అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..! | Travel tips: Kodinhi village, Malappuram district of Kerala Village of Twins | Sakshi
Sakshi News home page

అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..! మనసును హత్తుకునే బ్యూటిఫుల్‌ ప్రదేశం

May 4 2026 12:47 PM | Updated on May 4 2026 1:09 PM

Travel tips: Kodinhi village, Malappuram district of Kerala Village of Twins

ఒక ఊరిలో నడుస్తోంటే ప్రతీ ఒక్కరు రెండు సార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది?! కేరళలోని మలప్పురం దగ్గర ఉండే ‘కోడిని’ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. మొదటిసారి ట్రావెల్‌ చేసే వారికి ఇది చాలా వింతగా, ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. స్పెషల్‌ ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కావాలనే వారికి ఇది చాలా ఈజీగా, మనసును హత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక అద్దం ముందు నిలబడినట్టుగా ప్రతీ చోట జనాలు కనిపిస్తూ ఉంటే ఎవరికరైనా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా!

అక్కడ అడుగు పెట్టగానే పచ్చని పొలాలు, చల్లని గాలి మనకు స్వాగతం పలుకుతాయి. ఆర్కిటెక్చర్‌ చాలా సింపుల్‌గా, మన ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ తిరిగే కవల పిల్లలు చూస్తుంటే ఒక్కసారిగా మనం ఎక్కడున్నాం అనే అనుభూతి కలుగుతుంది. ఆ గాలిలో నడుస్తుంటే మనం ఒక వింత స్వప్నంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ప్రతీ తోటలో, ప్రతీ ఇంటి ముందు ఒక కొత్త కళ కనిపిస్తుంది. మనుషుల చిరునవ్వులు, వారి అమాయకత్వం మనసుకు చాలా హాయిని ఇస్తాయి.

సందర్శనీయ ప్రదేశాలు
కవలల నగరం లేదా ట్విన్‌ టౌన్‌ అని పిలిచే ఈ ప్రాంతంలో తిరుగుతూ అక్కడి స్థానికులతో మాట్లాడటం ఒక గొప్ప అనుభవం. దగ్గరలో ఉన్న కడలుండి బర్డ్‌ శాంక్చువరీలో రంగురంగుల పక్షులను చూడటం లేదా నీలాంబుర్లోని తోటలను సందర్శించడం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.

ఏం తినాలి?
కేరళ స్థానిక రుచులు అయిన వేడి వేడి పుట్టు, కడల కర్రీ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్‌ అని చెప్పవచ్చు. స్థానిక టీ స్టాల్స్‌ దగ్గర లభించే వేడి భోజనం, బనానా ఫ్రిట్టర్స్‌ అక్కడ కూర్చొని తినడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఎప్పుడు వెళ్లాలి?
సెప్టెంబర్‌ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో కూడా వెళ్లవచ్చు. అప్పుడూ అక్కడి పచ్చదనం మనసును హాయిగా ఉంచుతుంది. కానీ చలికాలంలో వెళ్లడం ఉత్తమం. మీరు ఎప్పుడు వెళ్లినా కూడా స్థానికులు చాలా మర్యాదగా పలకరిస్తారు. మొత్తం ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి కోజికోడ్‌కు డైరెక్ట్‌ విమానాలు ఉంటాయి. ట్రైన్‌లో వెళ్తే కోజికోడ్‌ లేదా తిరూర్‌ దగ్గర దిగి సుమారు 40 కిమీ రోడ్‌ జర్నీ చేయాలి. బస్సులో వెళ్లాలని ప్లాన్‌ చేస్తే కోజికోడ్‌ లేదా మలప్పురంకి డైరెక్ట్‌ సర్వీసులు ఉంటాయి. అక్కడి నుంచి లోకల్‌ బస్‌ లేదా క్యాబ్‌తో కోడిని ఈజీగా చేరుకోవచ్చు. 

ఈ ప్రయాణం మనలోని క్యూరియాసిటీకి ఒక సమాధానంతోపాటు ప్రకతితో మమేకం అయ్యే ఒక అవకాశం. ప్రపంచంలోని వింతల గురించి ఆలోచించినప్పుడు కోడిని మీకు తప్పకుండా గుర్తుకు రావాలి అంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్లిరావాలి మరి!.

(చదవండి: కేదార్‌నాథ్‌: మంచుకొండల్లో ఓంకార నాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement