ఎన్‌పీఎస్‌పై పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్ణయం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కింద పెన్షన్ ఫండ్స్ ఏర్పాటుకు బ్యాంక్‌లను అనుమతిస్తూ పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్ణయం తీసుకుంది. పెన్షన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడం, చందాదారుల ప్రయోజనాలను కాపాడడంతోపాటు, పోటీని పెంచేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రకటించింది.
పెన్షన్ ఫండ్స్ అన్నవి ఎన్‌పీఎస్ చందాదారుల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేస్తూ, రాబడులను పంచే బాధ్యతను చూస్తుంటాయి. బ్యాంకుల నెట్‌వర్త్ ఆధారంగా వాటిని అనుమతించేందుకు, పూర్తి కార్యాచరణ, మార్గదర్శకాలను తర్వాత నోటిఫై చేయనున్నట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. ప్రస్తుతం ఎన్‌పీఎస్ కింద 10 పెన్షన్ ఫండ్స్ సేవలు అందిస్తున్నాయి. మరోవైపు ఎన్‌పీఎస్ ట్రస్ట్‌లో ముగ్గురిని నియమిస్తూ పీఎఫ్‌ఆర్‌డీఐ నిర్ణయం తీసుకుంది.


