breaking news
Bison
-
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఫ్రైడే వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు ఇక పండగే. థియేటర్లతో పాటు ఓటీటీల్లో వరుసపెట్టి సినిమాలు సందడి చేస్తుంటాయి. ఇకపోతే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. తెలుగులో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి. వీటిలో ది బెంగాలీ ఫైల్స్ అనే కాంట్రవర్సీ సినిమా కూడా ఉంది. అంతేకాకుండా విక్రమ్ తనయుడు నటించిన బైసన్, 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా సందడి చేయనుంది. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.ఈ ఫ్రైడే ఓటీటీ మూవీస్ ఇవే..నెట్‌ఫ్లిక్స్ బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21 ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21 హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21 డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21 వన్ షాట్ విత్ ఈడ్ షీరాన్(హాలీవుడ్ మూవీ)- నవంబరు 21అమెజాన్ ప్రైమ్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21జియో హాట్‌స్టార్ జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21 ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో(కామెడీ సిరీస్)- నవంబర్ 21 ర్యాంబో ఇన్ లవ్(తెలుగు వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్స్)- నవంబర్ 21 అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21 కర్మణ్యే వాధికరస్తే(తెలుగు సినిమా)- నవంబరు 21 డీజిల్(తెలుగు సినిమా)- నవంబరు 21జీ5 ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21మనోరమ మ్యాక్స్షేడ్స్ ఆఫ్ లైఫ్(మలయాళ సినిమా)- నవంబరు 21లయన్స్ గేట్ ప్లే..టన్నెల్(తమిళ సినిమా)- నవంబర్ 21 -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి బోలెడన్ని సినిమాలు రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేశ్ '12ఏ రైల్వేకాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే', రాజు వెడ్స్ రాంబాయి, ఇట్లు మీ ఎదవ, పాంచ్ మినార్, ప్రేమలో రెండోసారి, కలివనం అనే తెలుగు చిత్రాలతో పాటు మఫ్టీ పోలీస్, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్‌లెస్ అనే డబ్బింగ్ మూవీస్ రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్)ఓటీటీల్లో రిలీజయ్యే వాటిలో.. తమిళ హిట్ సినిమా 'బైసన్', కాంట్రవర్సీ చిత్రం 'ద బెంగాల్ ఫైల్స్' ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' సీజన్ కూడా ఇదే వీకెండ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు కచ్చితంగా చూడాల్సినవి కాగా వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఈ వారంలో రవితేజ 'మాస్ జాతర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 17 నుంచి 23వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్ద మైటీ నెన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 19ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 21నెట్ఫ్లిక్స్బ్లాక్ టూ బ్లాక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17బేబ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17షాంపేన్ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19బైసన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - నవంబరు 21హోమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21ట్రైన్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 21హౌమ్ బౌండ్ (హిందీ మూవీ) - నవంబరు 21డైనింగ్ విత్ ద కపూర్స్ (హిందీ రియాలిటీ షో) - నవంబరు 21హాట్స్టార్ల్యాండ్ మ్యాన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17నైట్ స్విమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 19ద రోజెస్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20నాడు సెంటర్ (తమిళ సిరీస్) - నవంబరు 20జిద్దీ ఇష్క్ (హిందీ సిరీస్) - నవంబరు 21అజ్టెక్ బ్యాట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 23సన్ నెక్స్ట్ఉసిరు (కన్నడ సినిమా) - నవంబరు 21జీ5ద బెంగాల్ ఫైల్స్ (హిందీ మూవీ) - నవంబరు 21(ఇదీ చదవండి: ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ ఎమోషనల్) -
ఓటీటీలో హిట్ సినిమా 'బైసన్'.. స్ట్రీమింగ్కు రెడీ
విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన సూపర్ హిట్ సినిమా బైసన్(Bison) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం మొదట తమిళ్ ఆ తర్వాత అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాతో ధ్రువ్‌కు నేషనల్ స్థాయిలో అవార్డ్ రావచ్చని కూడా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.బైసన్(Bison) సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నవంబర్ 21 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ఆ సంస్థ ఒక పోస్టర్‌తో ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఈ వీకెండ్లో ఓటీటీలో చూసేయండి.కథేంటంటే?తమిళనాడుకు చెందిన కబడ్డీ క్రీడాకారుడైన మనతి గణేశన్ జీవితం ఆధారంగా బైసన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ మొత్తం 1990 దశకం నేపథ్యంలో సాగుతుంది. వనతి కిట్టన్(ధ్రువ్ విక్రమ్) జపాన్‌లో జరుగుతున్న 12వ ఆసియా క్రీడలకు ఎంపికవుతాడు. ఎన్నోఏళ్లపాటు ఎదురుచూస్తున్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని తన గ్రామం మొత్తం సంతోషంలో ఉంటారు. కానీ, పలు కారణాల వల్ల అతను మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం దొరకదు. తనలో ప్రతిభ ఉన్నప్పటికీ ఎక్స్ట్రా ప్లేయర్‌గా బెంచ్‌కి పరిమితం అవుతాడు. ఈ క్రమంలోనే ఇండియా, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దవుతుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక అయిన తర్వాత కూడా తనని బరిలోకి దింపకపోవడంతో నిరాశకు గురవుతాడు. అలాంటి సమయంలో కిట్టన్ ఏం చేశాడు.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కిట్టన్ పాక్ జట్టుతో పోటీకి దిగాడా.. అతన్ని అడ్డుకున్నది ఎవరు.. అనేది తెలియాలంటే బైసన్ చూడాల్సిందే. -
విక్రమ్ తనయుడి బైసన్.. ఓటీటీకి వచ్చేది ఆ రోజే!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించిన చిత్రం బైసన్. ఇటీవలే దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని కబడ్డీ బ్యాక్ డ్రాప్లో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాను ఓ వారం రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 24న తెలుగులోనూ విడుదల చేశారు. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ధ్రువ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం నవంబర్ 21 నుంచి డిజిటల్‌గా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ నెలలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్‌న్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమే బైసన్. #BisonKaalamaadan is expected to be streaming on November 21 in #Netflix !#SaiSango #TAMILTVHouse #DhruvVikram #Pasupathy #AnupamaParameswaran #BisonKaalamaadanOnNetflix pic.twitter.com/QxFLAk6e7x— TAMIL TV House (@tamiltvhouse) November 10, 2025 -
కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్.. భారీ సాయం
తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత U-18 మహిళల కబడ్డీ జట్టు వైస్-కెప్టెన్ కార్తీకకు రూ. 5 లక్షలు ప్రోత్సాహకంగా అందించారు. తమిళనాడుకు చెందిన కార్తీక రీసెంట్గా బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్ తరపున స్వర్ణం సాధించింది. ఇప్పటికే కార్తీక జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 20 లక్షలు అందించారు. భారత్‌తో పాటు తమిళనాడు కీర్తిని ఆమె పెంచిందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న కార్తీక చాలా పేదరికంతో ఉన్న కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్ మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై భారత్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపులో కార్తీకది కీలక పాత్ర ఉంది. దేశ కీర్తిని పెంచిన ఆ జట్టుకు మారి సెల్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఆమె ఇంటికి వెళ్లి రూ. 5 లక్షల చెక్‌ను బహుమతికి ఇచ్చారు. కన్నగి నగర్ కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు.కబడ్డీ నేపథ్యంతో బైసన్మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్‌విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. నటి అనుపమపరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి, దర్శకుడు అమీర్, లాల్, మదన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్‌న్స్ పతాకంపై దర్శకుడు రంజిత్ నిర్మించారు. కబడ్డీ నేపథ్యంతో విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయం సాధించింది. బైసన్ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల తిలకించారు. ఆపై చిత్ర యూనిట్‌ను వారు మెచ్చుకున్నారు.சமீபத்தில் பஹ்ரைனில் நடந்த ஆசிய இளைஞர் விளையாட்டுப் போட்டியில் தங்கம் வென்ற இந்திய U-18 பெண்கள் கபடி அணியின் துணைத் தலைவராக விளையாடிய கார்த்திகா இந்தியாவிற்கும் தமிழ்நாட்டிற்கும் பெருமை தேடித்தந்து இறுதிப் போட்டியில் ஈரான் அணிக்கு எதிரான ஆட்டத்தில் பெற்ற வெற்றியில் அவர் முக்கிய… pic.twitter.com/nzTwkf1Aia— Mari Selvaraj (@mari_selvaraj) October 30, 2025 -
'బైసన్' కోసం పల్లెటూరి అమ్మాయిలా మేకప్ లేకుండా (ఫొటోలు)
-
బైసన్ కలెక్షన్స్.. బిగ్ మార్క్ అందుకున్న ధ్రువ్
విక్రమ్ కుమారుడు ధ్రువ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison). మొదట తమిళ్లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో కూడా రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైసన్ రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ చిత్రం కేవలం పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధికంగా థియేటర్స్ పెరగడం విశేషం. అయితే, తెలుగులో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించేలా బైసన్ ఉంది.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he's breaking those barriers right away!!💥🦬55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025 -
'బైసన్' కోసం ధ్రువ్ కష్టం.. మేకింగ్ వీడియో విడుదల
తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన చిత్రం బైసన్.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ తనకు జోడీగా నటించింది. అయితే, కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కబడ్డీ ఆటగాడిగా ధ్రువ్ పడిన కష్టం ఏంటి అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాలో ధ్రువ్ నటన పట్ల విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. -
‘బైసన్’ మూవీ ప్రెస్ మీట్ లో మెరిసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
ధ్రువ్ విక్రమ్ సినిమా.. భారీగా 'బైసన్' కలెక్షన్స్
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్‌లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్‌గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్‌ను గుర్తు చేశారు. Extremely grateful for all your love! #BisonKaalamaadan grows over a hundred percent over day one and is roaring at the box office. Just Tamil version collects 35cr gross collections worldwide New Raid #Bison ready for Telugu release 🦬#BisonKaalamaadan 🦬 #DiwaliWinner 💥… pic.twitter.com/FqeV8unvls— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025 -
'బైసన్' తర్వాత టాలెంటెడ్ దర్శకుడితో 'ధ్రువ్' కొత్త సినిమా
కోలీవుడ్‌లో ఆదిత్య వర్మ చిత్రంతో విక్రమ్ వారసుడిగా ధ్రువ్ పరిచయం అయ్యాడు. అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌గా తమిళ్లో విడుదలైంది. అలా తొలి చిత్రంతోనే నటనలో సత్తా చాటుకున్న ధ్రువ్‌కు ఆ చిత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాతి చిత్రం మహాన్ కూడా నేరుగా ఓటీటీలో స్ట్రమింగ్ కావడంతో సరైన థియేటరికల్ చిత్రం కోసం చాలా రోజులు వేచి చూశారు. అలాంటి సమయంలో దర్శకుడు మారీ సెల్వరాజ్ దృష్టిలో ధ్రువ్ పడ్డారు. ఫలితంగా బైసన్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 17వ తేదీన తమిళ్లో విడుదలైంది. అక్కడ అనూహ్య విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఇదే టైటిల్‌తో అక్టోబర్ 24న విడుదల కానుంది. ఈ చిత్రం ఒక్కసారిగా అతన్ని లైమ్ టైమ్‌లో తీసుకొచ్చింది. దీంతో ధ్రువ్ విక్రమ్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా డాడా చిత్రం ఫేమ్ గణేష్ బాబు దర్శకత్వంలో ధ్రువ్ విక్రమ్ తదుపరి నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు గణేష్ బాబు నటుడు ధ్రువ్ కోసం మంచి కథను సిద్ధం చేసినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దర్శకుడిగా గణేష్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్‌తో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. -
హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ‘బైసన్’ మూవీ ఈవెంట్ (ఫొటోలు)
-
నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించగా.. పా.రంజిత్ సమర్పించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్ చాలానే కష్టపడ్డాడు. తమిళ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బైసన్ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ధ్రువ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్ అదరగొట్టారు. ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్‌కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి... రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025 -
విక్రమ్ తనయుడి బైసన్.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తోన్న తాజా చిత్రం బైసన్(Bison Kaalamaadan). ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఈ రోజు రిలీజ్ అయింది. వచ్చేవారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలోనే బైసన్ మూవీ నుంచి ఓ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మంచి మనసు అంటూ సాగే పాటను విడుదల చేశారు. మారి సెల్వరాజ్ రాసిన ఈ సాంగ్‌ను తెలుగులోకి యనమండ్ర రామకృష్ణ ట్రాన్స్‌లేట్ చేశారు. ఈ పాటను మనువర్ధన్, గాయత్రీ సురేశ్ ఆలపించారు. -
కబడ్డి... కబడ్డి
ప్రముఖ తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘బైసన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పా. రంజిత్ సమర్పణలో నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్పై సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితీ ఆనంద్ నిర్మించిన ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుంది. తెలుగులో జగదాంబే ఫిలిమ్స్ పై బాలాజీ ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రానా రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ– ‘‘1990 బ్యాక్‌డ్రాప్‌లో కబడ్డి నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బైసన్’. ట్రైలర్ ఎంత ఆసక్తికరంగా ఉందో సినిమా కూడా థ్రిల్లింగ్ అంశాలతో అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతుంది. కబడ్డి నేపథ్యంలో రాబోతున్న మా సినిమా కూడా మంచి విజయం అందుకుంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు. -
విక్రమ్ వారసుడి మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు. In a Land of Chaos, rises a Believer! #BisonKaalamaadan 🦬 காளமாடன் வருகை Trailer Out Now ▶️ https://t.co/mwDlHRrJqx 4 Days to go until his last Raid 🔥#BisonKaalamaadanFromDiwali #BisonKaalamaadanOnOct17 🎆@applausesocial @NeelamStudios_ #SameerNair @deepaksegal… pic.twitter.com/kDLfnFWBcQ— Anupama Parameswaran (@anupamahere) October 13, 2025 -
అనుపమ పరమేశ్వరణ్ కొత్త సినిమా.. లవ్ సాంగ్ చూశారా?
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా బైసన్.. ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి తీరేనా.. వేదన అనే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుండగా.. తెలుగులో ఇదే నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలా ఈ చిత్రం వుండనుంది. -
స్టార్ హీరో తనయుడి యాక్షన్ చిత్రం.. దీపావళి బాక్సాఫీస్ వద్ద పోటీ!
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఇది ఫుట్‌బాల్ క్రీడ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నటి అనుపమ పరమేశ్వరన్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటుడు ధృవ్ విక్రమ్ చాలా కొత్తగా ఉండి చిత్రంపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బైసన్ కాలమడాన్ చిత్రం అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు తమిళ చిత్ర పరిశ్రమలో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. విభిన్న కథ, బలమైన కథనం, ఉత్తమ సాంకేతిక కళాకారుల శ్రమ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. -
జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గొరగేదెలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పైడిపనుకుల, మంప, సూరేంద్రపాలెం పరిసర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. వేసవి తీవ్రత, అటవీప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకపోవడమే అవి బయటకు రావడానికి కారణంగా చెబుతున్నారు. కొయ్యూరు: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన గిరిజనులు భయపడుతున్నారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు, చల్లదనం కోసం కాలువల వెంబడి ఉంటున్నాయి. గత ఐదేళ్లక్రితం వరకు ఒడిశాకు చెందిన వేటగాళ్లు వీటిని వేటాడేందుకు వచ్చేవారు. నెల రోజుల పాటు కాలువల వెంబడి కాసి నాటు తుపాకులతో వాటిని వేటాడి చంపేవారు.ఆ మాంసాన్ని ఎండిబెట్టి గ్రామాలకు తరలించేవారు. 2016 ఫిబ్రవరిలో ఎం.భీమవరం పంచాయతీ పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నాటు తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు ఒడిశా గిరిజనులను మావోయిస్టులుగా అనుమానించి అప్పటిలో పోలీసులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఒడిశా వేటగాళ్లు రావడం తగ్గించేశారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు పులులు ఉన్నట్టు అటవీశాఖ నిర్ధారించింది. తరువాత జరిగిన జంతు గణనలో వాటి జాడ తెలియలేదు. దీంతో గొరగేదెల సంఖ్య పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. గొరగేదెలు ఎక్కువగా గూడెం,చింతపల్లి, కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంటాయి. మర్రిపాకల రేంజ్లో ఫారెస్టు చాలా దట్టంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో వీటి మంద ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మేత, నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావు. వేసవి వచ్చేసరికి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఊట కాలువలు ఎండిపోతాయి. వాటి చర్మం పలుచగా ఉన్నందున వేడిని తట్టుకోలేవు. అందువల్ల ఎక్కువగా ఇవి నీటిలోనే ఉండేందుకు ఇష్టపడతాయి. పెద్ద కాలువల వద్దనే ఉంటాయి.అక్కడే నీళ్లు తాగి తిరుగుతాయి. వేటగాళ్లు కూడా కాలువల వెంబడే ఉంటారు.అవి నీరు తాగుతున్న సమయంలో తుపాకీతో వేటాడుతారు. లేదంటే సంప్రదాయ ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నిస్తారు. గాయపడిన గేదెలు కనిపించిన వారిని చంపేందుకు చూస్తాయి. ఇలాంటి సమయంలోనే వీటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మందతో ప్రమాదం లేదు గొరగేదెలు మందలుగా ఉన్నప్పుడు ఎవరిని ఏమీ అనవు. ఒంటరిగా ఉన్న గేదెలు మాత్రమే దాడులు చేసేందుకు చూస్తాయి. అవి దాడులు చేస్తే ప్రాణాలతో బయటపడడం కష్టంగానే ఉంటుంది. ఒంటరిగా ఉన్న గేదె, గాయపడిన వాటితోనే ప్రమాదం ఉంటుందని గిరిజనులు తెలిపారు. పైడిపనుకుల, మంపకు అటువైపున ఉన్న కొండ, సూరేంద్రపాలెం ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. గాయపడిన గేదె ఒకటి తిరుగుతుందని తెలుసుకున్న పరిసర ప్రాంతీయులు భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్టమైన అడవిలోనే గొరగేదెలుంటాయి. వాటిపై ఎలాంటి లెక్కలు లేవు. అంచనాగా చెప్పడం తప్ప అవి ఎన్ని ఉంటాయో గణన చేయలేదు. వేసవి కావడంతో అవి నీటి వనరులున్న ప్రాంతాలకు వస్తాయి.అవి ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయో అటవీ సిబ్బందిని పంపించి పరిశీలన చేయిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మర్రిపాకల రేంజ్‌లోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. – సూర్యనారాయణ పడాల్, నర్సీపట్నం డీఎఫ్‌వో -
సదర్ కింగ్..సర్తాజ్
మహానగరానికే ప్రత్యేకమైన సదర్ ఉత్సవానికి రంగం సిద్ధమైంది. దీపావళి అనంతరం యాదవుల సాంస్కృతిక వేడుకగా పేరొందిన సదర్‌ను నగరంలోని పలుచోట్ల నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో దున్నల ప్రదర్శన హైలెట్. ఇందుకోసం ప్రత్యేక దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తారు. ఈ నెల 29న జరగనున్న సదర్‌లో ‘సర్తాజ్’అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హరియాణాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్రసింగ్‌కు చెందిన ‘సర్తాజ్’ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. రూ.27 కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల సందర్భంగా ప్రదర్శించేందుకు అఖిలభారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
అదొక భయానక దృశ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని ‘ఎల్లోస్టోన్ నేషనల్ స్టోన్ పార్క్’లో సోమవారం చోటుచేసుకున్న భయానక దశ్యం ఇదీ. ఫ్లోరిడాలోని ఒడిస్సా ప్రాంతానికి చెందిన యాభై మంది సందర్శకులు ఆ రోజు నేషనల్ పార్క్‌లో సంచరిస్తూ అమెరికా అడవి దున్నగా పిలిచే (బైసన్) సమీపంలోకి వెళ్లారు. వారు దాదాపు 20 నిమిషాల సేపు అక్కడే గడిపారు. అనూహ్యంగా ఓ అడవిదున్న మిగతా వారికి కొంచెం ఎడంగా ఉన్న ముగ్గురు పిల్లల మీదకు దూసుకెళ్లింది. దాని దాడి నుంచి ఇద్దరు పిల్లలు తప్పించుకోగా, ఓ తొమ్మిదేళ్ల బాలకను అది కొమ్ములతోనే ఆకాశంలోకి గిరాటేసింది. ఆ దశ్యాన్ని చూసిన సందర్శకులు భయభ్రాంతులతో తలోదిక్కుకు పరుగులు తీశారు. తీవ్రంగా దెబ్బతగిలిన ఆ బాలికను ‘ఓల్డ్ ఫేత్‌ఫుల్ క్లినిక్’కు కుటుంబ సభ్యులు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసింది. అయితే ఆ కుటుంబ సభ్యులు నేషనల్ పార్క్ సిబ్బందిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పార్క్ అధికారులు సంఘటనకు సంబంధించి సందర్శకులు తీసిన ఓ వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. 2018లో ఓ అమ్మాయిని కూడా ఓ అడవిదున్న ఇలాగే కుమ్మేసింది. ఆ తర్వాత అలాంటి సంఘటన జరగడం ఇదేనని పార్క్ సిబ్బంది తెలిపారు. ఈపార్క్‌లో అమెరికా జాతికి చెందిన అడవి దున్నలు 4,527 ఉన్నాయి. వాటిలో మగ దున్నలు దాదాపు 920 కిలోల బరువుంటే, అడ దున్నలు దాదాపు 500 కిలోల బరువు ఉంటాయని సిబ్బంది తెలిపారు. -
