హెచ్‌సీఎ కొత్త కార్యదర్శిగా జీవన్‌ రెడ్డి | Jeevan Reddy Unanimously Elected As The Secretary Of The Hyderabad Cricket Association, More Details Inside | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎ కొత్త కార్యదర్శిగా జీవన్‌ రెడ్డి

Mar 11 2026 7:50 AM | Updated on Mar 11 2026 9:50 AM

Jeevan Reddy unanimously elected as the Secretary of the Hyderabad Cricket Association

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కొత్త కార్యదర్శిగా ఎం.జీవన్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 15న కార్యదర్శి పదవి కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జీవన్‌ రెడ్డితో పాటు ఈ పదవి కోసం నామినేషన్‌ వేసిన మరో నలుగురు తప్పుకున్నారు.

చిట్టి శ్రీధర్, అనిల్, హరినారాయణ, బాబూరావు తమ నామినేషన్లను చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో జీవన్‌ రెడ్డికి పోటీ లేకుండా పోయింది. ప్రతిష్టాత్మక ఫార్మా సంస్థ ఎంఎస్‌ఎన్‌ లాబొరేటరీస్‌లో జీవన్‌ రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 

కార్యదర్శి ఎంపిక ఖరారు కావడంతో ఈ నెల 15న కేవలం హెచ్‌సీఏ కోశాధికారి పోస్టు కోసం ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వీఎస్‌ సంపత్‌ వెల్లడించారు. కార్యదర్శి పదవికి బాబూరావు, అనిల్‌ కుమార్, హరినారాయణ, ఆగం రావు పోటీ పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement