
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ (Dhruv Vikram) నటించిన తాజా చిత్రం బైసన్.

ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఇప్పటికే విడుదలైంది. ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.











