బ్రెజిల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి జిమ్ చేస్తూ కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో ఉన్న ఒక జిమ్‌లో రొనాల్డ్ మోంటెనెగ్రో కసరత్తు చేస్తున్నాడు. రోజూ వ్యాయామం చేసే జిమ్‌లోనే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్‌లోని ఈశాన్య తీరంలోని రెసిఫే నగరానికి సమీపంలోని ఒలిండాలో ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది.
రోనాల్డ్ మోంటెనెగ్రో బెంచ్ ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బార్‌బెల్ జారి ఛాతీపై పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. బార్‌బెల్ జారి బార్బెల్ ఛాతీపై పడింది. దీని తర్వాత తొలుత లేచాడు కానీ సెకన్లలోనే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తుచేశారు. ఇది ఒక ప్రమాదమని ప్రాథమికంగా భావించారు.
☠️A Brazilian man lost control of a barbell and died right in the gym
He was using an unsafe grip — without wrapping his thumb around the bar. It slipped, crashed onto his chest, and the impact caused his heart to stop.
👍Gym lovers, watch your thumbs — it might literally save… pic.twitter.com/mSEiq5vdqj— NEXTA (@nexta_tv) December 4, 2025
దీనికి సంబంధించిన వీడియెనెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు.స్పాటర్ ఉండటంఅందుకే చాలా ముఖ్యం! ఇలాంటివి చేసేటపుడు ట్రైనర్ కచ్చితంగా ఉండాలని కొందరు విచారం వ్యక్తం చేశారు. అయ్యో.. కొన్ని సెకన్లలోనే జీవితం మారి పోయింది అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు మోంటెనెగ్రో పని చేసే పలాసియో డోస్ బోనెకోస్ గిగాంటెస్ మ్యూజియం, ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జిమ్, RW అకాడెమియా కూడా దాని సోషల్ మీడియాలో విచారాన్ని వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తే


