పెరిగాయని చెబుతున్నారు. -
అబద్ధాలే.. రామోజీకి నిత్యావసరం!
నిత్యం అబద్ధాలాడటం... రామోజీరావుకు నిత్యావసరం!!. చంద్రబాబు నాయుడు ఐదేళ్లూ ఏమీ చేయకపోయినా... అదో గుప్తుల కాలం నాటి స్వర్ణయుగంలా రోజూ కీర్తిస్తే జనాన్ని కొంతయినా నమ్మించగలమనేది ఆయన దింపుడు కళ్లం ఆశ. నిత్యావసరాల్లో కోత... అంటూ ఆదివారంనాడు ఆయన చేసిన ఆక్రందనలూ అందులో భాగమే. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేనాటికి ఉన్న రేషన్ కార్డులు 1.39 కోట్లు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఉన్నవి 1.45 కోట్లు. అంటే... ఏకంగా 6 లక్షల కుటుంబాలు పెరిగినట్లు. ఈ నిజాన్ని రామోజీరావు చెప్పరుగాక చెప్పరు. ఇక చంద్రబాబు ఏలిన ఐదేళ్లలోనూ కందిపప్పు, పంచదారపై నాటి ప్రభుత్వం పెట్టిన మొత్తం ఖర్చు రూ.568 కోట్లు. కానీ వై.ఎస్.జగన్ హయాంలో ఈ మూడేళ్లలోనే కందిపప్పు, పంచదార రేషన్ డిపోల్లో ఇవ్వటానికి ప్రభుత్వం చేసిన వ్యయం ఏకంగా రూ.1,891 కోట్లు. ఈ రెండు లెక్కలూ చాలవూ... ఎవరి హయాంలో ఏం జరిగిందో కళ్లకు కట్టడానికి? కాకపోతే ఈ వాస్తవాలను ‘ఈనాడు’ కావాలనే చెప్పదు. పైపెచ్చు కందిపప్పు, పంచదారలో ప్రభుత్వం కోతపెడుతోందని రాస్తూ... చంద్రబాబు హయాంలో ప్రతినెలా ప్రతి కార్డుకూ కిలోలకు కిలోలు పంపిణీ చేశారనే గ్రాఫిక్స్ చూపించడానికి పడరాని పాట్లు పడుతోంది. ఈ ముసుగులు తొలగిస్తూ... నిజానిజాలేంటో చెప్పే కథనమిది!. రాష్ట్రంలో 2014 నుంచీ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పామాయిల్ కేటాయింపులే లేవన్నది నిజం. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సబ్సిడీ కందిపప్పు ధర రూ.67కే స్థిరంగా అందిస్తున్నారని, ఎక్కడా పెంచలేదన్నది నిజం. కానీ వీటిని ‘ఈనాడు’ చెప్పదు. అయినా చంద్రబాబు హయాంలో పండగ కానుకలు ఎందుకిచ్చారో మీకు తెలియదా రామోజీరావు గారూ? పీడీఎస్ డబ్బుల్ని హెరిటేజ్ లాంటి కంపెనీలకు దోచిపెట్టడానికి కాదా? ఎలాంటి నిబంధనలూ లేకుండా... టెండర్ల ఊసే లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు మింగింది మీరందరూ కాదా? అసలు పేదలకు నాణ్యమైన సరుకులు ఇచ్చేందుకు ఏనాడైనా ప్రయత్నించారా? అప్పట్లో బియ్యాన్ని తీసుకున్నా తినగలిగే పరిస్థితి ఉండేదా? ఇప్పుడు మధ్యస్త సన్నరకం బియ్యాన్ని తీసుకుని ఖర్చుకు వెరవకుండా మరింత నాణ్యంగా సార్టెక్స్ చేసి అందిస్తుండటం నిజం కాదా? అప్పట్లో ఇన్ని అక్రమాలు జరిగినా ప్రశ్నించలేదెందుకు? పైపెచ్చు ఇప్పుడు ఇళ్లవద్దకే రేషన్ సరఫరా చేస్తున్న అద్భుతమైన వ్యవస్థపై కూడా... ఇంటి ముంగిటకు రాకుండా వీధి మలుపుల్లో ఉంటున్నారనే విమర్శలా? మరీ ఇంతలా దిగజారిపోతున్నారెందుకు రామోజీరావు గారూ? సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటా నెలకొన్న పండగ వాతావరణం బాబుకు ఎదురవబోయే ఓటమిని ముందే చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారా? ఇవీ... చంద్రబాబు లెక్కలు టీడీపీ ప్రభుత్వం హయాంలో రాగులు, జొన్నలు, గోదుమ పిండి, ఉప్పు పంపిణీ చేయటం మొదలెట్టిందే చివర్లో. ‘ఈనాడు’ దృష్టిలో అది సూపర్. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచ్చినా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో పంపిణీ చేశారీ చిరు ధాన్యాల్ని. గతంలో నెలకు 14 వేల టన్నుల గోధుమ పిండి అవసరం ఉంటే 900 టన్నులు తెచ్చి కొద్ది మందికే పంపిణీ చేశారు. ఇక్కడి ప్రజలకు బియ్యమే ఇష్టం. కార్మికులు, కూలి కుటుంబాలకు గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే తీరిక ఉండదు. దీంతో గోధుమ పిండి తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిల్వలు పాడైపోతున్న కారణంగా పంపిణీ నిలిచిపోయింది. రాగులు, జొన్నల విషయంలోనూ ఇదే జరిగింది. 2018–19 మధ్య 25,034 టన్నుల రాగులు, 15,635 టన్నుల జొన్నలను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేశారు. వీటిని బయటి మార్కెట్ నుంచి కొనటంతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నిలిపివేసింది. వీటి పరిమాణానికి సమానవైన బియ్యంపై సైతం సబ్సిడీ ఇవ్వలేదు. ఈ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. వీటిని తీసుకునేందుకెవరూ ఆసక్తి చూపించకపోవడంతో మధ్యలోనే ఆగిపోతే.. దీనిక్కూడా ‘ఈనాడు’ మసి పూస్తూనే ఉంది. 2020లో కేంద్రం 1838 టన్నుల గోధుమలు మాత్రమే సరఫరా చేసేది. వాటిని పిండిగా చేసి రేషన్ దుకాణాలకు చేర్చేందుకు ఖర్చు అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటా’ సరఫరాలను నిలిపివేసింది. అన్నీ... ఎన్నికల ముందే ఇక గత ప్రభుత్వం ఐదేళ్లలో 93 వేల టన్నుల కందిపప్పు, 3.16 లక్షల పంచదారను మాత్రమే పంపిణీ చేస్తే... వై.ఎస్.జగన్ ప్రభుత్వం మూడేళ్లలో 2.76 లక్షల టన్నుల కందిపప్పును, 2.14 లక్షల టన్నుల పంచదారను అందించింది. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూన్ వరకు కందిపప్పు గురించి పట్టించుకోనే లేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు వస్తున్నాయనగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులకు రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పంచదార పరిస్థితీ అంతే. నెలకు సగటున 7724 టన్నులు అవసరం కాగా, కేంద్రం కేవలం 908 టన్నులకే రాయితీ ఇస్తోంది. మిగిలినదంతా రాష్ట్రం బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి... సబ్సిడీని భరిస్తోంది. పైపెచ్చు బాబు హయాంలో ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులుండేవి. ఆగస్టు 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఇచ్చి... ధర రూ.50 నుంచి రూ.120 మధ్యన విక్రయించారు. 2015 డిసెంబర్లో రూ.90కి విక్రయిస్తే... 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేశారు. 2018లో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ.63 ఉన్నప్పుడు కేవలం రూ.23 రాయితీ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో రూ.115 ఉంటే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.48 సబ్సిడీ ఇస్తూ రూ.67కే అందిస్తోంది. మార్కెట్ ఒడిదుడుకులు, కోవిడ్ సంక్షోభం, ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగాయి. ఇదే నేరమైనట్లు... ధరలు పెంచేశారంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకోవటం చూస్తే చిత్రంగానే అనిపిస్తుంది. ఇంటింటికీ రేషన్‌పైనా నిందలా? ‘తోచీ తోచనమ్మ’ తరహాలో రామోజీరావుకు దేనిపై విమర్శలు చేయాలో తెలియటం లేదన్నది ఆయన కథనాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటింటికీ రేషన్ అందించటంలో ఏపీని యావద్దేశం ఆదర్శంగా తీసుకుంటోంది. ‘ఈనాడు’ మాత్రం పసలేని విమర్శలు చేస్తూనే ఉంది. బాబు హయాంలో రేషన్ సరుకుల కోసం యుద్ధాలే చేయాల్సి వచ్చేది. డిపోల్లో సర్వర్లు ఎప్పుడు పని చేస్తాయో తెలీక రోజంతా కూలి మానేసి క్యూలో పడిగాపులు పడేవారు. ఒక్కోసారి రేషన్ తీసుకోకుండానే ఇళ్లకెళ్లేవారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. కానీ ఈ నిజాలను ఇప్పటికీ ‘ఈనాడు’ చెప్పదు. పైపెచ్చు అప్పట్లో ఒకరోజు సెలవు పెట్టుకుని డిపోలకు వెళ్లేవారని, ఇపుడు ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తాయో తెలియక తంటాలు పడుతున్నారని రాయటంలోనే ఆ పత్రిక ఎంత నీచానికి దిగజారుతున్నదో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో... ఇపుడు 9,260 వాహనాల్లో లబ్ధిదారులకు ఇళ్లవద్దే రేషన్ అందుతోంది. ఈ మొబైల్ వాహనాలతో ఉపాధి పొందుతున్న ఆపరేటర్లకు నెలకు సుమారు రూ.25 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరచి, కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదుల్లేవు. వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణా లేదు. ఇప్పుడు రేషన్ తీసుకునేవారు 87 శాతం నుంచి 92 శాతానికి పెరిగారు. వాహనం వచ్చినప్పుడు ఇంట్లో సభ్యులు లేకపోతే సాయంత్రం సచివాలయం వద్ద రేషన్ వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎండీయూ వాహనం నుంచి బియ్యం పొందే సౌలభ్యాన్ని కల్పించారు. ఇవన్నీ ‘ఈనాడు’ చెప్పని నిజాలే మరి! తగ్గిన బియ్యం అక్రమ రవాణా.. బాబు హయాంలో రేషన్ బియ్యం తినేవారు చాలా తక్కువ. ముక్కిపోవటం... పురుగులు పట్టడం... రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజలు రంగు మారటం వంటివి అప్పట్లో అత్యంత సహజం. దీనిని కూడా బాబు బినామీలు తమ దళారులతో ప్రజల దగ్గర నుంచి పదీపరకా పెట్టి కొనేసేవారు. అక్రమంగా తరలించి ప్రజాధనాన్ని దోచేసేవారు. కానీ ఇప్పుడిస్తున్న సార్టెక్స్ బియ్యం నిరుపేదల కడుపు నింపుతోంది. అందుకే గతంలో కంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా తగ్గింది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 117.45 లక్షల టన్నులు బియ్యం సరఫరా చేస్తే ఈ మూడేళ్లలోనే జగన్ ప్రభుత్వం 85.27లక్షల టన్నులు పేదలకు ఇచ్చింది. బియ్యం సార్టెక్స్‌కే కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. బాబు ఐదేళ్ల కాలంలో బియ్యం సబ్సిడీపై చేసిన ఖర్చు రూ.12,377 కోట్లయితే జగన్ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున నాణ్యమైన బియ్యమిస్తూ ఈ మూడేళ్లలోనే రూ.12,379 కోట్లు సబ్సిడీకి వెచ్చించింది. పాతాళంలోకి పడిపోయిన బాబును ఎలాగైనా పైకి లాగాలని చూస్తున్న రామోజీకి ఇవేమీ కనిపించట్లేదు! 19 నెలల ఉచిత బియ్యం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏప్రిల్ 2020లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పప్పు ధాన్యాల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల నాన్‌సార్టెక్స్ బియ్యాన్ని అందించింది. అయితే కేంద్రం కేవలం జాతీయ ఆహార భద్రత (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డులకు మాత్రమే దీనిని వర్తింప జేసింది. రాష్ట్రంలో 1.45 కోట్ల కార్డులు ఉంటే.. 88 లక్షల ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు దశల్లో అంటే 25 నెలల పాటు ఈ పథకం కొనసాగగా కేంద్రంతో సమానంగా ఐదు దశల వరకు 19 నెలల పాటు రాష్ట్ర కార్డులకు కూడా ప్రభుత్వం సొంత ఖర్చులతో బియ్యాన్ని అందించింది. ఇందు కోసం అదనంగా దాదాపు రూ.5700 కోట్ల వరకు ఖర్చు చేసింది. దీనికి తోడు పీఎంజీకేఏవై కింద శనగలు, కందిపప్పు పంపిణీకి రూ.1729 కోట్లు ఖర్చు చేసింది. ఆరవ విడతలో ప్రభుత్వం వద్ద సరిపడినన్ని నాన్ సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ఆలస్యమై కేవలం చివరి రెండు నెలలు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే.. ఎంపిక చేసిన జిల్లాల్లో పంపిణీ చేశారు. ఇకనైనా ఈ వాస్తవాలు రాయండి రామోజీరావు గారూ!! -
హైదరాబాద్: హెరిటేజ్ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్‌పై తీసుకొస్తుండగా
సాక్షి, హైదరాబాద్: బ్రేకులు ఫెయిలై అతివేగంగా వచ్చిన హెరిటేజ్ పాల లారీ ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో అన్నా, చెల్లెలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం వనస్థలిపురంలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బి.సురేశ్‌కుమార్ (47), నల్లగొండ పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఎం.విజయలక్ష్మి (43) అన్నాచెల్లెళ్లు. విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమెకు సంబంధించిన ఎల్ఐసీ లోన్ కోసం మంగళవారం నగరానికి వచ్చారు. చెల్లెలిని సురేశ్‌కుమార్ తన బైకుపై నగరంలోని అమీర్‌పేట ఎల్ఐసీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. సురేశ్‌కుమార్, విజయలక్ష్మి (ఫైల్) ఈ క్రమంలో వనస్థలిపురం సుష్మా చౌరస్తాకు రాగానే రెడ్ సిగ్నల్ పడడంతో ఆగారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా బ్రేకులు ఫెయిలైన హెరిటేజ్ పాల లారీ వచ్చి సురేశ్‌కుమార్ బైకును ఢీకొట్టి మరో స్కూటీని ఢీకొని పాన్‌డబ్బా పైకి దూసికెళ్లింది. ఈ ప్రమాదంలో సురేశ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరిలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. స్కూటీపై ఉన్న మరో వ్యక్తి మురళీమోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సురేశ్‌కుమార్ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ షేక్ బాషాను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. చదవండి: మమత భేటీకి టీఆర్ఎస్ దూరం! -
చికుబుకు చికుబుకు రైలు.. కొత్త సమస్య ఎదురయ్యేను చూడూ...
