రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్
మచిలీపట్నంటౌన్: నగరంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాసం సంద ర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న ఆలయ ప్రాంగ ణంలోని 35 అడుగుల ధ్యాన ముద్రలోని పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు కలిసి కోటి దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ చింతపట్ల వేంకటాచారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ దేసు నిరాజ, కార్యనిర్వహణా ధికారి సమ్మెట ఆంజనేయస్వామికి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్పొరేటర్ చిత్త జల్లు నాగరాము, సబ్ జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి.ఫణికుమార్, ఆలయ మాజీ చైర్మన్ దేసు సుబ్రహ్మణ్యేశ్వరరావు, కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ మామిడి మురళీకృష్ణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ దిలీప్, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, గుడివాడ క్రైమ్ సీఐ ఇంజరపు రమణీ తదితరులు పాల్గొన్నారు.


