ఇరాన్‌లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలలో మరణాల సంఖ్య 62కి పెరిగింది.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రంప్‌కు రెజా పహ్లవి విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లో నిరసనలు చెలరేగుతున్న ఇరాన్ దివంగత రాజు బహిష్కృత కుమారుడు రెజా పహ్లవి కోరడం హాట్ టాపిక్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్టర్ అమెరికా ప్రెసిడెంట్.. దయచేసి ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కోరాడు.
మరోవైపు నిరసనకారులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ హెచ్చరించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలాంహోస్సేన్ మొహ్సేని-ఎజెయ్ శిక్షను అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన నిరసనకారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్, విదేశీ దేశాలతో కమ్యూనికేషన్‌ను నిషేధించింది.
నిరసనల మధ్య ఖమేనీ ప్రసంగం
టెహ్రాన్‌లో అశాంతి మధ్య.. సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా సమస్యలపై దృష్టి పెట్టాలని ట్రంప్‌కు సూచించారు. నిరసనకారులు మరొక దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖమేనీ అన్నారు. దేశం విదేశీ కిరాయి సైనికులను సహించదని ఖమేనీ స్పష్టంగా పేర్కొన్నారు. నిరసనలపై ఇరాన్ రాష్ట్ర టీవీ ఒక నివేదికలో ఇజ్రాయెల్ మరియు అమెరికన్ "ఉగ్రవాద ఏజెంట్లు" హింసను ప్రేరేపించారని నిందించిన తర్వాత సుప్రీం లీడర్ ప్రకటన వచ్చింది.
Mr. President, this is an urgent and immediate call for your attention, support, and action. Last night you saw the millions of brave Iranians in the streets facing down live bullets. Today, they are facing not just bullets but a total communications blackout. No Internet. No…
— Reza Pahlavi (@PahlaviReza) January 9, 2026