బుల్లెట్ రైళ్ల యుగం వచ్చినా ఇప్పటికీ స్టీమ్ ఇంజన్‌తో నడిచే హెరిటేజ్ రైళ్లకు ఆదరణ తగ్గలేదు. రెగ్యులర్ ప్రయాణికులు తగ్గిపోయినా టూరిజం, సినిమా షూటింగుల పరంగా హెరిటేజ్ రైళ్లకు ఫుల్ గిరాకీ ఉంది. ముఖ్యంగా బ్రిటన్ దేశంలో హెరిటేజ్ రైళ్లు ఇప్పటికీ పట్టాలపై చుక్‌బుక్ చుక్‌బుక్ అంటూ పరుగులు పెడుతున్నాయి. ఈ సర్వీసులకు ఇప్పుడు ఊహించని రీతిలో సమస్యలు వచ్చి పడ్డాయి. మన దగ్గర ప్యాలెస్ ఆన్ వీల్స్ పేరుతో రాజస్థాన్‌లో స్టీమ్ ఇంజన్ రైలు నడుస్తోంది. ఇదే తరహాలో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే అత్యధికంగా హెరిటేజ్ సర్వీసులు బ్రిటన్‌లో నడుస్తున్నాయి. ఈ రైళ్లు నడిచేందుకు ఇంధనంగా బొగ్గును ఉపయోగిస్తారు. రైళ్లలో ఉపయోగించేందుకు అవసరమైన బొగ్గును సౌత్ వేల్స్లో ఉన్న ఫ్రోస్ వై ఫ్రాన్ మైనింగ్ సంస్థ ఉత్పత్తి చేసేది. ఈ మైన్ కాలపరిమితి కంటే ముందుగానే 2022 జనవరిలో ఇక్కడ కార్యకలాపాలు ఆగిపోయాయి. మరోవైపు హెరిటేజ్ రైళ్లకు అవసరమైన బొగ్గులో కొంత మొత్తాన్ని రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి బ్రిటన్ దిగుమతి చేసుకునేది. కాగా ఫ్రిబవరిలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవడంతో అక్కడి నుంచి కూడా దిగుమతి ఆగిపోయింది. దీంతో హెరిటేజ్ రైళ్లకు అవసరమైన బొగ్గు తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు 2022 మే 31 వరకే సరిపోతాయని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగియని పక్షంలో మరో నెల రోజులకు మించి ఈ రైళ్లను నడిపించే పరిస్థితి లేదంటున్నాయి బ్రిటన్‌లోని హెరిటేజ్ రైల్ సర్వీసెస్ అందిస్తున్న కంపెనీలు. బొగ్గు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ ఇంత వరకు ఎక్కడ సానుకూల ఫలితాలు కనిపించడం లేదంటున్నాయి. చదవండి: ఏడాది కాలంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు..ఎందుకంటే! -
మెంబర్షిప్ పేరుతో హెరిటేజ్ మోసం
సాక్షి,పీఎంపాలెం (భీమిలి): హెరిటేజ్ సంస్థ మెంబర్ షిప్‌ల పేరుతో మోసానికి పాల్పడింది. హెరిటేజ్ ఫ్రెష్ పేరున పీఎంపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డులోనూ, 7 వ వార్డు వుడాకాలనీ రోడ్డులోనూ బహుళ అంతస్తుల భవనంలో ఒకేమారు డిపార్టుమెంట్ స్టాల్స్ ప్రారంభించింది. నిత్యావసర సరకులు తోపాటు పండ్లు, కూరగాయలు, గృహోపరణాలు, పూజా సామగ్రి ఈ స్టోర్స్‌లో లభిస్తాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రూ.వెయ్యి చెల్లి మెంబర్ షిప్ కార్డు పొందితే స్టోర్‌లో కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో వందలాది మంది మెంబర్ షిప్ తీసుకున్నారు. అయితే గత నెల 28న రెండూ స్టోర్స్ మూసివేశారు. ఎందుకు మూసివేశారో అక్కడ సమాధానం చెప్పేవాళ్లు లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఫిబ్రవరి చివరి వారంలో కూడా మెంబర్ షిప్ తీసుకున్నారు. ఇలా అకస్మాతుగా స్టోర్స్ మూసివేసి వినియోగదారులను మోసం చేయడం తగదని పలువురు బాధితులు పేర్కొన్నారు. -
పా‘పాల’ పుట్ట హెరిటేజ్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) పేరిట హెరిటేజ్ డెయిరీ పాడి రైతులకు కుచ్చుటోపీ పెడుతోంది. చిత్తూరు జిల్లాలోని 9 హెరిటేజ్ డెయిరీల నుంచి రోజూ 1.41 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణ సమయంలో ల్యాక్టోమీటరుతో వెన్న, కొవ్వు శాతాలను గుర్తించి ధర నిర్ణయిస్తారు. ఎస్ఎన్ఎఫ్ 7.69 శాతం, ఫ్యాట్ 0.75 శాతం ఉన్న పాలకు లీటరు రూ.17.97 మాత్రమే చెల్లిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని చాలా హెరిటేజ్ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తూ రైతులను నిలువు దగా చేస్తున్నారు. కానీ ఇదే ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ శాతం ఉన్న లీటరు పాలకు పక్కనే గొల్లపల్లిలో శివశక్తి డెయిరీలో, రొంపిచర్ల క్రాస్ శ్రీజ డెయిరీలో, మదనపల్లి అమూల్ డెయిరీ పాల కేంద్రంలో రూ.25 నుంచి రూ.27 వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన హెరిటేజ్‌కు మిగిలిన డెయిరీలకు రైతులు చెల్లించే సేకరణ ధరల్లో ఎంత తేడా ఉందో అర్ధం చేసుకోవచ్చు. (చదవండి: రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం జోలికెళ్లం: హైకోర్టు ) వెన్నశాతం పెరిగినా రైతుకిచ్చే ధర తక్కువే హెరిటేజ్ పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ 7.79 శాతం, ఫ్యాట్ 4.19 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.18.09 ఇస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ 8.06 శాతం ఉన్న పాలకు లీటరుకు రూ.23.52 చెల్లిస్తున్నారు. ఫ్యాట్ 3.10 శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ 8.08 శాతం ఉంటే రూ.27.97 చెల్లిస్తున్నారు. కానీ ఇవే శాతం ప్రకారం ఉంటే అమూల్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు లీటరు రూ.33.24 నుంచి రూ.40 వరకు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. రైతులకు దగా.. వినియోగదారులకు వంచన వాస్తవానికి పాలల్లో నిర్దేశించిన మేరకు ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయకూడదు. కానీ హెరిటేజ్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ పాలు తగిన నాణ్యతతో లేకున్నా కొనుగోలు చేసి వాటితో పాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. బాలకృష్ణను పిండేసింది...! చిత్తూరు జిల్లాలో పాడి రైతు బాలకృష్ణకు హెరిటేజ్ చెల్లించిన ధర లీటర్‌కు రూ.17.97. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం బెల్లంవారి పల్లెలోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో ఆయనకు 20 రోజుల పాటు దాదాపు ఇలాగే చెల్లించారు. ఓసారి అయితే రూ.16.65 మాత్రమే ఇచ్చారు. ఆయనొక్కరే కాదు.. భాస్కర్, వి.గంగిరెడ్డి, పసుపులేటి రాణి, హరినాథ్, నాగమ్మ, కిరణ్ తదితర పాడి రైతులందరికీ జనవరిలో ఇదే మాదిరిగా బిల్లులు చెల్లించారు. అక్కడే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని హెరిటేజ్ పాల సేకరణ కేంద్రాల్లో దారుణాలు ఇవీ.. (చదవండి: సానుకూలంగా చర్చలు) -
ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థకు నాంపల్లి కోర్టు మంగళవారం గట్టిషాక్ ఇచ్చింది. గతంలో కన్నబాబు,అంబటి రాంబాబులపై హెరిటేజ్ సంస్థ పరువునష్టం కింద నాంపల్లి కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది.హెరిటేజ్ కేసులో సంస్థ అధికారులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ మేరకు కన్నబాబు, అంబటి రాంబాబులపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది. -
'బావ మాట బంగారు బాట అన్నట్లు బాలకృష్ణ మాట్లాడుతున్నారు'
కాకినాడ రూరల్: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడాన్ని చంద్రబాబునాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకరంగా మారారని చెప్పారు. నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల చులకన భావాన్ని ప్రదర్శిస్తూ.. చెడుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన్ను ఎలాగైనా అణగదొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్రలు చేశారని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. నాడు కుట్ర చేసి ఇరికించారు.. ► ‘సాక్షి’లో కొన్ని సంస్థలు రాజమార్గంలో సుమారు రూ.1200 కోట్లు పెట్టుబడులు పెడితే, ఇదంతా అక్రమమన్నట్టు చిత్రీకరించారు. ఆనాడు కాంగ్రెస్‌తో లోలోన కుమ్మక్కై జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించారు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ వంటి వాటిని ప్రయోగించి రాజకీయంగా పైకి రానివ్వకూడదని అణిచివేతకు లేనిపోనివి సృష్టించారు. అయినా వైఎస్ జగన్ దేనికీ వెన్ను చూపలేదు. ► ఈ నేపథ్యంలో సాక్షిలో పెట్టుబడులన్నీ సక్రమమేనని, ఏవీ దొడ్డి దారిన రాలేదని ఇటీవల ఇన్‌కం ట్యాక్స్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు కంట్లో నుంచి రక్తం కారుతోంది. విపరీతంగా బాధ పడుతున్నాడు. ఆయనకు నిద్ర కరువైంది. చివరికి న్యాయ వ్యవస్థను తప్పు పట్టేలా తయారయ్యాడు. ► 2008లోని ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏమిటో బయటపడ్డాయి. అందుకే కేసులు ఒక్కొక్కటిగా నీరుగారి పోతున్నాయి. లక్ష కోట్ల రూపాయల మేర అవినీతి అని చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు చేసింది. అభియోగం లక్ష కోట్లు కాదని, కేవలం రూ.1,200 కోట్లు మాత్రమేనని అప్పటి దర్యాప్తు అధికారి జేడీ లక్ష్మినారాయణ ఇటీవల చెప్పారు. ఇప్పుడు ఇది కూడా తేలిపోవడంతో బాబుకు నిద్ర రావడం లేదు. ► ఆ నాడు సాక్షిలో పెట్టుబడులపై ముందుగా ఐటీని పంపించారు. ఆ పెట్టుబడులు సక్రమం కాదని దుర్మార్గమైన ఆర్డర్ ఇప్పించారు. దీని వెనక ఎవరు ఉన్నారో మనందరికీ తెలుసు. ఎందుకు సాక్షిని టార్గెట్ చేశారనేదీ అందరికీ తెలుసు. సాక్షిని దెబ్బతీస్తే జగన్ వాయిస్ బయటకు రాకుండా చేయొచ్చని వాళ్ల నమ్మకం. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే హెరిటేజ్ షేర్ ఎందుకు పెరిగింది? ఆయన అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ షేర్లు పరిశీలిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. 2004లో చంద్రబాబు అధికారం నుంచి దిగే నాటికి షేర్ విలువ రూ.13 నుంచి 14 వరకు ఉండేది. 2014లో అధికారంలోకి వచ్చాక రూ.100 వరకు పెరిగింది. దీనికి బాబు ఏమని సమాధానం చెబుతారు? ► చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 ఆయన బలం. అయితే జనబలం ముందు ఆ బలం సరిపోక చతికిలపడ్డారు. ► చంద్రబాబు అవినీతి గురించి అందరికీ తెలుసు. ఏలేరు నుంచి అమరావతి వరకు ఎన్ని స్కామ్‌లు చేశారో కూడా తెలుసు. ఏలేరు స్కామ్‌ను బయటకు తీసింది నేనే (రిపోర్టర్‌గా ఉన్నప్పుడు). ఈ స్కామ్‌పై అప్పట్లో చంద్రబాబును 6 గంటల పాటు విచారిస్తే ఆయన అనుకూల పత్రికలు ఎంతో బాధపడ్డాయి. ► ఉద్యోగులపై చంద్రబాబుకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు. అలాంటి బాబు ఇవాళ పీఆర్సీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగులపై ఎంత గౌరవముందో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ చిట్‌చాట్ బట్టబయలు చేసిన విషయం అందరికీ తెలుసు. ►ఇతర సిమెంట్ కంపెనీలతో పాటే భారతీ సిమెంట్ కూడా బస్తా రూ.230 చొప్పున ప్రభుత్వానికి ఇస్తున్న విషయం బాబుకు తెలియదు కాబోలు. ఇవాళ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలతో రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. చంద్రబాబూ.. మీ మాటలు ఎవరూ నమ్మరు. ఇప్పటికైనా మారండి. చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు) -
అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!
