ఇస్లాంపూర్‌- కృష్ణానగర్‌గా .. పాకిస్థాన్‌లో పేర్ల మార్పు | Pakistan To Restore Pre-Partition Names Of Historic Places, Heritage Sites In Lahore Islampura, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఇస్లాంపూర్‌- కృష్ణానగర్‌గా .. పాకిస్థాన్‌లో పేర్ల మార్పు

May 19 2026 11:02 AM | Updated on May 19 2026 1:36 PM

 pakistan revives pre partition names in lahore islampura

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని చారిత్రక కట్టడాలకు, వారసత్వ సంపదలకు విభజనకు ముందు ఉన్న పేర్లను తిరిగి నామకరణం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకాలం ఇస్లామిక్‌ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు, ప్రదేశాలకు పేర్లు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వాటికి పాత పేర్లు రానున్నాయి.

పాకిస్థాన్ మతతత్వ విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి చెందిన ప్రతి చిన్న విషయంలో మతతత్వ విధానాలనే ఆ దేశం ఫాలో అవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కటి చారిత్రక ప్రదేశాలకు ఇస్లామిక్‌ భావజాలలతో సంబంధం ఉన్న పేర్లనే పెట్టింది. కాగా ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకోనున్నట్లు ప్రకటించింది.  


మార్పు జరిగే ప్రాంతాల పేర్లు

  • కృష్ణ నగర్ - ఇస్లాంపురాగా

  • సంత్‌నగర్ - సున్నత్ నగర్‌

  • ధరంపురా - ముస్తఫాబాద్‌గా

  • బ్రాండ్రెత్ రోడ్- నిష్తర్ రోడ్‌గా

  • టెంపుల్ స్ట్రీట్ - హమీద్ నిజామీ రోడ్‌గా 

  • లక్ష్మీ చౌక్‌- మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్‌గా

  • జైన్ మందిర్ రోడ్‌- బాబ్రీ మసీద్ చౌక్‌గా 

  • రామ్ గలిని -రెహమాన్ గలి

  • కుంహర్‌పురా- ఘజియాబాద్‌ గా మార్చారు.

అదే విధంగా క్వీన్స్ రోడ్ - ఫాతిమా జిన్నా రోడ్‌.జైల్ రోడ్-  అల్లామా ఇక్బాల్ రోడ్‌, డేవిస్ రోడ్ పేరును సర్ అగా ఖాన్ రోడ్‌గా, లారెన్స్ రోడ్ పేరును బాగ్-ఇ-జిన్నా రోడ్‌గా, మరియు ఎంప్రెస్ రోడ్ పేరును షహ్రా-ఇ-అబ్దుల్ హమీద్ బిన్ బదీస్‌గా మార్చారు.

కాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్ ఆదేశాలనుగునంగానే చారిత్రక ప్రదేశాలకు దేశ విభజనకు ముందు ఉన్న పేర్లను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.  కాగా ఇటీవల జరిగిన పంజాబ్‌ క్యాబినెట్‌ సమావేశంలో చారిత్రక ప్రదేశాలకు వాటి పూర్వ పేర్లే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అదే విధంగా ప్రస్తుతం గ్రేటర్ ఇక్బాల్ పార్క్‌గా పిలవబడుతున్న మింటో పార్క్‌లోని మూడు క్రికెట్ మైదానాలను, ఒక సాంప్రదాయ అఖారాను (కుస్తీ రంగం) పునరుద్ధరించాలని కూడా  ప్రధాని ప్రతిపాదించారని అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement