
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ వ్రికమ్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం బైసన్(Bison).. దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. అక్టోబర్ 17న కేవలం తమిళ్‌లో మాత్రమే విడుదలైన బైసన్ భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ధ్రువ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.

బైసన్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే కోలీవుడ్‌లో విడుదలైంది. దీంతో మొదటిరోజు అనుకున్నంత రేంజ్‌లో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, సినిమా బాగుందని టాక్ రావడంతో కలెక్షన్ల జోరు పెరిగింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం తమిళ్‌లో మాత్రమే బైసన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో కూడా అక్టోబర్ 24న విడుదల కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ధ్రువ్ మార్కెట్ పెరగనుంది. ఫైనల్‌గా వంద కోట్లకు దగ్గర్లో బైసన్ కలెక్షన్స్ ఉండొచ్చని అంచనా వేయవచ్చు. కబడ్డీ ప్లేయర్ మానతీ గణేశన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.
ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్‌ను గుర్తు చేశారు.
Extremely grateful for all your love! #BisonKaalamaadan grows over a hundred percent over day one and is roaring at the box office. Just Tamil version collects 35cr gross collections worldwide
New Raid #Bison ready for Telugu release 🦬#BisonKaalamaadan 🦬 #DiwaliWinner 💥… pic.twitter.com/FqeV8unvls— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025