వాషింగ్టన్: మూడు దశాబ్దాల క్రితం అపహరణకు గురైన గిల్గమేశ్ అనే ఇరాక్ పురాణ ఇతిహస కథలకు సంబంధించిన శిలాశాసనాన్ని(టాబ్లెట్) వాషింగ్టన్ వేడుకల సందర్భంగా అమెరికా తిరిగి ఇరాక్‌కి అందజేసింది. ఈ మేరకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ ఆ టాబ్లెట్‌ని స్వీకరించారు. దీంతో ఇరాక్ సమాజం పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించగలిగమంటూ... హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!) చిన్నపరిమాణంలో ఉన్న పురాతన రాతి శాసనం(టాబ్లెట్) అయినప్పటికీ, ఇది అత్యంత విలువైన చారిత్రక కళా సాంస్కృతిక సంపదగా హజీమ్ పేర్కొన్నార. అంతేకాదు అత్యంత పురాతన సాహిత్య రచనలలో ఒకటిగా పరిగణించే గిల్గమేశ్ ఇతిహాసానికి సంబంధించిందని చెప్పారు. ఇది అమరత్వం కోసం తపనతో ఉన్న మొసపటోమియో రాజు కథను వివరిస్తోందన్నారు. అన్నిమతాల సారాంశం ఏకేశ్వరోపాసన(ఒక్కడే దేవుడు అనే సిద్ధాంతం)ని గురించి నొక్కి చెప్పేలా ఉంటుందని యునెస్కో(ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సమితి) డైరెక్టర్ ఆండ్రీ అజౌలే అన్నారు. ఈ ఇతిహసం మానవత్వానికి నిధిగా ఆండ్రీ అజౌలే అభివర్ణించారు. ఈ రాతి శాసనాన్ని(టాబ్లెట్) తన స్వస్థానానికి చేర్చటంతో వారసత్వాన్ని నాశనం చేసే అంతర్జాతీయ సమాజంపై సాధించిన ప్రధాన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇది ఇతిహాసాల సారాంశాన్ని తెలియజేసే శాసనం(టాబ్లెట్) అని యూఎస్ అసిస్టెంట్ అటర్నరీ జనరల్ కెన్నిత్ పోలిట్ అన్నారు. 1991లో గల్ఫ యుద్ధంలో ఈ శాసనం ఇరాక్ మ్యూజియం నుంచి అపహరణకు గురై తిరిగి మళ్లీ బ్రిటన్‌లో కనిపించింది. లండన్‌కి చెందిన జోర్డాన్ కుటుంబం నుంచి అమెరికన్ ఆర్ట్ డీలర్ ఈ టాబ్లెట్‌ని కొనుగోలు చేశాడు. 2007లో దీన్ని తప్పుడు ధృవీకరణ పత్రంతో విక్రయించారు. తదనంతరం మరోసారి 2014లో క్రాఫ్ట్ చైన్ యజమాని హబీ లాబీ, నుంచి వాషింగ్టన్ లోని బైబిల్ మ్యూజియంలో రాయిని ప్రదర్శించాలనుకునే ఫండమెంటలిస్ట్ క్రైస్తవులకు విక్రయించారు. 2017లో ఈ టాబ్లెట్ అసంపూర్ణంగా ఉందని ఆందోళన చెందారు. ఆ తర్వాత 2019లో దీనిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో అపహరణకు గురైన పురాతన కాలంనాటి వారసత్వ సంపదలను వెలికితీయాలంటూ ప్రపంచదేశాలకు ఇరాక్ సాంస్కృతిక శాఖ మంత్రి హసన్ నజీమ్ పిలుపునిచ్చారు. అంతేకాదు అన్ని యూనివర్సిటీలు, మ్యూజియంలు, ఇనిస్టిట్యూట్లు పురాతన వస్తువులు సేకరించే వారు వారసత్వ సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేసేలా అందరూ కృషి చేయాలన్నారు నజీమ్. గత నెలలో చిన్న చిన్న పరిమాణంలోని 17 వేల పురాతన కళాఖండాలు ఇరాక్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముక్కలు ఎక్కువగా దాదాపు 4వేల సంవత్సరాల క్రితంలోని సుమేరియన్ కాలం నాటివి. (చదవండి: పియానో బామ్మ కొత్త ఆల్బమ్.. 107లో సిక్సర్) -
బ్రహ్మంగారి మఠం: వారసుల మధ్య ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా... నూతన పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కుటుంబ సభ్యుల మధ్య గొడవకు దారితీసింది. మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పీఠాధిపతి పదవి తనకే దక్కాలంటున్న పెద్దభార్య కుమారుడు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడికే ఇవ్వాలని వీలునామా రాశారని చిన్న భార్య చెబుతున్నారు. వారసుల మధ్య విబేధాల నేపథ్యంలో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియలో సందిగ్ధత నెలకొంది. చదవండి: చిన్నారులకు ఏపీ సర్కార్ ఆర్థిక సాయం చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ సమయం పెంపు.. -
బ్రహ్మంగారి మఠం వారసత్వంపై కొనసాగుతోన్న వివాదం
-
హెరిటేజ్‌పై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున నుంచి ఈ దాడులు కొనసాగుతన్నాయి. చెన్నై, మధురై సహా ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెరిటేజ్ హోటళ్లపై జరుగుతున్న దాడుల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) (రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత) -
కోటానుకోట్ల లాభాలు.. ఏమిటో ఈ కిటుకు?
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోటానుకోట్ల రూపాయల లాభాల్లో ఉన్న హెరిటేజ్ సంస్థ.. ఇప్పుడు ఎందుకు నష్టాల్లో ఉందని ప్రశ్నించారు. కోఆపరేటివ్ బెయిరీలను సర్వనాశనం చేసి రైతులను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ‘చంద్రబాబు అధికారంలో ఉంటే కోటానుకోట్ల లాభాలు, అధికారం పొతే నష్టాలు. ఏమిటో ఈ హెరిటేజ్ కిటుకు? అవినీతి డబ్బును వైట్ మనీగా మార్చుకోడానికే హెరిటేజ్ పెట్టాడా ? తన స్వార్థం కోసం పాడి రైతుల ఆధ్వర్యంలో నడిచే కోఆపరేటివ్ డైయిరీలను సర్వనాశనం చేసి రైతులను భ్రష్టు పట్టించాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : ఓడి ఇంట్లో కూర్చొని ఇదేం వాదన బాబూ!) ఇక బుధవారం మరో ట్వీట్ చేస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.‘చంద్రబాబు అవినీతి, కమీషన్ల కక్కుర్తి ఏపీకి శాపాలుగా మారాయి.పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించాడు. పోలవరంను ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తు ప్రధానే ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన పాపాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారు’అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు) -
జగమంతా రామమయం
అయోధ్య: శతాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది రామభక్తుల స్వప్నం సాకారమైంది. దేశవ్యాప్తంగా రామ నామం ప్రతిధ్వనించింది. విశ్వవ్యాప్తంగా హిందూ లోగిళ్లలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బాల రాముడి కోసం ఆయన జన్మస్థలిలోనే నవ్య, భవ్య, రమ్య మందిరం ఘనంగా సిద్ధమవుతోంది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. పట్టణమంతా పూల దండలతో ముస్తాబయింది. అలాగే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. పలు చోట్ల ప్రజలు షాపుల్లోని టీవీల ముందు నిల్చుని కార్యక్రమాన్ని చూశారు. దేశంలోని పలు రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. భూమి పూజ అనంతరం ప్రధాని మోదీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘సియా(సీతా)వర్ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. భారత దేశ ఆత్మగా నిలిచిన సకలగుణాభిరాముడి ఔన్నత్యాన్ని ఘనంగా శ్లాఘించారు. రామ నామం ఇప్పుడు దేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తోందన్నారు. రాముడు సర్వ జనుల కొంగు బంగారమని కొనియాడారు. అద్భుత ఆలయంగా శతాబ్దాలు నిలిచే నిర్మాణానికి భూమిపూజ నిర్వహించే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. దశాబ్దాలుగా చిన్న తాత్కాలిక గుడారంలో ఉన్న రామ్‌లల్లా ఇకపై అద్భుతమైన ఆలయంలో కొలువుతీరుతారని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికి స్ఫూర్తిప్రదాయినిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయులందరి హృదయాల్లో రాముడు నిలిచి ఉంటాడన్నారు. సామాజిక సామరస్యం రామరాజ్యంలో ముఖ్యమైన విధానమని తెలిపారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రసంగం ముగించే ముందు సీతారాములను కీర్తిస్తూ ‘జై శ్రీరామ్’ అని నినదించారు. హనుమాన్‌గఢీలో హారతి భూమి పూజ కోసం బుధవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి, ముందుగా హనుమాన్‌గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ స్వయంగా పవన సుతుడికి హారతి ఇచ్చారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడినుంచి వారు నేరుగా రామ్‌లల్లాను దర్శించుకునేందుకు రామజన్మభూమికి వెళ్లారు. రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం, కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భూమిపూజ వేదికకు సాష్టాంగ ప్రణామాలు అర్పించారు. అనంతరం విశిష్ట అతిథుల సమక్షంలో కాసేపు ప్రసంగించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 175 మందికి మాత్రమే ఆహ్వానం పంపించారు. వారిలో పలువురు వృద్ధాప్యం సహా పలు ఇతర కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం.. రామజన్మభూమి ప్రాంతం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేస్తూ గత సంవత్సరం సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రకటించిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 1992లో ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం, తదనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగడం తెలిసిందే. రామ చరితం విశ్వవ్యాప్తం ప్రసంగం ప్రారంభ, ముగింపు సమయాల్లో సీతారాములను కీర్తిస్తూ ‘సియావర్ రామచంద్ర కీ జై’, ‘సీతారామ్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినదించారు. ‘ఈ నినాదాలు ఇక్కడే కాదు.. ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి’ అని అన్నారు. ‘అంతా జానకీ మాతను, శ్రీరామ చంద్రుడిని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ తరువాత నేను ప్రసంగం ప్రారంభిస్తాను’ అన్నారు. అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, రామ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ రామచంద్రుడిని, సీతమ్మ తల్లిని ప్రార్థిస్తున్నా. వారిద్దరి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు. తొలి ప్రధాని మోదీనే.. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. దేశంలో నెలకొని ఉన్న సామాజిక సామరస్యానికి, దేశ ప్రజల అభినివేశానికి ఈ కార్యక్రమం సాక్ష్యంగా నిలుస్తుంది. రామరాజ్య విలువలతో నడిచే ఆధునిక భారతదేశ ప్రతీకగా చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం నిలుస్తుంది. –రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతీయుల 500 ఏళ్ల కలను నేడు ప్రధాని మోదీ సాకారం చేశారు. ప్రధాని మోదీ ముందుచూపు, జ్ఞానము రామ మందిరానికి మార్గం సుగమం చేశాయి. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా, రాజ్యాంగ మార్గాల ద్వారా సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో మోదీ చూపించారు. –యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ సీఎం మానవ విలువలకు అత్యున్నత రూపం రాముడు. ఆయన శాంతమూర్తి. ఆయనలో క్రూరత్వం, ద్వేషం, అన్యాయం లేవు. –రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత రామ మందిర నిర్మాణానికి పునాది పడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆనందాన్ని నింపింది. దేశం స్వతంత్రంగా నిలబడగల ఆత్మవిశ్వాసం దీని ద్వారా వస్తుంది. రామాలయం కోసం రథయాత్ర చేసిన అడ్వాణీ జీ కార్యక్రమంలో హాజరు కాలేకపోయినా, టీవీ ద్వారా చూస్తూ ఉంటారు. – మోహన్ భాగవత్, ఆరెస్సెస్ చీఫ్ కోట్లాది మంది హిందు వుల కల నేడు నిజమైంది. అయోధ్యలో రామాలయ నిర్మా ణం ప్రజా క్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇది దేశాన్ని, ప్రపంచాన్ని నిర్మించడం లాంటిది. ఆలయాన్ని త్వరగా నిర్మి స్తే మన కళ్లతో చూడవచ్చు. ఓ వైపు మోదీ, మరో వైపు యోగి. ఇప్పు డు కాకపోతే ఎప్పుడు నిర్మిస్తారు. –మహంత్ న్రిత్య గోపాల్ దాస్, రామాలయ ట్రస్ట్ చీఫ్ స్వాతంత్య్ర పోరాటం తీరుగానే.. బంగారు రంగు కుర్తా, ధోవతిపై కాషాయ కండువా ధరించి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం దేశ ఐక్యతకు ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆలయంతో ఈ ప్రాంతం ఆర్థి కంగా పుంజుకుంటుందన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వం పునాదులుగా ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ‘దశాబ్దాలుగా చిన్న గుడారంలో ఉన్న రామ్‌లల్లా కోసం అద్భుత ఆలయం రూపుదిద్దుకోనుంది. తన అస్తిత్వాన్ని రూపుమాపేందుకు శతాబ్దాలుగా సాగిన అన్ని ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుని రామ జన్మభూమి స్వేచ్ఛను పొందింది. రాముడి విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ ఆయన మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు. మన సంస్కృతికి మూలం ఆయనే’ అన్నారు. ఇప్పుడు భారత్ అయోధ్యలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. భారత దేశ విశిష్టత భిన్నత్వంలో ఏకత్వమని, ఆ భావనను నిలిపే ఉమ్మడి బంధం రాముడేనని వ్యాఖ్యానించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు జరిపిన పోరాటంతో.. ఆయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించేందుకు శతాబ్దాలు సాగిన పోరాటాన్ని ప్రధాని పోల్చారు. స్వాతంత్య్ర పోరాటంలో దళితులు, గిరిజనులు సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మహాత్మాగాంధీకి మద్దతిచ్చిన విధంగానే.. నేడు ప్రజలంతా దేశంలోని మూలమూలల నుంచి ఇటకలు, మట్టి, పవిత్ర జలంతో రామాలయ నిర్మాణానికి సహకరిస్తున్నారన్నారు. వేలాది మంది సహకారం, కృషి కారణంగానే రామాలయ నిర్మాణానికి పునాది పడిందన్నారు. తమ జీవిత కాలంలో ఈ అద్భుతాన్ని చూస్తామని ఊహించని వారంతా.. ఇప్పుడు తాదాత్మ్యంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించనున్న ఆలయం భారతదేశ సంస్కృతి, విశ్వాసాలకు, జాతీయ భావనకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ తెలిపారు. రాముడు చూపిన మార్గంలో వెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ మార్గం తప్పినప్పుడు విధ్వంసం చోటు చేసుకుంటుందని వివరించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా సహా.. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు రూపాల్లో రామ చరితం ప్రజల్లో నిలిచి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జైపూర్‌లోని రామచంద్రజీ ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న భక్తురాలు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రామ్టెంపుల్ కరమ్‌చంద్ చౌక్ వద్ద బాణసంచా కాలుస్తూ స్థానికుల సంబరాలు అయోధ్యలో హనుమాన్ ఆలయంలో హారతి ఇస్తున్న ప్రధాని మోదీ -
ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై మాట్లాడకుండా కాంగ్రెస్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ పాండు నాయక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూలిపోయే దశలో ఉందని, భవనాల ఫ్లోరింగ్ దారుణంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో మంత్రులు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని ప్రశ్నించారు. ఆసుపత్రి ఆందోళనకర పరిస్థితిలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాల ప్రణాళిక ఉందని హాస్పిటల్ సూపరిండెంట్ చెప్పినా అది ఆచరణ రూపం దాల్చడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం దీనికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. నిజాం కట్టిన భవనాలను కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, అద్భుతమైన సచివాలయాన్ని మూడనమ్మకాల కోసం కూలగొట్టడం దారుణమన్నారు. హెరిటేజ్ భవనాన్ని కూల్చొద్దని, ఉస్మానియా ఆవరణలోనే ఉన్న 6 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. హెరిటేజ్ భవనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. (కరోనాను 'ఆరోగ్య శ్రీ' లో చేర్చాలి : ఉత్తమ్ ) -
హుటాహుటిన..
ఉప్పల్: ఉప్పల్ ఐడీఏలోని హెరిటేజ్ కంపెనీలో బుధవారం వైద్యాధికారుల బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. బుధవారం ‘సాక్షి’దినపత్రికలో ‘హెరిటేజ్‌లో కరోనా కల్లోలం’పేరిట ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉదయం హుటాహుటిన వైద్యాధికారి డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో హెరిటేజ్ ప్లాంట్‌లోని కార్మికులు పనిచేసే పలు డిపార్టుమెంట్లను, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కార్మికులను కలిసి విచారణ చేపట్టారు. దీంతోపాటు లక్ష్మీనారాయణకాలనీలో హోం క్వారంటైన్లో ఉన్న సెక్యూరిటీ గార్డుల గదులను పరిశీలించారు. అంతకుముందు కథనానికి స్పందించిన హెరిటేజ్ యాజమాన్యం కూడా ముందుగానే హోం క్వారంటైన్లో ఉన్న సెక్యూరిటీగార్డులను పరామర్శించారు. -
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?
సాక్షి, కాకినాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పుడు సమాచారాలు సేకరించి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన బుధవారం కాకినాడ రూరల్‌లో కోరమండల్ సహకారంతో పేదలకు బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 24 గంటలు ప్రభుత్వాన్ని నిమగ్నపరిచి పని చేస్తున్నారు. ప్రతిపక్ష నేత మాత్రం హైదరాబాద్‌లో ఉండి ఖాళీ దొరికినప్పుడల్లా లేఖ రాస్తున్నారు. (ఏపీలో ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం) ముందు హెరిటేజ్ కంపెనీలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు ఎందుకు గోప్యంగా ఉంచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆయనకు రాష్ట్ర ప్రజలపై నిజమైన ప్రేముంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టడం లేదు. కరోనాకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? మేమందరం తిరగడం లేదా?. రాజధాని పేరుతో పెద్ద ఎత్తున భూములు సేకరించి చెట్లు, తోటలు నరికించిన దుర్మార్గాన్ని ప్రజలు మరిచిపోలేదు. మిల్లర్లు ఎక్కడైనా ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా వల్ల నష్టపోయిన రైతులను వర్షాలను సాకుగా చూపి దోచుకోవడం మంచి పద్ధతి కాదు’ అని హితవు పలికారు. (ఉప్పల్ హెరిటేజ్: క్వారంటైన్‌కు 34 మంది) -
ఉప్పల్ హెరిటేజ్: క్వారంటైన్‌కు 34 మంది
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కరోనా కలకలంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ఉదయం హెరిటేజ్ మిల్క్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న 34మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు ఉద్యోగులను బెదిరించడంపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరిటేజ్ మిల్క్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. (హెరిటేజ్‌లో కరోనా కల్లోలం) కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, ప్లాంట్‌ను మూసివేయాలంటూ స్థానికులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న యువకుడి (19)కి తండ్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు.. అతనితో సమీపంగా వ్యవహరించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. 34మంది అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి, బెదిరింపులకు పాల్పడిన యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు. (ప్రతి ఏడాది కరోనా పలకరింపులు!) -
హెరిటేజ్‌లో కరోనా కల్లోలం
హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు మరింత మందికి సోకకుండా ప్లాంట్‌ను మూసి వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడి (19)కి తండ్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారని మండిపడ్డారు. అతనితో సమీపంగా వ్యవహరించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంట్లో ఉంచడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► హెరిటేజ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న యువకుడి తండ్రి (53) రామంతాపూర్‌లోని శ్రీరమణపురంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న అతడికి పాజిటివ్ రావడంతో గాంధీ ఐసొలేషన్‌కు తరలించారు. 26వ తేదీన తల్లీ, కుమారుడి(సెక్యూరిటీ గార్డు)కి కూడా పాజిటివ్ అని తేలడంతో వారిని గాంధీ ఐసొలేషన్‌కు తరలించారు. ► సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో పాటు, వీరితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న మరో 27 మందిని కూడా సదరు ప్లాంట్ నిర్వాహకులు లక్ష్మీనారాయణకాలనీలోని ఓ చిన్న ఇంట్లో క్వారంటైన్లో ఉంచారు. తమ కంపెనీ పేరు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. అంతేగాకుండా వీరిని విధులకు రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. (ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్) ► అయితే హోం క్వారంటైన్లో ఉన్న వారు ఇష్టానుసారంగా బయట తిరుగుతుండటంతో లక్ష్మీనారాయణ కాలనీ వాసులు గుర్తించి యాజమాన్యాన్ని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే పాల ఉత్పత్తులను నిలిపివేసి కంపెనీ మూసివేయాలని డిమాండ్ చేశారు. ► కంపెనీ హెచ్ఆర్ బుకాయింపు సమాధానం చెప్పడంతో కాలనీవాసులు ఆందోళనకు దిగారు. తుదకు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, సెక్యూరిటీ గార్డు ద్వారా ఎంత మందికి వైరస్ సోకిందోనని, ప్లాంట్‌లో అందరికీ టెస్ట్‌లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. . (ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్న: హీరో ) -
యునెస్కో గుర్తింపు పొందిన ఫేమస్ మసాజ్
బ్యాంకాక్ : ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంప్రదాయక ‘నువాద్ థాయ్’మసాజ్‌కు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) గురువారం థాయ్ మాసజ్ను వారసత్వ జాబితాలో చేర్చినట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి థాయ్ మసాజ్ మూలాలు భారత్‌లోనే ఉన్నట్టు తెలిసింది. 2500 ఏళ్ల క్రితమే ఈ విధానం థాయ్‌కు వచ్చిందని థాయ్ ప్రజలు అంటున్నారు. -
‘హెరిటేజ్‌లో ధరలన్నీ అధికమే’
సాక్షి, అమరావతి: దేశమంతా ఉల్లి అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా.. మన రాష్ట్రంలో కేజీకి రూ. 25లకే అందిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం రూ.150 నుంచి రూ. 200 వరకు ఉల్లిపాయలను కొనుగోలు చేసి ప్రజలకు కేవలం రూ. 25లకు అందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కార్యాలయం నుంచి ప్రతిరోజు మార్కెటింగ్ శాఖ, ఎస్టేట్ అధికారులతో సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అధిక వర్షాభావం వలన ఉల్లిపాయల ఇబ్బందులు వచ్చాయని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. ఉల్లిని కావాలని స్టాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన గుర్తుచేశారు. హెరిటేజ్‌లో ఉల్లిపాయల ధర రూ.200 ఉందని.. ప్రజలపై ప్రేమ ఉంటే హెరిటేజ్‌లో తక్కువ ధరకు ఉల్లిపాయలు ఎందుకు విక్రయించట్లేదని ప్రశ్నించారు. హెరిటేజ్‌లో నిత్యావసర వస్తువులు అన్నీ అధిక ధరలే.. మందు రేట్లు పెరిగితే మాత్రం చంద్రబాబు, లోకేష్‌కి భాదేస్తోందని ఎమ్మెల్యే ధర్మశ్రీ మండిపడ్డారు. అదే విధంగా హెరిటేజ్‌లో ఉల్లి అమ్మకాల ధరలకు సంబంధించిన ప్లకార్డులను కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుక ఎటుపడితే అటు మళ్లిస్తారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుతో భయపడి పారిపోయింది చంద్రబాబు కాదా అని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు. -
చరిత్రకు వారసత్వం..
‘ప్రత్యేకత’ ఉంటే హెరిటేజ్‌గా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: చార్మినార్, రామప్ప, వేయి స్తంభాల గుడి.. అద్భుత నిర్మాణానికి, కట్టిపడేసే శిల్పకళకు తార్కాణాలు. నాటి నైపుణ్యానికి ప్రతీకలు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇలాంటి కట్టడాలను భావితరాలకు అందించడం మన కర్తవ్యం. దీని కోసమే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), హెరిటేజ్ తెలంగాణ కృషి చేస్తున్నాయి. యునెస్కో గుర్తింపు కోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడం.. ఎర్రమంజిల్ కూల్చివేత నేపథ్యంలో ‘హెరిటేజ్’ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు హెరిటేజ్ అంటే ఏమిటి?.. ఎలా గుర్తిస్తారు?... ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ప్రస్తుతం తెలంగాణలో ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, రామప్ప, వేయిస్తంభాల గుడి ఇందులో ప్రముఖమైనవి. దేశానికి ప్రాధాన్యాన్ని కల్పించే ప్రాంతం/ కట్టడాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తన ఆధీనంలోకి తీసుకుంటుంది. హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 రక్షిత కట్టడాలు ఉన్నాయి. స్థానిక ప్రాంతానికి ప్రత్యేకతదిగా ఉన్న కట్టడం/ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రక్షిత కట్టడాల జాబితాలోకి చేరుతుంది. నాటి హుడా ఆధ్వర్యంలో ఏర్పడ్డ హెరిటేజ్ కమిటీ గుర్తించిన కట్టడాలు 137. ఇటీవల వీటిని రక్షిత కట్టడాల జాబితా నుంచి సవరించారు. ఇవి అటు ఏఎస్ఐ అధీనంలో, ఇటు హెరిటేజ్ తెలంగాణ అధీనంలో లేవు. ప్రస్తుతం 3,693 కేంద్ర ప్రభుత్వ అధీనంలో (బ్రిటిష్ కాలంలో) 1861లో ప్రారంభమైన ఏఎస్ఐ తొలుత ఢిల్లీలోని 20 చారిత్రక కట్టడాలను రక్షిత కట్టడాలుగా గుర్తించింది. స్వాతంత్రం సిద్ధించే నాటికి వీటి సంఖ్య 151కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ జాబితాలో 3,693 ఉన్నాయి. వారసత్వ కట్టడాలంటే.. ఒక మానవ కట్టడం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రాంతం కొన్ని ప్రత్యేక లక్షణాలతో కనీసం వందేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంటే దాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించొచ్చు. చారిత్రకంగా ఆ ప్రాంతానికి ప్రత్యేక లక్షణాలుండాలి. లేదా నిర్మాణ శైలి అసాధారణ విలక్షణతతో కూడుకుని ఉండాలి. ఆ నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండాలి. దాని సౌందర్యం గొప్పగా అనిపించాలి. ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైనదై ఉండాలి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. ప్రకృతి రమణీయతలో విలక్షణం కనపడాలి. అది ఆ ప్రాంత ప్రత్యేకత అని చాటి చెప్పేలా ఉండాలి.... ఇలా ఏదో ఓ అంశాన్ని అది కలిగి ఉంటే దాన్ని వారసత్వ ప్రాంతం కట్టడంగా గుర్తిస్తారు. -
నిన్న విశాఖ.. నేడు హెరిటేజ్
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపింది. కోట్ల రూపాయల డబ్బును వెదజల్లి ఓటర్లను లోబర్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి చంద్రబాబు నాయుడు పోలీసు యంత్రాంగంతో పాటు సొంత సంస్థ హెరిటేజ్‌తో పాటు విశాఖ డైరీని వాడుకుంటున్నారు. తాజాగా విశాఖ జిల్లా మకవరపాలెంలో హెరిటేజ్ పాలవ్యాన్‌లో రూ.3.95లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విశాఖలో పాలవ్యాన్ల ద్వారా డబ్బులు తరలించి జిల్లాలోని ఓటర్లకు పంచేందుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల స్వ్వాడ్ అధికారుల తనిఖీల్లో ఈ సొమ్ము పట్టుపడింది. సొమ్ము తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. ఇటీవలే విశాఖ డెయిరీ వ్యాన్‌లో రూ. 6లక్షలు పట్టుపడిన సంగతి తెలిసిందే. చోడవరం నుంచి చీడికాడ వైపు వెళ్తున్న వ్యాన్లలో తనిఖీలు నిర్వహించి రూ. ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ డెయిరీ, హెరిటేజ్ వ్యాన్లలో సొమ్ము రవాణా జిల్లాలో డబ్బు రవాణా అంతా హెరిటేజ్, విశాఖ డెయిరీ వ్యాన్లలోనే జరుగుతోంది. అనకాపల్లి పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ తమ కుటుంబ సంçస్థగా మారిన విశాఖ డెయిరీ వ్యాన్ల ద్వారా కోట్లాది రూపాయలను మారుమూల పల్లెలకు చేరవేస్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పాలక్యాన్లలో పాలిథిన్ కవర్లలో పెట్టి పైకి పాలు కన్పించేలా చేసి రవాణా చేస్తున్నారని ఓ ఇంటిలిజెన్స్ అధికారి సాక్షి వద్ద వ్యాఖ్యానించారు. హెరిటేజ్ డెయిరీ వ్యాన్లలో కూడా డబ్బుల రవాణా జరుగుతోందని తాజాగా గురువారం పట్టుబడిన డబ్బును బట్టి అర్ధమవుతోంది. మరోవైపు విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ తన విద్యాసంస్థలకు చెందిన బస్సులు, ఇతర వాహనాల ద్వారా పంపిణీ సాగిస్తున్నట్టు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు దాదాపు నాలుగున్నర కోట్ల నగదుతో పాటు పెద్ద ఎత్తున మద్యం తదితర పట్టుబడ్డాయంటే రానున్న వారం రోజుల్లో ఇంకెంత దొరుకుతుందో అంతు చిక్కడం లేదు. పట్టుబడిన మద్యం, డబ్బులో 90 శాతం టీడీపీ నేతలకు చెందినదేనని అధికారులు సైతం ధ్రువీకరించారు. -
