హర్యానాకు చెందిన ఐఐటీ బాంబే విద్యార్థిని షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. క్యాంపస్ మెస్ ఫుడ్ ఎలా ఉంది అనే విషయాలతో తన అనుభవాన్ని పంచుకుంది.
భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో ఒకటైన ఐఐటీ బాంబే మెస్ గురించి అక్కడ చదువుకుంటున్న గరిమా తన యూ ట్యూబ్‌లో ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. ఇక్కడ మెస్ చాలా హైజీనిక్‌గా ఉంటుందని,ఫుడ్ కూడా చాలా బావుంటుందని వివరించింది. అంతే ఈ చిన్న యూట్యూబ్ వీడియో వైరల్ అయింది.
"నేను హర్యానా నుండి వచ్చాను, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ఆహార సంస్కృతిని ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఐఐటీ బాంబే నాకు ప్రతిదీ పరిచయం చేస్తోంది."అని పేర్కొంది. ఇది 12 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించింది. 4 లక్షలకు పైగా కామెంట్లువెల్లువెత్తాయి. 2024లో పోస్ట్ చేసిన ఈ వీడియో మళ్లీ ఇపుడు వైరలవుతోంది. 1300 కమెంట్స్ రావడంతో నెట్టింట ఇంట్రస్టింగ్‌గా మారింది.
కాగా గరిమా @garimabagar పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. IIT బాంబే మెస్ టూర్‌లో ప్రతి పండుగ మెస్‌లో మా ప్లేట్‌లో కనిపిస్తుంది." అంటూ అక్కడ వడ్డించే ఆహారం గురించి మాట్లాడుతుంది.పొంగల్ సమయంలో, అరటి ఆకుల్లో భోజనాన్ని వడ్డించడం,విద్యార్థులు నేలపై కూర్చుని తినడం గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. పొంగల్ రోజున, క్యాంటీన్ లోపల రంగోలి సాంప్రదాయ లేఅవుట్‌లో భోజనం వడ్డించారు. బియ్యం, సాంబార్, చట్నీ . స్వీట్లు వంటి వంటకాలను అరటి ఆకులపై వడ్డించాన్ని ఈ వీడియో చూడవచ్చు.
అంతేకాదు ఈ సంప్రదాయంలో భాగంగా విద్యార్థులు నేలపై కూర్చుని తినడానికి ,,చెప్పులు తీసేసారని, తొలిసారి, సాంప్రదాయ దక్షిణ భారత పండుగ భోజనాన్ని ఆస్వాదిస్తున్నామని నిజంగా ఇది భిన్నమైన అనుభవం అని ఈ వీడియోలో వివరించింది. మరికొన్ని రోజుల్లో పొంగల్ సందడి రానున్న సందర్భంగా మళ్లీ ఇపుడు ఈ వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది.


