జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో దారుణం జరిగింది. ఇక్కడి ప్రటోరియా సమీపంలో ఓ హాస్టల్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు జొహన్నెస్‌బర్గ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారు.
కాల్పులు జరిపిందెవరో స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికారి అథ్లెండా మాథే తెలిపారు. మృతుల్లో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున 4.30 సమయంలో హాస్టల్‌కు వచ్చి, తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.
ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించినట్లు, దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 2023-24 నివేదిక ప్రకారం హత్యల రేటులో దక్షిణాఫ్రికా టాప్-10లో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందికి గాను 45 మంది హత్యకు గురవుతున్నారు. రోజుకు సగటున 63 హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
BREAKING: PRETORIA MASSACRE
11 Dead in South Africa. A 3-Year-Old Among Them.
At 4:30 AM this morning, three gunmen walked into an illegal tavern at Saulsville Hostel and opened fire on everyone inside.
They did not discriminate.
A three-year-old boy. A twelve-year-old boy. A… pic.twitter.com/cAGTw2sKdr— Shanaka Anslem Perera ⚡ (@shanaka86) December 6, 2025


