ఇరాన్‌పై యుధ్దం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం మధ్య అమెరికాలోమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గం నుంచి కీలక వ్యక్తి తప్పుకున్నారు.అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి తులసి గబ్బార్డ్ (45)రాజీనామా చేశారు. ఇది జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది. తన రాజీనామా విషయాన్ని ఆన్‌లైన్ పంచుకున్నారు.
తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆయన్ను దగ్గరుండి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండి, పూర్తి మద్దతు ఇవ్వడానికే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నరగా తనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!
ఆమె ప్రకటన ''మా పదకొండు సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచాడు .తూర్పు ఆఫ్రికాలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్‌లో నేను పాల్గొన్నప్పుడు, అనేక రాజకీయ ప్రచారాలలో, మరియు ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా స్థిరంగా నిలబడ్డాడు. అతని బలం, ప్రేమే ప్రతి సవాలులో నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించలేను..అలాగే ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోనేలా చేయడం భావ్యం కాదు’’ అని ఆమె వెల్లడించారు.
ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువు
కాగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ట్రంప్ సర్కార్‌లో తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా, క్యాబినెట్ స్థాయి ఇంటెలిజెన్స్ పదవిని చేపట్టిన మొదటి పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ , హిందూ అమెరికన్ అయ్యారు. ఆమె మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ఆర్మీ వెటరన్ కూడా.
I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half.
Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026


