
నగరంలో సదర్ ఉత్సవాలతో కోలాహలం నెలకొంది. ఖైరతాబాద్‌లో జరుగుతున్న వేడుకలను తిలకించేందుకు ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సంబురాల్లో ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

దీపావళి మరుసటి రోజు సదర్ ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఖైరతాబాద్ గ్రంథాలయ చౌరస్తా నుంచి... రైల్వేగేటు వరకు ఉత్సవం నిర్వహించారు.












