కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్‌.. భారీ సాయం | Director Mari Selvaraj Big Help To Kabaddi Player Kannagi Nagar Karthika, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

కార్తీక ఇంటికి మారి సెల్వరాజ్‌.. భారీ సాయం

Oct 31 2025 8:10 AM | Updated on Oct 31 2025 10:02 AM

Director Mari selvaraj Big Help to Kabaddi player Kannagi nagar karthika

తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. భారత U-18 మహిళల కబడ్డీ జట్టు వైస్-కెప్టెన్‌ కార్తీకకు రూ. 5 లక్షలు ప్రోత్సాహకంగా అందించారు. తమిళనాడుకు చెందిన కార్తీక రీసెంట్గా బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్తరపున స్వర్ణం సాధించింది. ఇప్పటికే కార్తీక జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్రూ. 20 లక్షలు అందించారు. భారత్‌తో పాటు తమిళనాడు కీర్తిని ఆమె పెంచిందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇంటర్చదువుతున్న కార్తీక చాలా పేదరికంతో ఉన్న కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు.  

కొద్దిరోజుల క్రితం బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై భారత్భారీ విజయం సాధించింది. గెలుపులో కార్తీకది కీలక పాత్ర ఉంది. దేశ కీర్తిని పెంచిన జట్టుకు మారి సెల్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ఆమె ఇంటికి వెళ్లి రూ. 5 లక్షల చెక్ను బహుమతికి ఇచ్చారు. కన్నగి నగర్ కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆయన కోరారు.

కబడ్డీ నేపథ్యంతో బైసన్‌
మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో నటుడు ధ్రువ్‌విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్‌. నటి అనుపమపరమేశ్వరన్‌, రజీషా విజయన్‌, పశుపతి, దర్శకుడు అమీర్‌, లాల్‌, మదన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అప్లాస్‌ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్‌న్స్‌ పతాకంపై దర్శకుడు రంజిత్‌ నిర్మించారు. కబడ్డీ నేపథ్యంతో విడుదలైన చిత్రం తమిళనాడులో సంచలన విజయం సాధించింది. బైసన్‌ చిత్రాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఇటీవల తిలకించారు. ఆపై చిత్ర యూనిట్ను వారు మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement