
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఫౌండర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, నీతా అంబానీ ముంబైలో మరో స్వదేశీ స్టోర్‌ను లాంచ్ చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్పూర్తితోపాటు, హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్‌ను హైదరాబాద్ ఏర్పాటు చేసిన నీతా అంబానీ తాజాగా ముంబైలోని ఈరోస్‌లో స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా నీతా అంబానీ కుమార్తె ఇషా, కోడళ్లు శ్లోక, రాధికలతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.స్వదేశ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈవేడుక నిర్వహించారు. దేశీయ అనాది సంప్రదాయాలు, తరతరాలుగా అందివస్తున్న చేతివృత్తుల నైపుణ్యానికి శాశ్వత వారసత్వానికి నివాళిగా ఈ వేడుకను నిర్వహించారు.
భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. తాజాగా మరో అద్భుతమైన చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. రాజ్‌శృందర్ రాజ్‌కోట్ 10 నెలలకు పైగా చేతితో నేసిన అద్భుతమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించారు. ఈ చీరకు ప్రముఖ డిజైనర్ మనీష్‌మల్హోత్రా అందమైన జాకెట్టును నీతా ఎంపిక చేసుకున్నారు. యాంటిక్ గోల్డ్ వరల్డ్ ఎంబ్రాయిడరీతో ఫిరోజీ సిల్క్ కాంచాలి బ్లౌజ్‌తో స్టైల్ చేయడం గమనార్హం.
తాత ముత్తాల నాటి మహిళా కళాకారులకు నివాళిగా నీతా తనకు వారసత్వంగా వచ్చిన బంగారు బాజుబంద్‌ను ధరించారు. ఇది నీతా తల్లి ముత్తాత నుండి లభించిన ఆర్మ్‌లెట్. తన వివాహం సందర్భంగా కూడా దీన్ని ధరించడం విశేషం. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, వారసత్వం, ప్రేమ , ఒక తరం మహిళల నుండి మరొక తరం వరకు ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం . పెద్దల కరుణ, జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆర్మ్‌లెట్ అంబానీ నుంచి , ఆమె కుమార్తె ఇషా కుమార్తె, మనవరాలికి వారసత్వంగా లభిచనుంది.

ఇక నీతా అంబానీ జ్యుయల్లరీ గురించి చెప్పాలంటే స్వదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన నెక్లెస్‌తో తన లుక్‌ను మరింత వన్నె తెచ్చారు. ప్రతి ప్యానెల్ వైట్ గోల్డ్‌తో శ్రీనాథుడి జీవితంలోని దైవిక క్షణాలను చిత్రీకరించేలా చేతితో చేసిన కళాసృష్టి ఇది. కళాత్మకతను ఆధ్యాత్మికతతో మిళితం చేస్తుంది.