వివాదంలో సంజయ్‌ మంజ్రేకర్‌! | Sanjay Manjrekar Controversial Comments About Team India, Says ICC Test Championship More Prestigious Than T20 World Cup | Sakshi
Sakshi News home page

వివాదంలో సంజయ్‌ మంజ్రేకర్‌!

Mar 11 2026 11:30 AM | Updated on Mar 11 2026 11:48 AM

Sanjay Manjrekar Controversial Comments About Team India

భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ తాను సంతోషంగా లేనంటూ పేర్కొన్నాడు. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ, తన దృష్టిలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిచినప్పుడే అన్ని ఫార్మాట్లలో చాంపియన్‌గా భారత్‌ పరిపూర్ణమవుతుందని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.ఇదే విషయమై సంజయ్‌ మంజ్రేకర్‌ తన సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించాడు.

‘క్రికెట్‌ అభిమానులు అన్ని ఐసీసీ ట్రోఫీలను ఒకలా చూడలేరు. నా దృష్టిలో టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌కు ఎక్కువ ప్రాధానత్య ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్‌ గెలవడం కంటే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిస్తే వచ్చే మజా వేరుగా ఉంటుంది. ఐసీసీ టైటిల్స్‌ ర్యాంకింగ్‌ ప్రకారం చూస్తే మొదట వన్డే వరల్డ్‌కప్‌, రెండో స్థానంలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌, మూడో స్థానంలో టీ20 ప్రపంచకప్‌, నాలుగో స్థానంలో చాంపియన్స్‌ ట్రోఫీ ఉంటాయి. కనీసం వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపాడు.

మీ తలకు తుపాకీ పెట్టారా?
అయితే సంజయ్‌ మంజ్రేకర్‌ మాటలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్‌ ఐసీసీ ట్రోఫీలు గెలవడం సంజయ్‌కు ఇష్టం లేదేమో’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఇక కమెడియన్‌ అబిజిత్‌ గంగూలీ సంజయ్‌ మంజ్రేకర్‌కు ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ టీ20 ప్రపంచకప్‌ గెలిచిందని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీ తలకు తుపాకీ పెట్టి ఎవరు ఇలా చెప్పమని అడగరు. సానియా మీర్జా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది.. కానీ అది సింగిల్స్‌లో కాదు డబుల్స్‌లో అన్నట్లుగా మీరు చెప్పిన విషయముంది. ఫార్మాట్‌ ముఖ్యం కాదు ఆమె నంబర్‌వన్‌ ర్యాంకు అందుకోవడం గొప్ప విషయం. అలాగే భారత్‌ కూడా ఏ ఫార్మాట్‌లో కప్పు కొట్టాలన్నది ముఖ్యం కాదు.’ అని ట్వీట్‌ చేశాడు.

ఇదేమీ కొత్త కాదు..
కాగా సంజయ్‌ మంజ్రేకర్‌ వివాదంలో చిక్కుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2024లో బోర్డర్ గావస్కర్‌ సిరస్ సందర్భంగ ‘కోచ్‌ గౌతమ్ గంభీర్‌ ప్రెస్‌ కానఫఫరెన్స్‌కు దూరంగా ఉంటే మంచిదేమో. మీడియ సమావేశాల కంటే కోచ్‌గా తన పని తాను సక్రమంగా చేస్తే మంచిదనుకుంటా’ అని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. మొత్తం మీద తన చర్యలతో సంజయ్ మంజ్రేకర్ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.

చదవండి: టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement