వాట్‌ పబ్లిక్‌ టాయిలెట్‌ టూరిస్ట్‌ స్పాటా..?! | This Public Toilet In China Became A Tourist Hotspot Goes Viral | Sakshi
Sakshi News home page

వాట్‌ పబ్లిక్‌ టాయిలెట్‌ టూరిస్ట్‌ స్పాటా..?! రీజన్‌ ఇదే..

Sep 12 2025 12:15 PM | Updated on Sep 12 2025 1:01 PM

This Public Toilet In China Became A Tourist Hotspot Goes Viral

టూరిస్ట్‌ స్పాట్‌ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్‌ స్పాట్‌ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక​ చదివేయండి మరి..

చైనైలోని గన్సు ప్రావిన్స్‌లోని డన్హువాంగ్‌ నైట్‌ మార్కెట్‌లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్‌ టాయిలెట్‌ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్‌రూమ్‌కి ఇంత క్రేజ్‌ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్‌రూమ్‌ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్‌ యునెస్కోలో చోటు దక్కించుకున్న‌ ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్‌రూమ్‌. 

చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్‌  టాయిలెట్‌ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్‌ పబ్లిక్‌ టాయిలెట్‌ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్‌ గాజు కర్టెన్‌ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్‌ ఈ రెస్ట్‌రూమ్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ నర్సింగ్‌ టేబుల్స్‌, చైల్డ్‌ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్‌ సిస్టమ్‌తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. 

అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్‌ ప్రదేశం తోపాటు డ్రింక్‌ డిస్పెన్సర్‌లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్‌ టాయిలెట్‌ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్‌గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా.

 

(చదవండి: ఫిఫ్టీ ప్లస్‌.. టాలెంట్‌ జోష్‌..! యాభై దాటాకా లైఫ్‌ స్టార్ట్‌ అంటున్న 'ఖ్యాల్‌')


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement