
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా బైసన్.. ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి తీరేనా.. వేదన అనే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఈ నెల 17న విడుదల కానుండగా.. తెలుగులో ఇదే నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలా ఈ చిత్రం వుండనుంది.