సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో హెరిటేజ్ సంస్థ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. శామీర్‌పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.

అయితే, కొత్త ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.




