15 వేల అడుగుల ఎత్తు, కాపాడిన హుక్‌ నైఫ్‌, ఒళ్లు గగుర్పొడిచే వీడియో | Skydiver Dangles from Plane After Parachute Snags on Aircrafts Tail Video viral | Sakshi
Sakshi News home page

15 వేల అడుగుల ఎత్తు, కాపాడిన హుక్‌ నైఫ్‌, ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Dec 12 2025 6:26 PM | Updated on Dec 12 2025 7:49 PM

Skydiver Dangles from Plane After Parachute Snags on Aircrafts Tail Video viral

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో 15,000 అడుగుల ఎత్తులో ఉండగా, స్కైడైవర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. స్కైడైవింగ్ చేస్తుండగా ఆయన అత్యవసర (రిజర్వ్) పారాచూట్ విమానం వెనుక రెక్కలో చిక్కుకుంది. స్కైడైవర్ విమానం నుండి దూకడానికి కొద్దిసేపటి ముందు ఈ ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన జరిగింది.

ఆస్ట్రేలియా రవాణా భద్రతా సంస్థ ఈ వీడియోను విడుదల చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం 15000 అడుగుల ఎత్తులో ఉంది. దీనిలో స్కైడైవర్ చాలా సేపు గాలిలో వేలాడుతూ కనిపించాడు. చివరికి పారా జంపర్‌ పారాచూట్ 11  తాళ్లను హుక్ నైఫ్‌తో కట్ చేసి తనను తాను విడిపించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సవచలనంగా మారింది. ఆస్ట్రేలియాలోని సౌత్ ఆఫ్ కెయిర్న్స్ లో సెప్టెంబర్ 20న జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు విడుదల చేయడంతో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

మధుమేహులకు గుడ్‌ న్యూస్‌ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది
 

'మిడ్ వెడ్జ్ ఎట్ ది బీచ్' కార్యక్రమంలో, స్టంట్‌లో 16 మంది స్కై డైవర్లు ఆకాశంలోకి వెళ్లి  15,000 అడుగుల (4,600 మీటర్లు) ఎత్తు నుండి దూకి కిందకి దూకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ స్కైడైవర్ తొందరపడి పారాచూట్ బటన్ ముందే నొక్కాడు. అతనికి కాలు జారి పోయింది. దీంతో అతను విమానం అంచున ఉండగానే పారాచూట్ విచ్చుకోవడం, విమానం రెక్కకు చుట్టు కోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఫలితంగా విమానంలో నుంచి దూకేసిన స్కైడైవర్ గాల్లో వేలాడాడు. అయితే చాకచక్యంగా దాని తాళ్లను కట్‌ చేశాడు. ఆ తరువాత అదనంగా ఉండే రిజర్వ్ పారాచూట్ సాయంతో క్షేమంగా నేలపై దిగాడు. కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విమానం కూడా విజయవంతంగా ల్యాండ్ అయింది.

హుక్‌ నైఫ్‌ కాపాడింది
అతను గాల్లో వేలాడుతున్న సమయంలో మిగిలిన 13 మంది  స్కైడైవర్లు. తన మిత్రుడి భద్రత కోసం వెంటనే దూకారు. ఇంతలో, స్కైడైవర్ తన పారాచూట్ 11 తాళ్లను కత్తిరించడం ప్రారంభించాడు. దీనికి అతనికి దాదాపు నిమిషం పట్టింది. అలా హుక్ నైఫ్‌ ప్రాణాలను కాపాడుతుంది, దానిని ధరించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుండి, నార్త్ ఫ్రీ-ఫాల్ క్లబ్ తన భద్రతా ప్రోటోకాల్‌లలో అనేక మార్పులు చేసింది. దీని ప్రకారం, అన్ని స్కై డైవర్లు హుక్ నైఫ్ ధరించడం తప్పనిసరి చేయడం విశేషం.

ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement