స్టార్‌ హీరో తనయుడి యాక్షన్‌ చిత్రం.. దీపావళి బాక్సాఫీస్‌ వద్ద పోటీ! | Star Hero son Dhruv Vikram movie at deewali Box Office | Sakshi
Sakshi News home page

Dhruv Vikram: స్టార్‌ హీరో తనయుడి యాక్షన్‌ చిత్రం.. దీపావళి బాక్సాఫీస్‌ వద్ద పోటీ!

May 5 2025 7:38 AM | Updated on May 5 2025 8:52 AM

Star Hero son Dhruv Vikram movie at deewali Box Office

కోలీవుడ్ స్టార్‌ చియాన్‌ విక్రమ్‌ వారసుడు ధృవ్‌ విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం'బైసన్‌ కాలమడాన్‌'. హిట్‌ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్‌ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్, నీలం స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ఇది ఫుట్‌బాల్‌  క్రీడ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ధృవ్‌ విక్రమ్‌ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. షూటింగ్‌ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నటి అనుపమ పరమేశ్వరన్‌ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటుడు ధృవ్‌ విక్రమ్‌ చాలా కొత్తగా ఉండి చిత్రంపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బైసన్‌ కాలమడాన్‌ చిత్రం అప్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థకు తమిళ చిత్ర పరిశ్రమలో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు. విభిన్న కథ, బలమైన కథనం, ఉత్తమ సాంకేతిక కళాకారుల శ్రమ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement