చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్‌’ బండారం బట్టబయలు | Heritage Fined For Selling Substandard Curd | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్‌’ బండారం బట్టబయలు

Feb 7 2026 9:57 PM | Updated on Feb 7 2026 10:10 PM

Heritage Fined For Selling Substandard Curd

సాక్షి, విజయవాడ: చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ బండారం బట్టబయలైంది. హెరిటేజ్‌ ‘టోటల్‌ కర్డ్‌’ అత్యంత నాణ్యతలేనిదిగా నిర్థారణ అయ్యింది. సబ్‌-స్టాండర్డ్‌ ఉత్పతి అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ధారించింది. నిబంధనలు ఉల్లంఘించి నాణ్యత లేని పెరుగు విక్రయిస్తోంది. నాణ్యత లేని  పెరుగు విక్రయిస్తున్న హెరిటేజ్‌కు జరిమానా విధించిన అధికారులు.. పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ యాక్ట్‌ కింద రూ.లక్ష పెనాల్టీ వేశారు. తప్పు ఒప్పుకున్న హెరిటేజ్‌ యాజమాన్యం.. పెనాల్టీ కడతామంటూ సెబీకి నివేదిక ఇచ్చింది. 

ప్రజల ఆరోగ్యంతో బాబు సంస్థ చెలగాటమాడుతోంది. నాణ్యతలేని పెరుగును మార్కెట్‌లోకి వదిలిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్‌ పేరుతో హెరిటేజ్‌ మోసానికి పాల్పడుతోంది.  హెరిటేజ్‌ ఉత్పత్తుల్లో నాణ్యత లోపంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement