లూవ్రీ మ్యూజియంలో టికెట్ల మోసం  | Ticket fraud at the Louvre Museum | Sakshi
Sakshi News home page

లూవ్రీ మ్యూజియంలో టికెట్ల మోసం 

Feb 14 2026 6:23 AM | Updated on Feb 14 2026 6:23 AM

Ticket fraud at the Louvre Museum

రూ.106 కోట్లు పక్కదారి

టికెట్ల రీసైకిల్‌తో లూటీ  

9 మంది నిందితుల అరెస్టు

పారిస్‌:  ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత లూవ్రీ మ్యూజియంలో టికెట్ల మోసం జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. గత పదేళ్లలో ఏకంగా 10 మిలియన్‌ యూరోలు (రూ.106.90 కోట్లు) పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు గురువారం వెల్లడించారు. టికెట్ల విషయంలో మోసంపై మ్యూజియం నిర్వాహకులు 2024 డిసెంబర్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు జ్యుడీíÙయల్‌ విచారణ ప్రారంభించారు.

 అరెస్టయిన వారిలో ఇద్దరు మ్యూజియం ఉద్యోగులు ఉండడం గమనార్హం. టూర్‌ గైడ్లతోపాటు మరో వ్యక్తి కూడా అరెస్టయ్యాడు. అతడే ఈ మొత్తం మోసానికి మాస్టర్‌మైండ్‌ అని వెల్లడయ్యింది. ఇద్దరు చైనా టూర్‌ గైడ్లు తరచుగా చైనా పర్యాటకులను ఈ మ్యూజియానికి తీసుకొస్తూ ఉండేవారు. మ్యూజియంలోకి ప్రవేశించడానికి ఒకసారి ఉపయోగించిన టికెట్లను పదేపదే ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులకు అనుమానం వచి్చంది.

 చైనా టూర్‌ గైడ్ల దారిలోనే మరికొందరు గైడ్లు కూడా ఈ మోసానికి పాల్పడ్డారు. మ్యూజియం ఉద్యోగుల అండతో టికెట్లను మళ్లీమళ్లీ ఉపయోగించారు. ఇలా రీసైకల్‌ అవుతున్న టికెట్లను ప్రవేశద్వారం వద్ద తనిఖీ చేయకుండా ఉద్యోగులను మచి్చక చేసుకున్నారు. వారికి లంచాలు ఎరవేశారు. తద్వారా టికెట్ల రుసుమును మ్యూజియం కోల్పోయింది. ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవహారంపై గత ఏడాది జూన్‌లో దర్యాప్తు మొదలైంది. 

ఇది వ్యవస్థీకృత నేరంగా గుర్తించారు. మోసపూరితంగా సంపాదించిన సొమ్మును నిందితులు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఫ్రాన్స్, దుబాయ్‌లో ఆస్తులు కొన్నారు. అధికారులు ఇప్పటిదాకా కొంత నగదును సీజ్‌ చేశారు. పారిస్‌లోని మరికొన్ని దర్శనీయ కేంద్రాల్లోనూ టికెట్ల మోసం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   
 

Advertisement
 
Advertisement
Advertisement