చంద్రబాబు కుటుంబం ఆస్తులపై పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆస్తుల వివరాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాతో విచారణ జరిపించాలని ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది రామారావు దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తున్న హెరిటేజ్ గ్రూప్ కంపెనీల ఆదాయాన్ని ఫోరెన్సిక్ అడిట్ చేయించాలని కోరారు. గతంలో మొత్తం 14 కంపెనీలపై ఆర్వోసీ(రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)కి ఫిర్యాదు చేస్తే కేవలం ఐదు కంపెనీలపై మాత్రమే చర్యలు తీసుకున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మిగతా తొమ్మిది కంపెనీలపై కూడా చర్యలు చేపట్టేవిధంగా ఆర్వోసీని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. -
ఆదుకోకపోతే వలసలే గతి
శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో ఆదాయం ఇచ్చే జీడిమామిడి, కొబ్బరి తోటలతోపాటు ఇళ్లు కూడా కూలిపోవడంతో వేలాది కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. ఇళ్లలో ఉన్న బియ్యం, ఉప్పు, పప్పు పనికిరాకుండా పోయాయి. వీరంతా సర్కారు ప్రకటించిన 25 కిలోల బియ్యం, ఉప్పు, పప్పు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఇంతవరకు అందలేదు. సర్కారు ఆదుకోకపోతే వలసపోవడం తప్ప వారికి గత్యంతరం కనిపించడం లేదు. ‘గూడు కూడా లేనప్పుడు ఎక్కడుంటే ఏముంది? కూలి పనులు ఎక్కడ దొరికితే అక్కడకు వెళ్లక తప్పదు’ అంటూ బాధితులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. పెళ్లి ఇళ్లే పునరావాస కేంద్రం కవిటి, మందస, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, పలాస తదితర గ్రామాల్లో బాధితుల బాధలు వర్ణణాతీతం. నాలుగు రోజులు నుంచి తాగునీరు లభించడం లేదు. వేలాది కుటుంబాలు పస్తులతో గడుపుతున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో ఒక వ్యక్తి తన బిడ్డకు నెలన్నర కిందట నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి బట్టలు, భోజనాలకు అవసరమైన సరుకులన్నీ ముందే తెచ్చుకున్నారు. ఆదివారం ఆ కుటుంబంలో పెళ్లి జరగడంతో పిలిచినవారితోపాటు పిలవని వారు కూడా భోజనాలకు వెళ్లారు. దీంతో వండిన వంటలు అయిపోయి మళ్లీ చేయాల్సి వచ్చింది. ఆ పెళ్లిల్లు తుపాను పునరావాస కేంద్రంగా మారిపోయింది. ఆకలితో తుపాను బాధితులు ఎంత అల్లాడిపోతున్నారో తెలియడానికి ఈ సంఘటనే నిదర్శనం. వర్షమొస్తే ఎక్కడుండాలో? ఇళ్లు కూలిపోవడంతో వేలాది మంది చెట్ల కింద, పడిపోయిన ఇళ్ల పక్కన, పాఠశాలల్లో ఉంటున్నారు. ఇక వర్షమొస్తే ఎక్కడ తలదాచుకోవాలోనని భయపడుతున్నారు. తోటల్లోనే చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. అక్కడ ఉండాలంటేనే భయమేస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు త్వరగా సాయం చేయాలని వారు కోరుతున్నారు. ‘మా మట్టి మిద్దె పడిపోయింది. దీంతో మేం కట్టుబట్టలతో మిగిలాం. మార్చుకోవడానికి దుస్తులు కూడా లేవు. సర్కారు ఆదుకోలేదు’ అని వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బైపల్లికి చెందిన పొలాకి బాలమ్మ వాపోయారు. తాగునీటి కోసం బాధితులు రాస్తారోకోలు చేస్తున్నారు. వరద వెలిసిపోయి మూడు రోజులు కావస్తున్నా వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో చాలా గ్రామాల్లో బాధితులకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దాఖలాలే లేవు. దుర్వాసన వస్తున్న హెరిటేజ్ నీటి ప్యాకెట్లు హెరిటేజ్ నీటి ప్యాకెట్లను బాధితులకు ఇచ్చారు. అయితే అవి తాగడానికి పనికిరాకుండా దుర్వాసన వస్తుండటంతో జనం వాటిని పడేశారు. ఇళ్లలోనూ, పొలాల్లోనూ బోర్లు, మోటార్లు ఉన్నప్పటికీ నాలుగు రోజులుగా కరెంటు సరఫరా లేకపోవడంతో నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. నీటి ట్యాంకర్ వస్తుందని చెప్పారని, ఇప్పటివరకు రాలేదని వివిధ గ్రామాల మహిళలు వాపోయారు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందలేదు మా గ్రామానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. రోడ్డుపై పడిపోయిన చెట్లను గ్రామస్తుల సహకారంతో తొలగించాం. పారిశుధ్య పనులు కూడా గ్రామకమిటీనే చేయించింది. 500 గడపలున్న మా గ్రామంలో తోటలు, ఇళ్లు పడిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. – డొంక తిరుపతిరావు, మాజీ సర్పంచ్, పెద్దబైపల్లి, వజ్రపుకొత్తూరు మండలం. -
‘హెరిటేజ్‌పై ఉన్న శ్రద్ద ప్రాజెక్టులపై లేదు’
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం పనుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది వరకు పూర్తి కావడం కష్టమని కాగ్ తేల్చిచెప్పిందని.. అయినప్పటికీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ కాంట్రాక్టర్లకు 22 శాతం అదనంగా ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చి 31కి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిబంధన ఎందుకు పెట్టుకున్నారు. కాగ్ కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించిందన్నారు. థర్డ్ పార్టీతో పోలవరం పనుల క్వాలిటీ ఎందుకు చెక్ చేయించడం లేదని అడిగారు. హెరిటేజ్ పనుల మీద పెట్టిన శ్రద్ద పోలవరం పనుల మీద పెట్టాలని చురకలు అంటించారు. ప్రతీ పథకంలోనూ అవినీతే టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్లలో అడుగడుగునా అవినీతి జరిగిందని అరోపించారు. ఆదరణ పథకం కూడా అవినీతి మయమేనని తెలిపారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు అంగీకరిస్తే పోలవరం, ఆదరణ, అన్న క్యాంటీన్లపై చర్చకు సిద్దమని సవాలు విసిరారు. చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయంలో కుటుంబరావు పాత్ర ఉంటుందన్నారు. గోదావరి పుష్కర మరణాల గురించి సమగ్ర విచారణకు ఆదేశిస్తూ సోమయాజులు కమిషన్‌ను ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కానీ సోమయాజులు రిపోర్టు మీద సంతకం మాత్రమే పెట్టారని, మిగతా స్కిప్టు వేరేవారు రాశారన్నారు. -
రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారు
-
హెరిటేజ్ , మోర్, రత్నదీప్‌లపై కేసులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘిస్తూ జీఎస్టీ పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలు, కొలతలశాఖ కొరడా ఝులిపించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఇప్పటికీ పాత ధరలకే విక్రయిస్తున్న షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లపై తూనికలశాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మొత్తం 16 బృందాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని మణికొండ, మాదాపూర్, హైటెక్‌సిటీ, బాచుపల్లి, కొంపెల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, నాంపల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, బేగంబజార్, కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 125 కేసులు నమోదు చేశారు. ఇందులో రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై 18, హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై 13, మోర్ సూపర్ మార్కెట్‌పై 5, స్పెన్సర్స్‌పై 7, బిగ్‌బజార్‌పై 15, విజేత సూపర్ మార్కెట్, మహావీర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్, భగవతి పెయింట్స్ అండ్ హార్డ్‌వేర్, బిగ్ సీ, హైపర్ మార్కెట్లపై కేసులు నమోదు చేశారు. పెర్ఫ్యూమ్స్, శానిటరీ న్యాప్కిన్స్పై జీఎస్టీ ఉల్లంఘనలకు పాల్పడినందుకు హెరిటేజ్, రత్నదీప్‌లపై కేసులు నమోదు అయ్యాయి. -
లాకౌట్‌కు సిద్ధం !
అనంతపురం అగ్రికల్చర్: పదేళ్ల కిందట పాల విప్లవం సృష్టించిన ప్రభుత్వ డెయిరీ పరిస్థితి ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం, డెయిరీ అధికారుల అలసత్వం పాడి రైతులకు శాపంగా మారాయి. హెరిటేజ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ సంక్షోభంలో కూరుకుపోయింది. పాలక పెద్దలకు పట్టించుకునే తీరిక లేకపోవడంతో ఇదే అదనుగా డెయిరీలో పనిచేస్తున్న అధికారులకు ఇష్టారాజ్యమైంది. ఫలితంగా పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుని పాడి రైతులకు సేవలందించలేక మూతబడేందుకు సిద్ధమైంది. పదేళ్ల కిందటే 70 వేల లీటర్లు పదేళ్లు వెనక్కి తిరిగి చూస్తే 2006–2012 వరకు రోజుకు 20 వేల మందికి పైగా రైతుల నుంచి 70 నుంచి 80 వేల లీటర్లు పాలు సేకరిస్తూ క్షీరవిప్లవం సృష్టించిన ఏపీ డెయిరీ ఇప్పుడు చతికిలపడిపోయింది. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయితీలు, సబ్సిడీలతో ఇచ్చిన ప్రోత్సాహంలో జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ అభివృద్ధి బాటలో దూసుకుపోయింది. 30 బీఎంసీలు మూత జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 50 వేల లీటర్లు చొప్పున అనంతపురం, హిందూపురంలో లక్ష లీటర్లు సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 2006–12 మధ్యకాలంలో 42 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు (బీఎంసీ) పనిచేస్తుండగా వాటి పరిధిలో 74 పాలరూట్లు, 540 వరకు పాల సేకరణ సెంటర్లు పనిచేస్తూ రోజుకు ఎంతలేదన్నా 70 వేల లీటర్లు పాల సేకరిస్తూ... వాటిని జిల్లాతో పాటు హైరదాబాద్‌కు రవాణా చేసి లాభాలబాటలో పయనించింది. కానీ... ఇపుడు 30 బీఎంసీలు మూతబడ్డాయి. కేవలం 30 పాలరూట్ల పరిధిలో 230 పాల సేకరణ సెంటర్లు మిణుకు మిణుకు మంటూ పనిచేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు కేవలం 5 వేల నుంచి 5,500 లీటర్లు పాల సేకరిస్తున్నారు. రైతులు తక్కువైనా వారికి కూడా నెలల తరబడి బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీ రైతులను బట్టులో వేసుకుంటూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. డెయిరీపై అవినీతి ముద్ర డెయిరీలో పనిచేస్తున్న డీడీతో పాటు ఇతర అధికారులు, మేనేజర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిలో చాలా మంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాల సేకరణ, స్థానిక అమ్మకాలు, ఇతర రాష్ట్రాలకు అమ్మకం, చెల్లింపులు, నిర్వహణ విషయాల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోవడం, అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, ఆ శాఖ కమిషనరేట్ అధికారులు సహకరించకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న డీడీల్లో ఇటీవల కాలంలో నాగేశ్వర్రావు, వై.శ్రీనివాసులు అనే ఇరువురు అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మూడు నెలల్లో డెయిరీని అభివృద్ధి బాటలో పట్టిస్తానంటూ గొప్పలు చెప్పిన డీడీ ఎం.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టి 9 నెలలైనా చేసిందేమీ లేదన్న విమర్శలు వ్యక్తమతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతుల బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డెయిరీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో డెయిరీ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ప్రైవేట్ డెయిరీల్లో లీటర్‌పై ఐదు నుంచి ఆరు రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఏపీ డెయిరీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, ఆ శాఖ కమిషనరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. – బుల్లే ఆదినారాయణ, పాల ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
‘చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం లేవు’
సాక్షి, విజయవాడ : అధికారం కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఏపీ చంద్రబాబుకే అలవాటేనని, ఎందుకంటే 46 ఉప ఎన్నికలకు సింగిల్‌గా వెళ్లి చిత్తుగా ఓడిపోయారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాంబు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, కానీ ఇప్పుడు అవే పార్టీలు చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. ‘కొత్త పొత్తుల కోసం ప్రస్తుతం చంద్రబాబు వెంపర్లాడుడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా ఏదో ఓ పార్టీతో పొత్తుతోనే విజయాలు సాధిస్తోంది. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు. అందుకే 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. 2009లో వామపక్షాలు, టీఆర్ఎస్తో, తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జత కట్టడం నిజం కాదా. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడం చంద్రబాబుకు అలవాటే. దేశంలో ఏ పార్టీతోనూ చంద్రబాబు నిజాయితీగా పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో కలిసే ఏ పార్టీ అయినా మసి అవ్వాల్సిందే. చంద్రబాబు తన అవినీతి మకిలిని పొత్తు పెట్టుకున్న పార్టీకి, నేతలకు అంటిస్తారు. చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ఆయనతో ఎవరూ కలవరు. జూన్ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. తన ప్రసంగాలతో ప్రజలకు సుత్తి కొట్టడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారింది. నవ నిర్మాణ దీక్ష ఎందుకు? అసలు రాజధానిలో ఏం నిర్మించారు. మీరు సాధించిన అభివృద్ధి ఏంటి. ప్రజలను మభ్య పెట్టడానికే మీ నవ నిర్మాణ దీక్షలు. చంద్రబాబు నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో అబద్దాలపై అబద్దాలు చెప్పడం మాత్రమే అలవాటు అయిందంటూ’ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అన్నీ అమ్ముకున్నారు ఇసుక, మట్టి, రాజధాని భూములను అమ్ముకున్నారు. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ కలిసి చౌక ధర దుకాణాలకు సరుకులు అందిస్తాయని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో వాటాలు కలిగి వుంది. ఇంకా పాలన చేయడానికి చంద్రబాబుకు ఏడాది సమయం ఉంది. కనీసం ఇప్పుడయినా ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తే మంచిది. కులం పేరుతో అందరినీ విభజిస్తున్నారు. చివరకు దేవుడికి కూడా కులం ఆపాదిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
