విక్రమ్ కుమారుడు ధ్రువ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison). మొదట తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో కూడా రిలీజ్ అయింది. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మించాయి. ధ్రువ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా బైసన్ రికార్డ్ క్రియేట్ చేసింది.

బైసన్ చిత్రం కేవలం పదిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. రెండో వారంలో ఈ చిత్రానికి భారీగా స్క్రీన్స్ పెరిగాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అత్యధికంగా థియేటర్స్ పెరగడం విశేషం. అయితే, తెలుగులో మాత్రం కాస్త పర్వాలేదు అనిపించేలా బైసన్ ఉంది.
ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు.
Ecstatic beyond measure and thankful beyond words!! #BisonKaalamaadan is unstoppable as he's breaking those barriers right away!!💥🦬
55 Crores Worldwide in 10 days!! #Blockbuster Raid in the Theatres Near You! 💥💥💥@applausesocial @NeelamStudios_ @nairsameer @deepaksegal… pic.twitter.com/ozbbqRLl7S— Mari Selvaraj (@mari_selvaraj) October 27, 2025


