రైలు ప్రయాణం మనం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే అనుకుంటాం. కానీ చాలా మందికి ఇది ఒక ఇమోషన్. విండో పక్కనే కూర్చుని బయటకు చూస్తుంటే కనిపించే పచ్చని పర్వతాలు, మబ్బుల్లో మాయం అయ్యే ట్రాక్స్, టన్నెల్స్‌లో ఉన్న చీకటి నుంచి వెలుగులోకి వెళ్లే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్.. ఇవన్నీ కలిసి ఒక మేజికల్ అనుభవాన్ని క్రియేట్ చేస్తాయి.
ఈ మ్యాజికల్ మూమెంట్స్‌ని ఇంకా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయి భారత దేశంలో హెరిటేజ్ రైల్వేస్. ఇవి సింపుల్‌గా ట్రైన్స్ కాదు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్తున్న టైమ్ మెషన్స్ లాంటివి. బ్రిటిష్ కాలంలో మరీ ముఖ్యంగా 19 నుంచి 20వ శతాబ్దంలోనే భారత దేశంలో అత్యంత కఠినమైన ప్రాంతాల్లో రైల్వే లైన్లను ఏర్పాటు చేశారు.
అప్పట్లో ఆధునిక సాంకేతికత లేకపోయినా ఈ దారులను ఏర్పాటు చేయడం ఒక ఇంజినీరింగ్ అద్భుతం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ ట్రాక్స్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్లనే అవి హెరిటేజ్ రైల్వేస్‌గా గుర్తింపు పొందాయి.
ఈ దారుల్లో కొన్ని అంతర్జాతీయంగా కూడా పేరుపొంది యునెస్కోలో చోటు సంపాదించాయి. నిజానికి ఈ ట్రైన్స్‌స్పీడ్ చాలా తక్కువ. ఇందులో కొన్ని ట్రైన్లు 10 నుంచి 30 కిమీ వేగంతో మాత్రమే వెళ్తాయి. కానీ ఇందులో ప్రయాణించేవారు వేగం కోసం కాకుండా చక్కని అనుభూతి కోసం చాలా దూరం నుంచి వస్తుంటారు.
నీలిగిరి మౌంటెన్ రైల్వే
సౌత్ ఇండియాలో ఉన్న నీలిగిరి మౌంటెయిన్ రైల్వే ఒక అందమైన జర్నీ అనుభవాన్ని ఇస్తుంది. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు వెళ్లే ఈ బ్లూ ట్రెయిన్ మన దేశంలో ఇప్పటికీ ఆవిరితో నడిచే రైల్వే వ్యవస్థలో ఒకటిగా నిలుస్తోంది. ఉదయం వేళలో పొగ మంచులో అటవి అందాలు, జలపాతాల మధ్యలో వెళ్తుంటే ఈ జర్నీ ఒక డ్రీమ్ సీక్వెన్స్‌లా అనిపిస్తుంది. మూవీలో ఐకానిక్ విజువల్స్ కూడా ఇక్కడే షూట్ అయ్యాయి.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్
భారత దేశంలో హెరిటేజ్ జర్నీస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్. 1881లో ప్రారంభమైన ఈ టాయ్ ట్రెయిన్, న్యూ జల్పైగురి నుంచి డార్జీలింగ్ వరకు వెళ్తుంది. టీ గార్డెన్‌ల మధ్యలో నెమ్మదిగా తిరుగుతూ వెళ్తుంది ఈ ట్రెయిన్.
బటాసియా లూప్ దగ్గర సర్క్యులర్‌గా తిరిగే మూమెంట్ చాలా ఫేమస్. రోడ్డు పక్కనే వెళ్తుంది కాబట్టి కొన్ని చోట్ల కార్లు, వ్యానులు కూడా ఈ ట్రైనుకు సమాంతరంగా ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది. బాలీవుడ్ సినిమా సీన్స్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఈ జర్నీలో ప్రతీ ఫ్రేమ్ ఒక పోస్ట్‌కార్డ్‌లా అనిపిస్తుంది.
హెరిటేజ్ ట్రైన్ ఎందుకు భిన్నం అంటే..’
మన రెగ్యులర్ ట్రైన్స్ వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడం కోసం ఉంటాయి. కానీ హెరిటేజ్ ట్రైన్స్‌లో ప్రధాన లక్ష్యం వేగం కాదు. అనుభవం, అనుభూతి, మెమోరీస్ క్రియేట్ చేయడం. స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఆ స్లో మూమెంట్ వల్ల ప్రతీ క్షణాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తుంది, సాధారణ ట్రైన్స్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ట్రైన్స్ చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకే ఈ జర్నీని చాలా మంది ట్రావెల్ కాదు ఇది ఒక ఎక్స్‌పీరియెన్స్ అని వర్ణిస్తారు.
ఆసక్తికరమైన విషయాలు
ఈ హెరిటేజ్ ట్రైన్ జర్నీలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ట్రావెల్ రీల్స్ చూస్తే ఈ ట్రైన్ విజువల్స్ రెగ్యులర్‌గా కనిపిస్తాయి. స్లోగా వంపులు తిరుగుతూ వెళ్లడం, టన్నెల్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ షాట్స్, ఫాగ్ మధ్యలో ట్రాక్స్.. ఇవన్నీ రీల్స్‌కి పర్ఫెక్ట్ సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. అందుకే ట్రావెల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకి ఈ ప్రయాణాలు ఒక సువర్ణావకాశంలా అనిపిస్తాయి.
సింపుల్ ట్రావెల్ ప్లాన్
ఈ జర్నీస్‌ని ప్లాన్ చేయడానికి సింపుల్‌గా 2–3 రోజుల ఐటిసిఆర్ ఫాలో అవ్వొచ్చు. మొదటి రోజు బేస్ లొకేషన్‌కి రీచ్ అవ్వడం, రెండవ రోజు హెరిటేజ్ ట్రెయిన్ జర్నీ, మూడవ రోజు రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే రష్ లేకుండా చక్కగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే టైమ్ లభిస్తుంది.
బుకింగ్ ఎలా?
ఈ జర్నీస్ ప్లాన్ చేయడానికి టికెట్స్‌ని ఆన్‌లైన్ ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా.. సుమారు రూ.500 నుంచి రూ.1500 మధ్య ఉంటాయి. వేసవిలోనూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, సీనరీస్ చాలా అందంగా ఉంటాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి.
కాంగ్రా వ్యాలీ రైల్వే
కాంగ్రా వ్యాలీ రైల్వే అనేది చాలా తక్కువ మందికి తెలిసిన ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ. పఠాన్‌కోట్ నుంచి జోగిందర్ నగర్ వరకు వెళ్లే ఈ ట్రైన్ రూట్‌లో ధౌలాధర్ మౌంటెయిన్ రేంజ్ వ్యూస్ డైరెక్ట్‌గా కనిపిస్తాయి.క్రౌడ్ తక్కువగా ఉండటం వల్ల ఈ జర్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేచర్‌ని చాలా కామ్‌గా ఎంజాయ్ చేయాలి అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది ఒక స్వర్గంలాంటిది.
మాతెరన్ హిల్ రైల్వే
మహారాష్ట్రలో ఉన్న మాతెరన్ హిల్ రైల్వే కూడా చాలా యూనిక్ అని చెప్పవచ్చు. మాతెరన్‌లో వాహనాలను అనుమతించరు. అందుకే ఇక్కడి టాయ్ ట్రెయిన్ ఒక ప్రధాన రవాణా సాధనంగా మారిపోయింది. సన్నని గేజ్ ట్రాక్‌పై చుట్టపక్కల వనాల్లోంచి టైన్ వెళ్తోంటే పక్షుల శబ్దాలు, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ఈ జర్నీలో హైలైట్‌గా నిలుస్తాయి.
కాల్కా–షిమ్లా రైల్వే
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాల్కా షిమ్లా రైల్వే అనేది బ్రిటిష్ ఇంజినీరింగ్ బ్రిలియన్స్‌కు చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. 1903లో స్టార్ట్ అయిన ఈ రూట్‌లో 100కి పైగా టన్నెల్స్, 800కి పైగా బ్రిడ్జిలు ఉంటాయి. బారోగ్ టన్నెల్ అనేది అత్యంత పొడవైన టన్నెల్‌గా ప్రసిద్ధి చెందింది.
– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
(చదవండి: అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..! మనసును హత్తుకునే బ్యూటిఫుల్ ప్రదేశం)


