
ప్రీమియం వసతులకు ప్రాధాన్యం
నూర్‌మహల్ ప్యాలస్ సర్వే వెల్లడి
యువతరం (18–24 ఏళ్లు) చారిత్రక ప్రాశస్త్యం, గొప్ప వారసత్వం కలిగిన ప్రదేశాలను చూసి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియం వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతిథ్య సేవల సంస్థ నూర్‌మహల్ ప్యాలెస్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. సంప్రదాయ పర్యాటక ప్రదేశాల కంటే గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రదేశాలను చూడడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు.
ఢిల్లీ, ముంబై, జైపూర్, కర్నాల్, కోల్‌కతాలో 2,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను నూర్‌మహల్ ప్యాలెస్ విడుదల చేసింది. గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాపర్టీల్లో బస చేయాలని అనుకుంటున్నట్టు సర్వేలో 53 శాతం మంది చెప్పారు. వినూత్నమైన చరిత్ర, నిర్మాణ నైపుణ్యం (ఆర్కిటెక్చర్), వ్యక్తిగత సేవలకు ప్రాధాన్యం దృష్ట్యా తాము ఖరీదైన వారసత్వ ప్రాపర్టీలను ఎంపిక చేసుకుంటున్నట్టు వారు చెప్పారు.
‘‘యువత కేవలం లగ్జరీనే కోరుకోవడం లేదు. చారిత్రక వైభవంతో అనుసంధానాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తూనే.. చరిత్ర, సంస్కృతితో అనుసంధానమయ్యే అనుభవాన్ని అందించడం పట్ల గర్విస్తున్నాం’’అని నూర్‌మహల్ ప్యాలస్ ఈడీ రూప్ ప్రతాప్ చౌదరి తెలిపారు.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్‌వర్క్