దీపావళి వేడుకల్లో ట్రంప్‌.. మోదీపై ప్రశంసలు | Donald Trump celebrates Diwali At White House | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌లో దీపావళి సందడి.. మోదీపై ట్రంప్‌ ప్రశంసలు

Oct 22 2025 7:20 AM | Updated on Oct 22 2025 10:32 AM

Donald Trump celebrates Diwali At White House

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (స్థానిక సమయం) వైట్ హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు, భారతీయ అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, దీపావళి గురించి కూడా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘భారతదేశ ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈరోజు భారత ప్రధానమంత్రి మోదీతో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. మేము ప్రపంచ వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి.. గొప్ప స్నేహితుడు. చాలా ఏళ్లుగా మోదీతో నాకు స్నేహం ఉంది. అలాగే, పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దు అని మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. దాంట్లో వాణిజ్యం కూడా ఉందనేది వాస్తవం. ప్రస్తుతం పాకిస్తాన్, భారత్‌ మధ్య యుద్ధం లేదు. అది చాలా మంచి విషయం’ అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో దీపావళి పండుగ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్..‘చీకటిపై కాంతి విజయంలో విశ్వాసానికి చిహ్నంగా మనం దీపాన్ని వెలిగిస్తాము. ఇది అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచి. దీపావళి సందర్భంగా ఆనందించేవారు శత్రువులను ఓడించడం, అడ్డంకులు తొలగించడం.. బందీలను విడిపించడం గురించి పురాతన కథలను గుర్తుచేసుకుంటారు. దీపం నుంచి వచ్చే జ్వాల ప్రతి ఒక్కరికీ జ్ఞాన మార్గాన్ని వెతకడం, శ్రద్ధతో పనిచేయడం, అనేక ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పడం గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.

White House: దీపావళి వేడుకల్లో ట్రంప్

వైట్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ODNI డైరెక్టర్ తులసి గబ్బర్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహా ట్రంప్ పరిపాలన నుండి అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ భారతీయ-అమెరికన్ వ్యాపార నాయకుల ప్రతినిధి బృందం కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement