కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పామర్రులోని యడదిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ (15)పై పక్కింటి వ్యక్తి బొట్టు సాంబశివరావు దొంగతనం నింద మోపాడని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ ఇంట్లో రూ.1500 పోయాయని, అది బాలుడు తీసుకున్నాడని ఆరోపించాడు సాంబశివరావు. ఆ డబ్బును యశ్వంత్ పేరెంట్స్ తిరిగి ఇవ్వబోగా.. సాంబశివరావు నిరాకరించాడు. అయితే తమ ఇంట్లో ఏది పోయినా యశ్వంత్‌దే బాధ్యత అంటూ మరింతగా బెదిరించాడు. అంతటితో ఆగక తన బంధువైన రిటైర్డ్ ఏఎస్ఐతో ఫోన్ చేయించి బాటుడిపై ఒత్తిడి చేశాడు.
సాంబశివరావు బెదిరింపులకు భయపడి, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక యశ్వంత్ మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన యడదిబ్బ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక చిన్నారి ప్రాణం అనవసరమైన నిందలతో ముగియడం స్థానికులను కలచివేసింది.


