ఆఫ్ఘనిస్థాన్‌లో బహిరంగ మరణ శిక్షలు, కొరడా దెబ్బలు లాంటి అనాగరిక శిక్షలు సర్వ సాధారణంగా. తాజాగా ఆటవిక న్యాయానికి సంబంధించిన మరో అరాచక సంఘటన ఒకటి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖోస్ట్ ప్రావిన్స్‌లో మంగళవారం తాలిబన్లు తొమ్మిది మంది పిల్లలతో సహా ఒకే కుటుంబంలోని 13 మంది సభ్యులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవ్యక్తికి తాలిబన్లు బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. కిక్కిరిసిన స్టేడియంలో ఈ శిక్ష అమలు చేయడం సంచలనం రేపింది.
ఈ ఘటనలో తాలిబన్లు వీడియోలు, ఫోటోలను నిషేధించినప్పటికీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. వేలాదిమంది సమక్షంలో మతపరమైన నినాదాల మధ్య, కోస్త్ ప్రావిన్స్‌లోని స్టేడియంలో 80 వేల మంది చూస్తుండగా శిక్ష అమలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అమానవీయం అంటూ తాలిబన్ల చర్యను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. అలాగే అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు తాలిబన్ల వైఖరిని తప్పుబట్టాయి.
అసలు ఏం జరిగింది?
తాలిబన్ అధికారులు ఉరితీసిన వ్యక్తిని మంగళ్‌గా గుర్తించారు. సుమారు పది నెలల క్రితం మంగళ్ స్థానిక నివాసి అబ్దుల్ రెహమాన్‌తోపాటు, 12 మంది కుటుంబ సభ్యులను చంపినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు. హతుల్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. తాలిబన్ ప్రకారం, ఈ శిక్షను మొదటి దశ, అప్పీల్ కోర్టులు , సుప్రీంకోర్టు సమర్థించాయి. దీంతో మంగళ్‌కు తాలిబన్లు మరణశిక్షను అమలు చేశారు. ఆఫ్ఘన్ మీడియా నివేదిక ప్రకారం తాలిబన్ల క్విసాస్ (ప్రతీకారం) కింద, నేరస్థుడిని క్షమించే అవకాశాన్ని బాలుడు నిరాకరించాడంతో స్వయంగా బాధితురాలి కొడుకు, తన కుటుంబ సభ్యులను కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు చేత ఈ ఉరిశిక్షను అమలు చేయించారు.
The #Taliban have turned #Afghanistan into an exhibition of brutality: yesterday flogging, today a public execution in the Khost stadium. A man was gunned down on the orders of #Hibatullah, in front of hundreds of children and teenagers and most shocking of all, the final shot… pic.twitter.com/cfrlwvWgMR
— Golchehrah Yaftali (@womenaidafghan1) December 2, 2025
ఈ అమానవీయ ఘనటపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ ఈ చర్యను క్రూరమైన శిక్షగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి వాటిని తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.


