ఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఫ్రాన్స్‌తో రూ. 3 లక్షల 25 వేల కోట్లతో రఫేల్ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు Defence Acquisition Council (DAC) స్పష్టం చేసింది.
ఈ నెల 18వ తేదీన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ .. భారత్‌కు రానున్నారు. అయితే మేక్రాన్ పర్యటనకు ముందే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ీడీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
ఈ డీల్ ద్వారా భారత వాయుసేనకు ఆధునిక సాంకేతికతతో కూడిన శక్తిమంతమైన యుద్ధ విమానాలు లభిస్తాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది మరింత కీలకం కానుంది. మరొకవైపు భారత నేవీ కోసం, Scalp Cruise Missiles ఇతర రక్షణ సామగ్రిని కూడా కొనుగోలు చేయనున్నారు.
కాగా, భారత్ ఇప్పటివరకు రెండు ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఫ్రాన్స్‌తో రూ. 59 వేల కోట్లతో ఈ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో మొదటి బ్యాచ్ భారత్‌కు చేరింది, 2022 నాటికి అన్ని విమానాలు ఐఏఎఫ్‌లో చేరాయి.
ఇక నేవీ కోంస 2025 ఏప్రిల్‌లో భారత్ రూ. 63 వేల కోట్లతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. 22 సింగిల్ సీట్, 4 ట్విన్ సీట్, రఫేల్ మెరైన్ జెట్స్‌ను భారత్ కొనుగోలు చేసింది. ఇవి ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాధిత్యా ఎయిర్‌క్రాఫ్ట్‌పై మోహరించబడతాయి.


