
చాలామంది తమలో వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందంగా, యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఇప్పుడు కొత్త ‘పోర్టబుల్ హ్యాండ్‌హెల్డ్ యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్’ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ పరికరం చర్మ ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఈ డివైజ్ సాయంతో చర్మాన్ని లిఫ్ట్ చేసి, బిగుతుగా ఉంచుకోవచ్చు. చర్మంపై ఉండే సన్నటి ముడతలను ఈ పరికరం సమర్థవంతంగా తగ్గిస్తుంది. చర్మంపై కనిపించే రంధ్రాలు పెద్దవిగా ఉంటే, ఈ పరికరం వాటిని చిన్నవిగా చేయడానికి సహాయపడుతుంది.
ఈ డివైజ్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొలాజెన్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా మార్చి, దానిని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ డివైజ్ అయానిక్ మోడ్ ఆప్షన్లతో పనిచేస్తుంది. దీనిలో హై, లో, మీడియం వంటి మైక్రో కరెంట్ పవర్ ఆప్షన్లు ఉంటాయి. దీనితో చర్మ అవసరాలకు తగినట్టుగా కరెంటు స్థాయిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చికిత్స సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు.
ఈ బ్యూటీ డివైస్‌కి ట్రీట్‌మెంట్ హెడ్స్ వేరువేరుగా ఉంటాయి. ముక్కు, కళ్లు భాగాలను మసాజ్ చేసుకోవడానికి ఒక హెడ్, ముఖానికి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి మరో హెడ్, మొత్తం బాడీని మసాజ్ చేయడానికి ఇంకో హెడ్ ఇలా మూడు వేరువేరు హెడ్స్ లభిస్తాయి. ఈ రకమైన ఫీచర్లు ఉన్న డివైస్‌తో చర్మ సంరక్షణను సులభతరం చేసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.
(చదవండి: Back pain during pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..)