ట్యాంకర్‌ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా | Milk Tanker rollover | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ బోల్తా...వేల లీటర్ల పాలు వృథా

Apr 6 2018 12:31 PM | Updated on Apr 6 2018 12:31 PM

Milk Tanker rollover - Sakshi

ఘట్కేసర్‌ వద్ద ఔటర్‌ రింగు రోడ్డు పై నుంచి బోల్తా పడిన పాల ట్యాంకర్‌

మేడ్చల్ జిల్లా:  ఘట్కేసర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వద్ద ఓ పాల ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా పడింది.   ఈ ఘటనలో పాల ట్యాంకర్‌ డ్రైవర్‌  వెంకటేశ్వర రావు(40) గాయాలు కావడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ ట్యాంకర్‌లో పాలు నిండుగా ఉండటంతో పాలన్నీ వృధాగా పోయాయి.

సుమారు పదిహేను వేల లీటర్ల పాలు వృధాగా పోయి ఉంటాయని అంచనా. బోల్తా పడిన ట్యాంకర్‌ గుంటూరుకు చెందిన శ్రీలక్ష్మి ట్రేడర్స్‌కు చెందిన పాల ట్యాంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి నుంచి హైదరాబాద్‌లోని హెరిటేజ్‌ సంస్థకు పాలను తెస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement