తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన చిత్రం బైసన్.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ తనకు జోడీగా నటించింది. అయితే, కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కబడ్డీ ఆటగాడిగా ధ్రువ్ పడిన కష్టం ఏంటి అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సినిమాలో ధ్రువ్ నటన పట్ల విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.


