ఇటీవల కాలంలో పలు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటల దాడి హెచ్చుమీరుతోంది. ఈ పరిణామాలను చూస్తే గతంలోనే వరల్డ్ వార్-3 వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దేశాల మధ్య సఖ్యత చెదిరి, యుద్ధాలకు దారి తీస్తున్న పరిస్థితులే వీటన్నంటికీ కారణం. అటు రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలుకొని నేటి పాకిస్తాన్-ఆఫ్గాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూస్తే ఏదో ఉపధ్రవం రాబోతుందా? అని పగటు ప్రజానీకం ఉలిక్కిపడిన సందర్భాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ట్రంప్‌లో అసహనం..
మరొకవైపు ‘శాంతి-శాంతి’ అని చెప్పుకునే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో వరల్డ్ వార్-3 అంటూ వ్యాఖ్యానించారు కూడా. మళ్లీ తాజాగా ట్రంప్ అదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయన్‌ల మధ్య యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా గత నెలలోనే సుమారు 25 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారని, అందులో ప్రజలు, సైనికులు కూడా ఉన్నారన్నారు.ఆ యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావొచ్చని హెచ్చరించారు.
ఆ ఇర దేశాల నేతాలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదొక రూపంలో ముందుకు తీసుకెళుతున్నారే కానీ దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ వైట్‌హౌస్ వేదికగా మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్.
ఇక మాటల్లేవ్.. అంతా యాక్షనే..!
అంతకుముందు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధంపై ట్రంప్ చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. అది ట్రంప్‌కు విపరీతమైన చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇరుదేశాలు ఒక సఖ్యతకు వచ్చి యుద్ధం ఆపకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్‌లతో మాట్లాడాలని ట్రంప్ అనుకోవడం లేదని, ఇక కేవలం చర్యలతోనే ఇరు దేశాలకు సరైన సమాధానం చెప్పాలని ట్రంప్ భావిస్తున్నారన్నారు.


