టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు | T20 World Cup Victory: PM Narendra Modi praises Team India | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్ కప్ విజయం.. భారత్ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు

Mar 9 2026 12:07 AM | Updated on Mar 9 2026 12:12 AM

T20 World Cup Victory: PM Narendra Modi praises Team India

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం దూకుడుగా ఆడిన టీమిండియా చివరి మ్యాచ్‌లో కూడా తమ ప్రతిభ చాటుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత్ జట్టును అభినందించారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. “ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ ఘనతకు టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.

భారత్ జట్టు సాధించిన ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. క్రీడల పట్ల దేశంలో ఆసక్తిని మరింత పెంచే ఘనత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement