breaking news
dangle
-
మృత్యువు అంచునుంచి..
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్, టల్లీ ఎయిర్ పోర్ట్.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్ ఆడ్రియన్ ఫెర్గూసన్ గుండె వేగం పెరిగింది. విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్ ఫెర్గూసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్ పారాచూట్ తాడు విమానం రెక్క ఫ్లాప్‌ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్‌ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్‌ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్లో పడిపోయాడు. అసాధారణ ధైర్యశాలికళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్ స్టెబిలైజర్’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్ ఫెర్గూసన్ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్ ఫెర్గూసన్ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యువుతో పోరాడాలి. ప్రాణం కాపాడిన కత్తిఆడ్రియన్ తన వద్ద ఉన్న చిన్న ’హుక్ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్‌లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్ తన ప్రధాన పారాచూట్‌ను తెరిచాడు. రిజర్వ్ పారాచూట్ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యాడు. మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది ప్రమాదంలో విమానం..ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్‌తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో, పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. A skydiver in Queensland Australia was left dangling thousands of metres in the air after their parachute caught on the plane’s tail. The dramatic footage was released by the Australian Transport Safety Bureau following an investigation into the incident. pic.twitter.com/ntXU6d8pAQ— Channel 4 News (@Channel4News) December 11, 2025శభాష్ ఫెర్గూసన్!ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్ ఆంగస్ మిచెల్ మాట్లాడుతూ, ‘హుక్ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్ పారాచూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు. పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా -
10 అడుగుల పైథాన్‌తో పోరు..!
ముంబయి: మహారాష్ట్రాలోని థాణె జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 అడుగుల పైథాన్ ఓ ఇంటి బెడ్రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో కిటికి గుండా ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు యువకులు పైథాన్‌తో ఫైట్ చేసి చివరికి దానిని కిటికీ నుంచి కిందికి పడేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద పైథాన్ ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Imagine a massive python hanging from your bedroom window. It happened in Mumbai's Thane.#Thane #Python pic.twitter.com/dbL1IIbasZ — IndiaToday (@IndiaToday) September 26, 2023 ఇదీ చదవండి: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్ -
బస్సులోనుంచి తల బయటకు పెట్టి..
చెన్నై: బస్సులో నుంచి తల బయటకు పెట్టిన ఓ వ్యక్తి లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన దారుణ సంఘటన కాంచీపురం జిల్లాలోని మమందూర్ కు దగ్గరలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడలూరుకు చెందిన సొక్రటీస్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చుట్టానికి అనారోగ్యంగా ఉండటంతో సొక్రటిస్, అతని అన్నయ్య, ఓ స్నేహితుడు కలిసి చూడటానికి బయలుదేరారు. సొక్రటిస్ బస్సులో చివరి నుంచి రెండో వరుసలో ఎడమ వైపు కిటికీ సీటులో కూర్చున్నాడు. మొత్తం 40మందికి పైగా ప్రయాణిస్తున్నబస్సులో తెల్లవారుజామున నిద్రపట్టకపోవడంతో సొక్రటిస్ బయటకు తలపెట్టి చూస్తున్నాడు. ఇంతలో బస్సు వెనుకే వచ్చిన లారీ బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించి సొక్రటిస్ తలను బలంగా ఢీ కొట్టింది. దీంతో అతను ఒక్కసారిగా పెద్ద అరుస్తూ బాధతో విలవిల్లాడిపోయాడు. దీంతో గాఢ నిద్రలో ఉన్న బస్సులోని ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతని పక్కనే ఉన్న ప్రయాణీకులు లేచి వెళ్లి డ్రైవర్ కు విషయం చెప్పడంతో అతను బస్సును ఆపినట్లు తెలిపారు. యాక్సిడెంట్ కు కారణమైన బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. Man, die, dangle, head, bus, window, బస్సు, కిటికి, వ్యక్తి, మృతి


