
ఇరాన్ నుండి యెమెన్‌లోని హౌతీలకు బాలిస్టిక్ క్షిపణి భాగాలను అక్రమంగా రవాణా చేసినందుకు పాకిస్తాన్ పౌరుడు ముహమ్మద్ పహ్లావన్‌కు అమెరికాలోని వర్జీనియా కోర్టు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అరేబియా సముద్రంలో అమెరికా సైనిక ఆపరేషన్ సందర్భంగా పహ్లావన్‌ను అరెస్టు చేశారు. గతేదాడి అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టగా, తాజాగా పాక్ పౌరుడు పహ్లావన్‌కు బుక్ అయ్యాదు. హౌతీలకు బాలిస్టిక్ క్షిప;ణులన అందించే క్రమంలో పహ్లావన్ సిబ్బంది తాము మత్స్యకారులుగా నమ్మించి అధికారుల్ని బురిడీ కొట్టించారు.
ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్‌లోని అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, వారు గాజా ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తూ ఆయధాల ఆక్రమ రవాణా చేసేవారు. అయితే తాము హౌతీలకు ఆయుధాలు సరఫరా చేయలేదని ఇరాన్ పదే పదే ఖండిస్తూ వచ్చింది. పహ్లావాన్ పడవలో దొరికిన ఆయుధాల అక్రమ రవాణాను కోర్టు ముందుకు తీసుకొచ్చిన యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు.. ఆయుధ వ్యవస్థలోని అత్యంత శక్తిమంతమైన ఆయధాలుగా నిరూపణ చేశారు. దాంతో పహ్లావన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ యూఎస్ కోర్టు తీర్పు చెప్పింది.