2026 అండర్-19 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 9) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మహబూబ్ ఖాన్ నియమితుడయ్యాడు. స్టార్ బ్యాటర్లు ఉజైరుల్లా నియాజై, ఖాలిద్ అహ్మద్‌జై, ఉస్మాన్ సదత్, అజీజ్ మియా ఖిల్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. నియాజై ఇటీవలి బంగ్లాదేశ్ పర్యటనలో, ఆసియా కప్ 2025లో సత్తా చాటాడు.
బౌలింగ్ విభాగంలో నూరిస్తానీ ఓర్మాజీ (ప్రధాన పేస్ బౌలర్), స్పిన్ విభాగంలో జియాతుల్లా షాహీన్, హఫీజ్‌ఉల్లా జద్రాన్, వహీద్‌ఉల్లా జద్రాన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అండర్-19 విభాగంలోనూ ఆఫ్ఘనిస్తాన్‌కు స్పిన్ బౌలింగే ప్రధాన ఆయుధం.
ఈ జట్టులో ఖతీర్ స్టానిక్‌జై, అబ్దుల్ అజీజ్, సలామ్ ఖాన్, రోహుల్లా అరబ్, హఫీజ్ జద్రాన్ పరిశీలించదగ్గ ఆటగాళ్లు. రిజర్వ్ ప్లేయర్లుగా అఖిల్ ఖాన్, ఫహీమ్ ఖాసిమీ, ఇజాత్ నూర్ ఎంపికయ్యారు.
ఈ మెగా టోర్నీ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ఇండియా, యూఎస్‌ఏ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం జనవరి 16న సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం 18న వెస్టిండీస్‌తో, 21న టాంజానియాతో తలపడనుంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆసియా క్వాలిఫయర్‌లో నేపాల్‌పై నెట్ రన్ రేట్ ఆధారంగా ముందంజ వేసి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.
అండర్19 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ పూర్తి జట్టు..
మహబూబ్ ఖాన్ (c), ఖాలిద్ అహ్మద్‌జై, ఉస్మాన్ సదత్, ఫైసల్ ఖాన్, ఉజైరుల్లా నియాజై, అజీజ్ మియా ఖిల్, నజీఫ్ అమిరి, ఖతీర్ స్టానిక్‌జై, నూరిస్తానీ, అబ్దుల్ అజీజ్, సలామ్ ఖాన్, వహీద్ జద్రాన్, జియాతుల్లా షాహీన్, రోహుల్లా అరబ్, హఫీజ్ జద్రాన్
రిజర్వ్స్: అఖిల్ ఖాన్, ఫహీమ్ ఖాసిమీ, ఇజాత్ నూర్


