'కాంతార' హిట్‌ సాంగ్‌.. వీడియో వర్షన్‌ విడుదల | Rishab Shetty and Rukmini video song out from Kantara Chapter 1 | Sakshi
Sakshi News home page

'కాంతార' హిట్‌ సాంగ్‌.. వీడియో వర్షన్‌ విడుదల

Oct 19 2025 11:57 AM | Updated on Oct 19 2025 12:37 PM

Rishab Shetty and Rukmini video song out from Kantara Chapter 1

కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార:చాప్టర్‌1’ (Kantara Chapter 1). అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 720 కోట్లకు పైగానే కలెక్షన్స​్‌ రాబట్టింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి రావే ఇక ప్రియ భామిని అనే సాంగ్‌ను విడుదల చేశారు. రిషబ్‌, రుక్మిణి వసంత్‌ మధ్య చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద ఆలపించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు.  

కాంతార ఛాప్టర్‌-1 విజయవంతమైన తర్వాత రిషబ్‌ శెట్టి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా చాముండి బెట్టపై చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాంతార సినిమా విజయంలో కన్నడిగుల పాత్ర చాలా ఉందన్నారు. దైవాన్ని తాను ఎక్కువగానే విశ్వసిస్తానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మూఢ నమ్మకాలను ప్రోత్సహించానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్‌’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన కన్నడ చిత్రాల లిస్ట్‌లో ‘కాంతార -1’  రెండో స్థానంలో ఉంది. రూ.1200 కోట్ల కలెక్షన్లతో ‘కేజీయఫ్‌ 2’ తొలి స్థానంలో నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement