breaking news
Tulsi Gabbard
-
కోవిడ్-19 : బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్
ప్రపంచాన్ని గడ గడలాడించిన మహమ్మారి కోవిడ్-19 వైరస్ మూలాలపై అమెరికా జాతీయ నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెళుత వెళుతూ బాంబు పేల్చారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌కు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారు, కోవిడ్ వాస్తవాలను దాచారంటూ అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ఇప్పటికీ సాగుతున్న వివాదంలో సరికొత్త అగ్గి రాజేశారు.అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మాజీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చైనాలోని వుహాన్ రీసెర్చ్ ల్యాబ్‌కు నిధులు సమకూర్చారని, ఈ ల్యాబ్ నుంచే కోవిడ్-19 మహమ్మారి వ్యాపించిందని అమెరికా అవుట్గోయింగ్ డీఎన్ఐ చీఫ్ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు. తన అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకోవడానికి గత నెలలో డోనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. నిజాన్ని దాచడానికి ఆంథోనీ ఫౌచీ ఉపయోగించిన వ్యూహాలు "డీప్ స్టేట్ ప్లేబుక్" ( తెరవెనుక శక్తుల వ్యూహం) నుండి వచ్చినవేనని అన్నారు.తన పదవీకాలం చివరి రోజున కొన్ని ‘ఇంతకుముందెన్నడూ చూడని’ రహస్య పత్రాలను విడుదల చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. 2020లో అమెరికాకు కోవిడ్ సోకినప్పుడు బైడెన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఫౌచీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)లో "బాట్ (గబ్బిలం) కరోనావైరస్లపై ప్రమాదకరమైన గెయిన్-ఆఫ్-ఫంక్షన్ (gain-of-function) పరిశోధనల" కోసం అమెరికా పన్ను చెల్లింపుదారుల మిలియన్ల డాలర్ల నిధులను అందించారని గబ్బార్డ్ పేర్కొన్నారు. వైరస్ ల్యాబ్ నుండి లీక్ అయిందనే నిజాన్ని కప్పి పుచ్చడానికి ఫౌచీ కెరీర్ లీడర్‌షిప్‌తో కలిసి పనిచేశారని తులసి గబ్బార్డ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీట్రిలియన్ డాలర్ల వ్యాక్సిన్ వ్యాపారం కోసంవైరల్ పరిశోధనల గురించి ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన చర్చలపై 2024లో కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ముందు ప్రమాణం చేసి ఫౌచీ అబద్ధాలు చెప్పారని వెల్లడించింది. డిసెంబర్ 2022లో పదవి నుంచి వైదొలగే వరకు 38 ఏళ్లపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID)కు అధిపతిగా పనిచేసిన 85 ఏళ్ల ఫౌచీ, పెద్ద ఫార్మా కంపెనీలతో చేతులు కలిపి "రిస్కీ కరోనావైరస్ పరిశోధనల"కు నిధులు ఇచ్చారని గబ్బార్డ్ కార్యాలయం ఆరోపించింది. ట్రిలియన్ల డాలర్ల విలువైన "యూనివర్సల్ వ్యాక్సిన్ల" వేట కోసం ఇదంతా జరిగిందని పేర్కొంది.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరండాక్టర్ ఫౌచీ వంటి రాజకీయ ప్రేరేపిత,స్వార్థపూరిత నాయకులు తమ సొంత తప్పులను, అధికార దుర్వినియోగాన్ని కప్పిపుచ్చు కున్నారు, ఇంటెలిజెన్స్‌ను తారుమారు చేశారు, కాంగ్రెస్‌కు అబద్ధాలు చెప్పారు, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరమైన కీలక వాస్తవాలను తెలుసుకోకుండా చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని అడ్డుకోవడం ద్వారా ఆయనను బలహీన పరిచారంటూ ఆమె ధ్వజమెత్తారు."కోవిడ్-19 మహమ్మారి మిలియన్ల మంది అమెరికన్లకు ,ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని మందికి అపారమైన కష్టాలను, నష్టాన్ని మిగిల్చింది. ఏళ్ల తరబడి సాగిన అబద్ధాలు, సెన్సార్షిప్ కప్పిపుచ్చుకునే ధోరణుల తర్వాత, అమెరికా ప్రజలకు పారదర్శకత, నిజం మరియు జవాబుదారీతనం లభించాల్సిన అవసరం ఉంది." అని తులసి గబ్బార్డ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు జూన్ 2024లో జరిగిన పబ్లిక్ కాంగ్రెస్ విచారణలో ఫౌచీ అబద్ధాలు చెప్పారని ఆమె కార్యాలయం స్పష్టం చేసింది. మహమ్మారికి ముందు లేదా తర్వాత వైరల్ పరిశోధనలకు సంబంధించి ఎఫ్‌బీఐ (FBI), సీఐఏ (CIA), డీఐఏ (DIA) లేదా ఏదైనా యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో మాట్లాడారా అని ఫౌచీని పదే పదే ప్రశ్నించినపుడు ఆయన మాట దాటవేశారని, కోవిడ్ గురించి నాకు తెలిసి తప్పు మాట్లాడలేదని తప్పుడు ప్రకటన చేశారని పేర్కొంది.ఫౌచీ కోవిడ్ నివేదికలను సవాలు చేసిన ఇంటెలిజెన్స్ విశ్లేషకులు ప్రతీకార చర్యలను ఎదుర్కొన్నారని, వారిని పక్కన పెట్టడంతోపాటు, వారి కెరీర్‌కు నష్టం వాటిల్లిందని పలువురు విజిల్ బ్లోవర్ల సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి, ఈ భయాల వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే వారి నోళ్లు మూయించారని గబ్బార్డ్ కార్యాలయం వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై డాక్టర్ ఆంథోనీ ఫౌచీ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. -
మీరు నిజాయితీగా.. ట్రంప్‌కు వ్యతిరేకంగా
టెహ్రాన్: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.అమెరికాకు అత్యత కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది.ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్‌ఖాతాలో రాసుకొచ్చింది.అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్ ట్రంప్‌కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.అమెరికా మీడియా కథనాలు అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. -
తులసి గబ్బార్డ్ ఎగ్జిట్.. వైట్‌హౌస్‌లో ఏం జరిగింది?
అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్‌హౌస్ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్‌తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్‌కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. భారతీయ మూలాలు లేకున్నా.. తులసి గబ్బార్డ్(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్ గబ్బర్డ్ సమోవన్-యూరోపియన్ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్ గబ్బార్డ్ అమెరికన్. కానీ ఆమె తల్లి క్యారెల్ గబ్బార్డ్‌కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్‌పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. ఏం జరిగి ఉండొచ్చు?అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్‌లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్‌హౌస్‌లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్‌కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ట్రంప్.. పొగిడారు కదా!ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్‌మీడియాలో తుల్సీ గబ్బార్డ్ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.తులసి గబ్బార్డ్ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. -
అమెరికా ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా
ఇరాన్‌పై యుధ్దం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం మధ్య అమెరికాలోమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గం నుంచి కీలక వ్యక్తి తప్పుకున్నారు.అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి తులసి గబ్బార్డ్ (45)రాజీనామా చేశారు. ఇది జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది. తన రాజీనామా విషయాన్ని ఆన్లైన్ పంచుకున్నారు.తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆయన్ను దగ్గరుండి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండి, పూర్తి మద్దతు ఇవ్వడానికే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నరగా తనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!ఆమె ప్రకటన ''మా పదకొండు సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచాడు .తూర్పు ఆఫ్రికాలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్‌లో నేను పాల్గొన్నప్పుడు, అనేక రాజకీయ ప్రచారాలలో, మరియు ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా స్థిరంగా నిలబడ్డాడు. అతని బలం, ప్రేమే ప్రతి సవాలులో నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించలేను..అలాగే ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోనేలా చేయడం భావ్యం కాదు’’ అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువుకాగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ట్రంప్ సర్కార్‌లో తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా, క్యాబినెట్ స్థాయి ఇంటెలిజెన్స్ పదవిని చేపట్టిన మొదటి పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ , హిందూ అమెరికన్ అయ్యారు. ఆమె మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ఆర్మీ వెటరన్ కూడా.I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half. Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026 -
ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్!
