అఫ్గానిస్థాన్ లో నిన్న అర్థరాత్రి జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఒక మహిళ మృతి చెందారు. ఈ దాడులకు పాకిస్థానే కారణమని అఫ్గాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్థాన్ తమ దేశంలోని పౌరుల ఇళ్లే టార్గెట్‌గా దాడి చేసిందని పేర్కొన్నారు. కాగా ఈ దాడిపై పాక్ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పాక్- అఫ్గాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్థాన్ సేనలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్‌బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపై దాడి చేశాయని మంగళవారం తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడిలో 9 మంది చిన్నారులతో పాటు ఒక మహిళ మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కూనార్ తో పాటు మరో ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా నిన్న పాకిస్థాన్ పెషావర్‌లో పాక్ పారామిలటరీ కేంద్రం టార్గెట్‌గా దాడులు జరుగగా అందులో ఆరుగురు మృతిచెందారు. ఆ మరునాడే ఆప్గానిస్థాన్‌లో దాడులు జరుగడంతో ఈ ఘటన పాకిస్థాన్ చర్యేనని ఆప్గాన్ ఆరోపిస్తు్ంది.
అయితే ఈ దాడిపై పాకిస్థాన్ ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 12మంది పౌరులు మృతి చెందారు. ఆ ఘటనకు టీటీపీ కారణమని ప్రకటించారు. కాగా అఫ్గాన్ టీటీపీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని పాక్ నిందిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి వెనుకాడబోమని ఆ దేశ మంత్రి ఖవాజా ప్రకటించారు. ఈ బాంబుదాడులతో ప్రస్తుతం రెండు దేశాల మధ్య సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి.


