పాకిస్తాన్--ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు మళ్లీ భగ్గుమన్నాయి. వీరి మధ్య మధ్య శాంతి ఒప్పందం జరిగిన 48 గంటల వ్యవధిలోనే మళ్లీ ఇరు దేశాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తమ దేశాలనికి చెందిన ఐదుగురు పౌరులు మృతిచెందిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ధృవీకరించింది. ఇరు దేశాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగియాని, పాకిస్తాన్ తమ సరిహద్దులు వెంబడి కాల్పులకు ఉపక్రమించిందని ఆఫ్ఘాన్ అధికారులు స్పష్టం చేశారు. వారి దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టామని, కాకపోతే ఐదుగురు పౌరులు మృత్యువాత పడటం బాధాకరమని ఆఫ్ఘాన్ వర్గాలు పేర్కొన్నాయి.
దాంతో ఇరుదేశాల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయ్యింది. ఈ ఏడాది అక్టోబర్‌లో, ఆపై నవంబర్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగ్గా, తాజాగా వీరి మధ్య మరొకసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ సరిహద్దుల వెంబడి ఇరు దేశాలు కాల్పులు జరుపుకోవడం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
కందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంతో పాటు, అలాగే పాకిస్తాన్ సరిహద్దు చమన్ ప్రాంతం వద్ద కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆఫ్ఘాన్ చెబుతుండగా, ఆఫ్ఘానిస్తానే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని పాకిస్తాన్ అంటోంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాతే ఈ కాల్పుల విరమణ జరిగిందని ఇరు దేశాలు వాదించుకుంటున్నాయి.