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భర్తకు మద్దతుగా నిలిచేందుకు తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపిన రాజీనామా లేఖను తులసి గబ్బార్డ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తులసి భర్త అబ్రహం ఇటీవల ఒక అరుదైన బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జూన్ 30 నుం,ఇ తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. "నా భర్త అబ్రహంకు ఇటీవల అత్యంత అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బోయే రోజుల్లో ఆయన ఎన్నో సవాళ్లను, కఠినమైన చికిత్సలను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే ఆయనకు సపోర్ట్‌గా ఉండేందుకు నా పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది.ఈ క్లిష్ట సమయంలో నేను ప్రజా సేవకు దూరంగా జరిగి, ఆయన వెన్నంటే ఉంటూ పూర్తి మద్దతు అందించడం నా బాధ్యత. నాపై నమ్మకం ఉంచి 'ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్ ట్రంప్‌కు ధన్యవాదాలు" అని తన రాజీనామా లేఖలో గబ్బార్డ్ పేర్కొన్నారు.కాగా గబ్బార్డ్ గైర్హాజరీలో జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా ఆరోన్ లూకాస్ వ్యవహరిస్తారని ట్రంప్ ప్రకటించారు. కాగా ఆరోన్ లూకాస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. -
దీపావళి వేడుకల్లో ట్రంప్.. మోదీపై ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (స్థానిక సమయం) వైట్ హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు, భారతీయ అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, దీపావళి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘భారతదేశ ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈరోజు భారత ప్రధానమంత్రి మోదీతో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. మేము ప్రపంచ వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి.. గొప్ప స్నేహితుడు. చాలా ఏళ్లుగా మోదీతో నాకు స్నేహం ఉంది. అలాగే, పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దు అని మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. దాంట్లో వాణిజ్యం కూడా ఉందనేది వాస్తవం. ప్రస్తుతం పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం లేదు. అది చాలా మంచి విషయం’ అని చెప్పుకొచ్చారు.BREAKING 🚨 President Trump just lit the diyas in celebration of Diwali. The Peace President 🙏 pic.twitter.com/kpDLTMRIkf— MAGA Voice (@MAGAVoice) October 21, 2025ఇదే సమయంలో దీపావళి పండుగ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్..‘చీకటిపై కాంతి విజయంలో విశ్వాసానికి చిహ్నంగా మనం దీపాన్ని వెలిగిస్తాము. ఇది అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచి. దీపావళి సందర్భంగా ఆనందించేవారు శత్రువులను ఓడించడం, అడ్డంకులు తొలగించడం.. బందీలను విడిపించడం గురించి పురాతన కథలను గుర్తుచేసుకుంటారు. దీపం నుంచి వచ్చే జ్వాల ప్రతి ఒక్కరికీ జ్ఞాన మార్గాన్ని వెతకడం, శ్రద్ధతో పనిచేయడం, అనేక ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పడం గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.⚡ US President Trump lights a diya in the Oval Office to celebrate Diwali. pic.twitter.com/yFfSgDiEse— OSINT Updates (@OsintUpdates) October 22, 2025వైట్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ODNI డైరెక్టర్ తులసి గబ్బర్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహా ట్రంప్ పరిపాలన నుండి అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ భారతీయ-అమెరికన్ వ్యాపార నాయకుల ప్రతినిధి బృందం కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.NOW — POTUS Hosts A Diwali Celebration In The Oval Office 🪔"In the spirit of Diwali, we should acknowledge all the administration is doing to boost technology innovation leading to economic growth...Mr. President, I'd like to thank you." - Business Leader pic.twitter.com/oYJcaSxmr1— Townhall.com (@townhallcom) October 21, 2025 -
‘ట్రంప్ కమిట్ అయ్యారు.. మోదీ కూడా సీరియస్‌గానే ఉన్నారు’
న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా ఇంటెలిజెన్సీ చీఫ్ తుల్సీ గబ్బార్డ్.. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో సమావేశమయ్యారు. తొలుత రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ఆమె.. ఆ తర్వాత మోదీతో భేటీ అయ్యారు. తుల్సీ గబ్బార్డ్ తో సమావేశం సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ పలు అంతర్జాతీయ సమస్యలపై మాట్లాడారు. ప్రధానంగా ఖలిస్థానీ ఉగ్రవాదంపై రాజ్ నాథ్ సింగ్ చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రసంస్థ ఎస్ఎఫ్ జే(సిక్కు ఫర్ జస్టిస్) తో పాటు దాని వ్యవస్థాపకుడు గురపత్వంత్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాజ్ నాథ్ సింగ్ కోరారు.ట్రంప్, మోదీల లక్ష్యం ఒక్కటే..అయితే ప్రధాని మోదీతో భేటీలో ఉగ్రవాదంపై ప్రధానంగా చర్చించారు తుల్సీ గబ్బార్డ్. ఇదే విషయాన్ని మోదీతో సమావేశం అనంతరం ఆమె వెల్లడించారు. ఉగ్రవాదంపై మోదీ చాలా సీరియస్ గా ఉన్నారన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో ఉన్నారని ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్య్వూలో తుల్సీ గబ్బార్డ్ స్పష్టం చేశారు.‘మా అధ్యక్షుడు ట్రంప్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఉగ్రవాద నిర్మూలనే ఆయన లక్ష్యం. ఉగ్రవాదం ఇప్పుడు మాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికన్ ప్రజలకు ఉగ్రవాదుల నుంచి నేరుగా బెదిరింపులు వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. మేము ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. దీనిపై మోదీ ఎంత సీరియస్ గా ఉన్నారో.. మా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంతే కమిట్మెంట్ తో ఉన్నారు.భారత్ లో ఉగ్రవాద సమస్య ఎలా ఉందో తాము చూస్తూనే ఉన్నామని, అలాగే బంగ్లాదేవ్, ప్రస్తుతం సిరియాలో, ఇజ్రాయిల్ ఇలా చాలా దేశాల్లో పలు రకాలైన ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇది నిజంగా చాలా ముప్పు. ఇక్కడ దేశాలు కలిసి పని చేస్తే వారు ఎక్కడ ఉన్నారో పసిగట్టి దానిని శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది’ అని ఆమె పేర్కొన్నారు.


