న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లు దూరం | New Zealand Announces Squad For 5 Match T20 Series Against South Africa, Mitchell Santner To Lead And Finn Allen Rested | Sakshi
Sakshi News home page

NZ vs SA: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లు దూరం

Mar 11 2026 9:08 AM | Updated on Mar 11 2026 10:21 AM

Mitchell Santner To Lead, Finn Allen Rested As New Zealand Name Squad For SA Series

టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత న్యూజిలాండ్ తమ మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో 18 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్ర‌క‌టించింది.

ఈ జ‌ట్టుకు మిచెల్ సాంట్నర్ జట్టుకు సారథ్యం వ‌హించ‌నున్నాడు. అదేవిధంగా ప్రపంచ కప్ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీలు వంటి స్టార్ ప్లేయ‌ర్లకు సెలెక్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు.

కటేన్ క్లార్క్, నిక్ కెల్లీ, జేడన్ లెన్నాక్స్‌ల‌కు సెలెక్ట‌ర్లు పిలుపునిచ్చారు. అలాగే ఆల్‌రౌండ‌ర్ జోష్ క్లార్క్‌స‌న్‌ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత జ‌ట్టులోకి వ‌చ్చాడు. బెవాన్ జాకబ్స్, జాక్ ఫౌల్క్స్,టిమ్ రాబిన్సన్ కూడా పునరాగమనం చేశారు. వీరు ముగ్గురు భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఉన్నారు.

కాగా కెప్టెన్ శాంట్న‌ర్ తొలి మూడు మ్యాచ్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాడు. ఆ త‌ర్వాత ఆఖ‌రి రెండు టీ20ల్లో టామ్ లాథ‌మ్ కివీస్ జ‌ట్టును నడిపించ‌నున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 రన్నరప్‌గా న్యూజిలాండ్‌ నిలిచిన సంగతి తెలిసిందే.

సౌతాఫ్రికా సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టు
కటేన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, బెవాన్ జాకబ్స్, కైల్ జెమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, జేడన్ లెన్నాక్స్, కోల్ మెక్కాన్చీ, జిమ్మీ నీషమ్, టిమ్ రాబిన్సన్, బెన్ సీర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి.
చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement