breaking news
skydivers safe
-
మృత్యువు అంచునుంచి..
అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్, టల్లీ ఎయిర్ పోర్ట్.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్ జంప్ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్ ఆడ్రియన్ ఫెర్గూసన్ గుండె వేగం పెరిగింది. విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్ ఫెర్గూసన్ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్ పారాచూట్ తాడు విమానం రెక్క ఫ్లాప్‌ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్‌ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్‌ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్లో పడిపోయాడు. అసాధారణ ధైర్యశాలికళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్ స్టెబిలైజర్’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్ ఫెర్గూసన్ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్ ఫెర్గూసన్ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్ మృత్యువుతో పోరాడాలి. ప్రాణం కాపాడిన కత్తిఆడ్రియన్ తన వద్ద ఉన్న చిన్న ’హుక్ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్ పారాచూట్ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్‌లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్ తన ప్రధాన పారాచూట్‌ను తెరిచాడు. రిజర్వ్ పారాచూట్ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యాడు. మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది ప్రమాదంలో విమానం..ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్‌తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయంతో, పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది. A skydiver in Queensland Australia was left dangling thousands of metres in the air after their parachute caught on the plane’s tail. The dramatic footage was released by the Australian Transport Safety Bureau following an investigation into the incident. pic.twitter.com/ntXU6d8pAQ— Channel 4 News (@Channel4News) December 11, 2025శభాష్ ఫెర్గూసన్!ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్ ఆంగస్ మిచెల్ మాట్లాడుతూ, ‘హుక్ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్ పారాచూట్ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్ సమయస్ఫూర్తిని ప్రశంసించారు. పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా -
14 వేల అడుగుల ఎత్తునుంచి జారిపడిన స్కైడైవర్.. కాపాడిన అగ్ని చీమలు!
స్కైడైవింగ్‌కు ప్రయత్నించే ధైర్యం అందరికీ ఉండదు. ఈ ఫీట్ చేసేందుకు కొందరు సిద్ధమైనా.. మధ్యలో పారాచూట్ విఫలమైతే ఏమైపోతామోనని భయపడిపోతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్ల కోసం తయారైన పారాచూట్లు వంద శాతం మేరకు తెరుచుకుంటాయి. అయితే దీనికి విరుద్ధమైన పరిస్థితి జోన్ ముర్రే అనే మహిళకు ఎదురయ్యింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. అది 1999, సెప్టెంబర్ 25.. జోన్ ముర్రే(40) అనే మహిళ స్కైడైవింగ్‌కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది. అయితే ఈ అగ్ని చీమలే ఆమెను కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెపై ఆ అగ్ని చీమలు దాడి చేశాయి. ఈ దాడి కారణంగానే ఆమె బతికి బట్టకట్టిందంటే ఎవరూ నమ్మలేరు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయి. ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయి. ఆసుపత్రిలో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు పలు ఆపరేషన్ల చేయవలసి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమె ప్రాణాలను అగ్ని చీమలే కాపాడాయని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి: అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక.. The story of Joan Murray, who survived a 4,500 meter fall when her main parachute failed while skydiving. She landed in a fire ant mound where numerous venomous stings caused an adrenaline rush to keep her heart beating long enough for doctors to assist https://t.co/YUMFGJCXX6 pic.twitter.com/GOPpFwKjqB — Massimo (@Rainmaker1973) May 13, 2020 -
ఇంటిపై కుప్పకూలిన జెట్ విమానం
అమెరికాలో ఓ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఓ జెట్ విమానం లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తూ జెట్ విమానం అదుపుతప్పింది. ఓ ఇంటిపై జెట్ ఫ్లైట్ కూలిపోయింది. ఈ ఘటన అరిజోనాలోని ఫోనిక్స్ లో చోటుచేసుకుంది. విమానం కుప్పకూలేముందు పైలట్, ఇతర సిబ్బంది పారాచూట్ సహాయంతో కిందకి దూకేయడంతో పెద్ద మొత్తంలో నష్టం జరగలేదు. ఇంట్లోని వ్యక్తులకు ఎవరికి గాయలు కాలేదని, అయితే పైలట్ గాయాలు అయినట్లు అధికారి గిల్బర్ట్ వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జెట్ ఫైట్ లో స్కై డైవర్స్ ను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