91 శాతం తగ్గిన హెరిటేజ్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికం స్టాండెలోన్ ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ నిరాశపరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 91 శాతం తగ్గి రూ.20 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.737 కోట్ల నుంచి రూ.607 కోట్లకు వచ్చి చేరింది. 2017–18లో నికరలాభం రూ.275 కోట్ల నుంచి రూ.60 కోట్లకు తగ్గిపోయింది. టర్నోవరు రూ.2,122 కోట్ల నుంచి రూ.2,746 కోట్లను వృద్ధి చెందింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. -
హెరిటేజ్ సమర్పించు.. భూ దందా
-
హెరిటేజ్ సమర్పించు.. ఆ 14 ఎకరాలు
సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్నీతిని అమలుచేశారు. రాజ ధాని ఎంపికలో రాజధర్మం మంటగలిపారు. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే రాజధానిగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గోప్యంగా ఉంచారు. తన కుటుంబ సంస్థలు, సన్నిహితులు, బినామీలు వేల ఎకరాల భూములను ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేలా చేసి లక్షల కోట్లు దోపిడీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ బాగోతంలో చంద్రబాబు కుటుంబ ప్రమేయాన్నీ నిజం చేస్తూ హెరిటేజ్ కోసం కూడా ఆనాడే 14.22 ఎకరాలను తాను ముందే అనుకున్న రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారు. తర్వాత అదే ప్రాంతంలో రాజధానిని ప్రకటించారు. అంతేకాక, ఈ ప్రాంతాన్ని ల్యాండ్‌పూలింగ్ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును కూడా హెరిటేజ్ భూముల ముందు నుంచి వెళ్లేలా ‘మాస్టర్‌ప్లాన్’ రూపొందించినట్లు ‘సాక్షి’ తాజా పరిశోధనలో వెలుగుచూసింది. రాజధానిపై తప్పుదోవ పట్టించి మరీ.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గుంటూరు జిల్లా తాడికొండ, మంగ ళగిరి నియోజకవర్గాల పరిధిలో రాజధానిని ఎంపిక చేయాలని నిర్ణయించి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు తెరతీశారు. అందులో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతంపై ఇతర ప్రాంతాల పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంటి పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయనున్నారని ప్రచారంలోకి తెచ్చారు. దాంతో రాష్ట్రంలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు ఆ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత సీన్ పూర్తిగా మార్చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు వ్యవహారం పూర్తయిన తరువాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు 2014, డిసెంబర్ 28న ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.5లక్షలు ఉన్న భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరా మార్కెట్ ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. తద్వారా చంద్రబాబు, ఆయన బినామీలు, సన్నిహితులు వేలకోట్లు కొల్లగొట్టారు. పూలింగ్ నుంచి మినహాయింపు రాజధాని కోసం ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ చేపడుతున్నట్లు 2015, జనవరి 1న నోటిఫికేషన్ జారీచేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని మొత్తం 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ పరిధిలో చేర్చారు. కానీ, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్, ఆయన సన్నిహితుడైన లింగమనేని సంస్థకు చెందిన భూములు ఉన్న తాడికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్ ప్రక్రియలో చేర్చనే లేదు. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వరకు ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారు. కానీ, నిడమర్రును ఆనుకునే ఉన్న కంతేరు ల్యాండ్ పూలింగ్‌లో లేకపోవడం గమనార్హం. చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పుడ్స్ కొనుగోలు చేసిన భూములతోపాటు, ఆయన సన్నిహిత సంస్థ లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన వందలాది ఎకరాలు కంతేరులోనే ఉన్నాయి. అమాంతం ధరలు పెరిగిన ఆ భూములన్నీ హెరిటేజ్, లింగమనేని ఎస్టేట్ గుప్పిట్లోనే ఉండేట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ అవినీతి బంధం డృఢమైంది.. లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ లింగమనేని రమేష్, ఆయన సోదరుడు వెంకట సూర్య రాజశేఖర్‌లు సీఎంకు అత్యంత సన్నిహితుడు, బినామీలే అన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా తీరంలో లింగమనేని ఎస్టేట్స్ అక్రమంగా నిర్మించిన భవనాన్నే సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలను లింగమనేని సంస్థ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే.. రాజధాని కోసం సామాన్య రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోగా.. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం తన బినామీలు, సన్నిహితుల భూముల ధరలు అమాంతంగా పెరిగేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడటం గమనార్హం. ఇన్నర్ రింగ్‌రోడ్డూ మెలికలు తిరిగింది.. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 250 అడుగుల వెడల్పుతో అమరావతి చూట్టూ ఇన్నర్‌రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ఇన్నర్‌రింగ్ రోడ్డు కచ్చితంగా హెరిటేజ్ సంస్థ భూముల ముందు నుంచే వెళ్తుండటం గమనార్హం. కంతేరులో సర్వే నంబర్ 27/3ఎ ముందు నుంచే వెళ్తోంది. అదే విధంగా హెరిటేజ్, లింగమనేని సంస్థల భూములన్నీ కూడా ఇన్నర్‌రింగ్‌కు రెండువైపులా ఉన్నాయి. అంతేగాక.. ఆ ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం భూసేకరణ పరిధిలో చేరకపోవడం గమనార్హం. ఈ రెండు సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకే ఇన్నర్‌రింగ్ రోడ్డు మ్యాప్ రూపొందించారన్నది స్పష్టమవుతోంది. సీఎం అయిన నెల రోజులకే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014, జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. అధికారిక రహస్యాలను కాపాడతానని కూడా ఆ ప్రమాణ స్వీకారంలో చెప్పారు. కానీ, అధికారిక రహస్యాలను తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారు. రాజధాని ప్రాంత ఎంపిక వ్యవహారాన్ని తమ అక్రమ సంపాదనకు సాధనంగా చేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే ఈ అవినీతి వ్యూహానికి తెరతీశారు. అదెలాగంటే.. ♦ 2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ఆ 7.21 ఎకరాలను రూ.67.68లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ కూడా విజయవాడకు చెందిన మొవ్వా శ్రీలక్ష్మి అనే ఆమె నుంచి కొన్నారు. ఆ భూములను కూడా మొవ్వా శ్రీలక్ష్మీ గతంలో జీపీఏ ద్వారానే పొందడం గమనార్హం. ♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరు గ్రామంలోనే మరోసారి భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/2బిలలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూములను విజయవాడకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్ అనే వ్యక్తి అంతకుముందు కొంతకాలం క్రితమే జీపీఏ ద్వారా పొందారు. ఆయన ఆ భూములనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు విక్రయించారు. ♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరులోనే మరికొన్ని భూములను కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/1, 63/2బి లలో ఉన్న 4.55 ఎకరాలను కొన్నారు. ఆ 4.55 ఎకరాలను రూ.36.40లక్షలకు లింగమనేని ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల నుంచి కొనుగోలు చేయడం గమనార్హం. ఇలా.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మొత్తం 14.22 ఎకరాలను రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. ఆ భూములన్నీ గుంటూరు జిల్లా తాడికొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూములను పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. -
ట్యాంకర్ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద ఓ పాల ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకటేశ్వర రావు(40) గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్లో పాలు నిండుగా ఉండటంతో పాలన్నీ వృధాగా పోయాయి. సుమారు పదిహేను వేల లీటర్ల పాలు వృధాగా పోయి ఉంటాయని అంచనా. బోల్తా పడిన ట్యాంకర్ గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి ట్రేడర్స్‌కు చెందిన పాల ట్యాంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి నుంచి హైదరాబాద్‌లోని హెరిటేజ్ సంస్థకు పాలను తెస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. -
సిటీకి హెరిటేజ్ ఆటోలు!
హైదరాబాద్ వారసత్వ సంపదను కళ్లకుకట్టేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) హోప్ ఆన్.. హోప్ ఆఫ్ సర్వీస్ బస్సులను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే తరహాలో ‘హెరిటేజ్ ఆన్ ఆటోస్’ పేరుతో బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రవేశ పెట్టనుంది. ఈ నెల 15వ తేదీ తర్వాత ఇవి సిటీలో చక్కర్లు కొట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆటోలను ఢిల్లీకి చెందిన స్మార్ట్ సంస్థ అందిస్తోంది. మ్యూజియంనుంచి ప్రారంభం.. నగర చరిత్రను చాటే సాలార్జంగ్ మ్యూజియం అందరూ సందర్శించే ప్రదేశం. ఈ ఆటో టూర్ ఇక్కడి నుంచే ప్రారభమవుతుంది. నిజాం అధికారక నివాసం పురానీ హవేలీ. అసఫ్ జాహీ వంశస్తుడైన సికందర్ జా నివాసం కోసం దీన్ని నిర్మించారు. ‘యు’ ఆకారంలో ఉన్న ఈ రాజసౌధంలో ప్రస్తుతం పలు విద్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఒక భాగాన్ని మ్యూజియంగా మార్చారు. ఏడో నిజాం సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భంగా అతిథులు అందించిన బహుమతులు, ఆ వేడుకల్లో నిజాం ఆశీనుడైన సింహాసనంతో సహా అనేక వెండి, బంగారు వస్తువులతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిజాం ‘వార్డ్రోబ్’, మ్యాన్యువల్ లిఫ్ట్‌ను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. వీటిని చూసేందుకు ఆటోలు ఇక్కడ ఆగుతాయి. చార్మినార్..మక్కా మసీదు.. పురానీహవేలీ నుంచి నిజాం మంత్రుల నివాసం ‘దివాన్ దేవిడీ’కి ఆటోలో ప్రయాణం చేయోచ్చు. చార్మినార్, మక్కా మసీద్, యునానీ ఆస్పత్రుల మీదుగా చౌమహల్లా ప్యాలెస్‌కు బయలుదేరతాయి. చార్మినార్ వద్దకు పెద్ద వాహనాలు ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఈ స్మార్ట్ ఆటోలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. రాయల్ ట్రీట్..హైదరాబాదీ టేస్ట్ చౌమహల్లా ప్యాలెస్‌లో నిజాం ధరించిన దుస్తులు.. వింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణ. ఏస్ బైక్ హార్లీ డేవిడ్సన్ సిరీస్‌లో తొలితరం బైక్‌ని ఇక్కడ చూడవచ్చు. అడుగడుగునా రాజసం ఉంట్టిపడే ప్యాలెస్ నాలుగు మహళ్ల సముదాయం. అఫ్జల్ మహల్, మహతబ్, తహ్నియత్, అఫ్తబ్ మహల్. నిజాం అతిథులకు విందు ఈ మహల్లోనే ఇచ్చేవారు. ప్రస్తుతం సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు వేదికగా ఉంది. స్మార్ట్ ఆటోలు.. టీఎస్‌టీడీసీ ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్’ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తొలుత 20 స్మార్ట్ ఆటోలను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. అన్ని హేరిటేజ్ ప్రాంతాల ఎంట్రీ టికెట్ కలిపి ఒక్కొక్కరు రూ.200 చెల్లించాలి. సాలార్జంగ్ మ్యూజియం నుంచి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆరు, ఏడు వారసత్వ ప్రాంతాలను ఈ టూర్లో చుట్టిరావచ్చు. సాలార్జంగ్ మ్యూజియం వద్ద ప్రతి పది నిమిషాలకు ఓ ఆటో బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆటోల్లోనే ఆయా ప్రాంతాల విశిష్టతను తెలియజేసే బోర్డులు సైతం ఏర్పాటు చేస్తారు. డ్రైవర్లకు గైడ్ల తరహా శిక్షణ ఇస్తారు. అసౌకర్యాలపై ఫిర్యాదు చేయండి టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నడిచే టూర్స్, హరిత హోటల్స్, బుకింగ్ రిజర్వేషన్ సెంటర్లు, సెంట్రల్ రిజర్వేషన్స్ సెంటర్లలో టూరిస్టులకు ఏ విషయంలోనైనా అసౌకర్యం కలిగితే 180042546464(టోల్ ఫ్రీ), 92460 10011 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు. -
కోల్గేట్ కేవలం రూ.76 లకు (ADVT)
-
అమూల్ బటర్ కేవలం రూ.41లకే.. (ADVT)
-
ఆశీర్వాద్ ఆటా కేవలం రూ.207 లకే.. (ADVT)
-
మెంబర్ షిప్ తీసుకోండి, పెద్ద బ్రాండ్స్ పైన ఎక్స్ట్రా 10% తగ్గింపు (ADVT)
-
ఊడ్చేవారిని రోడ్డుకీడ్చుతున్నారు..
బొబ్బిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న నిరుపేద మహిళ పేరు జలగడుగుల మంగమ్మ. ఈమె పారిశుద్ధ్య కార్మికుడు గోపాలం కుమార్తె. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులెవరయినా వారి కుటుంబాల్లోని వారంతా పనులకు వెళతారు. అలానే ఈమె తన భర్త చనిపోవడంతో తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవించేది. గోపాలం చేయాల్సిన పారిశుద్ధ్యపనులన్నీ చేసేది. ఏళ్లపాటు చేశాక ఇటీవల గోపాలం చనిపోయాడు. వాస్తవానికి వారసత్వంగా అతనిపై ఆధారపడిన కుమార్తెకు పారిశుద్ధ్య కార్మికురాలిగా కౌన్సిల్ అనుమతించలేదని తనను పక్కన పెట్టేశారు. ఇప్పుడీమె బతుకు భారమైంది. మున్సిపాలిటీలో ఈమె ఒక్కతే కాదు విజయమ్మ అనే మరో పారిశుద్ధ్య కార్మికురాలు కూడా చనిపోతే ఆమె కుటుంబ సభ్యులకు ఉద్యోగమివ్వలేదు. వేరే వారికి కట్టబెట్టారు. దీంతో ఆయా కార్మికులంతా తీవ్ర మనోవేదనతో తమ కుటుంబాలను ఈడ్చలేక దీనావస్థలో ఉన్నారు. అంగన్వాడీ, సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకుంటున్నారన్న ఖ్యాతి దక్కించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు చివరకు పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను పూర్తిగా కల్పించని యంత్రాంగం చివరకు వారి పోస్టులను కూడా అందనీయకుండా చేస్తోంది. పట్టణంలోని 30 వార్డులుండగా 95 మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించడం లేదు. చేస్తున్న పనులు పారిశుద్ధ్యం కనుక ఖచ్చితంగా బజ్బులు సోకుతున్నాయనీ, వాటిని బాగు చేయించుకోలేక మంచం పట్టి ఇలా చనిపోయిన కుటుంబాలు వీధిన పడాల్సిందేనా అని వారు వాపోతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రమోషన్లు.. పట్టణంలో ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు తక్కువ మంది ఉన్నారు. అయితే వారిలో ఎవరైతే తమకు అనుకూలంగా, అనుసరులుగా ఉండి అందుబాటులో ఉంటారో వారికి సూపర్ వైజర్లుగా ప్రమోషన్లు కల్పించారనీ అందువల్లనే కార్మికుల సంఖ్య తగ్గిందనీ కార్మిక నాయకులు బ హిరంగంగా చెబుతున్నారు. కార్మికులుగా పనిచేయిస్తూ అర్హత మేరకు సూపర్ వైజర్లుగా నియమించుకునే అవకాశం ఉన్నా అలా చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. రూ.50వేల చొప్పున అమ్ముకున్నారు కాంట్రాక్టు కార్మికులయితే గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇవ్వడం లేదు కనుక పోస్టును కుటుంబంపై ఆధారపడిన వారికి ఇవ్వాలి. కానీ అమ్ముకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పర్యవేక్షించే వారిని రిటైర్ అయినా వేల రూపాయల వేతనంతో తిరిగి నియమించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుడి పోస్టును టీడీపీ నాయకులు రూ.50వేలకు అమ్ముకున్నారు. అర్హులయిన వారిని వీధిన పడేశారు. నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారు.-పి శంకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సంఘం కాంట్రాక్టు పోస్టులకు ఇచ్చే అవకాశం లేదు పర్మినెంటు కార్మికుల కుటుంబాలకే వారసత్వ ఉద్యోగ అవకాశం ఉంది. కాంట్రాక్టు కార్మికులకు లేదు. గతంలో గోపాలం రిటైర్ అయిపోయాడు. ఆయన కుటుంబానికి పెన్షన్ వస్తుంది. ఆయన కుమారుడు కూడా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబంలో అన్ని ఉద్యోగాలూ ఇచ్చే జీఓ లేదు కదా? అందుకనే గోపాలం కుమార్తెకు పోస్టు ఇవ్వలేదు. -హనుమంతు శంకరరావు, కమిషనర్, బొబ్బిలి మున్సిపాలిటీ -
హెరిటేజ్‌లో అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీలోని హెరిటేజ్ సూపర్మార్కెట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే భారీ ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్‌తో పవర్రూమ్లో మంటలు చెలరేగాయి. సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. -
తగ్గిన హెరిటేజ్ లాభం
తొలి త్రైమాసికంలో 53 శాతం డౌన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నికరలాభం 2017–18 తొలి త్రైమాసికంలో 53 శాతం తగ్గింది. గతేడాది ఇదే కాలంతో ఆర్జించిన స్టాండలోన్ నికరలాభం రూ.16.4 కోట్లతో పోలిస్తే... ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్– జూన్) కేవలం రూ.7.64 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 32 శాతం వృద్ధి చెంది రూ.610.74 కోట్ల వద్ద నిలిచింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒకో ఈక్విటీ షేరును రూ.5 ముఖ విలువ కలిగిన రెండు షేర్లుగా విభజించేందుకు (స్ప్లిట్) బోర్డు ఆమోదించింది. హెరిటేజ్ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన నొవాన్డీ ఎస్ఎన్సీతో కలసి 50:50 జాయింట్ వెంచర్‌గా రూ.16 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఫ్లేవర్డ్ యుగార్ట్, వెస్ట్రన్ డిస్సెర్ట్స్ను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనుంది. -
ఎర్రచందనం దుంగలు.. ‘హెరిటేజ్’ దొంగలు
టాస్క్‌ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి - గాల్లోకి కాల్పులు.. స్మగ్లర్లు పరార్..71 దుంగలు స్వాధీనం - ఇది టీడీపీ నేతల పనేనని అనుమానాలు - స్మగ్లర్ల జాబితాలో పలువురు అధికార పక్ష నేతలు సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: హెరిటేజ్ పాల వ్యాన్‌లో తరలివెళ్తున్న ఎర్రచందనం దుంగలు మంగళవారం చిత్తూరు జిల్లాలో పోలీసులకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ వాహనంలో ఎర్రచందనం కనిపించగానే పోలీసులు విస్మయానికి గురయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ఆయన కంపెనీకి చెందిన వాహనంలో దుంగలను తరలిస్తున్నారంటే స్మగ్లర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు ఎంతగా బరితెగించారో ఇట్టే అర్థమైపోతోంది. పోలీసులపై రాళ్లు రువ్వి.. దాడులకు తెగబడ్డారంటే అషామాషీ వ్యవహారం కాదని, అధికారం అండ చూసుకునే ఇంతగా చెలరేగిపోయారని స్పష్టమవుతోంది. గతంలోనూ ఇదే రీతిలో పలు ఘటనలు చోటుచేసుకున్నా, పాలకులకు జడిసి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే టీడీపీ నేతలు పేట్రేగిపోయారని బట్టబయలైంది. ముఖ్యనేత అండ ఉంటే తప్ప ఈ రీతిలో స్మగ్గింగ్కు సాహసించరని అటవీ, పోలీసు శాఖలకు చెందిన పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లె వద్ద భారీ ఎర్రచందనం డంప్ బయట పడటం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలు ప్రత్యక్షంగా పట్టుపడటం.. తదితర ఘటనలు వరుసగా చోటుచేసుకున్నా కంటితుడుపు చర్యలు మినహా అసలు నిందితులను ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఏమార్చి ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటించడానికి సులువైన మార్గంగా హెరిటేజ్ వాహనాలను ఉపయోగించుకుంటున్నారని తేటతెల్లమైంది. ఇది ఎర్ర స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ టాస్క్ఫోర్సు ఐజీ కాంతారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరిస్తూ ఇది కొత్త ఎత్తుగడగా పేర్కొన్నారు. ‘మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విజయ నరసింహ బృందం కూంబింగ్ ముగించుకుని తిరుగు ముఖం పట్టింది. అదే సమయంలో వీరికి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కచ్చితమైన సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు అటుగా అడుగులు వేశారు. తిరుపతి బీడీకాలనీ మీదుగా మొండోడికోన అడవుల్లోకి ప్రవేశించగానే సుమారు వంద మందికి పైగా ఎర్ర చందనం దొంగలు భుజాలపై దుంగలతో ఎదురు పడ్డారు. అకస్మాత్తుగా పోలీసులు ఎదురు పడటంతో ఏం చేయాలో తోచని స్మగ్లర్లు కొండరాళ్లతో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భీతిల్లిపోయిన స్మగ్లర్లు దుంగలను కింద పడేసి అడవిలోకి పరారయ్యారు. అరగంట తర్వాత సంఘటనా స్థలిలో పోలీసులు 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఓ నాటు తుపాకీ కూడా లభ్యమైంది. అక్కడికి కొద్ది దూరంలో ఆగి ఉన్న హెరిటేజ్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌లో ఉన్న మరో 8 దుంగలను, వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. సుమారు రెండున్నర టన్నుల బరువున్న ఎర్రచందనం విలువ రూ.80 లక్షలకు పైనే ఉంటుంద’ని ఆయన వివరించారు. పట్టుబడిన వాహనంపై టీఎన్ 18ఎం8996 నంబరు ఉంది. దానిపై పెయింట్ వేసి, స్మగ్లర్లు.. ఏపీ 26 టీసీ4187 నంబరు రాశారు. ఈ వాహనం నెల్లూరుకు చెందిన ఒర్సాల ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయినట్లు ఆర్టీఓ వెబ్సైట్ తెలియజేస్తోంది. దీనిని అతను ఏడు నెలల క్రితం కలికిరికి చెందిన మహేశ్ అనే వ్యక్తికి అమ్మాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాధానం లేని ప్రశ్నలెన్నో.. ► సీఎం సొంత జిల్లాలో ఆయన అండ లేకుండా ఆయన కంపెనీ వాహనాన్ని ఎవరు ఉపయోగిస్తారు? ► హెరిటేజ్ వాహనంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? ► వంద మంది దాడికొస్తే పోలీసులు ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారా? ► గతంలో నారావారి పల్లె వద్ద డంప్ దొరికింది నిజం కాదా? అందులో టీడీపీ నేతల ప్రమేయం లేదా? ► గతంలోనూ దుంగలను తరలిస్తూ హెరిటేజ్ వాహనం పట్టుపడలేదా? ► ఎర్రచందనం స్మగ్లర్లతో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం నిజం కాదా? ► ఎర్ర స్మగ్లర్లకు సీఎంతో సంబంధాలున్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా? ► పట్టుబడిన టీడీపీ నేతలపై ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? -
రోడ్లు హెరిటేజ్ డబ్బులతో వేశారా?
విజయవాడ: వెయ్యి రూపాయల ప్రజల సొమ్ముతో పింఛన్ ఇస్తూ టీడీపీ ఓటేయమంటున్న చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నీతులు చెప్పేవారు ముందు నీతిగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తేనే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి అయ్యి కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. అన్ని ప్రయోజనాలు పొందిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఎంత కృతజ్ఞతతో ఉండాలి? అంటూ ప్రశ్నించారు. వెయ్యి రూపాయలు ప్రభుత్వ డబ్బులతో పింఛన్ ఇస్తూ టీడీపీకి ఓటు వేయమంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం? చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. బాబు తన మాటల పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లు ఏమైనా హెరిటేజ్ డబ్బులతో వేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీ, గిరిజనుల హక్కులను చంద్రబాబు కాల రాస్తున్నారని, మంత్రి వర్గంలో వారికి స్థానం కల్పించకపోవడం అన్యాయమని రఘువీరరెడ్డి అన్నారు. -
చంద్రబాబు, దేవాన్ష్ తాగేది ఆ పాలే
-
చంద్రబాబు, దేవాన్ష్ తాగేది ఆ పాలే
- హెరిటేజ్ పాలలో కల్తీకి తావులేదు: బ్రాహ్మణి - తమిళనాడు మంత్రి సంచలన ఆరోపణలకు కౌంటర్ చెన్నై: ప్రైవేట్ డైరీలను ఉద్దేశించి తమిళనాడు పాలు మరియు డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన సంచలన ఆరోపణలపై హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పందించారు. హెరిటేజ్ పాలలో కల్తీకి తావులేదని, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నందునే తమ సంస్థ పాతికేళ్లుగా మనగలుగుతోందని ఆమె చెప్పారు. చెన్నైలో గురువారం జరిగిన కార్యక్రమంలో "హెరిటేజ్ పెట్ బాటిల్" ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదలచేసిన బ్రాహ్మణి.. మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పాల సేకరణ కోసం తుప్పుపట్టని క్యాన్లను వాడుతున్నామని, సేకరించిన పాలను 150 సెంటర్లలో ప్రాసెసింగ్ చేస్తున్నామని, హెరిటేజ్ పాలలో కల్తీకి తావే లేదని బ్రాహ్మణి స్పష్టం చేశారు. తన రెండేళ్ల కుమారుడు దేవాన్ష్, తన మామ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం హెరిటేజ్ పాలనే తాగుతారని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో తన మామ(చంద్రబాబు) పాదయాత్ర చేసిన సందర్భంలో హెరిటేజ్ పాలను తాగి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారని బ్రాహ్మణి వివరించారు. వచ్చే ఐదేళ్లలో హెరిటేజ్ టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అవి పాలు కాదు విషం: రాజేంద్ర పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ప్రైవేట్ డైరీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని తమిళనాడు పాలు మరియు డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ ఆరోపించారు. ప్రైవేట్ సంస్థలు పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, క్లోరిన్ లాంటి రసాయనాలను కలుపుతున్నాయని, తమ బృందాలు చేసిన అధ్యయనంలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. గతవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. "ప్రైవేట్ డైరీలు తయారుచేసేవి పాలే కాదు.. విషం" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై పలు డైరీ సంస్థలు మండిపడ్డాయి. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువు..
