దేశంలో అంటువ్యాధుల కంటే జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల తీవ్రత పెరిగి΄ోతోంది. అందులో హైపర్ టెన్షన్ ఒకటి. నిశ్శబ్దంగా చుట్టుముట్టి.. గుండెను బలహీనపరిచే ఈ హైపర్ టెన్షన్ కంటికి కనిపించని ఒక శత్రువు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి నివేదికల ప్రకారం.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది.
భారత్‌లో సుమారు 30% మంది (దాదాపు 21.20 కోట్ల మంది) అధిక రక్తపోటుతో సతమతమవుతున్నారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది దీని బారిన పడ్డారు.
గతంలో 50 ఏళ్లు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య, ఇప్పుడు 25–30 ఏళ్ల యువతలోనూ అధికంగా కనిపిస్తోంది.
అధ్యయనాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాలతో (10–15%) పోలిస్తే, పట్టణ ప్రాంతాలలో (25%) అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంది.
పురుషుల్లో రక్తపోటు నియంత్రణ 13% మాత్రమే ఉండగా, మహిళల్లో ఇది 22% గా నమోదైంది.
భారతదేశంలో గుండె జబ్బులకు, మరణాలకు అధిక రక్తపోటు ఒక ప్రధాన కారణంగా ఉంది, దీనివల్ల ఏటా సుమారు 16 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ∙సుమారుగా ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస‍్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!
ప్రపంచవ్యాప్తంగా..
30–79 ఏళ్ల మధ్య ఉన్న వారిలో సుమారు 140 కోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అంటే 33 శాతం మంది.
వీరిలో దాదాపు 60 కోట్ల మందికి (44%) అసలు తమకు ఈ సమస్య ఉందనే విషయమే తెలియదు.
కేవలం 44% మంది మాత్రమే వ్యాధిని గుర్తించి చికిత్స పొందదుతున్నారు.
చికిత్స పొందుతున్న వారిలో కేవలం 23% (320 మిలియన్లు) మంది మాత్రమే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు.


