భద్రత తడబడిన బస్సులు
నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో బయటపడిన వైనం 28 బస్సులపై కేసులునమోదు చేసిన అధికారులు
యాజమాన్యాలపై కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లలకు పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే బస్సుల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. ఆర్టీఏ నిబంధనలను అనుసరించి స్కూల్ బస్సులకు ఉండాల్సిన ప్రమాణాలను ఆయా యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బస్సు నుంచి బయట పడేందుకు ఉన్న అత్యవసర ద్వారాలపై కూడా పిల్లలకు అవగాహన కలిగించడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఆర్టీఏ అధికారులు జరిపిన తనిఖీల్లో స్కూల్ బస్సుల డొల్లతనం బయటపడింది. అనేక లోపాలను గుర్తించిన ఆర్టీఏ అధికారులు బస్సులపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయా పాఠశా లల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరిస్తున్నారు.
రెండు రోజులుతనిఖీలు
రవాణాశాఖ అధికారులు జిల్లాలో పది ప్రత్యేక బృందాలతో స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు చేశారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎ. మోహన్ నేతృతంలో రెండు రోజుల పాటు 125 బస్సులను తనిఖీ చేశారు. స్కూల్ బస్సులకు ఉండా ల్సిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ వయస్సు, అనుభవం, లైసెన్స్, బస్సుకు అత్యవసర ఉందా, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? ఫిట్‌నెస్ పరిస్థితి ఏమిటి అన్న అంశాలను తనిఖీ చేశారు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో స్కూలు బస్సుల డొల్లతనం బయటపడింది. అంతేకాదు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పిల్లలు అత్యవసర ద్వారా నుంచి ఎలా బయట పడాలో కూడా తెలియజేయడం లేదని గుర్తించారు. అసలు ఆ ద్వారం ఉన్నట్లు కూడా పిల్లలకు తెలియదని తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని బస్సులు కనీస నిబంధనలు పాటించకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటం అడుతున్నట్లు గుర్తించారు.
కేసులు నమోదు
రవాణా శాఖ అధికారులు తొలిరోజు 60 బస్సులు తనిఖీ చేయగా, నిబంధనలు పాటించని 16 బస్సులపై కేసులు నమోదు చేశారు. రెండో రోజు 65 బస్సులను తనిఖీ చేయగా, వాటిలో లోపాలు గుర్తించిన 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఆయా బస్సులు నడుపుతున్న స్కూల్ యాజమాన్యాలపై కూడా చర్యలు ఉంటాయని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ిపిల్లలను తరలించే స్కూల్ బస్సులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండాలని ఆర్టీఏ అధికారులు చెపుతున్నారు.
పిల్లలకు అవగాహన
రవాణా అధికారులు బస్సులను తనిఖీ చేయడమే కాకుండా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బస్సు నుంచి ఎలా బయట పడాలో కూడా పిల్లలకు అవగాహన కలిగించారు. బస్సును నిలిచి అత్యవసర ద్వారం నుంచి పిల్లలను కిందకు దించారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని స్కూలుకు బస్సుల్లో పంపించేటప్పుడు ఆయా బస్సుల పరిస్థితిని కూడా గమనించాలంటున్నారు. ఏదైనా లోపాలు ఉంటే సంబంధిత కళాశాలకు వెంటనే ఫిర్యాదు చేయాలంటున్నారు. స్పందిచక పోతే, రవాణాశాఖకు, పోలీసులకు తెలియచేయాలని ఆర్టీఏ అధికారులు సూచించారు.
స్కూల్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే ఆయా బస్సులపై కేసులు నమోదు చేయడమే కాకుండా వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లలను బస్సుల్లో పంపించేటప్పుడు ఆయా బస్సుల పరిస్థితిని గమనించాలి. భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. తనిఖీలు చేసేటప్పుడు అత్యవసర సమయంలో బస్సు నుంచి ఎలా బయటపడాలో కూడా పిల్లలకు అవగాహన కలిగిస్తున్నాం.
– ప్రవీణ్, ఆర్టీఓ, విజయవాడ
భద్రత తడబడిన బస్సులు
భద్రత తడబడిన బస్సులు