అడవి దున్న హల్చల్
సాక్షి, గండేపల్లి: మండలంలోని సింగరంపాలెం పరిధి పొలాల్లో మగ అడవి దున్న హల్చల్ చేస్తోంది. స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామాయిల్ తోటలో దున్న సంచారాన్ని గమనించిన స్థానికులు మంగళవారం ఫారెస్ట్ అధికారి నూకాసాహెబ్కు సమాచారం అందజేశారు. దున్న నోటికి గాయమై ఏమీ తినలేక నీరసించి ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. దున్నను బంధించి బోను సహాయంతో విశాఖ జూకు లేదా మారేడుమిల్లికి గానీ తరలిస్తామని ఆ అధికారి చెప్పారు. విశాఖ నుంచి మత్తుమందు ఇచ్చే వైద్యులు రావాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా గతంలో కె.గోపాలపురం అడవికి సమీపంలో ఒక దున్న మృత్యువాతకు గురైన విషయాన్ని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి దున్నను సంరక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. -
సీన్ రివర్సైంది.. పరిగెత్తరో
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కు.. మధ్యాహ్నం.. లంచ్ టైం.. డొక్క మాడుతుండటంతో రెండు సింహాలు (ఫొటోలో ఒకటే కనిపిస్తోంది) వేటకు బయల్దేరాయి. దారిలో బాగా బలిసిన అడవి దున్నలు కనిపించాయి. ఒకదాన్ని పట్టుకున్నా.. రెండ్రోజులు ఫుడ్ గురించి చూసుకోనక్కర్లేదు అనుకున్నాయి. వేటకు రెడీ అయ్యాయి. అమాంతం ఓ దున్నపై పడ్డాయి. కానీ సీన్ రివర్సైంది. ఆ దున్న వాటిని ఫుట్‌బాల్ తన్నినట్లు తన్నింది. ఇంకేముంది.. సింహాలకు సీన్ అర్థమైంది. ఈగోను పక్కనపెట్టి.. ఇలా కాళ్లకు పని చెప్పాయి. -
పట్టుబడిన అడవి దున్న
వెలిచేరు (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : దారి తప్పి వెలిచేరు గ్రామంలోకి చేరుకుని వీరంగం సృష్టించిన అడవి దున్నను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు శనివారం బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆత్రేయపురం మండలం వెలి చేరు ఊదలమ్మ గవళ్ల పాలెం సమీపంలో అడవి దున్న శుక్రవారం అధికారులను, గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలి సిందే. పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలం చెందడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది. శనివారం ఉదయం విశాఖపట్నం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలకు చెందిన మత్తు వైద్యుడు శ్రీనివాసరావు తుపాకీతో అడవి దున్నకు మత్తు ఇచ్చారు. అది సరిగా పనిచేయకపోవడంతో సమీపంలో ఉన్న ఏటిగట్టుపైకి వచ్చి ప్రజలను పరుగులు తీయించింది. వారంతా భయాందోళనకు గురయ్యారు. చాకచక్యంగా మళ్లీ మత్తు మందు ఇవ్వడంతో కొద్దిసేపటికి స్పృహ కోల్పోయింది. అనంతరం అటవీ శాఖ, పోలీసుల సహాయంతో అడవి దున్న తలకు గుడ్డ కట్టి, కాళ్లను తాళ్లతో బంధించారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో అరటి తోట నుంచి ఏటుగట్టుపై ఉన్న అటవీ శాఖకు చెందిన వ్యాన్‌లోకి చేర్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి సీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దున్నను మారేడుమిల్లి సమీపంలోని అడవిలో వదలి పెట్టనున్నట్టు తెలిపారు. దీనిని బంధించేందుకు సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం దున్న దాడిలో తీవ్ర గాయాలపాలైన చీలి వెంకన్న ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాకినాడ ఫారెస్టు రేంజ్ అధికారి నర సింహా రావు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఎస్సై సత్యనారాయణ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


