ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్! | Tulsi Gabbard Quits As US Intelligence Chief To Support Ill Husband | Sakshi
Sakshi News home page

ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్!

May 23 2026 12:45 AM | Updated on May 23 2026 2:08 AM

Tulsi Gabbard Quits As US Intelligence Chief To Support Ill Husband

యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భర్తకు మద్దతుగా నిలిచేందుకు తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపిన రాజీనామా లేఖను తులసి గబ్బార్డ్ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. 

తులసి భర్త అబ్రహం ఇటీవల ఒక అరుదైన బోన్‌ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జూన్ 30 నుం,ఇ తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. "నా భర్త అబ్రహంకు ఇటీవల అత్యంత అరుదైన బోన్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు  నిర్ధారణ అయ్యింది. బోయే రోజుల్లో ఆయన ఎన్నో సవాళ్లను, కఠినమైన చికిత్సలను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే ఆయనకు సపోర్ట్‌గా ఉండేందుకు నా పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది.

ఈ క్లిష్ట సమయంలో నేను ప్రజా సేవకు దూరంగా జరిగి, ఆయన వెన్నంటే ఉంటూ పూర్తి మద్దతు అందించడం నా బాధ్యత. నాపై నమ్మకం ఉంచి  'ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు ధన్యవాదాలు" అని తన రాజీనామా లేఖలో గబ్బార్డ్‌ పేర్కొన్నారు.

కాగా గబ్బార్డ్ గైర్హాజరీలో జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా ఆరోన్ లూకాస్ వ్యవహరిస్తారని ట్రంప్ ప్రకటించారు. కాగా ఆరోన్ లూకాస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement