దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్‌లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.
సాధారణ సమయాల్లోనే దుబాయ్‌కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.
డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది.
వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్‌ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.