హైదరాబాద్ : మిర్చిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అమలు జరగడం లేదని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం అనేక షరతులు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మారెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్రం ధరపై స్పష్టత లేదని మార్కెటింగ్ కమిషనర్ చెబుతున్నారని, ఒకవేళ పంట కొనుగోళ్లు చేసినా స్టోరేజీ చేయడానికి గోడౌన్లు ఖాళీ లేవని చెబుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువైందని ఆయన అన్నారు. రైతుల జీవితాలంటే ఇంత ఆషామాషీగా ఉందా అని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ స్టోర్‌లో 200 గ్రాముల మిర్చికి రూ.44 వసూలు చేస్తున్నారని, ఆ లెక్కన క్వింటాల్ ధరరూ.22వేలు అవుతుందన్నారు. అదే రైతుకిస్తున్నది రూ.4వేలు అని, హెరిటేజ్‌లో అమ్ముతున్నది రూ.22వేలా? అని సూటిగా ప్రశ్నించారు. ఇక రిలయన్స్ దుకాణాల్లో 200 గ్రాముల మిర్చి రూ.71 ...దాని ప్రకారం క్వింటాల్ ధర రూ.35వేలు అవుతుందన్నారు. దేశంలో రోజుకు 34మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి, అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఉమ్మారెడ్డి అన్నారు. మిర్చి క్వింటాల్‌కు రూ.10వేలు చొప్పున కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో స్పష్టత కరువు..
-
పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తన రాజకీయ రంగప్రవేశంపై మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి క్లారీటీ ఇచ్చారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టి అంతా హెరిటేజ్ వ్యవహారాలపైనే అని ఆమె స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో అయిదు హెరిటేజ్ ప్రాజెస్ యూనిట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2022 కల్లా హెరిటేజ్ రూ.6వేల కోట్ల టర్నోవరే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బ్రహ్మణి వెల్లడించారు. ప్రస్తుతం బ్రహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కాగా బ్రహ్మణి రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆమె పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మణి తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని ఆమె వెల్లడించారు. దీంతో చాల కాలంగా బ్రహ్మణి రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడ్డట్టు అయింది. -
పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కీలక వ్యాఖ్యలు
-
హెరిటేజ్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: ఉప్పల్‌లోని హెరిటేజ్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. -
‘నారా లోకేశ్ తండ్రిని మించిన తనయుడు’
గుంటూరు : అబద్ధాలు చెప్పటంలో నారా లోకేశ్ తండ్రిని మించిన తనయుడిగా మారిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పటంలో లోకేశ్ ఆరితేరి ముదిరిపోయారని ఆయన అన్నారు. ఆరేళ్లుగా ప్రకటించిన ఆస్తులు కొన్న ధర ప్రకారమని చెప్పిన లోకేశ్, చంద్రబాబులు ఇన్నాళ్లు ప్రజలను పచ్చి మోసం, దగా చేశారని ఆయన అన్నారు. నారా లోకేశ్ ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఇచ్చిన వివరాలను చూస్తుంటే పచ్చిమోసం, దగా చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. నారా లోకేశ్ ఆస్తుల వ్యవహారంపై ’సాక్షి’ కన్నా ముందుగా ఆంగ్ల దినపత్రిక ’హిందుస్తాన్ టైమ్స్’ సమగ్రంగా ఓ వార్తను ప్రచురించిందని అంబటి అన్నారు. ఆరు నెలల కాలంలో వందల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నిస్తే దానికి సమధానం ఇవ్వకుండా ఎదురు దాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పై పెచ్చు వైఎస్ జగన్ ను ఆస్తులు ప్రకటించాలని ప్రశ్నించడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. దొంగ లెక్కలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంబటి అన్నారు. 2014 మార్చిలో రూ.200 ఉన్న హెరిటేజ్ షేర్ ధర 2017 ఫిబ్రవరికి రూ.1134కు చేరిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే షేర్ ధర పెరిగిందని అంబటి తెలిపారు. ఆస్తులపై లోకేశ్ చెపుతున్న లెక్కలన్నీ బోగస్ అని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఆస్తులు ప్రకటించారన్నారు. సంబంధిత వార్తలు.... నాపై బురద జల్లుతున్నారు: నారా లోకేశ్ సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన నారా లోకేశ్ ఐదు నెలల్లో లోకేష్ ఆస్తులు చూస్తే కళ్లు బైర్లే -
సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన నారా లోకేశ్
విజయవాడ: తెలుగువారి మనస్సాక్షిగా నిలిచిన 'సాక్షి'మీడియాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ తన అక్కసు వెళ్లగక్కారు. స్మోకింగ్ కంటే ఘోరమైంది...సాక్షి పేపర్ చదవడం, సాక్షి చానల్ చూడటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దయచేసి సాక్షి పేపర్ చదవొద్దని, చానల్ చూడదంటూ లోకేశ్ సూచనలు చేశారు. ఆ పేపర్లో లేనిది రాస్తారు, చెప్పింది రాయరంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సాక్షి మీడియాను ఫాలో అయితే మెంటల్ బ్యాలన్స్ తప్పుతుందంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన తన ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై లోకేష్ స్పందించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకుంటున్నామని అన్నారు. తమది వ్యవసాయ కుటుంబమని, పాలు, కూరగాయలు అమ్ముకుంటూ నీతి నిజాయితీగా బతుకుతున్న తమపై ఆరోపణలు చేయడం తగదన్నారు. శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, అందువల్ల తనపై వచ్చిన ఆరోపణలపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా తాము ఆస్తులు ప్రకటించామని, అయితే తాను చట్టసభకు వస్తున్నందువల్లే అయిదు నెలల్లో లోకేశ్ ఆస్తులు 23 రెట్లు పెరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. -
నాపై బురద జల్లుతున్నారు: నారా లోకేశ్
-
నాపై బురద జల్లుతున్నారు: నారా లోకేశ్
విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లో పేర్కొన్న ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబం అంతా స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నామన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ తమలా ఆస్తులు ప్రకటించలేదన్నారు. ఎవరూ అడగకుండానే తాము ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తనపై కావాలనే బురద జల్లుతున్నారని ఆయన అన్నారు. తనకు 23 లక్షల హెరిటేజ్ షేర్లు ఉన్నాయని, మార్కెట్లో ఆ షేర్ల విలువలు పెరగటం వల్లే ఆస్తులు విలువలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ షేర్ల విలువ పెరిగిందని నారా లోకేష్ పేర్కొన్నారు. పది రూపాయల షేర్ విలువ 20 ఏళ్లలో రూ.2500కు చేరిందన్నారు. తాము తమ షేర్ల మార్కెట్ ధరను ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేవలం కొన్న ధరను మాత్రమే చెప్పామని లోకేశ్ తెలిపారు. తమ షేర్ ధర ఇప్పుడు వేయి రూపాయలకు చేరడంతో తన ఆస్తి రూ.330 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. ఎటువంటి ఆరోపణలు లేని తనపై విమర్శలు చేస్తున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు. అందుకే ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. తమది వ్యవసాయ కుటుంబం అని, పాలు, కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నామని లోకేశ్ అన్నారు. సంబంధిత కథనం... ఐదు నెలల్లో లోకేష్ ఆస్తులు చూస్తే కళ్లు బైర్లే -
హెరిటేజ్ ఫుడ్స్‌తో బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన
-
‘హెరిటేజ్ వాక్’ పరిశీలన
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిని రెండేళ్ల క్రితం ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ అమరావతి, ధరణికోట గ్రామాల్లో హెరిటేజ్ వాక్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా నిర్మిస్తున్న రోడ్లను మంగళవారం పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాంశ్ శుక్లా, జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా పర్యాటక శాఖ సలహాదారుడు ప్రొఫెసర్ గల్లా అమరేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ప్రొఫెసర్‌అమరేశ్వర్ అమరేశ్వరాలయం, కృష్ణా నది తీర ప్రశస్తిని వారికి వివరించారు. అనంతరం అమరావతి పాత మ్యూజియంలోని మహాస్థూపం, కొత్త మ్యూజియంలోని శిల్పాలను తిలకించారు. త్వరితగతిని నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రతినిధి కిరణ్, సాయిబాబు వీర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కొయ్య బారుతున్న శిల్పం
తరతరాల వారసత్వం కళ సృజనకు.. సునిశిత దృష్టికి వారధి కళ సహనానికి.. దృఢ సంకల్పానికి సాక్ష్యం కళశిల్పం.. శిల్పుల పనితనానికి దర్పణం కొయ్య శిల్పం ఆధ్యాత్మిక తిమిరాల రాగం కురిచేడుకు చెందిన మాచరౌతు వంశీయులకు కళాత్మక దృష్టి ఉన్నా భవిష్యత్ తరాలకు ఈ విద్య అందించడం కష్టంగా మారుతోంది మారుతున్న కాలం చెక్క బొమ్మలను సుదూరంగా నెట్టేస్తోంది...! - కురిచేడు గుడిలో ఏ వేడుక జరిగినా.. ఆలయూలకు ఎలాంటి బొమ్మలు కావాలన్నా రాష్ర్టం నలుమూలల నుంచి స్థానికంగా నివాసం ఉండే మాచరౌతు శ్రీనివాసులు గడప తొక్కాల్సిందే. కొయ్యతో కావాల్సిన రూపాల్లో శిల్పాలను చెక్కడం ఈ వంశీయుల ప్రత్యేకత. ఉత్సవ విగ్రహాలు, స్వామివార్ల వాహనాలైన అశ్వం, పులి, సింహం, హంస, హనుమంత, గరుడ, గజ, బొల్లావుల వంటి వాటిని తయూరు చేస్తే ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళను నేటికీ జాగ్రత్తగా పట్టుకొస్తున్నారు. మాచరౌతు సుబ్బరాయుడు తన తండ్రి, తాతల వద్ద నేర్చుకున్న విద్యను తన కుమారులు శ్రీనివాసులు, రాముడుకు నేర్పించారు. వీరు తయూరు చేసే కళారూపాలకు ఎంతో విశిష్టత ఉంది. చక్కనైన డిజైన్లు.. రంగులతో ముగ్ధమనోహరంగా రూపొందిస్తారు. ఇత్తడి రాకతో.. కాలంతో పాటు సంప్రదాయూల్లో కూడా కొన్ని మార్పులు వస్తున్నారుు. ప్రస్తుతం ఇత్తడి వాహనాలపై ప్రజలకు మోజు పెరగటంతో కొయ్యవాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఎంతో ఉత్కృష్టమైన ఈ విద్య భావి తరాలకు ఎక్కడ అందకుండా పోతుందో అని కళాభిమానులు ఆవేదన చెందుతున్నారు. శ్రీనివాసులు కూడా తమ బిడ్డలు ఇదే పని చేయమని సూచించడంలేదు. జీవితంలో స్థిరపడే వృత్తిని కూడా ఎంచుకోవచ్చంటున్నారు. కాలం.. శ్రమ! ఒక్క వాహనాన్ని తయారు చేయటానికి సుమారు రెండు నెలలు పడుతుంది. దీనికి ఇద్దరు మనుషులు కావాలి. ‘ఏడాదిలో మూడు నెలలు మాత్రమే పండగల సీజన్ ఉంటుంది. విగ్రహాలను ద్రోణాచలం, తెనాలి, గుంటూరు, తదితర ప్రాంతాలనుంచి వచ్చినవారు కొంటారు. పూర్వకాలంలో ఈ బొమ్మలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోరుుంది. అందుకే వేరే పనులు కూడా చూసుకుంటున్నాం. మా తండ్రి నుంచి నేర్చుకున్న ఈ విద్యను నా సంతానానికి నేర్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అరుుతే ఈ కళనునేర్చుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా నేర్పిస్తా’ అని శ్రీనివాసులు తెలిపారు. -
భావి తరాలకూ తీజ్ వారసత్వం
సంస్కృతిని చాటడం అభినందనీయం ఖానాపూన్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు ఉట్నూర్‌లో హాజరైన ఎమ్మెల్యే, పీవో ఉట్నూర్ రూరల్ : ఆనవాయితీగా వస్తున్న తీజ్ పండుగ వారసత్వాన్ని భావి తరాలకు అందించేలా, మన సంస్కృతిని చాటి చెప్పేలా ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గోర్ బంజారా తీజ్ మేళా ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో పాటు ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నత్యాలు, పాటలతో అంగరంగ వైభవంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. పాడిపంట, గొడ్డూగోద, ఇంటిల్లిపాది.. ఇలా గ్రామం మొత్తం బాగుండాలని ఆ దేవుణ్ని కోరుకుంటూ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండువగా సాగాయని తెలిపారు. అందరూ వారి సంప్రదాయ వస్త్రాలను ధరించి భావి తరాలకు వాటి విశిష్టత తెలియజేయాలని కోరారు. అంతకుముందు చేసిన నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే సైతం తీజ్ బుట్టలను తలపై పెట్టుకొని నృత్యం చేశారు. అనంతరం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఆయా తండాల్లోనూ... మండలంతో పాటు లక్కారం, ఎక్స్‌రోడ్డు, హస్నాపూర్, శ్యాంపూర్‌తో పాటు వివిధ లంబాడి తండాల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. అందరూ ఒకే చోట చేరి ప్రత్యేక పూజల అనంతరం ఊరి పొలిమేరల్లో తీజ్‌లను నిమ్మజ్జనం చేశారు. ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, సర్పంచ్ బొంత ఆశారెడ్డి, తహసీల్దార్ రమేశ్ రాథోడ్, గజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, బంజారా సేవా సంఘం ఉపాధ్యక్షుడు గోవింద్‌నాయక్, శ్రీరాంనాయక్, జనార్దన్ రాథోడ్, జాదవ్ కష్ణ, బానోత్ రామారావు, గడ్డం ప్రకాశ్, భరత్ చౌహాన్, ప్రేంసింగ్, రమణానాయక్, వెంకటేశ్, గంగారాంనాయక్, జాలంసింగ్, వెంకట్రావు, వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొన్నారు.


